వచ్చిన తలనెప్పి వివరాలు:
తలనెప్పి 1)క్యూ లో నించునే రోజులు పోయాయి కాబట్టి,నెట్ లో శెలవురోజు కాబట్టి వెతికి వెతికి,సిట్లు ఖాళీ ఉన్న ఓ సినిమాకు టికెట్ బుక్ చెయ్యటం ఒక తలనెప్పి.
2) సినిమా అంటే ఓ లుక్ ఇచ్చే అయ్యవారిని ఒప్పించటం,కూర్చున్న రెండు గంటల్లోనూ 200సార్లు అసహనంగా కదిలే ఆయన మూమెంట్స్ గమనించుకుంటూ,చీకట్లో కూడా స్పష్టంగా కనిపించే ఆ తీవ్రమైన అసహనపు ఎక్ష్ప్రెషన్స్ గట్రా ఒక తలనెప్పి..! (అయినా,నా కోసం ఇంత భరిస్తున్నారనే ఆనందం లోపల్లోపల..)
3)సినిమాలకు పాపని తిసుకెళ్లకూడదు అనే నిర్ణయం మాకున్నందువల్ల,ముందు "అటు" వెళ్ళి పాపని దింపి,మళ్ళీ టైంకి సినిమా మొదలవ్వకుండా వెళ్ళడానికి;సినిమా మధ్యలో వచ్చిన ఫొన్ కాల్స్ వల్ల అది అయ్యాకా మళ్ళీ పాప కోసం "అటు" వెళ్ళడానికి మొత్తం 3ఆటోలు ఎక్కాల్సి వచ్చినందుకు బాధతో నిండిన తలనెప్పి...
4) ఇక ఇవన్నీ పక్కన పెట్టి కధలోకి వస్తే...ఎక్కువ ట్విస్ట్ లు పెట్టి ప్రేక్షకుడి ఆలోచనా శక్తిని పరీక్షించే ప్రయత్నాలు ఈ మధ్య కొత్త సినిమాలన్నింటిలో జరుగుతున్నాయి.మొదటి సన్నివేశాన్ని బట్టి క్లైమాక్స్ ఊహించుకునే స్థాయికి ప్రేక్షకుడు వచ్చేసాడని తెలుసుకున్న కధా రచయితలు,తమ చాకచక్యంతో జనాలు ఊహించలేని మార్పులను కధల్లోకి చొప్పిస్తున్నారు.ఓహో ఇలా కూడా జరగొచ్చన్నమాట అని మనం సర్దుకుపోయిన సందర్భాలూ,ఇష్టం వచ్చినట్లు కధను మార్చేస్తే చూస్తున్న ప్రేక్షకుడు ఏమవ్వాలి అనే కోపం వచ్చిన సందర్భాలు ఎక్కువే..!!
5)సినిమా అయ్యాకా పాప కోసం అమ్మావాళ్ళీంటికి ఒక్కర్తినీ ఆటోలో వెళ్తూంటే ,ఆటోఅతను సరిగ్గా తిసుకెళ్తాడా?పాటలెందుకు పాడతాడు?మొంచివాడో కాదో?రొడ్డు మీద సెలవు వల్ల ట్రాఫిక్ లేదు..బస్సెక్కాల్సిందేమో..?అని బోలెడు ప్రశ్నలూ.ఇల్లు దగ్గర పడేదాకా అదో తలనెప్పి..
6)అన్నింటిని మించి సినిమా కధో పెద్ద తలనెప్పి..ఇక నిన్నటి కధలోకి వస్తే,చాలా డౌట్లు..
అసలూ...ఒక ప్రేమికుడూ,ప్రేమికురాలూ ఉన్న మనిషికి మళ్ళీ ఎందుకు మరో వ్యక్తి పట్ల ఆసక్తి కలగాలి?అన్నది ప్రాధమిక ప్రశ్న.
