అరే.. సెంచరీ అయిపోయింది....
నాకు బొత్తిగా లెఖ్ఖలు రావనటానికి ఇంతకంటే ఋజువు ఏం కావాలి?
సిరిసిరిమువ్వగారికి సమాధానం రాస్తూ ఎందుకో నా "బ్లాగ్ ఆర్కైవ్" వైపు చూసా..అది "100" టపాలని అంకె చూపెట్టింది...2,3 సార్లు పోస్టులన్నీ లెఖ్ఖ వేసా..కరక్టే..100 అయిపోయాయి...!!
అది సంగతి...!!
నేను మే 28న అనాలోచితంగా,యాదృచ్చికంగా...ఈ బ్లాగ్ తెరిచాను.అంతకు ముందు బ్లాగుల గురించి ఏమీ తెలీదు.ఎప్పుడూ ఎవరివీ చదవలేదు కూడా....ఒక Gmail మొదలెడుతూంటే,"start your own blog"అని ఒక విండో ఓపెన్ అయ్యింది..i signed in and opened this, just like that..!
ఏదో పుస్తకంలో బ్లాగ్ ద్వారా తన భావాలను ఓ డైరీలో రాసుకున్నట్లే రాసే అమ్మాయి కధ చదివాను..అది మనసులో ఉండిపోయిందేమో..నేను కూడా బ్లాగ్ లో ఓ దైరీలోలాగే మనోభావాలు ప్రకటిస్తూ వచ్చాను.నాకు చాలామంది స్నేహితులు ఉన్నా, అందరికన్నా నాకు సన్నిహితమైంది నా డైరీ..ఎందుకంటే నా డైరీ పేజీలు నా భావాలను తనలో దాచుకుంటాయి,నా కోపాన్ని దాచుకుంటాయి,నా దు:ఖ్ఖాన్ని పేజీలు ఇముడ్చుకుంటాయి,నా ఆనందం అక్షరాల్లోకి మారే కొద్ది ఎక్కువౌతుంది...అందులో రాస్తే గానీ నా ఏ భావమూ సంపూర్ణం కాదు..అంత సన్నిహితం నాకు నా డైరీ..అలాంటిది బ్లాగ్ తెరిచాకా నా పర్సనల్ డైరీ ఇప్పటిదాకా తెరవనే లేదు.డైరీ కన్నా ఎక్కువైపోయింది నా బ్లాగ్ నాకు.ఇదే ఒక డైరీ అయిపోయింది.మనసులో నిక్షిప్తమై,ఏ ములనో పడిఉన్న నా ఆలోచనలకీ,మనోభావాలకీ ఓ చక్కని దారి కనిపించింది.అవన్నీ టపాల ద్వారా నన్నడక్కుండానే బయటకు రావటం మొదలేట్టాయి...ఇవిగో ఇలా "100" టపాలయ్యాయి...వాటిల్లో కొన్ని నా బొమ్మలూ,పైన్టింగ్స్ ఉన్నా అవి కూడా నాలోని కళాదృష్టికి ప్రతిబింబాలే కాబట్టి అవీ నా భావప్రకటనల్లో భాగాలే.
పాటలూ,సినిమాలూ,పుస్తకాలూ,కవితలూ అనే లోకంలో చాలా ఏళ్ళు...అదే జీవితమనుకుని పెరిగిన నాకు జీవితాన్ని జీవించటానికి కావాల్సినవి తెలివితేటలూ,సమయస్ఫూర్తి,సంపాదన...అనే సత్యం చాలా లేటుగా తెలిసింది....జీవితంలో ఏదీ సాధించలేకపోయాను అనే అసంతృప్తి మిగిలిపోయింది.అయితే నా కర్తవ్యాన్ని,బాధ్యతల్ని మాత్రం నేను వదిలేసింది లేదు.స్త్రీ గా నాకు లభించిన అన్ని పాత్రలకీ నా వంతు కర్తవ్యం నేను నిజాయితీగా నెరవేర్చాను.జీవితంలో ఎన్నో ఒడిదొడుకులూ, ఇబ్బందులూ, దెబ్బలూ...అందరికీ ఉండేవే.కాకపోతే నాలాటి సున్నితమనస్కులకు అవి మరింత వేదనను పెంచుతాయి,పాఠాల్ని నేర్పిస్తాయి.నన్ను నేను మర్చిపోయి జీవనప్రవాహంలో కొట్టుకు పోతున్న నాకు, ఈ బ్లాగ్ ఎంత ఆనందాన్నిచ్చిందో మాటల్లో చెప్పలేను.నది ఒడ్డున గిలగిలా కొట్టుకుంటున్న చేపని మళ్ళీ నీటిలో పడవేస్తే ఎలా ఉంటుందో..అదీ బ్లాగ్లోకంలో నా స్థితి.
