ఏమో...మునుపెలా ఓర్చానో గాయాల్ని....
ఇంతే దు:ఖం అయి ఉంటుంది....
ఇవే కన్నీళ్ళయి ఉంటాయి...
ఇదే నిస్పృహ ఆవరించి ఉంటుంది...
ఏమో...మునుపెలా ఓర్చానో గాయాల్ని....
పగిలి ముక్కలైన మనసుని అతికాను
ఉదాసీనమైన మోములో నవ్వు చిందించాను
వెంట వస్తున్న నిరాశను సాగనంపాను
ఏమో ...మునుపెలా ఓర్చానో గాయాల్ని....
మంచితనాన్ని వాడుకున్న స్నేహపు వంచనలు దాటాను
వదలనంటూనే చేయి వీడిన నేస్తాలను వదిలాను
మాటల బాణాలతో మనసు తూట్లుచేసినా భరించాను
ఏమో..మునుపెలా ఓర్చానో గాయాల్ని....
ఈనాడిలా ఓడిపోయను...
కన్నీటిలో కరిగిపోయాను...
నిట్టూర్పులో ఆవిరయ్యాను...
చెయ్యని నేరానికి దోషినయ్యాను...
ఈనాడిలా ఓడిపోయను...
ఏమో..మునుపెలా ఓర్చానో గాయాల్ని....
20 comments:
అంతెనండి తెలిసి చేసిన తప్పుకి శిక్షనుభవించదానికి మన్సు వొప్పుంతుంది కాని చేయని తప్పుకు నింద పద్డ్టం మాత్రం బ్రతికుండ గానే చితిమీద కాలడం కన్నా భయంకర వేదన.
అద్బుతమైన ఎత్తుగడ
అంతే అద్బుతంగా మిగిలిన పాదాలు.
bhaavam chaalaa udaattamgaa vundi.
gnana prasuna
డైరీ లో పేజీ లా ఉందండీ...
ఎందుకంత నిర్వేదం. మరి లోకం తీరే అదికదా. పొనీలే! ఇది కవితే కదా! నిజ జీవితం కాకుంటే అంతే చాలు. కవిత చెప్పిన విధానం చాలా బాగుంది. మళ్ళీ చాలా రోజుల తరువాత మీ దగ్గిర ఒక కవిత చూసాను. వయసుకు మించిన అనుభవాలు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఎన్ని పాఠాలు నేర్చుకున్నా మన నేచర్ అయితే మారదు కదా!. నేను ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాను. అయినా నా 'బుద్ధి ' మారదు. ఆకు రాలిన చోటనే కొత్త చిగురు వేస్తూ ఉంటుంది. అదే కొత్త శక్తిని ఇస్తూ ఉంటుంది. మీరిలా రాస్తే నేను మళ్ళీ మీకోసం ఒక కవిత రాయాల్సి ఉంటుంది.
కార్తీక్: అమ్మో కొంచెం బరువుగా ఉందండీ వ్యాఖ్య...ధన్యవాదాలు.
బోల్లోజు బాబా: బ్లాగ్లో ఇది మీ రెండవ వ్యాఖ్య.... ధన్యవాదాలు.
జ్ఞాన ప్రసూన : అనుభవంలోంచి వచ్చిన భావం కదండీ మరి.. ధన్యవాదాలండి.
మురళి: నా బ్లాగ్ నా ఓపెన్ డైరీఏనండీ మరి...కొన్ని డైరి లో పేజీలు ఇందులో పెడుతూంటాను just to analyse myself and this is a shade of my bruised ego..!!
ధన్యవాదాలు.
@జయ: మీ కోసమే చూస్తున్ననండీ...టీచర్ గారూ..!! అనుభవం పాఠాలు నేర్పుతుంది. మనం నేర్చుకుంటాము..కానీ మీరన్నట్లూ మన నేచర్..పుట్టుకతో వచ్చిన బుద్ధి.....మరి..!
మీకు కవిత రాసే అవసరం రాదు లెండి...కానీ కొన్ని భావాలు మనసులోంచి బయటకు వచ్చాకా మనసు తేలికైపోతుంది...మళ్ళీ రేపటి ఉదయం కోసం తయారైపోతుంది....
Thankyou verymuch for the concern.
వేదన స్పష్టమవుతుంది. అతి త్వరలో ఉపశమించాలని కోరుతున్నాను.
venu gaaru, thanks amdi..!
కవిత చాలా బాగుంది. మా అనుభవాలను కుడా మీరే పలికి దగ్గరి వారిగా అనుభూతి కలిగింది. ధన్యవాదాలు.
జయ గారు చెప్పినట్లు "ఆకు రాలిన చోట కొత్త చిగురు వస్తుంది "....నిజం .ప్రతిది మనసుకు తీసుకుంటే ఇదే భాద తీసుకోకుండా వుండలేము కొందరం ...కాలమే మాన్పుతుంది గాయాన్ని అప్పటి వరకు తప్పదు వేదన .......
@ కుమార్: ధన్యవాదాలు.
@చిన్ని:అవునండీ కాలానికి ఆ శక్తి ఉంది...ధన్యవాదాలు.
గాయమేదైన స్రవించే గేయం మధురమే..
బాధ ఏమైనా అది మెలి తిప్పే నొప్పి ఒక్కటే..
గుండె నుంచి జారిన ఆశ్రువొక్కటి టన్నుల కొద్ది బరువు ను దింపితే
తేలికైన ప్రభాతం తిరిగి పలకదా పునః స్వాగతం ఇంకో వుదయానికి
@భావన: చాలా చాలా థాంక్స్ అండీ..పలికేసాను కొత్త ఉదయానికి స్వాగతం...మీ వ్యాఖ్య చదివి ఇంకా తేలికైంది మనసు...
మీవి పెండింగ్ ఉన్నవి చదవాలి ..i'll come to you...just a little wait...
తృష్ణ గారు నమస్తె!..
మీ స్పందన అందరికీ పనికొస్తుంది...
అన్ని గాయాలకి మందౌతుందీ...
ఎన్ని జన్మల వృద్ధాత్మ వో...
అనుభవాన్ని తొడు గా తెచ్చుకున్నవ్...
అందరికీ పంచడానికి,
బంధాలు విడిపించడానికి...
-సత్య..
enni sarlu chadivanoo ii kavitha ii 2 rojulloooo ......bagundandii bagundi...!!
naaku copy kottadam ante ishttam undadu kani, mi kavita loni Ghadata naku baga nahcindi.... na bhavalaki daggaraga undatam valla.. nenu kotha modalu pettina, blog lo mi post ni post chesa... kshamistaru ani korukuntu..... mi " EMO " Abhimani..
@na priya nestam:నా కవిత నచ్చినందుకు సంతోషం అండి. కానీ అన్నీ తెలుగులో రాసి మొదట్లో మాత్రం అలా తెంగ్లీషులో ఎందుకని రాసారో అర్ధంకాలేదండీ. All the best.
Sorry andi.... nenu ippude start chesa kada, flow anni saarlu ravdam ledu..... na post ni edit chestanu...
Post a Comment