సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Friday, October 30, 2009
"క్షీరాబ్ధి ద్వాదశి"
(కోటిపల్లి "సోమేశ్వరాలయం" ముందర ఉన్న తులసి చెట్టు ఇది. ఆ మధ్య తూర్పు గోదావరి ప్రయాణం లో తీసిన ఫొటో.)
ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజంటే నాకున్న ఇష్టం కొద్దీ లింక్ కూడా పెట్టకుండా, ఆగష్టు 31న రాసిన ఈ టపానే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను.( అప్పుడు చూడనివాళ్ళ కోసం.)చిన్నప్పుడు తులసికోట ముందర కూర్చిని, బోలెడు దీపాలు పెట్టి, తులసి కోటలో కాయలు ఉన్నా ఉసిరి కొమ్మ పెట్టి అమ్మా చేసే "క్షీరాబ్ధి ద్వాదశి" పూజ అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది.పెళ్ళయ్యాకా నేను చేయటం మొదలెట్టాను...!క్షీరాబ్ధి ద్వాదశి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.కానీ తెలియనివాళ్ళెవరైనా ఉంటే,వాళ్ళ కోసం--
కార్తీక మాసంలోని శుక్లపక్ష ద్వాదశిని "క్షీరాబ్ధి ద్వాదశి" అంటారు.పురాణ కధనం ప్రకారం--విష్ణువు చెప్పగా,దేవదానవులు పాలకడలిని (క్షీరాబ్ధిని) మధించిన రొజు ఇది.అందువల్ల ఈ పేరు వచ్చింది.అంతేకాక,"ఆషాఢ శుక్ల ఏకాదశి"నాడు యోగనిద్ర ఆరంభించే విష్ణువు "కార్తిక శుధ్ధ ఏకాదశి"నాడు తన నిద్రను ముగిస్తాడు.మరుసటి దినమైన "క్షీరాబ్ధి ద్వాదశి"నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై,బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు.అందువల్ల ఈ రోజుని "బృందావన ద్వాదశి"గా కూడా పిలుస్తారు.ఈ రొజు సాయంత్రం విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మను,లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్క పక్కన పెట్టి పూజ చేస్తారు.ఈ ప్రదేశాన్ని వీలైనన్ని దీపాలతో అలంకరిస్తారు కూడా.సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం,ఈనాడు దీపారాధన చేయటం వల్ల పరిహారమౌతుంది అంటారు.
ఇవాళ బోలెడు పనులు...ముందు వెళ్ళి సాయంత్రం పూజకు "ఉసిరి కొమ్మ" కొని తెచ్చుకోవాలి..ఊళ్ళో బానే దొరుకుతాయని చెప్పారు మరి...! వెంఠనే వ్యాఖ్యలు ప్రచురించకపొయినా, జవాబులు లేటు గా రాసినా ఏమీ అనుకోకండేం...!!
************ ************
వినయక చవితికి ఎక్కడెక్కడ నుంచో పత్రి, రకరకల పువ్వులు తెచ్చి పది,ఇరవై అని అమ్ముతూంటారు...పోనీలే ఇప్పుడే కదా వీళ్ళకి కాసిని డబ్బులు వచ్చేవి అని కొనేస్తూ ఉంటాం కూడా...అలానే ఇవాళ ఉసిరి కొమ్మ కోసం వెళ్తే,
ఉసిరి కాయలతో ఉన్న చిన్న కొమ్మ పదిహేను రూపాయలట ?! "ఔరా" అనుకున్నా కొనక తప్పదుగా. అవసరం మనది..!! చిన్నప్పటినుంచీ
ఫ్రీ గా పక్కింట్లోంచో ,ఎదురింట్లోంచో తెచ్చుకునే అలవాటు మరి....మా ఊళ్ళో అయితే పక్కింట్లోంచి మా దొడ్లోకి ఒరిగి ఆకులూ, కాయలూ అన్నీ మాకే ఇచ్చేదొక ఉసిరి చెట్టు...!!