కలిగిందే పో,అలా కలిగిన ఆసక్తిని ఇంకా ఇంకా పొడిగించి అది "ప్రేమే" అని చూట్టూ ఉన్నా పాత్రల ద్వారా పదే పదే చెప్పించి,మనల్ని నమ్మించే ప్రయత్నం కధకుడు ఎందుకు చెయ్యాలి?
నమ్మించారే పో,ఆ కొత్తగా పుట్టిన ప్రేమకి లాజిక్కులూ,కారణాలు ఉండవా?3 నెలలు ఒకే చొట పని చేస్తే,పక్కపక్కనే ఉంటే, పాత ప్రేమికులని మర్చిపోయి పక్కనే కనబడే వాళ్ళని ప్రేమించేసేంత బలహీనమైనదా వాళ్ళ ప్రేమ?
యువతా ఇలానే ఉన్నారు అని చూపించే సెటైరా ఇది?
పోనీ ఏదో ఒకటి,ఈ రెండోదే నిజమైన ప్రేమేమో అని మనం నమ్మే ప్రయత్నంలో ఉండగా,కాదు కాదు మొదటిదే అసలైనది అని మనల్ని కంఫ్యుజ్ చేసేస్తాడు కధారచయిత.
అసలు కధలోకి మరో పెద్ద హీరో ఎందుకు?సమస్యను చెప్పుకోవటానికి ఆ పెద్ద హీరో ఎమన్నా "లవ్ గురూ"నా?తనది ప్రేమో ఆకర్షణో తానే అర్ధం చేసుకోలేని వ్యక్తికి ప్రేమ అవసరమా?
సరే అంతా అయ్యి, విమానం దిగగానే వాళ్ల వాళ్ళ ప్రేమికులు వచ్చి "ఎంత మిస్సయ్యానో" అని గట్టిగా కౌగిలించుకునే సరికీ,అప్పటిదాకా "ధక్ ధక్" అని కొట్టుకున్న వాళ్ళ వళ్ళ మనసులు రుట్ మారిపోయి పాత ప్రేమికుల వైపు వెళ్ళిపోతాయి..!
మరి అంతదాకా మనకు చూపించిన వేదన,బాధా,ప్రేమ,ఆరాటం అన్నీ తూచ్చా?(ప్రేక్షకులు వెర్రిమొహాలు అని ఎర్రాటి అక్షరాల్లో చూపించటం అన్నమాట.)వాళ్ళు రాసిన ఉత్తరాల్ని చింపేసి,"హ హా హా " అని హాయిగా మనసారా నవ్వేసుకుంటూంటే..జుట్టు పీక్కోవాలని అనిపించని వాడు ప్రేక్షకుడే కాదని నా అభిప్రాయం.
7)ఇక సినిమాలో పాటలు,సందర్భోచితమా కాదా అన్న సంగతి నే చెప్పకపొవటమే బెటర్..చెబితే అవి నచ్చిన వాళ్ళతో అదో తలనెప్పి...!
8)ఇంటికి వచ్చి "కధ చెబుతా..కధ చెబుతా" అని(మైఖేల్ మదన కామరాజులో పాట లాగ)ఎంత శ్రీలక్ష్మిలాగా ప్రయత్నాలు చేసినా ఎవరూ వినరేమిటో....!అయినా మొదలెట్టాను"ఇద్దరమ్మాయూ,ఇద్దరబాయిలూ,వాళ్ళలో ఒక అమ్మాయి,ఒక అబ్బాయి విమానం ఎక్కుతారు..."వద్దు బాబోయ్ ....ఆపవే బాబూ...అని అందరూ...కెవ్వున...కేక..!
9)అలా కధ నోట్లోంచి బయటకు రాక రాత్రంతా పెద్ద తలనెప్పి...!!
10)తలనెప్పిల్లో ఇన్ని రకాలా అని టపా చదివిన వారందరికీ కొత్త తలనెప్పి..!?!
(ఇంతకి సినిమా పేరేమిటో...అబ్బ ఆశ,దోశ..చెప్పేస్తాననే..)
14 comments:
ఇలా పది పాయింట్లు రాసినప్పుడే అనుకున్నా మీరు చెప్పరని. అయినా కధ కోసం వెతుక్కుంటారటండీ ఈ రోజుల్లో వస్తున్న సినిమాలలో కూడా ?
తొడ కొట్టి ట్రైను ఆపాడా , హీరోయిజమ్ పెరిగిందా లేదా ?
సుమో లోంచి జంప్ అమాంతం జంప్ చేసాడా లేదా ?
మీసం తిప్పి సునామీ సృష్టించాడా లేదా ?
ఇవే కదా సినిమాలలో దర్శకరత్నాలు చూస్తున్నవి ఇప్పుడు
(మీకు కధ ఉన్న, లేదా కొంచెం బుర్ర పెట్టి తీసిన సినిమాలు కావాలంటే "బాణం" లాంటివి ఎడారిలో ఒయాసిస్సులా వస్తాయి, చూడండి. )
అయితే మా పనే సుఖమన్న మాట :) భోజనం చేసి తీరిగ్గా పాటలు వింటూ ఓ గంట డ్రైవ్, ఓ పెద్ద హాల్లో నలుగురితో కూర్చుని చూసి రావటం, లేదా శుక్రవారం రాత్రి హాయిగా డిన్నర్ తిని డి వి డి లో సినిమా చూసుకోవటం. కాకపోతే కాస్త ఆ మొదటిరోజు మోజులో పడకుండా కాస్త వెనగ్గా ముందుగా అంతే... ;)
Everything is fine. :-)
Nice account.
Is it Love Aaj Kal?
5, and 7th points are one and the same. Is it intentional? or a satire on the repitition of the point in the movie? ;-)
"....తిమిర సంహరణాలు.. చైతన్య దీపాలు.. జగతికి ప్రాణాలు...ప్రగతి రధ చక్రాలు..." ...రైట్?? (క్లూ అర్ధం కాకపొతే ఇదో కొత్త తలనొప్పి :-) )
సూపరో సూపరు.
1) క్యూ లో నిలబడి (ఆనందంగా !) టికెట్లు కొనుక్కుని చూసి, ఆనందించిన సినిమాలు - సిమ్హాసనం, పడమటి సంధ్యా రాగం, గీతాంజలి, సీతా రామయ్య గారి మనవరాలు, జగదేక వీరుడు, అతిలోక సుందరి. అంతే! ఈ లిస్టు అంతటితో స్టాప్. ఇవన్నీ వేసవి సెలవుల్లో కసిన్స్ తో చూసినవి. నెట్టు బుకింగ్ లో ఆ మజా లేదు. పడమటి సంధ్యా రాగం అయితే మరీనూ. ఎండలో మేటనీ కెళ్ళి, ఇంకేం దొరక్క, కరెంటు పోయి కరిగిపోయిన ఐస్ క్రీం (నీళ్ళు) కోన్ లలో పట్టుకుని తాగడం! (అలానే అమ్మేరు ఆ రోజు)
2) Sadism అని దీన్నే అంటారు. :(
3) ..
4) అరుంధతి చూసి ఇలానే అనుకున్నాను. ఆ ధధీచి టైపు లో వజ్రాయుధం కోసమని అనూహ్యని మరీ అనూహ్యంగా చంపడం ! అమ్మ బాబోయ్! వీళ్ళకెంత క్రియేటివిటీ ! అనిపించింది.
5) ..
6) సేం డౌట్లు చాలా మందికి ఉండొచ్చు. Same Pinch.
7) ..
