సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, October 11, 2009

పుస్తకాలు..అభిరుచులు...


మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో "డిప్లొమో ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ(1965-68)" చదివారు నాన్న. 1968లో "INDIAN FILM MUSIC" మీదThesis సమర్పించి ఆ ఏటి "Best student Award" కుడా సంపాదించుకున్నారు.Student best film "The House" కధా రచయితగా AVM చెట్టియార్ గారి హస్తాలమీదుగా ప్రధమ బహుమతి అందుకున్నారు. మనమొకటి తలిస్తే,దైవమొకటి...అన్నట్లుగా నాన్న సినీ ఫిల్డ్ లోకి అడుగు పెట్టడం కుదరలేదు...కానీ తాను అడుగు పెట్టిన ఫీల్డ్ లో మాత్రం "The best" గా తనదంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అడుగు పెట్టిన మాధ్యమం కోసం తన శక్తిని,మేధస్సుని,కష్టాన్ని ధారపోసారు...పది జాతీయ బహుమతులను అందుకున్నారు.ప్రసార మాధ్యమంలో తన డెసిగ్నేషన్లో అలా పది జాతియ బహుమతులు అందుకున్న ఏకైక వ్యక్తి నాన్న ఒక్కరే!!ఒక "ట్రెండ్ సెట్టర్"గా "ఉగాది తెలుగు పురస్కారాన్ని" కూడా అందుకున్నారు.

ఇప్పుడు నేను చెప్పబోయేది నాన్న గురించి కాదు...అది వేరే పెద్ద కధ.నాకు పుస్తకాలు,సంగీతం మొదలైన అభిరుచులు ఎలా వచ్చాయో,మా ఇంటి వాతావరణం ఎలా ఉండేదో చెప్పటానికి ఇదంతా రాసాను.మా ఇంట్లో ఉన్న ఇటువంటి వాతావరణం వల్ల, ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలు, కేసెట్లు, సంగీతం, సినిమాలు ..ఇవే కబుర్లు.మాకింకో ప్రపంచం తెలియదు.ఇవే మా నేస్తాలు.నాన్న film institute లో ఉన్నప్పుడు కొనుక్కున్న పుస్తకాలు చాలా ఉండేవి మా ఇంట్లో..మేమెవరం ఇంట్లో లేనప్పుడు ఒకరోజు అనుకోకుండా ఒక అగ్ని ప్రమాదం జరిగి మొత్తం పుస్తకాల రేక్ మొత్తం తగలబడి పోయింది...అదృష్టవశాత్తు మా అమ్మ క్షేమంగా బయట పడింది.

ఆ తరువాత మళ్ళీ నెమ్మదిగా కొన్ని కొన్ని చప్పున కొన్నారు కానీ ఆ పోయిన పుస్తకాలు చాలా వరకు దొరకలేదు పాపం నాన్నకు.ఇప్పుడు మళ్ళీ కొన్ని వందల పుస్తకాలు పొగేసారు..!! అవన్నీ చదవటానికి నా జీవితకాలం సరిపొదు.అసలు నాన్న సంపాదించిన 3000 దాకా ఉన్న కేసట్లనే నేను ఇంతదాకా అన్నీ వినలేదు...తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్, instrumental, westren clasical, బీథోవెన్, వివాల్డి, కర్ణాటక్, హిందుస్తానీ.. ఇలా సంగీతంలో ఉన్న రకాలన్నీ మా నాన్న దగ్గర ఉన్నాయి.

ఇవే మా ఆస్తి...మేము ముగ్గురమూ అంటుంటాము..వీటి కోసమే మేము దెబ్బలాడుకుంటాము అని.మా అభిరుచులన్ని నాన్న నుంచి సంక్రమించినవే..తనకు తెలిసిన మంచి మంచి సినిమాలన్నీ, అన్ని భాషలవీ చూపించేవారు మాకు.ఇక ఇంట్లో ఉన్న రకరకాల పుస్తకాల వల్ల చదివే అలవాటు వచ్చింది నాకు.

