మధుర గాయకుడు హరిహరన్ స్వయంగా స్వరపరిచిన "Horizon(1988)" అనే గజల్స్ ఆల్బం ఉండేది మా ఇంట్లో. హరిహరన్ వాయిస్ మొదటిసారి విన్నది అందులోనే నేను. ఆ ఆల్బమ్ లో మొత్తం ఎనిమిది గజల్స్ ఉంటాయి. అన్ని బాణీలూ హరిహరన్ వే .అన్నీ కూడా చాలా చాలా బావుంటాయి. గజల్స్ మధ్యన వచ్చే సంతూర్ వాదన వింటుంటే మనసు ఎటో గాల్లో తేలిపోతూ ఉంటుంది. అంత బాగా స్వరపరిచారు హరిహరన్. ఆ కేసెట్లో మొదటి గజల్ "ఆజ్ భీ హై మెరే కద్మోం కే నిషా ఆవారా.." ! సాహిత్యాన్ని రాసినది ముమ్తాజ్ రషీద్.
మొదటిసారి విన్న గజల్, అదీ హరిహరన్ వాయిస్ అవడంతో నాకు తెలిసిన గజల్స్ అన్నింటిలోకీ ఇది అత్యంత ప్రీతిపాత్రమైనదైపోయింది. కాస్త ఉదాసీనమైన సాహిత్యమని నేను వినడం మానేసాను కానీ ఇప్పటికీ చాలాసార్లు అప్రయత్నంగా నానోటి వెంట ఈ గజల్ వచ్చేస్తుంటుంది. ఇందులో "जिसकॊ भी चाहा उसॆ टूट कॆ चाहा राशिद.. कम मिलॆंगॆ तुम्हॆं हम जैसॆ यहां आवारा" అన్న వాక్యాలు పాడుకుంటే లోపల దాగున్న వేదనేదో తేలికైనట్లు అనిపిస్తుంది. ఈ గజల్ లో సాహిత్యం కన్నా హరిహరన్ తీసే గమకాలు నాకు చాలా ఇష్టం. మళ్ళి మళ్ళీ విన్నప్పుడు బాగా తెలుస్తాయి.
Ghazal: Aaj bhi hai mere..
Lyrics: Mumtaz Rashid
Singer & Composer: Hariharan
సాహిత్యం:
ప: आज भी है मॆरॆ कदमॊं कॆ निशा आवारा
तॆरी गिलयॊं में भटकतॆ थॆ जहा आवारा
((आज भी है मॆरॆ..))
1చ: तुझसॆ क्या बिछ्डॆ तॊ यॆ हॊगई अपनी हालत..
यॆ हॊगई अपनी हालत..
जैसॆ हॊ जाऎ हवावों में धुवां आवारा(२)
((तॆरी गिलयॊं में..))
2చ: मॆरॆ शॆरॊं की थी पेह्चान उसी कॆ दम सॆ..
उसी कॆ दम सॆ..
उसकॊ खॊ कर हुए बॆनाम निशा आवारा(२)
((तॆरी गिलयॊं में...))
3చ: जिसकॊ भी चाहा उसॆ टूट कॆ चाहा राशिद..
उसॆ टूट कॆ चाहा राशिद..
कम मिलॆंगॆ तुम्हॆं हम जैसॆ यहां आवारा(२)
((तॆरी गिलयॊं में...))
*** ***
ఈ ఆల్బమ్ లో మిగిలిన గజల్స్ లో
* फूल कॆ आस पास रेह्तॆ हैं
* हमनॆ काटी हैं तॆरी याद मॆं रातॆं अक्सर
* शराब ला.. शराब दॆ
* बन नही पाया..
* क्या खबर थी..
మొదలైనవవి చాలా బావుంటాయి. మొత్తమ్ ఆల్బమ్ ని క్రింద లింక్ లో వినవచ్చు:
http://play.raaga.com/hindi/album/ghazalsbyhariharanhorizong0000381