సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, October 16, 2009

దీపావళి జ్ఞాపకాలూ..





"దీపం పరంజ్యోతి కళాది నమో నమో
దీప మంగళ జ్యోతి నమో నమో.."
(పరం జ్యోతి అయిన దీపానికి నమస్కారం. శుభములను ఇచ్చే దీపానికి నమస్కారం)

****** *****


మీకు తెలిసిన పండుగ గురించి వ్రాయుము...

అని స్కూల్ పరిక్షల్లో ప్రశ్న ఉండేది...
ఆ తెలిసిన పండుగ తాలుకూ సమాధానం ఎప్పుడూ ఒకటే ...."దీపావళి అంటే దీపముల పండుగ.నరక చతుర్దశి రోజున నరకాసురుడు అనే రాక్షసుణ్ణి హతమార్చి.......etc..etc..etc.."


**** *****

"దుబ్బు దుబ్బు దీపావళి..మళ్ళీ వ
చ్చే నాగులచవితి.."

అంటూ గోగు కాడలతో(గోంగూర కొమ్మలు) మా పిల్లలతో అమ్మ దివిటీలు కొట్టించేది

(ఇది ఎందుకంటే దీపావళినాడు పితృదేవతలు సాయంసంధ్య తరువాత దక్షణ దిక్కు నుంచి వచ్చి తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట .వారికి దారి కనిపించటం కోసం దివిటీలు కొడతారుట. దీనిని
"ఉల్కా దానం" అని కూడా అంటారుట.)

దివిటీలు కొట్టిన తరువాత చేతులు కాళ్ళూ కడుక్కుని, తీపి తినాలి. మేం గులాబ్ జామ్ ( ప్రతి దీపావళికి స్టేండెర్డ్ స్వీట్ ) తినేసి...బుద్ధిగా దేముడి దగ్గర కూర్చుని అమ్మతో పాటే "కర్మ అనే ప్రమిదలో, భక్తి అనే తైలం పోసి, ధ్యానమనే వత్తి వేసి, జ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తున్నాను." అని చెప్తూ దీపాలను వెలిగించేవాళ్ళం.పల్చటి బట్టని చిన్న చిన్న వత్తులుగా చేసి, నువ్వులనునెలో ముందురోజు నానబెట్టి, వాటితో ప్రమిదలు వెలిగించేది అమ్మ.


ఇక ఆ తరువాత -- వారం రోజుల నుంచో, రెండు రోజులనుంచో...టపాకాయలు ఎండ పెట్టినప్పుడల్లా ఎప్పుడెప్పుడని తొందర పడే మనసు ఆగేది కాదు...నేనూ ,తమ్ముడు సుబ్భరంగా కొన్నవన్నీ కాల్చేసే వాళ్లం. నాగులచవితికి, కార్తీక పౌర్ణమికి కొన్ని దాచేది అమ్మ. కనబడితే వాటినీ కానిచ్చేస్తామని.
******** *********

ఎప్పుడన్నా అన్నయ్య దగ్గరకు ఊరు వెళ్తే, అక్కడ మా తాతమ్మ(నాన్నగారి అమ్మమ్మ) మతాబాలూ,చిచ్చుబుడ్లు, తారా జువ్వలు తయారు చేసేది. అబ్బురంగా ఆ చేసే విధానాన్ని చూసేవాళ్ళం.
************

కాలేజీ స్టేజి కొచ్చాకా కొంచెం జోరు తగ్గింది...ధరలు పెరిగాయి అని అర్ధం చేసుకుని ఏవో శాస్త్రానికి కొన్ని కొనుక్కునేవాళ్లం. చదువుల పేరుతో పిల్లలం దూరమయ్యాకా ఇక నే ఒక్కదాన్నే ఇంట్లో...ఏం కాలుస్తాంలే అనే నిస్తేజం వచ్చేసింది ఇంక. పైగా పెరుగుతున్న టపాసుల ధరలను చూస్తూంటే నోట్ల కట్టలను కాల్చుతున్నట్లే అనిపించేది నాకు. అంతకన్నా ఏదన్నా అన్నదానానికో, సేవా కేంద్రానికో ఇస్తే ఆ డబ్బు ఉపయోగపడుతుంది కదా అనే అభిప్రాయం ఏర్పడింది.

