“ఆంధ్రప్రభ” దినపత్రికను మా ఇంట్లో చాలా ఏళ్ళు తెప్పించారు. వార్తలే కాక వీక్లీ కాలమ్స్ , డైలీ సీరియల్స్, పిల్లలకు బొమ్మల సీరియల్స్ ఇలా చాలా ఉంటూండేవి పేపర్లో. కుప్పిలి పద్మగారి రచనలు కూడా ఆంధ్రప్రభలోనే మొదటిసారి చదివాను.ఇవి కాక 13-12-98 నుండి 16-7-99 వరకూ, అంటే మొత్తం ఎనిమిది నెలలపాటు, మేము ప్రతి శుక్రవారం పేపర్ కోసం ఎదురు చూసే వాళ్ళం. వాడ్రేవు వీరలక్ష్మిగారి “కాలమ్స్” కోసం ! ఆ పేపర్ కట్టింగ్స్ అన్నీ దాచేవాళ్ళం. 2001లో ఆ కాలమ్స్ అన్నీ ఒక పుస్తక రూపంలో అచ్చయ్యాయి.ఆ పుస్తకమే “ఆకులో ఆకునై….”
pustakam.net లో నా మొదటి పుస్తక పరిచయవ్యాసాన్ని క్రింద లింక్ లో చదవచ్చు:
http://pustakam.net/?p=2204
(పూర్ణిమగారు లింక్ పెట్టచ్చు అని చెప్పారు కానీ మొదటిసారి నా "పరిచయాన్ని" చదువుకునే ఆనందంలో...నా మట్టి బుర్రకి ఆ సంగతి అర్ధం కాలేదు...ఇప్పుడు మురళిగారు చెప్పాకా మళ్ళీ మైల్ చూస్తే..అర్ధం అయ్యింది..:)
10 comments:
చాలా బాగుంది పరిచయం. నేను కొనుక్కోవలసిన పుస్తకం లో ఇంకోటి కలుపుకున్నా, చదివినంత ఫీలింగ్ ను కలిగించారు మీ పరిచయం తో..
పుస్తకం ఏ పుబ్లికేషన్ లో ప్రింట్ అయ్యిందో/దొరుకుతుందో కూడా చెపితే బాగుండేది కదా తృష్ణా నాలాంటి వాళ్ళు చెప్పటానికి మా అక్క కు కొనమనేప్పుడూ..
తృష్ణగారు,మీ పుస్తక పరిచయం బాగుంది.అభినందనలు.
@భావన: ధన్యవాదాలు.పుస్తకం కాపీలకోసం సంప్రదించవలెను అని పోస్టల్ అడ్రస్స్ ఇచ్చారండి పుస్తకంలో :
వాడ్రేవు వీరలక్ష్మి దేవి,
70-1/c-2
N.F.C.L.road,
kakinada-3.
ఎంతమందికి వీలౌతుందో అలా అని రాయలేదు...పూర్నిమగారు గతంలో తెప్పించామని రాసారు అడిగి చూడండి.
@ పరిమళం: ధన్యవాదాలు.మరి మీ ప్రయాణం కబుర్ల కోసం మేం రెడీ.....
బాగుంది మీ పుస్తకపరిచయం. నేను కూడా లక్మిగారినుండే పుస్తకం తెప్పించుకున్నాను.
జ్యోతి గారు,
మీవంటి సీనియర్ల ప్రోత్సాహమే మా వంటి కొత్త బ్లాగర్లకి ఉత్సాహానిస్తుంది .I value your appreciation...ధన్యవాదాలు.
మీరు లింక్ ఎందుకు ఇవ్వలేదో ఇప్పుడు అర్ధమయ్యింది.. బహుశా యేనుగెక్కినంత సంబరపడి ఉంటారు కదూ :):)
ప్రతి ఒక్క వ్యాసాన్ని విశ్లేషించిన తీరు చాలా పద్ధతిగా, చదవాలి అనే కోరికను పెంచింది. చాలా బాగుంది తృష్ణ గారు.
@ మురళి:మీరు చెప్పేదాకా,మళ్ళీ పూర్ణిమగారి మైల్ చదివేదాకా విషయం అర్ధంకాలేదు...ధన్యవాదాలు.
@ జయ: ధన్యవాదాలు.తప్పక చదవండి.
Post a Comment