సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Thursday, October 29, 2009
వంటొచ్చిన మగాడు ( Just for fun..)
(నేను రాస్తున్నది కేవలం వంటొచ్చిన వారి గురించి. వంట రాని వారితో మరో రకమైన తంటా....అది మరొక టపా లో..)
వంటొచ్చిన మగాడు ( Just for fun..)
"ఇవాళ ఎం వండుతున్నావు?" అని తానే అడుగుతాడు.
"అది కాదు ఇది వండు" అని సలహా ఇస్తాడు.
ఉప్పులు,కారాలూ తేడాలు బాగా కనిపెడతాడు.
ఒహ పట్టాన ఏదీ నచ్చదసలు...
"ఈసారి ఇలా చెయ్యి" అని సలహా ఇస్తాడు.
ఏ కూర ముక్కలు ఏ సైజులో తరగాలో కూడా అడిగి చెయ్యాల్సిందే...లేకపోతే ప్రపంచం లో ఇలా ఎవరన్నా తరుగుతారా అని లెక్చర్లు...
"ఈ కూర దేంట్లో చేసావు? ఇంతకు ముందు దాంట్లో ఏం పోపు వేసావు?" అని ఆరా తీయగల సమర్ధుడు.
"మా అమ్మమ్మ లేక బామ్మ లేక అమ్మ చేసినట్లు చెయ్యటం నేర్చుకోరాదా..." అని ఉచిత సలహా పారేస్తాడు.
వంటకంలో పడాల్సిన వస్తువులు అన్నీ ఉండాలంటాడు. ఒక్క వస్తువు తగ్గినా రాజీ పడడు.
పొరపాటున వంటింట్లోకు వచ్చాడా...."ఇదేమిటి అది లేదా..అప్పుడే వండెయ్యకు..." అని డ్రెస్సు మార్చుకుని బయటకు పరుగెడతాడు...
ఇక తానే వంట మొదలెడితే ....ఇక మిగిలిన వారంతా ప్రేక్షకులవ్వాల్సిందే...
ఆ తరువాత అడవిని పోలిన వంటిల్లు సర్దటానికి ఇల్లాలి పని అయ్యిందే..!
ఇక కోపం వస్తే "వంటొండను పొమ్మనే" అవకాశం ఇల్లాలికి ఉండనే ఉండదు....
తానే ఇంచక్కా ఇష్టమైనవన్నీ వండేసుకుని, తినేసి, "టేబుల్ మీద పెట్టా నీక్కూడా..." అని వెళ్పోయేంత ధీరుడు.
హొటలుకి పోదామంతే మాత్రం....ఏ హొటల్కెళ్ళాలో ఎంతకీ తేల్చడు.....
అక్కడ అది బాగోదు..ఇక్కడ ఇది బాగోదు...అని జడ్జిమెంట్లిస్తాడు...
ఏక్కడికీ వద్దులెమ్మని ఇల్లాలు వంటింట్లోకి దూరే వరకూ....
పండుగలు, పుట్టినరోజులూ గట్రా వస్తే మాత్రం ఇల్లాలికి బెంగే ఉండదు...నేనున్నానని వంటింట్లోకి చొరబడతాడి వంటొచ్చిన మగాడు...
ఏది ఏమైనా వంట రాని ఆడవారు వీరిని కట్టుకుంటే గొప్ప వంటగత్తెలవటం ఖాయం.... !!!
************ **************
(ఇదంతా మావారి గురించి అనుకుంటున్నారా ? అబ్బే ఆయన రెండో రకం....
నీళ్ళు కాచుకోవాలంటే స్టవ్ వెలిగించాలని చన్నీళ్ళే పొసుకునే రకం...:)
ఇదంతా నా ప్రియమైన అన్నయ్య గురించి....(చదివితే కొడతాడేమో...)
కానీ మా వదినమ్మని ఇబ్బంది పెట్టడసలు...
వాడు చేసిన వంటకు వంక పెట్టలేమసలు...
వాడి వంట ముందు దిగదుడుపే అందరూ.....)
Subscribe to:
Post Comments (Atom)
41 comments:
>>ఆ తరువాత అడవిని పోలిన వంటిల్లు సర్దటానికి ఇల్లాలి పని అయ్యిందే..!
అందుకే మాకు వంటగదిలోకి ప్రవేశం నిషిద్దం
హ హ్హ..చిన్నప్పటినుండి రోజూ చూస్తున్నదే :) నాకో మోస్తరుగా వచ్చుగాని మా నాన్న గారు అద్భుతంగా వండుతారు. అపుడపుడు అమ్మకి ఆయనే నేర్పించారా అని అనుమానం వచ్చేలా. తు.చ. తప్పకుండా పైన చెప్పినవన్నీ వర్తిస్తాయి..భలే పట్టుకున్నారండీ.