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
"క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మి కి .... నీరాజనం.." అన్న పాట చాలాసార్లు విన్నానండి.. ఎందుకో బాగా నచ్చింది.. లిరిక్ మీ దగ్గర ఉంటే బ్లాగులో పెట్టరూ.. క్షీరాబ్ది అనగానే గుర్తొచ్చింది.. నాక్కూడా బోల్డన్ని జ్ఞాపకాలు ఉన్నాయండి కార్తీకం తో ..రాయాలి ఎప్పుడో...
@ murali:ఆగష్టులో కూడా ఇలాగే అంటే కార్తీకం గురించి రాయండి..అన్నానండీ..మరి కార్తీకం అయ్యేలోపు రాయండి.
"క్షీరాబ్ది కన్యకకు..." అన్నమాచార్య కృతి. చాలా మంది పాడినవి ఉన్నయి కాని "ఎమ్మెస్" అయితే బాగుమ్టూందని ఆ utube link ఇక్కడ పెడుతున్నానండీ...
http://www.youtube.com/watch?v=q-faNEW_EF0
సాహిత్యం కూడా ఇదిగోండి....
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహా లక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం
చరణం 1
జలజాక్షి మోమునకు జక్కువ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు, హస్త కమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం
చరణం 2
పగటు శ్రీ వేంకటేశు పట్టపు రాణీయై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి అలమేలు మంగ చక్కదనముల కెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
చరణం 3
చరణ కిసలయములకు సఖియరంభొరులకు
నిరతమగు ముత్తెల నీరజనం
అరిది జఘనంబునకు అతివ నిజనభికి
నిరతి ననవర్న నీరజనం
There are only 2 charanams in the above(utube) link.
ఆసక్తికరమైన సమాచారం ఇచ్చారు. టపా పేరు చూసి నేనూ ఇదే కీర్తనను స్మరించుకున్నాను.
చాలా..చాలా థాంక్స్ అండి...
vEnU gaarU, thanks for the visit.
murali gaaru: :)
అలివేణి తురుమునకు, హస్త కమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం
ఈవాక్యం బాగాఇష్టం. మంచి కీర్తన. బాలాజీపంచరత్నాల్లో అన్నీ నవరత్నాలే
బాగా చెప్పావమ్మా తృష్ణమ్మా.
క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మి కి .... నీరాజనం!!
బగమంతుడు మిమ్మల్ని మమ్మల్ని అందర్నీ సల్లంగ సూడాల.
బాగా చేసుకున్నారా క్షీరాబ్ది ద్వాదశి.?
@ చైతన్య:
@ భాస్కర్:
ధన్యవాదాలు.
@ భావన : తృప్తిగా, మంచిగా చేసుకున్నానండీ..కాకపోతే "బ్యాక్ గ్రౌడ్" లో కాస్త మా అమ్మాయిగారి "నస" ఎక్కువైంది...తపస్సు చేసుకుంటున్న మునులకి అప్సరసలు తపోభంగం కలిగించటానికి ప్రయత్నం చేసినట్లు..:) :)
లెగండి లెగండి, ద్వాదశి అయిపోయింది. వంటరాని మగాళ్ళంతా వైటింగ్ మీటపాకోసం:)
పూజ చాలా బాగుంది తృష్ణ. శ్రద్ధగా కార్తీక మాసమంతా జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు.
రోజులు చాలా తొందరగా మారిపోతున్నాయి అనటానికి వినాయక చవితికి మామిడాకులు కొనటం,ఇప్పుడు ఉసిరి కొమ్మలు కొనటమే పెద్ద ఉదాహరణలు.
ఇవాళ పొద్దున్న క్షీరాబ్ధి కన్యకకు కీర్తన పెట్టుకొని విన్నాను. నాకైతే ఎప్పుడూ ఇదే మంగళహారతిగా పాడుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఎక్కువగా పాడుకునేది "శ్రీ లలితా శివజ్యోతి". తొందరగా అయిపోతుంది కదా.
Sorry Trishna, I forgot to say. you have this complete song in e-snips.
bhaskar rami raddy gaaru, really../2 more days..for the 2nd part..
jaya: thankyou. but i have the song sung by 2,3 other artists also..
Post a Comment