ఇప్పుడిక అదే భావం బలపడిపోయింది. వందకి ఓ చిన్న పెట్టెడు టపాసులు వచ్చిన రోజు నుంచి... ఒక కాకరపువ్వొత్తుల పెట్టె వందకి చేరుకున్న రోజులు వచ్చాయి. మూడంకెలు పెడితే గానీ ఓ మాదిరి బణాసంచా కొనుగోలు అవ్వదు ఇవాళ్టి రొజున. అయినా జనాలు వేలకి వేలు పెట్టి కొంటూనే ఉన్నారు..శాస్త్రానికి కొన్ని కాల్చవచ్చు.కానీ సరదాలకీ, ఆర్భాటాలకీ, పోటిలకీ పోయి వేలు ఖర్చుపెట్టి
స్కై షాట్స్, ఇతర ఔట్లు కొనటం కాల్చటం ఎంతవరకూ సమంజసమో మరి...
****** *******

ప్రస్తుతానికి మా పాప చిన్నదే కాబట్టి దాని సరదా అగ్గిపెట్టెలు,తుపాకీ రీలులతో పూర్తవుతోంది. రేపొద్దున్న అది పెద్దయ్యాకా అది కావాలి,ఇది కావాలి అంటే ఇప్పుడు ఇన్ని అనుకుంటున్న నేనే కొనాల్సిరావచ్చు....కాని ఏదన్నా చెప్తే విని అర్ధం చేసుకునే తెలివి దానికి ఉంది కాబట్టి నా అభిప్రాయానికి గౌరవం ఇస్తుందనే నమ్మకం. అంటే అసలు తపాసులే కొననని కాదండోయ్..మితంగా కొంటానని
చెప్పటం.
***** *******

మనం ఒక్కరోజే చేసుకుంటాము కానీ శాస్త్రీయంగా దీపావళిని అయిదు రోజులు చేసుకోవాలి. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, గోవర్ధన పూజ, భగినీ హస్త భోజనం. ఉత్తరాదిన ఐదు రొజులూ జరుపుకుంటారు.
**********

ఇక పెద్దయ్యాకా దీపావళి ఎందుకు చేసుకుంటాము,
పురాణాలలో ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి అన్నది తెలిసింది...
పురాణాలలో దీపావళి గురించి రేపు...


బ్లాగ్మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

30 comments:

శేఖర్ పెద్దగోపు said...

అబ్బ..ఓ రెండు నిమిషాల్లో ఆఫీస్లో ఉన్న నన్ను గ్నాపకాల ఫ్లైయిట్ ఎక్కించేసి చిన్నప్పుడు రోజులకి తీసుకెళ్ళారు కదా!! అర్జంటుగా ఓ టపా రాయాలని ఉంది నాకు...
అవునండీ...రేట్లు చూస్తే ఆనందం కన్నా భాద ఎక్కువగా ఉంటుంది.
మరి మీ పాపకి దగ్గరుండి అగ్గిపెట్టెలు, పాము మాత్రలు కాలిపించి ఆ విశేషాలు కూడా బ్ల్గాగ్లోకి ఎక్కించేయండి..
దీపావళి శుభాకాంక్షలు

మురళి said...

బాగున్నాయండి జ్ఞాపకాలు.. దీపావళి శుభాకాంక్షలు..

Surabhi said...

తృష్ణ గారు మీకు కూడా దీపావళి శుభకాంక్షలు.
టపకాయల విషయం లొ నావి కూడ same thoughts నాకు అవి కాలుస్తుంటె డబ్బు ని కాలుస్తున్నట్టె వుండెది. ఎదొ కొన్ని క్షణాల అనందం కోసం అవి కాల్చడం అంత అవసరమా అనిపించెది కాని సాయంత్రాలు ఇంటి గోడ చుట్టు దీపాలు పెట్టాలంటె యెంతొ ఇష్టం వుండెది.
నేను final గ దైర్యం చేసి నా బ్లాగ్లొ ఒక పోస్ట్ వేసాను చదివి మీ అభిప్రాయం చెప్పండి.

SRRao said...

మధురమైన జ్ఞాపకాలు మదిలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. మీ పాపకు కూడా కొన్ని తీపి గుర్తులు అందివ్వండి. అవే పిల్లలకి మనమిచ్చే విలువైన ఆస్తి. మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.

మాలా కుమార్ said...

చిన్నప్పుడు ,నరకచతుర్దశి రోజు , నానంగారు హారతి పళ్ళెము లో ఇచ్చిన పది రుపాయలతో టపాకాయలు కొనిపించేది మా అమ్మ . అప్పుడు పది రుపాయలకే ఎన్ని టపాకాయలు వచ్చేవో !
దీపావళి శుభాకాంక్షలు .

చిలమకూరు విజయమోహన్ said...