పెరిగే వయసులో అమ్మ ఊరికెళ్తే మాకు చిన్న తేడా తెలిసేది కాదు. శుబ్బరంగా నాన్న మమ్మల్ని అసిస్టెంట్లుగా పెట్టుకొని ఆక్కూర పప్పులు, పులుసులు, కూరలతో సహా వండేసేవారు. మాక్కూడా భలే సరదాగా అనిపించేది. ప్రస్తుతం ఆయనకొచ్చినంత వంట రాదుగానీ ఏదో నడిపించేయగలం.
ఎప్పుడన్నా వండితే ముద్దుగానే వుంటుంది కాని రోజు కాళ్ళకి అడ్డం ,చేతికి అడ్డం పడితే ఒళ్ళు మండుద్ది ..నా వంటింటికి నేనే మహారాణిని,వంటగది అద్దంలా అన్ని వేళల మెరవడం నాకిష్టం అందుకే వారి ప్రవేశం నిషిద్దం ...బాగుంది టాపిక్ .
సాహిత్యం లో వంటొచ్చిన పురుష పాత్రలు (కొన్ని) :- అప్పదాసు గారు (శ్రీరమణ 'మిధునం') కోభ (సి. మృణాళిని 'కోమలి గాంధారం') మరియు అచ్చ్యుతం (వంశీ 'మా పసలపూడి కథలు') ..ఏతా వాతా తేలిందేమంటే మగవాళ్ళకి వంట రాకపోవడమే ఆడవాళ్ళకి సుఖమని :):) బాగుందండి టపా..
నిజం చెప్పండి..మీరు మా వంటింటి కిటికీలో నుండి నన్ను చూసి, అబ్జర్వ్ చేసి ఇందులో కొన్నింటిని రాసారు కదూ! :)
హ హ బాగున్నాయండీ కష్టాలు..
ఇప్పటి కాలం సంగతేమో గాని, కాస్త 10 సంవత్సరాల క్రితం గ్రామాల నుండి, ఊళ్ళ నుండి భాగ్యనగరానికొచ్చే యువకులు మాత్రం ఆడవారికంటే బాగా వంట చేసేవారు, అందులో నేనొకడిని, పొద్దున్నే 5 గంటలకే వంట చేసి క్యారెర్ సర్దుకొని పనులకెల్లేవాళ్ళం, ఇప్పటికీ ఊరెళ్ళితే మా ఇంట్లో నా చేతే వంట చేయిస్తారు, కాబట్టి మీ కథలోని మనుషులు మాత్రం బహుకొద్దిమందే ఉంటారనుకుంటా..! ఎంతైనా " నలభీమపాకం " అన్న నానుడి మగాళ్ళకే కదా..! హ హ హ.!..కమల్.
ఎందుకండీ మొగవాళ్ళకి వొంట తీరి కూర్చోని. హాయిగా పెట్టిందేదొ తినుకుంటు, అడిగినవేవో కొని ఇచ్హేస్తూ ఉంటే అది ఎంత మంచి కోఆర్డినేషనో కదా!
భాస్కర రామి రెడ్డి: భలే అదృష్టం...వంటగది జోలికి నే రమ్మన్నా రారు మా ఇంటాయన.
బుడుగు: నాకు తెలిసి వంటొచ్చిన మగవారున్న అన్ని ఇళ్ళది ఇదే పరిస్థితి అండీ...
నిజంగా మగవారికి వంట వస్తే ఎంత అదృష్టమో..
@ చిన్ని : మా వంట గదికీ నేనే మహారాణిని...పాపం ఆయనకు వంట రాదు కాబట్టి...!
@ మురళి : మగవారికి వంట రాకపోవటం ఆదవారికి సుఖమా?? ఇది 50% మాత్రమే కరక్ట్..
ఎందుకో "వంట రాని మగాడు" టపాలో రాస్తానండీ... :)
@శేఖర్ : అరే ఎలా కనిపెట్టేసారు...?
@వేణూ శ్రీకాంత్ : కష్టాలెక్కడైనా బాగుంటాయా? మీరు మరీనూ...:) :)
@kamal : ఒప్పేసుకున్నామండీ..
మీ వాదన కూడా సగమే కరక్టండీ...మగవారికి వంట రావటం వల్ల కొన్ని ఉపయొగాలు కూడా ఉన్నాయండోయ్...
వామ్మో వంట వస్తే ఇన్ని అనుకుంటారా మా గురించి
వామ్మో వెంటనే వంట మరచిపోవాలి
తృష్ణగారు మావారు రెండవ కోవకి చెందుతారు.... ఆ తిప్పలేవిటో????:):)
మా ఊరు: అయ్యో మర్చిపోకండి...అలా మర్చిపొతే రేపొద్దున్న మీ ఆవిడ దగ్గర మార్కులు తగ్గిపోతాయి....
