సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, October 17, 2009

దీపముల వరుసే "దీపావళి "


దీపముల వరుసే "దీపావళి ". నరకసురుని సంహారంతో ప్రజలు ఆనందంతో చేసుకున్న పండుగ ఇది.ముందు ఐదు రొజులు చేసుకోవాల్సిన ఈ పండుగ శాస్త్రియ పధ్ధతి...

శాస్త్రీయంగా దీపావళిని అయిదు రోజులు చేసుకోవాలి.ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, గోవర్ధన పూజ, భగినీ హస్త భోజనం. ఉత్తరాదిన ఐదు రొజులూ జరుపుకుంటారు.


ధనత్రయోదశి:దీనిని "ధన్ తెరస్" అని కూడా అంటారు. మహాభారతంలో ధర్మరాజుకు అతడు పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మరలా సంపాదించుకునేందుకు ఉపాయం చెప్తూ కృష్ణుడు బలి చక్రవర్తి కధ చెప్పి, ధర్మరాజును కూడా అలా లక్ష్మీ పూజలూ,దీపారాధనలూ చేయమంటాడు. బలి చక్రవర్తి కధ ఏమిటంటే :
వామనరూపంలో వచ్చినది విష్ణువు అని తెలిసి కూడా దానమిచ్చాడని, వామనుడు బలిని కోరిక కోరుకోమంటాడు. అప్పుడు బలి చక్రవర్తి ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచీ అమావాస్య వరకూ మూడురోజులూ ప్రజలందరూ దీపారాధనలు చేసుకుని,అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందేలాగ అనుగ్రహించమని కోరుకుంటాడు. అప్పటి నుంచీ మూడు రోజులూ లక్ష్మీపూజ చేసుకోవటం మొదలైంది.

ఈ రోజున ఆవునేతితో దీపం వెలిగించి శ్రీ సూక్తం చదువుకుంటే ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉండవని అంటారు.

నరక చతుర్దశి:
నువ్వుల నూనె తలపై పెట్టుకుని తలంటు పోసుకోవాలి. కొందరు 'ఉత్తరేణి'ఆకులను కుడా తలపై పెట్టుకుని తలంటు పోసుకుంటారు.నరకాసురుడు మరణించిన రోజు ఇది.
ఈ రోజున మినపగారెలు తింటే మంచిదని అంటారు.

దీపావళి అమావాస్య:
ఈ రోజున సాయంత్రం దివిటీలు కొట్టడం ఒక సంప్రదాయం.(కారణం
ఇక్కడ ఈ టపాలో..)
మట్టి ప్రమిదలలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించి, పూజా మందిరంలో,సింహద్వారానికి ఇరువైపులా,తులసి కోటవద్ద, వీధి గుమ్మం వద్ద ఉంచాలి. దీపాలకు నమస్కరించి,తరువాత టపాసులు కాల్చాలి.

గోవర్ధన పుజ:
ఈ రోజున గోపూజ చేస్తే ఎంతో పుణ్యమని అంటారు.

భగినీహస్తభోజనం:
ఆ రోజున అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి భోజనం చేసి, వారికి కానుకలు ఇస్తారు. దీన్నే మనవారు "అన్నాచెల్లెళ్ళ భోజనాలు" అంటారు.

ఇక కొన్ని పురాణాలలో,పురాణగాధలలో "దీపావళి" గురించిన ప్రస్తావన :

* విష్ణు పురాణం ప్రకారం వామనుడు బలి చక్రవర్తి ని పాతాళానికి త్రొక్కగానే తిరిగి ఇంద్రుడు దేవతలకు రాజైన సందర్భంలో వారు ఆనందోత్సాహాలతో స్వర్గం లో దీపావళి జరుపుకున్నారు.

* ఉత్తర భారతంలో శ్రీరాముడు వనవాసానంతరం, అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన వేళ ప్రజలు దీపావళి జరుపుకున్నారు.

* కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయుడైన ధర్మరాజు పట్టాభిషిక్తుడైన వేళ ప్రజలు పట్టణమంతా దీపాలు వెలిగించి కాంతులు విరజిమ్మారుట.

* పద్మ పురాణం ప్రకారం క్షీరసాగర మధనం సందర్భంలో లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు దీపాన్ని వెలిగించటం ఆచారమైందని, అదే దీపావళి అని తెలుపుతుంది.

* కాళికా పురాణం ప్రకారం రాక్షస సంహారానంతరం కాళికాదేవిని లక్ష్మి, జ్యోతి రూపములతో ఆరాధించటం జరిగింది. దుర్వాసుడి శాప కారణంగా రాజ్యాన్ని కోల్పోయిన ఇంద్రుడు, విష్ణువు చెప్పిన విధంగా "జ్యోతి"ని లక్ష్మిగా ఆరాధించారు దేవతలు. అదే దీపావళి.



"దీపం జ్యోతి: పరంబ్రహ్మా దిపం సర్వ తమోపహారం
దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే"


(ఈ పండుగ గురించి నేను చదివిన , విన్న విశేషాలు చెప్పాలని ఈ టపా రాయటం జరిగింది. 'లా పాయింట్లు ' తీస్తే సమాధానం రాయబడదు.)

11 comments:

జయ said...

బాగుంది. దీపావళి గురించి చాలా కొత్త విషయాలే చెప్పారు. ఎటువంటి లా పాయింట్లు తీయను లెండి. పురాణాలు బాగానే పుక్కిట బట్టారు. దీపావళి శుభాకాంక్షలు.

శేఖర్ పెద్దగోపు said...

తృష్ణ గారు, భవిష్యత్తులో మా పిల్లలకి దీపావళి మీద కాంపోజిషన్ చెప్పవలసి వస్తే మీ బ్లాగే నాకు రిఫరెన్స్ అని ఫిక్స్ అయిపోయాను నేను.
నాకు తెలియనివి చాలా విషయాలున్నాయి మీ టపాలో..

>>>'లా పాయింట్లు ' తీస్తే సమాధానం రాయబడదు.
:))

amma odi said...

మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు!

మరువం ఉష said...

తృష్ణ, ఎంత చక్కగా వివరాలన్ని వ్రాసారు. నిజంగా అభినందనీయం ఆ ప్రయత్నం. నాకు కూడా ఇక్కడికి వచ్చిన ఈ పదహారు సం. ల్లోనే మన సాంప్రదాయాల్లోని వైశిష్టత, వివరాలు తెలుస్తున్నాయి. నిన్న గుజరాతీ వారి వర్షన్ తెలుసుకున్నాను.

పండుగ బాగా జరుపుకున్నారా? మేము వేడుకలోకి ఇప్పుడే వెళ్తున్నాము.

పరిమళం said...

Good post ! మీ కుటుంబ సభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు !

తృష్ణ said...

@ jaya: dhanyavaadaalu.

@ sEkhar: surewelcome..:)

@amma odi: dhanyavaadaalu.

తృష్ణ said...

@ ఉష: ధన్యవాదాలు.(ములగ చెట్టేక్కేసా..) నేను కూడా పెళ్ళైన దగ్గరనుంచే ఈ పండగల గురించి శ్రధ్ధగా తెలుసుకుంటున్నానండి..

This festival has given lot of surprises to me this time..

మీరు కూడా పండుగ బాగా జరుపుకుంటారని ఆశిస్తాను.

తృష్ణ said...

@ పరిమళం: ధన్యవాదాలు.

హరే కృష్ణ said...

మీ ద్వారా దీపావళి గురుంచి చాలా విషయాలను తెలుసుకున్నాం..థాంక్ యూ
ముంబై ప్రస్తుతం ఫుల్ హడావుడి గా వుంది మీరన్నట్టే
రంగు రంగుల లైట్లతో, ప్రతి ఇంటిలో మెరిసే దిపపు కాంతులతో కళకళలాడుతోందా?..భలే గుర్తున్నాయి మీకు
అవునండి ఈ మూడు నెలలు పండగ వాతావరణమే.. unity in diversity ని మొదటిసారి చూస్తున్నా నేను కూడా

దీపావళి శుభాకాంక్షలు

తృష్ణ said...

@ hare krishna: " unity in diversity...."అందుకే నాకు విజయవాడ తరువాత బాగా ఇష్టమైన ఊరు అది...గుర్తుండటం ఏమిటీ...నేను ఇంకా ఆ వీధుల్లో తిరుగుతూనే ఉంటానండీ... ఊహల్లో...!! I just love mumbai..!! AmchI mumbai..

మాలా కుమార్ said...

మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .