సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, October 6, 2009

చిరు సహాయం ఇచ్చిన సంతృప్తి.....!!

ఇల్లేది...పల్లేది...ఈ కుటుంబానికి దిక్కేది?
నీటిపాలైన సంసారానికి చుక్కానేది?

ఉన్నపళంగా నిరాశ్రయమైన పల్లెలెన్నో..?!
కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలెన్నో...?!
నీటిపాలైన గద్వాల్ చేనేత కార్మికుల భవిష్యత్తు బాగుపడేనా...?
నష్టపోయిన రైతులూ,వ్యాపరస్తులూ తిరిగి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోగల్గుతారా..?
సహాయ కార్యక్రమాలూ,నిధులూ సక్రమంగా బాధితులకు అందుతున్నాయా...?
చీకటైన ఆ బ్రతుకులలో వెలుగు కాకపోయినా చిరు దీపమైనా వెలిగేనా...?

..ఇలా ఎన్నో..ఇంకెన్నో ప్రశ్నలు...ప్రశ్నలూ...
అంతుచిక్కని ఆలోచనలూ...టి.వి.లో శవాలు,కూలిపోయిన ఇళ్ళూ,నీట మునిగిన ఊళ్ళూ,పొలాలూ....
వై.యస్ గారితో పాటు ఐదుగురు మనుషులు దయనీయ స్థితిలో నిర్జీవులైపోతే ఎంతో బాధ పడ్డాం...మరి లక్షల జనాల జీవితాలు ఇవాళ తలక్రిందులైపోతే ఇంకెంత బాధ....ఒక మహా బాధ మనసుని దొలిచేస్తోంది..
మూడు రోజుల్నుంచీ మధ్యరాత్రి మెలుకువ వచ్చేస్తోంది...నిద్రే పట్టదు...
అయ్యో,ఆ వార్తల్లో కనిపించిన శవాలు ఎవరివో....ఎవరి బిడ్దో...ఎవరి తల్లో....ఎవరి అన్నో...

"భూమిపై పాపం పండిపోయినప్పుడు,భూమి భారం పెరిగిపోయినప్పుడూ
ఇలాంటి విపరీతాలు జరుగుతూంటాయి...
ప్రకృతి ప్రళయరూపం దాలుస్తూంటుంది" అని ఎక్కడో చదివిన గుర్తు..!
ఇది ఎవరి పాపం?ఎవరి శాపం?
పాపం ఎవరిదైనా ఇవాళ భరిస్తున్నది దీన అమాయక జనం...

భార్యలకూ,ప్రేమికురాళ్ళకూ కోట్లు,లక్షలు విలువ చేసే బహుమతులు అందజేసే వ్యాపారవేత్తలూ,ప్రముఖులూ,ధనవంతులూ ఇటువంటప్పుడు ఈ బాధితులకు

పెద్ద మొత్తాలలో సహాయం చెయ్యగలిగితే మానవత్వం నిలబడుతుందని నా అభిప్రాయం..!!
మరి నేను..?
వీరికి నేనేం చెయ్యగలను..?ఏదైనా చేయాలి...
చిన్నపిల్లని,సంసారన్నీ వదిలి ఆ ప్రాంతాలకు వెళ్ళి సహాయం చెయ్యలేను....
కానీ బాధ్యత గల పౌరురాలిగా చిరు సాయమైనా చేయాలి అనిపించింది...
ఒక సామాన్య మధ్యతరగతి గృహిణిగా పెద్ద సహాయాలేమీ చెయ్యలేను..
అయినా నాకు తోచిన చిన్న సాయం నేనూ చేసాను...

సహాయం నేరుగా బాధితులకు అందుతుంది అని నమ్మకం ఉన్న ఒక సేవా సంస్థకు నా దగ్గర ఉన్న కొంత డబ్బుని,కొన్ని కిలోల బియ్యాన్ని,మూడు సంచుల బట్టలను పట్టుకెళ్ళి ఇచ్చివచ్చాను.
ఇది చాలా చాలా చిన్న సహాయం...కాని ఇలాంటి చిన్న సహాయాలన్నీ కలసి ఒక "పెద్ద సహాయం" అవుతుంది అని నా నమ్మకం.
ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది....నేనూ నా వంతు బాధ్యత నేను నెరవేర్చాను అన్న సంతృప్తి నాకు కలిగింది.

ఇదంతా నేను ఏదో చేసేసాను అని చెప్పుకోవటం కోసం రాయటంలేదు...ఒకోసారి మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మనసుకు ఎంతటి సంతృప్తిని,ఆనందాన్ని కలిగిస్తాయో చెప్పటం కోసం రాస్తున్నాను...నా ఉడుతా సహాయం వల్ల నాకు కలిగిన సంతృప్తిని,ఆనందాన్ని పంచుకోవటం కోసం రాస్తున్నాను..!!

24 comments:

నేస్తం said...

మంచి పని చేసారు,నాకు ఇవే ఆలోచనలు .ఏంటో దిగాలుగా అయిపోతుంది మనసు .అక్కడికి వెళ్ళి వాళ్లను ఆదుకోవాలి అనిపిస్తుంది కాని నిస్సహాయం గా టి.వీ లలో చూడటమే ..కాకపోతే ప్రజలలో ఇంత మానవత్వం ఉంది అంటే వినడానికి చాలా ఆనందం గా ఉంది .

Bhãskar Rãmarãju said...

Good Job!!

SRRao said...

మానవత్వం పరిమళించినవేళ...... మీ స్పందన అభినందనీయం

జయ said...

నదిలో కొట్టుకుపోయేవాడికి చిన్న దర్భ్హ పుల్ల దొరికినా చాలు ఎంతో నమ్మకంతో ఒడ్డుకి చేరిపోతాడు. అటువంటి ఒక చిన్నపనే నేనూ ఇవాళ చేసి ఎంతో సంత్రుప్తి పొందాను. keep it up. Congrats.

జ్యోతి said...

good work. each drop collected can become an oceon..

Bhãskar Rãmarãju said...

తృష్ణ
సహాయం అనేది బ్లాగ్లోకంలో ఎప్పుడో మొదలయ్యింది.
http://jeevani2009.blogspot.com/2009/10/updated_2309.html
http://malakpetrowdy.blogspot.com/2009/10/blog-post.html
మీరూ ఓ చెయ్యి వేయండి...
[ఈ సమాచారాన్ని మీ స్నేహిత బ్లాగరౌలకు తెలియజెప్పండి]

తృష్ణ said...

భాస్కర్ గారూ, చూసానండి.చాలా మంచి ప్రయత్నం.
మా వారు వారి స్నేహితులతో కొన్ని వరద బాధిత ప్రదేశాలకు వెళ్తున్నారు.సంస్థల తరఫున కాకుండా స్వయంగా బియ్యం,పప్పు దినుసులు,కొన్ని వస్తువులు,డబ్బు అందజేయాలని.ఆయనే వెళ్తున్నారు కాబట్టి నేనింక మలక్పేట రౌడిగారి బ్లాగ్లో కానీ మరెక్కడ కానీ కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదండి.

తృష్ణ said...

భాస్కర్ గారూ,
నేను నా వంతు సహాయం చేసి వచ్చాకా మా వారి ప్రోగ్రాం తెలిసింది.లేకపోతే సేవా సమితిలో ఇచ్చేబదులు నేనూ తనకే ఇద్దును.
ఏమైనా నా వంతు సాయం చేసాననే సంతృప్తి నాకు మిగిలింది.

తృష్ణ said...

నేస్తం గారూ,
ఎస్.ఆర్.రావ్ గారూ,
జయగారూ,
జ్యోతిగారూ,
నా అంతరంగ భావాలకి ప్రతిస్పందించిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.

మెప్పు కోసం కానే కాదు...కేవలం నా ఆనందాన్ని పంచుకోవటానికి మాత్రమే రాసినది ఈ టపా.

భావన said...

పంచుకుంటే వచ్చే ఆనందం.. ఆత్మ తృప్తి నిస్తుంది తృష్ణా.. మీ మనసు అర్ధం అయ్యింది. చాలామంచి పని చేసేరు.."ధర్మో రక్షతి రక్షితః"

మధురవాణి said...

మీరన్నది అక్షరాలా నిజం. నాక్కూడా ఇదే భావన కలిగింది. చేసింది చిన్నపాటి సహాయమే అయినా ఒక మంచి పని చేసినప్పుడు కలిగే ఆత్మసంతృప్తి ఎంతో విలువైనది.

చిలమకూరు విజయమోహన్ said...

ప్రతి ఒక్కరూ మీలాగే మంచిమనస్సుతో ఆలోచించడవల్లనే వరద బాధితులకు తమవంతు సహాయాన్ని అందించగలుగుతున్నారు.

తృష్ణ said...

భావన గారు,ఆనందం పంచుకుంటే పెరుగుతుంది కదండి...అందుకే ఈ టపా..ధన్యవాదాలు.


మధురవాణిగారు,ధన్యవాదాలు.

తృష్ణ said...

విజయమోహన్ గారు,నిజమేనండి..మనుషుల్లో ఇంకా ఎంతో మానవత్వం మిగిలి ఉంది..అని అన్నటానికి జరుగుతున్న సహాయ కార్యక్రమాలే నిదర్శనాలండి.
ధన్యవాదాలు.

శేఖర్ పెద్దగోపు said...

మంచి పని చేశారండీ....అభినందనలు.

కొత్త పాళీ said...

good show.

తృష్ణ said...

@శేఖర్ పెద్దగోపుగారు,

@కొత్త పాళీగారు,
ధన్యవాదాలు.

Padmarpita said...

చాలామంచి పని చేసారు..

siva said...

అభిన౦దనలు. ప౦చుకొ౦టే పెరిగేది ఆన౦దమే కాదు, సేవాతత్పరత కూడా. స్ప౦ది౦చే హృ దయ౦ చాలదు, సాయ౦ చెసే చేతులు కావాలి.

తృష్ణ said...

@siva:ధన్యవాదాలు.

@ పద్మార్పిత: ధన్యవాదాలు.

మురళి said...

You have done a good job ma'm

తృష్ణ said...

@murali: thankyou.

వేణూశ్రీకాంత్ said...

చాలా మంచి పని చేశారు తృష్ణ గారు. నిజమే చిరు సాయమైనా సరే అది ఇచ్చే సంతృప్తి వెలకట్టలేనిది.

తృష్ణ said...

venu gaaru,thankyou.