సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, October 14, 2009

ఎంతెంత దూరం తీరం రాదా...


కొత్త సినిమా పాటల్లో బాగున్నవి వేళ్ళపై లెఖ్ఖ పెట్టుకోవచ్చు....నాకు నచ్చిన కొత్త సంగీత దర్శకుల్లో "హారిస్ జయ్ రాజ్" ఒకరు."చెలి" సినిమాలో పాటలు మొత్తం మూడు భాషల్లోనూ(హిందీ,తమిళ్,తెలుగు) కొని దాచుకున్నాను అవి వచ్చిన కొత్తల్లో. కొత్త "ఘర్షణ"లో ఏ చిలిపి కళ్లలోన కలవో" పాట, "ఘజినీ"లో "హృదయం ఎక్కడున్నది" ;ఆ తరువాత "సైనికుడు" సినిమాలోని ఈ పాట నాకు బాగా నచ్చుతాయి.ఈ పాట ఎందుకో నిన్నటి నుంచీ నోట్లో నానుతోంది...నాని నాని చలేస్తుందేమో అని(పాటకి) ఇలా బయటకు తీసి బ్లాగ్ లో వదులుతున్నాను....(ఈ సినిమాలో "ఓరుగాల్లుకేపిల్లా " పాట కుడా బాగుంటుంది .)



A లింక్ ఓపెన్ అవ్వాపోతే ఇది :
http://www.youtube.com/watch?v=KNNmGFX_amU
సంగీతం: హారిస్ జయ్ రాజ్
పాడినది: బాలు,ఉన్ని కృష్ణన్,కవిత సుబ్రహ్మణ్యం
రాసినది: కులశేఖర్

ఎంతెంత దూరం తీరం రాదా, ఇంకెంత మౌనం దూరం కాదా
ఏ నాడు ఏకం కావు ఆ నింగి నేల, ఈ నాడు ఏకం ఐతే వింతేగా
ఏ రోజు ఏమౌతుందో ఈ ప్రేమ గాధ, నీ వైపు మళ్ళిందంటే మాయేగా

మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయే లేరా,
ఊరించే ఊహా లోకం లేరా
మాయేరా మాయేరా రంగురంగులు చూపేదేరా,
రంగంటూ లేనే లేదు లేరా llపll

ఊహల్లో ఊసుల్లో ఆ మాటే,ఓసోసి గొప్ప ఏముంది గనక,
తానంటూ నీ వెంటె వుందంటే
ఆ ఎండ కూడా వెండి వెన్నెలవదా
అవునా అదంత నిజమా,
ఏదేది ఓసారి కనపడదా
ఇలలో ఎందెందు చూసినా,
అందందునే వుంటుందిలే బహుశా

మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదు లేరా
నీ చెంతే వుండే దూరం లేరా
హాయేలే హాయేలే ఎల్లలన్నవీ లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయే....

ప్రేమిస్తే ఎంతైనా వింతేలే,నువ్వెంత చెప్పు గుండేల్లో గుబులే
ఈడొస్తే ఏదైనా ఇంతేనా,ఇంతోటి తీపి ఏమున్నదైనా
సెలవా నా మాట వినవా,ఏనాడూ ప్రేమలో పడవా
నిజమ ఈ ప్రేమ వరమా,కల్లోనైన ఊహించని మహిమా
మాయేరా మాయేరా ప్రెమ అన్నది మాయే లేరా
ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా
హాయేలే హాయేలే ఎల్లలన్నవి లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయే....

ప్రేమిస్తే ఎంతైనా వింతేలే,నువ్వెంత చెప్పు గుండెల్లో గుబులే
ఈడొస్తే ఏదైనా ఇంతేనా,ఇంతోటి తీపి ఏమున్నదైనా
సెలవా నా మాట వినవా, ఏనాడూ ప్రేమలో పడవా
నిజమా ఈ ప్రేమ వరమా, కల్లోనైన ఊహించని మహిమా
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయే లెరా

మాయేరా మాయేరా ప్రెమ అన్నది మాయే లెరా
ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా
హాయేలే హాయేలే ఎల్లలన్నవి లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయే....


7 comments:

మురళి said...

నాకు 'ఓరుగల్లుకే పిల్లా.. ' నచ్చుతుందండీ.. సినిమా చూడలేదు...

తృష్ణ said...

మీరు సినిమా చూడకపోవటమా..?ఇదేదో ఆశ్చర్యంగా ఉందే....(just kidding :))

నేను బయట చూడలేదండీ...ఆ మధ్యన టి.వి.లో వేస్తే చూసాను. పాటలు మాత్రం రిలీజ్ అవ్వగానే కొనేసాను."ఓరుగల్లుకే " కూడా బాగుంటుంది .పైన రాసాననుకుంటా...

వేణూశ్రీకాంత్ said...

హ హ చలేయకుండా నా :-) బాగుంది. నాకు కూడా ఈ సినిమాలో మిగిలినవాటికంటే ఈ పాటే ఎక్కువ నచ్చుతుందండి.

జయ said...

ఈ పాట నిజంగానే చాలా బాగుంటుంది. మళ్ళీ చూపించినందుకు థాంక్స్.

తృష్ణ said...

@ వేణూ శ్రికాంత్: ఈ పాట సాహిత్యం కూడా బాగుండటంవల్ల పాటకింత అందం వచ్చిందనిపిస్తూ ఉంటుందండి.

@జయ: మీకు కూడా థాంక్స్.. !!

గీతాచార్య said...

I like this song well. Nice picturization, and excellent composition complemented by cute lyrics.

తృష్ణ said...

@ geetaachaarya: ya,i forgot..the picturization is also novel with graphics...particularly when they show two clouds resembling two people..