సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, October 2, 2009

అతడు నడిచిన దారిలో...


"అతడు నడిచిన దారిలో బ్రతుకు పూలు
ప్రజల కన్నుల తోటల పరిమళించి
ఆతడొరిగిన వెనువెంట పూతరాలి
మౌన హేమంతమను పొగమంచు మిగులు..."

(2004 ఆకాశవాణి వార్షిక పోటీల్లో జాతీయ బహుమతి పొందిన "నిశ్శభ్దం-గమ్యం" అనే శ్రీరామమూర్తి గారి సృజనాత్మక కార్యక్రమంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు గాంధీగారిపై రాసిన వాక్యాలివి)
************* *************** **********************
ఇది ఒక ఆర్టిస్ట్ గాంధీ గారి బొమ్మఎలా వేసారో తెలుపుతున్న వీడియో...
speed painting Mahatma GANDHI by Martin Missfeldt








***************** *********************
" దొంగరాముడు"చిత్రంలో నాకు ఇష్టమైన గాంధీతాత పాట....






భలే తాత మన బాపూజీ, బాలల తాతా బాపూజీ
భలే తాత మన బాపూజీ, బాలల తాతా బాపూజీ
బోసినవ్వుల బాపూజీ, చిన్నీ పిలక బాపూజీ

కుల మత బేధం వలదన్నాడు, కలిసి బతికితే బలమన్నాడు,
మానవులంతా ఒకటన్నాడు,మనలో జీవం పోసాడు
భలే తాత మన బాపూజీ, బాలల తాతా బాపూజీ

నడుం బిగించి లేచాడు, అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ, దేశం దేశం కదిలింది
గజగజలాడెను సామ్రాజ్యం, మనకు లభించెను స్వరాజ్యం
మనకు లభించెను స్వరాజ్యం
భలే తాత మన బాపూజీ, బాలల తాతా బాపూజీ


సత్యాహింసలే శాంతి మార్గమని, జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు,మానవ ధర్మం బోధించాడు
మహాత్ముడై ఇల వెలిశాడు
భలే తాత మన బాపూజీ, బాలల తాతా బాపూజీ 3

*********** ************* ************
"నర్సీ మెహతా" రాసిన బాపు కు ఇష్టమైన గుజరాతీ భజన్ "వైష్నవ జనతో.."
(నాక్కూడా చాలా ఇష్టమైన భజన్)
vaiShnavo janato--Narsi Mehta Bhajan in Lata Mangeshkar's voice





bhajan అర్ధం:
Vaishanav: A follower of Vaishnav school of Hinduism. Strict vegetarianism, ahimsa simplicity are the hallmarks of a true vaishnav. The Bhajan is in essence a "definition" of "vaishnav".

Vaishnav jan to tene kahiye je [One who is a vaishnav]
PeeD paraayi jaaNe re [Knows the pain of others]
Par-dukhkhe upkaar kare toye [Does good to others,
esp. to those ones who are in misery]
Man abhimaan na aaNe re [Does not let pride enter his mind]
Vaishnav... SakaL lok maan sahune vande [A Vaishnav, Tolerates and praises the the entire world]
Nindaa na kare keni re [Does not say bad things about anyone]
Vaach kaachh man nishchaL raakhe [Keeps his/her words, actions and thoughts pure]
Dhan-dhan janani teni re [O Vaishnav, your mother is blessed (dhanya-dhanya)]
Vaishnav... Sam-drishti ne trishna tyaagi [A Vaishnav sees everything equally, rejects greed and avarice]
Par-stree jene maat re [Considers some one else's wife/daughter as his mother]
Jivha thaki asatya na bole [The toungue may get tired, but will never speak lies]
Par-dhan nav jhaalee haath re [Does not even touch someone else's property]
Vaishnav... Moh-maaya vyaape nahi jene [A Vaishnav does not succumb to worldly attachments]
DriDh vairaagya jena man maan re [Who has devoted himself to stauch detachment to worldly pleasures]
Ram naam shoon taaLi laagi [Who has been edicted to the elixir coming by the name of Ram]
SakaL tirath tena tan maan re [For whom all the religious sites are in the mind]
Vaishnav... VaN-lobhi ne kapaT-rahit chhe [Who has no greed and deciet]
Kaam-krodh nivaarya re [Who has renounced lust of all types and anger]
BhaNe Narsaiyyo tenun darshan karta [The poet Narsi will like to see such a person]
KuL ekoter taarya re [By who's virtue, the entire family gets salvation]
Vaishnav...
(http://www.ramanuja.org/sv/bhakti/archives/all94/0016.html నుంచి)

ఇన్ని రాసాకా నాకు బాపు అంటే ఎంతిష్టమో వేరే చెప్పాలా...?!!

12 comments:

మరువం ఉష said...

