సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, October 22, 2009

నాగుల చవితి

కార్తికేతు సితే పూజ్యా:
చతుర్యార్ధం కార్త్యికేయక:
మహాచతుర్థీ సా ప్రోక్తో
సర్వపాపహరా శుభా !!

ఇవాళ "నాగులచవితి" . కార్థీక శుధ్ధ చవితి నాడు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే సకల పాపాలూ పోతాయంటారు పెద్దలు. ఈ రోజుని "మహా చతుర్థి" అని కూడా అంటారు. పుట్టకు పోయి ఆవుపాలు పోసి, పుట్ట మట్టిని ధరించి, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించినవారి అభీష్టాలు నెరవేరతాయని శాస్త్రం. దీపావళి నాడు కాల్చగా మిగిల్చిన కొన్ని టపాకాయల్ని కూడా ఇవాళ పిల్లలతో కాల్పిస్తారు. కొందరికి పుట్టకు పోయే ఆనవాయితి ఉండదు. వారు తమ తమ గృహాల్లోనే సుబ్రహ్మణ్యుని విగ్రహంపై, లేదా గోధుమ పిండితో చేసిన నాగేంద్రునిపై పాలు పోస్తారు. మేము ఇంట్లోనే పాలు పోస్తాము. చిమ్మిలి, చలిమిడి నైవేద్యం చెసి పెడతాము.

చిన్నప్పుడు అడవి లాంటి మా క్వార్టర్స్ లో చాలా పాము పుట్టలు ఉండేవి. నాగులచవితి నాడు తెల్లారేసరికీ బిలబిలమని బోలెడు జనం...పూలు,పాలు,పళ్ళు,పసుపు,కుంకుమ మొదలైన పూజాద్రవ్యాలతో వచ్చేసేవారు. మామూలుగా అక్కడ ఒక క్వార్టర్స్ ఉందని ఎవరికన్నా తెలుసా అనుకునే మాకు, ఇంతమందికి ఇక్కడ పాము పుట్టలు ఉన్నట్లు ఎలా తెలుసా? అని ఆశ్చర్యం కలిగేది.

ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన...క్వార్టర్స్ లో ఉండగానే ఒకసారి ఎవరో చెప్తే, ఐదు వారాలు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసాను. ఐదు మంగళవారాలు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి పళ్ళు మాత్రమే తినాలి. ఎర్రని పూలతో స్వామికి పూజ చేసి, గుడికి వెళ్ళి....etc..etc...చెయ్యాలి. మనం అత్యంత శ్రధ్ధగా పూజలు చేసేసాం. మొదటి మూడు వారాలూ ఏమీ కలేదు కానీ ఆఖరు రెండు వారాలూ కూడా సాయంత్రం అయ్యే సరికీ మా ఇంట్లోకి పాము వచ్చింది. నాలుగో వారం బోలెడు పుట్టలు ఉన్నాయి కదా అప్పుడప్పుడు వస్తాయి..అనుకున్నాం. కాని ఐదవ మంగళవారం మళ్ళీ ఇంకో పాము వచ్చింది. అబ్బా, నా పుజకి ఎంత శక్తో...అని నేను ఆనందించే లోపూ... మా అమ్మ చాలా భయపడిపోయి....కార్తికేయుణ్ణి పూజించు కానీ ఇంకెప్పుడూ ఈ ఉపవాసపుజ చెయ్యకే అమ్మా....అని గట్టిగా చెప్పేసింది..!

15 comments:

మాలా కుమార్ said...

పామురావటమేనా లేక దాని చుట్టూ మీరు , మీచుట్టూ అది తిరుగుతూ నాగిన్ డాన్స్ కూడా చేసారా ?

Rajasekharuni Vijay Sharma said...

కొన్ని నిజాలు మన కంటికెదురుగా కనిపిస్తున్నా నమ్మలేము :)

మురళి said...

అమ్మో.. మీ పూజ చాలా పవర్ఫుల్ అన్నమాట..

జయ said...

మీ నాగుల చవితి అనుభవాలు చాలా బాగున్నాయి. మీ పూజలు కొంచెం పాములు లేని చోటు చూసుకొని చేస్తూ ఉంటే బాగుంటుందనుకుంటా! ఎందుకంటే అన్నిరోజులు మనవి కాదు కదా!.

