మే నెల తెలుగు వెలుగు పత్రికలో నా కుక్కరీ బ్లాగ్ "రుచి...thetemptation "గురించి "అంతర్జాలంలో అమ్మ చేతి వంట" అనే ఆర్టికల్ లో చోటు దొరికింది. ఆర్టికల్ లో నా బ్లాగుని చేర్చిన మధురకు, 'తెలుగు వెలుగు' పత్రిక వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label మెట్లు... Show all posts
Showing posts with label మెట్లు... Show all posts
Friday, May 2, 2014
"తెలుగు వెలుగు" పత్రికలో నా 'రుచి..'
మే నెల తెలుగు వెలుగు పత్రికలో నా కుక్కరీ బ్లాగ్ "రుచి...thetemptation "గురించి "అంతర్జాలంలో అమ్మ చేతి వంట" అనే ఆర్టికల్ లో చోటు దొరికింది. ఆర్టికల్ లో నా బ్లాగుని చేర్చిన మధురకు, 'తెలుగు వెలుగు' పత్రిక వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.
Monday, February 25, 2013
"అనువాదలహరి" లో
నా బ్లాగ్ రెగులర్ పాఠకుల కోసం:
కవిత్వం అంటే ".....spontaneous overflow of powerful feelings from emotions recollected in tranquility" అని Wordsworth అన్నట్లు ఏవన్నా స్ట్రాంగ్ ఇమోషన్స్ కలిగినప్పుడు కవిత్వాన్ని రాస్తూంటారు కవులు ,కవయిత్రులూ. కానీ నేను అవలీలగా కవితలు రాయగలిగే కవయిత్రిని కానే కాదు. ఏవైనా అనుభూతులు గాఢంగా మనసుని కదిపినప్పుడు మాత్రమే నాలుగువాక్యాలు రాసుకుంటూంటాను. బ్లాగ్ నా సొంతం కాబట్టి అందులో నే రాసుకున్న వాటిని కూడా పొందుపరిచాను.
"అనువాదలహరి" బ్లాగ్ లో ఉత్తమమైన ఆంగ్ల కవితలను తెలుగులో అనువదిస్తుంటారు ఎన్.ఎస్.మూర్తి గారు. సాహిత్యంలో తమకంటూ ప్రత్యేక స్థానాలు సంపాదించుకున్న ఎందరో కవులు, కవయిత్రుల రచనల మధ్యన నాకూ కాస్త చోటు ఇచ్చారు "అనువాదలహరి" బ్లాగర్ మూర్తి గారు..
http://teluguanuvaadaalu.wordpress.com/2013/02/24/sometimes-trishna-telugu-indian/
ఆ సంతోషాన్ని నా బ్లాగ్ పాఠకులతో పంచుకుందామనే ఈ టపా.. ఇన్ఫర్మేషన్ కోసమే కాబట్టి కామెంట్ మోడ్ పెట్టడం లేదు.
Wednesday, January 2, 2013
చిన్న ముఖాముఖి..
రెండ్రోజుల క్రితమనుకుంటా జాజిమల్లి బ్లాగర్ 'మల్లీశ్వరి’ గారి వద్ద నుండి ఒక ప్రశ్నాపత్రం వచ్చింది. బ్లాగ్లో మహిళా బ్లాగర్లతో ముఖాముఖి రాస్తున్నానని... ప్రశ్నలకు సమాధానాలు రాసి పంపమని అడిగారు.
తోచిన సమాధానాలు రాసి పంపాను.. ఇవాళ ప్రచురించారు:
http://jajimalli.wordpress.com/2013/01/02/%E0%B0%A8%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3-%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%9F/
నాకీ సదవకాశం ఇచ్చిన మల్లీశ్వరి గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
***
నా బ్లాగ్ తరచూ చదివే పాఠకులు చదువుతారని మాత్రమే ఈ లింక్ ఇస్తున్నాను కాబట్టి కామెంట్ మోడ్ తీసివేస్తున్నాను.
Saturday, June 4, 2011
"మనోనేత్రం " - నా కొత్త బ్లాగ్
"మనోనేత్రం " -- looking with the heart !!
ఇది నా కొత్త బ్లాగ్.
ఫోటో బ్లాగ్.
నాకు ఫోటోలు తియ్యటం అంటే చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు సరదా కొద్ది తీసిన ఫోటోలు పెట్టాలని ఈ బ్లాగ్ మొదలుపెట్టాను. ఎలా ఉందో చెప్పండేం..!
Wednesday, October 14, 2009
నవతరంగం లో...
నవతరంగం లో నా మొదటి ఆర్టికల్ ఇక్కడ చూడచ్చు... :)
లేడిస్ టైలర్ లో రాళ్ళపల్లి "రావుగోపాల్రావు పక్కన్నేను...శోభన్ బాబు పక్కన్నేను..." అంటూ ఉంటారు..అలాగ
"కూడలి" లో నేను...
జల్లెడ "స్త్రీ బ్లాగులలో" నేను...
మొన్న "పుస్తకం" లో నేను...
ఇవాళ "నవతరంగం"లో నేను...
రేపు..ఎల్లుండి..మరో చోట కూడా ఉండచ్చు...
Sunday, October 11, 2009
పుస్తకం లో నా మొదటి పుస్తక పరిచయం..
“ఆంధ్రప్రభ” దినపత్రికను మా ఇంట్లో చాలా ఏళ్ళు తెప్పించారు. వార్తలే కాక వీక్లీ కాలమ్స్ , డైలీ సీరియల్స్, పిల్లలకు బొమ్మల సీరియల్స్ ఇలా చాలా ఉంటూండేవి పేపర్లో. కుప్పిలి పద్మగారి రచనలు కూడా ఆంధ్రప్రభలోనే మొదటిసారి చదివాను.ఇవి కాక 13-12-98 నుండి 16-7-99 వరకూ, అంటే మొత్తం ఎనిమిది నెలలపాటు, మేము ప్రతి శుక్రవారం పేపర్ కోసం ఎదురు చూసే వాళ్ళం. వాడ్రేవు వీరలక్ష్మిగారి “కాలమ్స్” కోసం ! ఆ పేపర్ కట్టింగ్స్ అన్నీ దాచేవాళ్ళం. 2001లో ఆ కాలమ్స్ అన్నీ ఒక పుస్తక రూపంలో అచ్చయ్యాయి.ఆ పుస్తకమే “ఆకులో ఆకునై….”
pustakam.net లో నా మొదటి పుస్తక పరిచయవ్యాసాన్ని క్రింద లింక్ లో చదవచ్చు:
http://pustakam.net/?p=2204
(పూర్ణిమగారు లింక్ పెట్టచ్చు అని చెప్పారు కానీ మొదటిసారి నా "పరిచయాన్ని" చదువుకునే ఆనందంలో...నా మట్టి బుర్రకి ఆ సంగతి అర్ధం కాలేదు...ఇప్పుడు మురళిగారు చెప్పాకా మళ్ళీ మైల్ చూస్తే..అర్ధం అయ్యింది..:)
Subscribe to:
Posts (Atom)