సృజన: మావారూ అంతే మరి....వాటి గురించి త్వరలో "వంట రాని ......" టపాలో...
అయినా మన్లో మన మాట ....మికు తెలుసు కదా...:) :)
maa vari gurinchi cheppinatle vuvdi...article bagundi
వంటరాని వాళ్ళైతే.......అది కూడా చదివి నిర్ణయించుకుంటా ఎవరు బెస్టో!!
కిరణ్ జ్యోతి గారు, వంటొచ్చిన వారి భార్యలందరూ మూడువంతులు ఇలానే అనుకుంటారేమోనండీ...ధన్యవాదాలు.
@పద్మ గారూ:పద్మ గారూ, బెస్ట్ సమ్గతి సరే కానీ...మీరే 'రకం' తరఫొ చెప్పనేలేదు.. :)
అబ్బే!! శుద్ధ తప్పు..
అబ్బబ్బే...మేం ఒప్పుకోం.
మీ అన్నయ్యకే నా వోటు.
అన్నయ్యకీ జై.
చదువుతున్నంతసేపూ 'నలభీముల'తో హరితగారి ఇక్కట్లు 70ఎమ్.ఎమ్ సినేమాస్కోప్ టెక్నికలర్‌లో కనిపించాయి.
నాదిమాత్రం రెండోబాచీ. ఎదురుచూస్తా ఆటపాకోసం.
ఇకమాఇంటి విషయానికి వస్తే నాన్న కెవ్వుకేక. కూరలు తరిగితే పరికరములు అని హెడ్డింగ్ పెట్టీ స్కేలు, స్క్రూగేజీ, కోణమాని, వృత్తలేఖిని మొ. రాయాలి. వంటపూర్తయ్యేసరికే సగం ఆకలి చచ్చిపోతుంది.
I know too cook. and can cook well too. But nobody found it a problem!!! Mmm. :-)
భాస్కర్ గారు, ఆవిడేరీ..ఏరి..అని. ఒక్కసారి ఈ మాటే చెప్పమనండి... :)
చైతన్యా, అయితే మీ నాన్నగారి పోలికన్నమాట..
@ Geetaachaarya: ఆ మాట పెళ్ళయ్యాకా చెప్పండి సార్..!!
"మా అమ్మమ్మ లేక బామ్మ లేక అమ్మ చేసినట్లు చెయ్యటం నేర్చుకోరాదా..." అని ఉచిత సలహా పారేస్తాడు."
-- ఇది మాత్రం ఇద్దరికి (రెండు వర్గాలకు) కామన్ అనుకుంటా..
ఆ అమ్మాయికి కూడా ముందే వంట వచ్చు అంటే ఇంకా చెప్పక్కరలేదు. వంటింట్లో ఫ్రీడం కోసం పోరాడాల్సిందే.హ హ
eppudainaa ekkadainaa Nenu maaranandee. Parama rational. :)
@ నా సమాధానం "nobody found it a problem" అన్న వాక్యానికి ! ఆ మాట మీకు పెళ్ళయాకా మీ భాగస్వామి చెప్పాల్సిందే కదా..!!
(usually problems do start only with marriages..dont get frightened :) )
సర్టిఫికెట్టు అక్కడ నుంచి రావాలి అని నేను అన్నది..:) :)
@ మౌళి : మీ వ్యాఖ్య చాలా బాగుందండీ...ఫ్రీడం సంగతి ఎలా ఉన్నా చక్కగా ఇద్దరు కలిసి వండుకుంటూ ఉండచ్చు...
@ bhaavana : correct...correct..
అబ్బా ఎక్కడొ తగిలిందే.. 99% మాచ్ అయినవి.. :-(
@మంచుపల్లకి: This is ur first comment...Thankyou..!
@ఇద్దరు కలిసి వండుకుంటూ ఉండచ్చు
idi sambhavamaa annadi,evaranna selaviyyali :)
మౌళి గారు, why can't? మా వారికి వంట రాదు కాని , నేనూ మా అన్నయ్యా కలిసి తెగ ఎక్స్పరిమెంట్స్ చేసేవాళ్ళం వంటింట్లో...
ఇప్పటికీ కలిసినప్పుడల్లా ఏదో ఒకటి వండుతూ ఉంటామండీ..!
హోటళ్ళకెళ్ళినప్పుడు అందఱమూ లొట్టలేసుకుంటూ తినేది మగవంటే కదండీ !
-- తాడేపల్లి
LBS గారూ, కాదన్నదెవరండీ..నా వోటేప్పుడు మా అన్నయ్యకే...ఇది కేవలం సరదాకే..:)
ఆడవాళ్ళు వంటలో వీకయితేనే ఈ తంటాలు. మగవాళ్ళతో సరిసాటి అయితే కిక్కురుమనకుండా తింటారు.