Someone sent this for me as a thought for the day 2 weeks ago
------------------------------
The best, like water,
Benefit all and do not compete.
They dwell in lowly spots that everyone else scorns.
Putting others before themselves,
They find themselves in the foremost place
And come very near to the Tao.
– Lao Tzu

In today’s competitive climate, often those who are aggressive about imposing their will on others are labeled “successful.” But the accomplishments of such people are often sadly short-lived, while the damage they do themselves and others can be far-reaching. When competitiveness is excessive, we end up offending others, feeling offended, and lashing back, and that undoes everything worthwhile we might achieve.

People who do not compete, on the other hand, seldom get upset when life goes against them. They do not try to impose their way on others, or get agitated or depressed or defensive when people hold different views.

Gandhi was an excellent example of this. It is said that he was at his best when he was criticized; it made him even more respectful and compassionate, and made him reach deeper into himself to find new ways of explaining his stand.

తృష్ణ said...

usha gaaru,thankyou for a treasurable quote.

మురళి said...

'వైష్ణవ జనతో' ఎమ్మెస్ గొంతులో వినడం ఇంకా బాగుంటుందండీ.. అన్నట్టు 'My Experiments with Truth' చదివారా??

బృహఃస్పతి said...

మొదటి వీడియో (గాంధీ బొమ్మ) చాలా బాగుంది.

తృష్ణ said...

@ మురళి: అవునండి.పొద్దున్న హడావుడిలో వెతకలేక ఉన్నది పెట్టేసానండి.
చిన్నప్పుడు చదవలేదు కానీ, పెళ్ళయ్యాకా మావారు నాతో చదివించిన మొదటి పుస్తకం అదేనండి.

@ బృహఃస్పతి : చిత్రకారుడు ఆ బొమ్మ గీసిన తీరు,విడియో చిత్రీకరణ నాకూ చాలా నచ్చాయండి.
thanks for the visit.

జయ said...

ఆశయాల కోసం జీవించు- ఆశల కోసం కాదు అన్న - గాంధీ గారి సూక్తి నేను ఎప్పటికి గుర్తుంచుకుంటాను. 'వైష్ణవ జనతో ' గాంధీ జీవితంతో ముడి వేసుకొని పోయింది. గాంధీ గారిని చిత్రిస్తున్న వీడియో చాలా, చాలా బాగుంది.

Kottapali said...

Very nice

కామేశ్వరరావు said...

అద్భుతమైన పద్యాన్ని పరిచయం చేసారండి!
"భలే తాత మన బాపూజీ" పాట పల్లవి నిన్ననే మా అమ్మగారు మా పాపకి ఫోన్లో వినిపించారు. ఇవాళ మీ ధర్మమా అని పూర్తిపాట వినిపించాను తనకి.
మంచి లింకులు మాతో పంచుకున్నందుకు నెనరులు.

siva said...

పునరాగమనానికి స్వాగత౦. ఎ౦దుకో మీ గా౦ధీ అ౦తగా మనస్సుని తాకలేదు. సారీ! బహుశా మీ హడావుడో లెదా కదన౦లో మీ భావాలు, ఆలోచనలు, అనుభవాలు అ౦తగా లేకపోవడమో! వీలైన౦తవరకు గొ౦తు, గు౦డె మీవిగా వు౦చ౦డి

తృష్ణ said...

@జయ: ధన్యవాదాలు.

@కొత్తపాళీ: ధన్యవాదాలు.

తృష్ణ said...

@ భైరవభట్ల కామేశ్వర రావు: మా పాపకి కూడా నిన్ననే వినిపించానండీ..ఇవాళ పొద్దున్నుంచీ గాంధీతాత పుట్టినరోజు,గాంధీతాత పుట్టినరోజు అని అందరికీ చెప్పింది..!

తృష్ణ said...

@siva: గాంధీ గారు "జాతిపిత". గాంధీజయంతి కాబట్టి,ఆయన గురించి నాకు నచ్చిన పాట ,ఆయనకు నచ్చిన భజన కావాలనుకుని పెట్టానండి.
ఆయన గొప్పతనాన్ని గురించో,ఆయన చేసిన పనుల గురించో నా భావాలను రాసి ఉంటే అది "నా టపా" అవుతుంది..ఇది కేవలం గాంధీగారి గొప్పతనాన్ని,ఆయన పట్ల నాకున్న అభిమానాన్ని తెలిపేందుకే.

ఆయినా సొంత అభిప్రాయాలు తప్ప మరెమీ రాయకుడదు,పాటల లింక్ లు పెట్టకూడదు అని రూలేమీ లేదుకదండీ..!

ఏదేమైనా టపా బాగుండాలని మీరు చెప్పిన పొయింట్ గుర్తుంచుకుంటాను. మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు .