ఆ మధ్య ఒకరోజు వేణూ శ్రీకాంత్ గారి సైట్లో పాత టెలీసీరియల్ "ఋతురాగాలు" టైటిల్ సాంగ్ ఉన్న టపా ఒకటి చూడటం జరిగింది. "ప్రేమించే హృదయానికి.." పాట సాహిత్యం ఆయన అడిగారు.ఏళ్ళ తర్వాత ఆ కేసెట్ తీసి పాటలు విని చాలా ఆనందించాను.చాలా ఏళ్ళ తరువాత ఈ పాటలను మళ్ళీ గుర్తు చేసి ,విని ఆనందించే అవకాశం కల్పించిన వేణూ శ్రీకాంత్ గారికి, ఆయన టపాకు ధన్యవాదాలు.
************* ************* ***********
ఋతురాగాలు టైటిల్ సాంగ్:
చక్కగా ఇస్త్రీ చీరలూ,పట్టుచీరలూ కట్టుకుని,అంగుళం మందం మేకప్ వేసుకుని;
సుదీర్ఘంగా ఏడుస్తూ,నిట్టూరుస్తూ,వగరుస్తుండే ఆడవాళ్ళు...
ఎత్తులు,పైఎత్తులూ...కుట్రలూ,కుతంత్రాలూ...అత్తాకోడళ్ళ విబేధాలూ...పగలూ,ప్రతీకారాలూ...నిండిన
తెలుగు టి.వి సీరియల్స్ అంటే నాకు చాలా భయం.వాటికి మైలు దురం పారిపోతాను....!
అలాంటి నేను కూడా ఓ 4,5 సీరియల్స్ చూసిన రోజులు ఉన్నాయి."కస్తూరి",""మొత్తం చూసాను.
ఋతురాగాలు,పిన్ని(రాధిక కోసం) మాత్రం సగం చూసి ఆపేసాను,కధ ఇంకా సాగదిస్తూంటే భరించలేక.
ఇవన్నీ ఎప్పుడో 13,15ఏళ్ళ క్రితమని గుర్తు...
"ఋతురాగాలు" దురదర్శన్లో వచ్చేది.యద్దనపుడి గారి కధ వరకూ చూసి ఆ తరువాత రచయిత మారాకా విసుగు చెంది మానేసాను చూడటం.దీంట్లో టైటిల్ సాంగ్ కు,మిగిలిన పాటల సంగీతం నాకు చాలా ఇష్టం.
అప్పట్లో ఆ పాటల కేసెట్ కూడా అమ్మారు.ఆ పాటల కోసం అది కొనేస్కున్నాను కూడా.మొత్తం ఎనిమిది పాతలు బావుంటాయి.అందులో టైటిల్ సాంగ్ కాక,నాకు నచ్చిన మరో రెండు పాటలు + సాహిత్యం కూడా ఈ టపాలో పెడ్తున్నాను.
బంటి పాడిన "ప్రేమించే హృదయానికి.."
ప్రేమించే హృదయానికి ప్రణమిల్లవే మనసా ప్రణమిల్లవే ll2ll
వంచన ఎరుగని ఎడదకు వ్రంగి మొక్కవే
శిరసా వ్రంగి మొక్కవే ll2ll
మరుమల్లియ మనసులో మలినముండునా
ఎల కోయిల పలుకులో కల్లలుండునా
ఆ మల్లిక మనసుకు ఆ కోకిల పలుకుకు
ప్రణమిల్లవే మనసా ప్రణమిల్లవే llప్రేll
ఉదయభాను కిరణంలో జీవకాంతి ధార
విలయనీలి గగనంలో ఉజ్వల నవతార
ఆ వెలుతురు చినుకుకు,ఆ తారక మెరుపుకు
ప్రణమిల్లవే మనసా ప్రణమిల్లవే llప్రేll
*బాలు పాడిన "లోకం తీరే వేరే.."
లోకం తీరే వేరే ఓ కోయిలా,ఈ శోకం తీరే వేరే దారే లేదే
ఇల కల అంత మధురం కాదే
బంధనాలే అన్నీ బంధం లేదే,అనురాగం భాగం చేస్తే త్యాగం కాదే
విధి ఎదురీది కడచేరవే
వాస్తవం ఊహలకూ కడు దూరం,ఆశకు అవధుండదే..ఆ...
ఋతువుకు ఆగమనం నీ గానం,వ్యధలను మరపించవే...
లోకం లోకం తీరే వేరే ఓ కోయిలా,ఈ శోకం తీరే వేరే దారే లేదే....
మనసున రేగే భావాలన్నీ ఋతురాగాలే
ఆ భావంలోనే భాషలకందని రుపం ఉందే
రుపం చాటున మెదిలే భావం రాగం వేరే
ఆ రాగంలోనే స్వరములకందని భావం ఉందే
అలుపెరగని ఈ గుండెలో అలజడులే ఈ రాతలు
తలరాతలనే తలవంచే నీ తలపే ఇక మారాలే
ప్రేమే జీవితనౌక చుక్కానిలే
నీ నిండు మనసే నీకు తొడూ నీడే
దారే తప్పి దిక్కేతోచని ఓ ప్రాణమా
నిను ఓదార్చే నీ తొడే నేనని గమనించుమా
ఒకటే జాతికి చెందిన గువ్వలు నువ్వూ నేనూ
నీ జీవితగతిలో ముదమును పంచే తొడౌతానూ
స్నేహం నిండిన గుండెలో,రావే ఒంటరి కోయిలా
మన గాధలు వెరే అయినా,మన బాధలు ఒకటే కాదా
కాలం సాగిపోదే కలతలతోనే,గత చేదు ఆవేదనలే గతియించునే
ఇక ప్రతి ఋతువు వాసంతమే
లోకం తీరే వేరే ఓ కోయిలా,ఈ శోకం తీరే వేరే దారే లేదే
ఇల కల అంత మధురం
వాస్తవం ఊహలకూ కడు దూరం,ఆశకు అవధుండదే..ఆ...