"పైగా పెరుగుతున్న టపాసుల ధరలను చూస్తూంటే నోట్ల కట్టలను కాల్చుతున్నట్లే అనిపించేది నాకు. అంతకన్నా ఏదన్నా అన్నదానానికో, సేవా కేంద్రానికో ఇస్తే ఆ డబ్బు ఉపయోగపడుతుంది"
బాగుందండీ మీ చిన్నప్పుడేమో టపాసులు కాల్చి ఈ రోజుకు కూడా వాటిని గుర్తుకు తెచ్చుకుని సంబరపడిపోవచ్చు.రేట్లు పెరిగినాయనో,నోట్లకట్టలను కాల్చుతున్నామనో అనిపించి మీ పిల్లలకేమో ఆ ఆనందాన్ని దూరం చేయాలనుకోవడం.చదువు చదువు అని పిల్లల చిన్నిపాటి ఆనందాల్ని కూడా దూరం చేస్తున్న మనం సంవత్సరానికి వాళ్ళు ఆనందపడే రోజును కూడా దూరం చేయాలనుకోవడం న్యాయమేనంటారా? ఖర్చు తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి కదా! ప్రతిరోజూ మనం తెలిసి ఎంతో ధనాన్ని దుబారా చేస్తూనే ఉన్నాము,దాన్ని తగ్గించుకొని ఇలాంటి ఖర్చుకు వాడుకోవచ్చుకదా!దయచేసి వాళ్ళకు కూడా కొన్ని మధుర జ్ఞాపకాల్నిపదిలపరచుకోవడానికి అవకాశమిద్దాం. ఏమంటారు మరి?

పరిమళం said...

దీపావళి వస్తుందంటే చాలు నాలుగు రోజుముందే టపాసులు (పేలనివేలెండి ) కొనేసుకుని రోజూ ఎండలో పెట్టుకోవడం ...స్కూల్ కి వెళ్తూ అమ్మకి జాగర్తలు చెప్పి వెళ్ళడం అన్నీ గుర్తోచ్చేశాయండీ మీకూ మీకుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు !

తృష్ణ said...

శేఖర్ గారూ, మరి టపా రాసేసారా?
ధన్యవాదాలు.

మురళిగారూ, ధన్యవాదాలు.

తృష్ణ said...

సురభిగారు, నాక్కూడా దీపాలు పెట్టడం చాలా ఇష్టమండి. ధన్యవాదాలు.

మాలా కుమార్ గారూ, పరిమళం గారు, ధన్యవాదాలు.

తృష్ణ said...

ఎస్.ఆర్.రావ్ గారూ ,పిల్లలకు మధురమైన జ్ఞాపకాలను ఇవ్వలేకపోతే మనం మంచి తల్లితండ్రులమే అవ్వమండి..నేను వేలు పెట్తి కొనను అన్నాను కాని అసలు టపాసులే కొనను అనలేదండి.

ధన్యవాదాలు.

తృష్ణ said...

విజయమోహన్ గారు, మీరు టపాలోని ఈ వాక్యాన్ని చదివినట్లు లేదు..

"అంటే అసలు టపాసులే కొననని కాదండోయ్..మితంగా కొంటానని చెప్పటం."

పైన ఎస్.ఆర్.రావు గారికి రాసినట్లు పిల్లలకి మధురమైన జ్ఞాపకాలను ఇవ్వలేకపొతే ఇంక పిల్లలను కనటం ఎందుకండి?

నా ఉద్దేశం వేలు ఖర్చుపెట్టి కొనను అని చెప్పటం అండి.పిల్లల సరదాలు తీర్చననీ కాదు,అస్సలు కొనననీ కాదు. నాకు ఊహ తెలిసాకా నేనెప్పుడు అది కొను, ఇది కొను అని మొండితనం చెయ్యలేదు.

అందరి సంగతి నాకు తెలీదు కానీ నేను పొరపాటున కూడా దుబారా చేసే మనిషిని కాదండి. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా బస్సులోనే వెళ్తాను కానీ ఆటోలు ఎక్కను.
రూపాయి కూడా ఊరికే రాదు అని నమ్మే మనిషిని నేను.

మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.

వేణూశ్రీకాంత్ said...

ఙ్ఞాపకాలు బాగున్నాయండీ.. దీపావళి శుభాకాంక్షలు. వన్నెచిన్నెల దివ్వెల వెలుగులను మించిన చిన్నారుల చిరునవ్వుల వెలుగులతో ఈ పండగ మీరంతా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

Bhãskar Rãmarãju said...

దీపావళి శుభాకాంక్షలు

చిలమకూరు విజయమోహన్ said...

మీరు దుబారా చేసేవారని నా ఉద్దేశ్యముకాదుగానీ చాలామంది నోటనుండి ఈమాట వినపడుతోంటే అందరినీ ఉద్దేశ్యించి అన్నానీమాట.మిమ్మల్ని నావ్యాఖ్యతో ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే అందుకు క్షంతవ్యుణ్ణి

Hima bindu said...

నాకు వేలకు వేలు కొని తగలబెట్టడం అస్సలు ఇష్టం వుండదు శాస్త్రానికి చిన్నవి కొని కాల్చితే సరిపోతుంది అనుకుంటాను ...ముఖ్యంగా ఆ ధ్వని ఆస్వాదించలేను ....పూలు జిమ్మె కాకర పువ్వోత్తులు ...మతాభులు చాలంటాను ///మీకు దీపావళి శుభాకాంక్షలు .

Anonymous said...

దివిటీలు ఎందుకు కొట్టిస్తారో తెల్సిపోయిందండోయ్.....
మేం చిన్నప్పుడు దివిటీలు కొట్టేవాళ్ళం. ఇప్పుడూ మా పిల్లల్తో కొట్టిస్తాం ..కానీ ఎందుకో తెలియదు. మా అత్తగారినడిగితే ఇంటికి జయం అన్నారు అంతే. అలాగే మా ఇంట్లో గుగ్గిలం పొగ వేస్తాం .....ఎందుకంటే ఆచారం అంతే!

హరే కృష్ణ said...

దీపావళి శుభాకాంక్షలు..

తృష్ణ said...

venu gaaru,

bhaskar gaaru,

thanks a lot.

తృష్ణ said...

విజయమోహన్ గారూ, మీరు అలా రాయటం మంచిదైందండి....టపాలోని వాక్యాలు అలాంటి భావనని కూడా కలిగించాయని అప్పుడు గాని అర్ధం కాలేదు నాకు. నా వాక్యాలను మళ్ళీ సరిగ్గా తెలియ చెప్పే అవకాశం మీ వ్యాఖ్య నాకు ఇచ్చింది. అందుకని మీకు మరోమారు ధన్యవాదాలు.

తృష్ణ said...

చిన్ని గారు, మీ వ్యాఖ్య నాకెంతో ఆనందాన్ని ఇచ్చిందండి...పెద్ద పెద్ద టపాకాయల శబ్దాలకి నేను ప్రతి నిమిషం ఉలిక్కిపడుతూంటే మావాళ్ళంతా నన్ను ఏడిపిస్తూ ఉంటారు...ధన్యవాదాలు.

లలిత గారూ, హమ్మయ్యా ! మీరొక్కరు అన్నారు మేమూ దివిటీలు కొడతామని...గుగ్గిలమ్ గురించి మరి నాకూ తెలియదండీ...ధన్యవాదాలు.

SRRao said...

తృష్ణ గారూ!
మీ టపా లోనే మీరు చెప్పిన విషయం గమనించాను. దుబారాను నేను కూడా ప్రోత్సహించను, అదే సమయంలో మనకున్న మధుర జ్ఞాపకాలను పిల్లలకు కూడా అందించాలనే ఆకాంక్ష వెలిబుచ్చాను. అంతే ! మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి.

తృష్ణ said...

హరే కృష్ణ : పండగలలో...ముఖ్యమైన తారీఖుల్లోనూ తప్పక wishes తెలుపుతారండీ మీరు...ఎలా ఉంది మా (మీ) బొంబాయి...రంగు రంగుల లైట్లతో, ప్రతి ఇంటిలో మెరిసే దిపపు కాంతులతో కళకళలాడుతోందా?...i love the olourful mumbai during this festive season..from Ganesh Chaturthi to diwaali...its really awesome...!!
ధన్యవాదాలు.

తృష్ణ said...

రావు గారూ, అదేమ్ లేదండి...ఇందాకా విజయమోహన్గారికి చెప్పిన మాటే...మీ వ్యాఖ్యలు నా భావాన్ని స్పష్టం చేయటానికి ఉపకరించాయి.Please dont be sorry..i'll feel embarrassed. Happy diwaali..

భావన said...

నేను అంతే చిన్నప్పుడు ఎప్పుడు ఇదే రాసే దాన్ని దీపావళి ఏక్ త్యోహార్ హై హూ అని హింది లో కూడా... :-) బాగుంది ఎన్ని కబుర్లు పంచారో దీపావళి సంబరలతో పంచుకోవటానికి. మీకు కూడా దీపావళి శుభకాంక్షలు.

తృష్ణ said...

bhaavana gaaru, thankyou and wishes 4 U 2...!!

amma odi said...

మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!

తృష్ణ said...

@ amma oDi : ధన్యవాదాలు.

అనంతం కృష్ణ చైతన్య said...

trushnagaru deepavali subhakankshalu mee tapa chadivaka deepavali gurunchi marintha telusukunnanu anduku kruthagnathalu

తృష్ణ said...

@ kark ; thankyou.

Brahma Mahesh said...

trishna gaaru,

chaala rojula tharvaatha nijangaa manasuku santosham kaligindhi... Ammamma gaari inta vennela choosthu padukunna tharvaatha.... geethanjali modathi roju nela class lo choosina tharvaatha... maa papa puttina tharvaatha modati saari choosina tharvaatha..