తృష్ణ said...

@ మాలా కుమార్: డాన్సా? నేనా? అప్పుడు పాములు కాదు మనుషులే పారిపోతారండి...

@ విజయ శర్మ: నేను నమ్మానండి..

తృష్ణ said...

@ మురళి : అంతే కదా మరి...( ఇది నిజమేనని చాలాసార్లు ఋజువైందండోయ్..)

@జయ: ఈ సారి చేస్తే అలానే చేస్తానండీ..

మాలా కుమార్ said...

ఊరికే సరదాకి అన్నానండి . అలగకండి .
మీరు అలిగితే నాకు లలిత గీతాల లింక్స్ ఇచ్చేవారుండరు .

శేఖర్ పెద్దగోపు said...

అవును అసలు నాగుల చవితి రోజు పుట్ట దగ్గరకు పొద్దున్నే వెళ్ళటం భలే ఉంటుంది కదండీ..
మీ ఇంటికి రెండో రోజు వచ్చిన పాము మొదటి రోజు వచ్చిన దాని గర్ల్ ఫ్రెండ్ అయ్యుంటుందని నా అనుమానం. :)
అయ్యో మీరలా కోపంగా చూడొద్దు..ఊరికే అన్నా...

SRRao said...

నమ్మకం - శాస్త్రం... ఈ రెండింటికీ వివాదం ఎప్పుడూ తప్పదు. కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు వంశానుగతంగా వస్తాయి. కొన్ని అనుభవాల పునాదుల మీద ఏర్పడతాయి. ఎవరి నమ్మకాలు వారివి. మీ నమ్మకమే మీకు శ్రీరామరక్ష.

గీతాచార్య said...

"అబ్బా, నా పుజకి ఎంత శక్తో...అని నేను ఆనందించే లోపూ... మా అమ్మ చాలా భయపడిపోయి....కార్తికేయుణ్ణి పూజించు కానీ ఇంకెప్పుడూ ఈ ఉపవాసపుజ చెయ్యకే అమ్మా....అని గట్టిగా చెప్పేసింది..!"
*** *** ***

:))

మీ పూజలకి ఇలాగే ఇంకా ఇంకా శక్తి రావాలని కోరుకుంటున్నాను.

తృష్ణ said...

@మాలా కుమార్: అబ్బే అలాటిదేమీ లేదండీ..

@ శేఖర్: అయ్యుండొచ్చు..

తృష్ణ said...

@ SRRao:ధన్యవాదాలు.

@గీతాచార్య: ThankU..!!

భావన said...

వో నిన్న నాగుల చవితా.. అయ్యో మర్చే పోయాను ఇంట్లో అన్నా పాలతో అభిషేకం చేసుకునే పని కదా.. నాకు ఇంత వరకు ఒక్క సారి కూడా పాము కనపడలేదు చాలా మంచిది కోరుకోకు నీకు అసలే భయం అని మా గురువు గారు చెపుతారు.. :-) మా అయనకు ఎంత సర్ప దోషమో చెప్పలేను ఎక్కడెక్కడి సర్ప రాజాలు ఆయనకే కనపడతాయి. ఆయన పనులకు అడ్డం పడతాయి, చాలా హోమాలు కూడా చేసేము దోష శాంతి కి. మా అక్క కు కూడా దాని మీద కూడా పడింది పాము ఒక సారి, వీళ్ళ తో నేను ఒకే ఇంట్లో వున్నా నాకు మచ్చుకు కూడా కనపడలేదు.. ఐనా నాకు చాలా భయం రాస్తుంటేనే చేతులు చల్ల గా ఐపోయాయి భయం తో.. అంత భయం..

తృష్ణ said...

@ భావన:నాక్కూడా భయమేనండీ...ఆ రోజైతే ఇంట్లో ఎవరూ లేరు కూడా...లక్కీగా మా నీళ్ళ టాంక్ స్విచ్ వేసే అబ్బాయి ఆ రోజు వీధిలో కనబడబట్టి గండం గడిచింది.

హరే కృష్ణ said...

Belated నాగుల చవితి శుభాకాంక్షలు :)