8) రివ్యూ అంటారు - అలా రాశేయండి. నేనూ రాస్తూంటాను. 'రివ్యూ అంటే కధ రాయడం కాదండీ' అని ఎంత మంది మొత్తుకున్నా..! :D :D
9) :D
10) మరేం చేస్తాం ?! టపా ఎవర్రాశేరు ?
మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ : నిజమే అలా ట్రై చేసి ఉండాల్సింది...కానీ ఇప్పట్లో మళ్ళీ సినిమా అంటే మావారిచ్చే లుక్కు గుర్తుతెచ్చుకొటానికే భయమేస్తోంది..:)
@ఉష: అదే రైటు..!కానీ నేనూ సినిమా వచ్చిన ఆర్నెల్లకి టి.వి.లో చూస్కోవచ్చులే అని సినిమాలు చూడకుండా వదిలేసిన రోజులున్నాయండోయ్..
@గీతాచార్య: భలే పట్టేసారే...point మార్చేసా చూడండి..
ఇదే మీ first comment.thankyou.
@ మురళి:మీరు చెప్పుకోలేకపోతే అదో తలనెప్పి...అయిన సినిమాల విషయంలో మీతో గెలిచిందెవరని...:)
నేనొక్క సినిమాను మాత్రమే రిలీజైన రోజు చూశాను 3 గంటలు క్యూలో నుంచొని మరీ (బాక్స్ లేటైనందుకు) "అదేరా సీమసిమ్హం". ఆదెబ్బతో వందరోజులు దాటిన తరువాత గానీ ఇంద్ర సినిమాను సైతం చూడటానికి భయపడ్డాను. చాలా రోజుల తరువాత ఈ release cyndrome తో నిన్న రాత్రి wake up sid కి వెళ్ళి ముందుకూర్చున్న వాళ్ళు ఈలలు వేస్తూ చూస్తుంటే మావాడితో నేనన్న మాట "ఏజి డిఫరెన్సు మామా. కుర్రాళ్ళు కదా వాళ్ళకి నచ్చుద్దిలే". అంతోటి సినిమాకి మళ్ళీ వివాదమొకటి అదికూడా "బాంబే" గురించి.
@ Indian Minerva: "wakeup sid" కి కూడా వెళ్దామనుకున్నామండి, కానీ tkts లేనందువల్ల వెళ్లలేదు..అయితే మరేం మిస్సయామని బాధపడక్కర్లేదన్నమాట.
@ సుజాత: మీ వ్యాఖ్య సూపరో సూపరు...లైన్లో నించుని టికెట్లు కొన్నుక్కున్న రోజుల మజానే వేరండి... కానీ అరగంట లైన్లో నించున్నాకా,
మనదాకా వచ్చి టికెట్లు అయిపోయాయని కౌంటర్లో అబ్బాయి చెప్పినప్పుడు మాత్రం సామ్రాజ్యాన్ని కోల్పోయిన మహారాజులాగ ఫీలవ్వటం గుర్తుంది..:)
హాస్యానికి రాసా గానీ,అసలు సాడిజం నాదేనండి.సినిమాలపై తనకి పెద్దగా ఆసక్తి లేకపోయినా లాక్కువెళ్తాను...!బ్రతిమాలించుకున్నా,నాకోసం అడిగినప్పుడల్లా వస్తారు పాపం.తను పక్కనుంటే కానీ సినిమా చూడలేను నేను మరి...!!
అప్పుడప్పుడు సినిమా టైటిల్ ను చూసి కూడా సినిమాకు వెళ్లి మోసపోవలసి వస్తుంది.....
అవునండి..టైటిల్స్ కుడా ఒకోసారి మోసం చేస్తుంటాయి..
luv aaj kal.. a sick romantic movie.. sattire to d present day youth.. xcept for dt funy flash back story.. nd mam, nt al new movies giv us head ache :) !!
raviteja,
i've written only on "one" new movie....and i know not all new movies give us headaches..:)
and thats not about "luv aaj kal"...maybe the srtoryline is similar.
Post a Comment