నాకు చదవటం వచ్చాకా దొరికినవి, నాకు అర్ధమయ్యేవి చదువటం మొదలెట్టాను.చిన్నప్పుడు నవలలు చదువుతున్నాననీ మా అమ్మ అవన్నీ దాచేసేది.ఒక వయసు వచ్చేవరకు పిల్లలు ఆ పుస్తకాలు చదవకూడదు అని అమ్మ ఉద్దేశం. కానీ మనం ఆగిందెక్కడ..శెలవు రొజుల్లో అమ్మ నిద్రపోయినప్పుడు దాచిన చోట్లు కనిపెట్టి మరీ పుస్తకాలు చదవేసేదాన్ని.అందుకని వారపత్రికలు కొనటం ఆపేసింది.అయినా ఇంట్లో నవలలు తక్కువే.కృష్ణశాస్త్రి, చలం, శరత్ సాహిత్యం, శ్రీరమణ,బాపు-రమణల పుస్తకాలూ, తెలుగు భాష, సంస్కృతికి సంబంధించినవి, సినిమాలకు సంబంధించినవి, కొన్ని కవితా పుస్తకాలు..ఇలా కొన్ని సెలెక్టెడ్ పుస్తకాలు కొనేవారు నాన్న. కొన్ని సినిమా కధల పుస్తకాలు నవలల్లా ఉండేవి.సినిమాలు చూడకపోయినా ఆ పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదివేదాన్ని.బాగా డైలాగులతో సహా బట్టీ వచ్చేసేంతగా...!! ముత్యాల ముగ్గు, త్యాగయ్య, గోరంత దీపం, రాధా కల్యాణం, సీతాకోకచిలుక, శంకరాభరణం..మొదలైనవి.

ఇక శెలవుల్లో పిన్ని,పెద్దమ్మల ఇళ్ళకి వెళ్ళినప్పుడు కోడూరి కౌసల్య, యద్దనపూడి,యండమురి,మల్లాది మొదలైన వాళ్ళ రచనలు వాళ్ళిళ్ళలోనే చదివాను.కాలేజీలోకి వచ్చాకా నేనూ నా చిరు సంపాదనలవల్ల,విజయవాడ బుక్ ఫెస్టివల్స్ వల్ల నా సొంత మొదలైంది..నాన్నవి కాక నేనూ నాకిష్టమైన పాతల సేసెట్లు కొనటం మొదలుపెట్టాను...పెళ్లయాకా...అందరిలానే సంసారంలో మునిగిపోయాను..ఇప్పటిదాకా మళ్ళీ ఆ అభిరుచులకి బ్రేక్ పడింది...!మళ్ళీ ఇదిగో ఇన్నేళ్ల తరువాత ఈ బ్లాగ్ పుణ్యాన..నా ప్రియ నేస్తాలైన పుస్తకాలను మళ్ళీ తెరిచి చదవటం మొదలెట్టాను...!!

14 comments:

Hima bindu said...

మన అభిరుచులు ,వ్యక్తిత్వం అన్ని మన తల్లిదండ్రుల నుంచే సంక్రమిస్తాయండి..చైల్డ్ సోషల్ అయిసేషన్ ఇంటినుండే ప్రారంభం అవ్వుతుంది... అటువంటి ఇంట పుట్టడం మీ అదృష్టం .

తృష్ణ said...

@ చిన్ని: అవునండి..నాన్న కూతురుగా పుట్టడం నిజంగా నా అదృష్టం.

మురళి said...

నా చదివే అలవాటు మీద అమ్మ ప్రభావం చాలా ఉందండి.. తన సందుగం పెట్టెలో ఉన్న పుస్తకాలు ఎన్నిసార్లు చదివానంటే ఇప్పటికీ నాకు అవన్నీ గుర్తే... అన్నట్టు 'పుస్తకం' లో మీరు రాసిన 'ఆకులో ఆకునై' పరిచయం చదివాను.. చక్కని పరిచయం.. వీరలక్ష్మి దేవి గారి సోదరుడు వాడ్రేవు చిన్న వీరభద్రుడు గారు కూడా మంచి రచయిత.. పుస్తకం లింక్ మీ బ్లాగులో ఇవ్వాల్సింది కదా..

తృష్ణ said...

@ murali: Thankyou.But i can do that only after 15days...!

మురళి said...

మొత్తం వ్యాసం ప్రచురించడానికి పదిహేను రోజులు ఆగాలండి.. అలాకాకుండా పుస్తకం వారి లింక్ ని బ్లాగులో ఇప్పుడు ఇవ్వొచ్చు..

తృష్ణ said...

oh,thankyou muraligaaru. I'll do it now..

SRRao said...

తృష్ణ గారూ ! ఒక్కసారి నన్ను నాకు గుర్తుచేశారు. మా నాన్నగారి దగ్గర నుండి వచ్చిన పుస్తకాలతో బాటు నేను సేకరించినవి కూడా కలిసి చాలా పుస్తకాలు సేకరించాను అలాగే కాసెట్లు ప్రస్తుతం సిడీలు కూడా ! పనికోస్తుందనుకున్న ప్రతి మాగజైన్, పేపర్ కట్టింగ్స్ గత 20 ఏళ్ళుగా దాస్తూనే ఉన్నాను.ప్రస్తుతం ఇవే నా ఆస్థి. నా అదృష్టం. మా పిల్లలిద్దరికీ నా అభిరుచులే వచ్చాయి. చాలా థాంక్స్ !

తృష్ణ said...

@ SRRao : మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.మంచి అభిరుచులు,సంస్కారం,ఒక పువ్వుని,వెన్నెలను చూసి ఆనందించగల సెన్సిటివిటీ...ఇవేనండీ పిల్లలకు నిజమైన ఆస్తులు.

భావన said...

మీరు చాలా అదృష్టవంతులు అటువంటి ఇంట పుట్టటం, మీతో స్నేహం చేస్తున్నందుకు మరి ఆ అదృష్టాన్ని అనేక పుస్తక పరిచయాలతో మాకు కూడా పంచాలి మరి మర్చిపోకండి..

తృష్ణ said...

@ భావన: ధన్యవాదాలు. నాకు వీలయినన్ని రాయాలనే ప్రయత్నం...ఆ పై భగవంతుని దయ..!!

కమల్ said...

తృష్ణ గారు, మీరు అదృష్ట వంతులు, మంచి అభిరుచి కలిగి ఉన్న వ్యక్తుల ఇంట్లో పుట్టారు, మరి అందరికీ అలాగె ఉండదు కదా..!"మన అభిరుచులు ,వ్యక్తిత్వం అన్ని మన తల్లిదండ్రుల నుంచే సంక్రమిస్తాయండి..చైల్డ్ సోషల్ అయిసేషన్ ఇంటినుండే ప్రారంభం అవ్వుతుంది.." చిన్నిగారి భావన అందరికీ వర్తించదేమో. నేను మాత్రం పూర్తిగా వ్యతిరేకం. సంక్రమించే విషయం లో, పోతే నేను కూడ మీ నాన్నగారిలాగే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నుండి వచ్చిన వాడినే, మీ నుండి నాకు కావలసిన విషయాలు ఇక మునుముందు మీ వ్యాసాలు ద్వార అందవచ్చు అని అనుకుంటున్నా.!..కమల్.

తృష్ణ said...

@kamalji: ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

Very nice.

I request you to write more about your father.

తృష్ణ said...

@ కొత్తపాళీ: ఎంత లేట్ గా చూస్తున్నారో.. :( రాస్తాను పర్మిషన్ ఇమ్మంటే...ఇవట్లేదు ఆయన...ఇది కూడా చెప్పకుండా రాసేసాను...ఈ పోస్ట్ ఇంకా చూడలేదు నాన్న.వెళ్ళినప్పుడల్లా ఆ వారంలో రాసినవన్నీ చూపిస్తూ ఉంటాను.

పుస్తకం.నెట్ లో మీ వ్యాఖ్య చూసాను.ధన్యవాదాలు.