@bonagiri: అలా అంటే బోలెడుమంది ఆడవాళ్ళు మీతో యుధ్ధానికి వస్తారు..
మీ పోయింట్ 50% ఏ సరయినదేమో..నాకు తెలిసినంతవరకూ నాకు అలా అనిపించదండి..ధన్యవాదాలు.
తృష్ణ గారు పొస్ట్ బావుంది ..
ముంబై లో తిండి కోసం పాట్లు మీకు తెలుసు అందుకే
రుచిగా వండిపెడితే ఎవరైనా పర్లేదు
@hare krishna: :) good boy..!!
ఆలస్యంగా కామెంటుతున్నందుకు ఏమీ అనుకోకండి.
చిన్నప్పుడు అమ్మ ఏదైనా సాయం చెయ్యమంటే మా స్నేహితులం అనుకునేవాళ్ళం..”హాయిగా వంటొచ్చిన మగాణ్ణి చేసుకుంటే సుఖంగా ఉండొచ్చని”
అది విని మా అమ్మగారు కేకలేసేవారు.. ”అదేం కోరిక..హాయిగా బోల్డు డబ్బున్నవాణ్ణి చేసుకుని వంటవాళ్ళని పెట్టుకోవాలని కోరుకోండి” అనేవారు. మీ టపా చదువుతుంటె నాకు మా అమ్మగారి మాట గుర్తు వచ్చింది. నిజమే.. వంటొచ్చిన మగాళ్ళతో ఎన్ని ఇబ్బందులో.
మరోమాట చెప్పడం మర్చిపోయాను. వంకలు పెట్టడానికి వంట చెయ్యడం రానక్కర్లేదేమో కదండీ. ఎందుకంటే వంట రాకుండా వంకలు మాత్రం పెట్టే మగవాళ్ళని చాలామందిని చూసాను. ఏమంటారు?
@శ్రీలలిత: అన్నింటికీ...:)
మరి రెండవ భాగం కూడా ఉంది కదా...
లేటేం లేదండీ..నేను రెండు మూడు నెలల క్రితం టపాలను కూడా చూసి వ్యాఖానిస్తూ ఉంటానండీ...ఎప్పుడు కుదిరితే అప్పుడే..
చాలా లేటు కామెంటు...కానీ ఇప్పుడే చూసాను మీ Post
కామెంటకుండా వుండలేకపోతున్నాను...కారణం మీరు చెప్పిన qualitylu 99% ఉన్నాయి మా శ్రీవారికి.
పెళ్ళికి ముందు నాకు వంట రాదు అంటే మాటల్లో...నాకొచ్చు లే నువ్వేం కంగారు పడకు...అని అభయ హస్తమిచ్చారు...వండి పెడతారు కాబోసు అనుకున్నా(అప్పట్లో అంత అమాయకం గా వుండే దాన్నిలెండి)
తర్వాత ఇంక చెప్పక్కర్లేదు మీ టపాఏ అంతా...నాకు పోపు అంటే పోపుల పెట్టె లో వి అన్నీ వెసేయటమే...అయనగారు ఫలానా కూరలో అవాలు వెయ్యరు...ఇందులో జీలకర్ర వెయ్యరూ అన్నింటికీ పేర్లే.
మీరు చెప్పిన దాన్లో లేని సుగుణం...మా వారికి సర్దటం లో doctorate ఇవ్వచ్చు...ఆయన వంట చేసాక నెనెళ్ళి సద్దే పని లేదు కాని ఆయన వండేది మహా ఐతే yearly once...రోజూ నాకు neatness గురించి మాత్రం lecture లు...పైగా ఇలా వంట చేస్తూనే అలా అన్నీ సద్దేసి వంట అయ్యేసరికి అసలు ఇక్కడ వంట వండారా అనేటట్టు వుండాలంటారు. ఇంకా mood వస్తే వంటింట్లో అన్నీ తనకి నచ్చినట్టు arrange చేసేస్తారు. మరునాటి నుంచి ఏది ఎక్కడ వుందో వెతుక్కోలేక నా పాట్లు మొదలు.
అసలు నేనొక టపా రాసి కసి తీర్చేస్కుందామనుకున్నా...కానీ మా వారికి నా blog చదివే అలవాటుంది...అందుకని ఇలా కసి తీర్చేస్కుంటున్నా అన్నమాట
మీ ఆఖరి వాక్యం మాత్రం 100% నిజం. వంట లో ఓనమాలు రాని నేను ఆయన్ని కట్టుకున్నాక ఒక మోస్తరు expert ఐపోయాను...
ఇంత పెద్ద comment పెట్టినందుకు క్షమించాలి...చెప్పాను కదా kasi అనీ...:)
Post a Comment