ఋతువుకు ఆగమనం నీ గానం,వ్యధలను మరపించవే...
11 comments:
Thanks a ton తృష్ణ గారు, ప్రస్తుతం ఆఫీస్ లో ఉన్నా పాట ఇంకా వినలేదు. సాయంత్రం వింటాను. అడిగిన వెంటనే పాట అందించినందుకు మరో మారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
వేణూ గారు, copyrights problem వస్తుందని డౌన్లోడ్ లింక్ పెట్టలేదండి.
వెల్కం బ్యాక్.. నాకు ఋతురాగాలు లో 'వాసంత సమీరంలా..' మాత్రమే తెలుసండి.. చాలాసార్లు విన్నాను. సునీత కి మంచి పేరు తెచ్చిన పాట.. ఆ సీరియల్ సాయంత్రం నాలుగు ఆ టైములో వచ్చేది కదా.. ఇంట్లో ఉండే టైం కాకపోడం వల్ల చూడలేదు.. మిగిలిన పాటల గురించి ఇప్పుడే తెలిసింది..
@ మురళి:థాంక్స్ అండి.కాలేజీ నుంచి వచ్చే టైం కి వస్తూ ఉండేది.దీనిలో ఇంకా "ఎవరు నీవు" ,"విధి వంచనకే.." అన్న పాటలు కూడా బాగుంటాయండి.
ర౦డీ ర౦డీ దయచెయ్య౦డీ తమరి రాక మాకు ఎ౦తో స౦తోషామ౦డీ...
మీ పురాగమనానికి నా స్వాగత సుమాలు....
నాకు తెలిసి దురదర్శన్ ని బ్రతికి౦చి౦ది ఋతురాగాలు సిరియల్.
నాకు వాస౦తసమీరలా.....నే తెలుసు.మేము అ౦త్యక్షరిలో కుడా సినిమా పాట కాకు౦డా అ౦తా ఏ అభ్యతర౦ లేకు౦డా ఒఫ్ఫుకునే పాట.
ధా౦క్స్ అ౦డీ....హ్యపి గా విన్నాను.
మంచి పాటలు గుర్తుచెయ్యడమే కాక వినిపించినందుకు థాంక్స్.నాకు బంటి గారు కంపోస్ చేసిన అన్ని పాటలూ ఇష్టమే.ఇళయరాజా గారి తరువాత అంత ఇష్టపడే సంగీత దర్శకుడు ఆయనే.అప్పట్లో కేసెట్ వచ్చిందని నాకు తెలీదు.టీవీలో వస్తుంటే టేపిరికార్డర్ లో రికార్డ్ చేసుకున్నాను నేను.అలాగే "ఎడారిలో కోయిల రాగాలన్ని నీకేల?మూగవోయిన గొంతుతో చివరకు ప్రశ్నగా మిగిలేవా" అనే పాట కూడా చాలా బాగుంటుంది.ఈ సీరియల్స్ అన్నీ పాట వరకు చూసి ఆపేసేదానిని.నాకు కస్తూరి సీరియల్ కూడా నచ్చింది.అదే నేను చివరివరకు చూసిన సీరియల్.ఋతురాగాలు వాళ్ళు పెద్దయ్యెవరకు చూసి ఆపేసా.
నాకు కూడా ఋతురాగాలు పాట చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటె నేను పాడి పాడి నా నాలుగేళ్ళ అబ్బాయి కూడా నొటికి వచ్చేసింది. ఒక రోజు వాడు mommy what does that song mean ? అంటే వాడికి meaning చెప్తువుంటె suddengaa ఆ Title తొ బ్లాగ్ వ్రాస్తె బాగుంటుంది అని ఒక బ్లాగ్ ఐతే start చేసా కాని అప్పటినుంచి అస్సలు time దొరకడం లేదు ఒక్క పొస్ట్ చెయటానికైనా.
Trishna గారు అవును అందులొ songs అన్ని చాలా బాగుంటాయి. Thanks a bunch for posting them here.
@ సుభద్ర:నిజమేనండి,దూరదర్షన్ వ్యూవర్ షిప్ ను పెంచిన సీరియల్స్ లొ ఇది ఒకటి.
మీ స్వాగతానికి ధన్యవాదాలు.
@రాధిక: అవునండి బంటిగారి సంగీతం బాగుంటుంది.కానీ నాకు ఋతురాగాలు సంగీతం నచ్చినంతగా వేరే ఏ సీరియల్ పాటలూ నచ్చలేదండి..
ధన్యవాదాలు.
@సురభి:సంగీతం + సాహిత్యం రెండూ సమపాళ్ళలో కలిసిన సుమధుర గీతాలవి.
విజిట్ చేసిన మీకు కూడా ధన్యవాదాలు.
తృష్ణగారూ అడిగిన వెంటనే పాటలు పంపినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
thanks ....చాల చాలా థ్యాంక్స్ అండీ మిగతా పాట్లు కూడ upload చేయ్యండి ప్లీస్ ..... Download చెస్కోవడం తెలికే mozilla firefox lo easy.
Post a Comment