వాద్య సంగీతానికీ నాకూ ఒక నాస్టాల్జిక్ బంధం! ఊహ తెలిసిననాటి నుండీ వింటూ వచ్చిన పాశ్చాత్య వాద్య సంగీతం నాపై అమితమైన ప్రభవం చూపింది. వివరాలు, ఆర్టిస్ట్ ల పేర్లు తెలియకపోయినా నాన్న వింటూంటే కూడా వినడం, ఆ తర్వాత మళ్ళీ వినాలనిపించినప్పుడు ఫలానా కేసెట్ వెతుక్కుని మళ్ళీ వినడం నాకు అలవాటుగా ఉండేది. ఏ పని చేస్తున్నా ఏదో ఒక వాద్య సంగీతం వినడం పాటలు వినడం కన్నా ఇష్టమైన పని నాకు ఒకప్పుడు. నాన్న దగ్గర ఏ అరలో ఏ కేసెట్ ఉంది, ఏ కేసెట్లో ఏం ఉన్నాయి అనే వివరాలు నాకు తప్ప ఇంట్లో మరెవరికీ ఎక్కువ తెలీదు.
పెళ్లయ్యాకా కంప్లీట్లీ different world లోకి వెళ్పోయాను. పక్కా ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీ! అసలు దాదాపు అన్నీ మర్చిపోయాను. బీథోవెన్, వివాల్డీ లు పూర్వ జన్మ స్మృతుల్లా మిగిలిపోయారు. ఇన్నేళ్లకి ఇప్పుడు సంగీతం వినడానికి ఏకాంతం దొరుకుతోంది కానీ నాన్న దగ్గర నుండి ఆ కెసేట్లు తెచ్చుకుని కాపీ చేసుకునే సమయమే ఉండట్లేదు. నిన్న సాయంత్రం వంటింట్లో పనులు చేసుకుంటూ 102.8 fm (వివిధభారతి) పెట్టేసరికీ హఠాత్తుగా ఒక 'సింఫొనీ ఆర్కెస్ట్రా' వస్తోంది.. చెకోవ్స్కీ దేదో..! ఆ సింఫొనీ ఆర్కెస్ట్రా వరుసగా అలా వింటుంటే పూర్వ స్మృతులన్నీ ఒక్కసారిగా దుమ్ము దులుపుకుని నన్ను చుట్టుముట్టేసాయి. ఆ స్వప్నలోకాల్లో మరోసారి విహరించా...!!
నిన్న కుదర్లేదు కానీ ఇవాళ మధ్యాహ్నం ఇదివరలో కాపీ చేస్కున్న ఓ పాత సీడీ వెతుక్కుని అవన్నీ 'యూట్యూబ్' లో వెదకడం మొదలెట్టా.. కొన్ని దొరికాయి!! ఇదిగో దొరికిందే తడవు ఈ టపాలో భద్రపరిచేద్దామని రాయడం మొదలెట్టా :) వాద్య సంగీతం పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు వీటిని తప్పకుండా వినండి.. ట్యూన్స్ అన్నీ చాలా చాలా బావుంటాయి.. ఏవో స్వప్న లోకాల్లో విహరింప చేస్తూ.. నూతన ఉత్సాహాన్ని నింపేస్తూ.. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లకపోతే అడగండి!
క్రింద ఉన్నవన్నీ నేను ఒకప్పుడు చాలా చాలా ఇష్టంగా ప్రతి noteనీ ఆస్వాదిస్తు మళ్ళీ మళ్ళీ విన్నవే..
This is too good..
Pan Pipe Moods - Without You
Kenny G - Songbird
YANNI - One man's Dream
Yanni- If I could tell you
Yanni - Live at the Acropolis (Nostalgia)
Beethoven - Moonlight Sonata
Antonio Vivaldi - The Four Seasons