బ్లాగ్ ద్వారా నా అభిప్రాయాలను వ్యక్తపరచటంతో పాటూ,నన్ను నేను మళ్ళీ కనుక్కున్నాను...నేనేమిటో మర్చిపోయిన నన్ను నేను మళ్ళీ గుర్తుచేసుకున్నాను...ఈ నెల 28కి ఈ బ్లాగ్ కు నాలుగు నెలలు.ముందుగా ఈ బ్లాగ్ వేదికను కనిపెట్టినవారికీ,బ్లాగ్ లో ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను తెలియచేసుకోవటానికీ అవకాశం కల్పించిననవారికందరికీ శతకోటి వందనాలు.ఓపిగ్గా ఈ టపాలన్నింటినీ చదివి,వ్యాఖ్య లందించి ఆనందపరిచిన బ్లాగ్మిత్రులందరికీ,వ్యాఖ్యలు రాయకపోయినా అజ్ఞాతంగా చదివిన వారికి కుడా పేరు పేరునా ఈ టపా ముఖంగా ధన్యవాదాలు.
రాయకుండా ఉండలేకపోవటం నా బలహీనత,అవసరం కూడా...so,..మళ్ళీ మనసైతే...కొన్నాళ్ళలో తప్పక ప్రత్యక్షమౌతాను...అంతవరకూ మీ , నా "తృష్ణ"కి శెలవు..!!
31 comments:
అదేమిటి అంత షాక్ ఇచ్చారు శెలవు అంటూ . బాలే !
అంటే కొన్ని రోజులు వ్రాయకుండా విరామం తీసుకుంటారా (:-?
మీకు బ్లాగు శతదినోత్సవ శుభాకాంక్షలు!
అభినందనలు తృష్ణ,
రాయలేకుండా ఉండలేరుగా..సెలవులు ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత ఆ విశేషాలు మాకు చెప్పాలి సుమా.. ఎదురుచూస్తున్నాము మరి..
అదేంటండి సెంచరీ కొట్ట గానే ఎప్పుడు డ్రెస్సింగ్ రూం కి పోయి తిండి తిందామా అనుకుని అవుట్ అయిపోయే ఇండియన్ బాట్స్మన్ లాగ వంద కే సంతృప్తి పడితే ముగత్రుష్ణ లో నీరు తాగి దప్పిక తీర్చుకునట్టే ,సంవత్సరం నుంచి రాస్తున్నా వోడుదుడుకులకి తట్టుకుని, మీరు నాలుగు నెలలకే రెస్ట్ తీసుకుంటే ఎలా?
సెంచరీలు కొట్టే వయసూ మనసూ ఉండి కూడా సెలవులు ప్రకటింటించడం బాలేదండీ. వంద టపాలకు అభినందనలు. ఆగకుండా సాగండి.
మొత్తానికి బ్లాగాఫీస్(బాక్సాఫీస్ లాగ) దగ్గర వంద టపాలు పూర్తిచేసుకున్నాయన్నమాట...అందుకోండి అభినందనల మందారమాల...
అక్షరాల్లో అనందం పొందే ఇంత అందమైన అనుభూతి అందరికి లభించదు. డైరీ కేవలం మనలోనే ఉండి పోతుంది. ఈ బ్లోగ్ చూశారా! నాలుగు నెలల్లో మీలో నింపని అనందం ఏమైనా మిగిల్చిందా! ప్రపంచమంతా పరచినా సరిపోని ఎన్నో భావోద్రేకాలను ఒక్క బ్లోగ్ లో ఎలా ఇముడ్చుకుందో. మీరు ఏం చెప్పుకున్నా ఈ బ్లోగ్ వింటుంది. ఎందరో మిత్రులను మీదరికి చేరుస్తుంది. మంచి చెడు లలో తోడుగా ఉంటుంది. ఇప్పుడు నది వొడ్డున గిల గిలా కొట్టుకుంటున్న ఎన్నో చేపలను తిరిగి నదిలోకి భద్రంగా జారవిడిచే స్థాయిలో మీరు ఉన్నారు. జీవితంలో మీ 'త్రుష్ణ ' అప్పుడే తీరి పోయిందా! శెలవ్ ఎందుకు? మళ్ళీ మనసైతే- కొన్నాళ్ళలో కలుస్తారా! ఏవిటిది! మీకు రాయటం చాలా అవసరం అని, మీ బలహీనత అని చెప్పుతూ శెలవ్ అంటున్నారు. ఎంతమాత్రం ఒప్పుకునేది లేదు. అంతేకాదు ప్రతిరోజు మీ పోస్ట్ కనిపించాల్సిందే. మీతో మానసిక బాంధవ్యం పెంచుకున్న మాలాంటి వాళ్ళేమైపోవాలి? మా 'త్రుష్ణ ' ఎలా తీరాలి!
"వందకు అభినందన"
కొనసాగిస్తూనే ఉండండి.
నన్ను చూడండి, ఏడాదిన్నరగా బ్లాగుతున్నా, ప్చ్ వంద దాకా ఇప్పుడప్పుడే వచ్చే సూచనలే లేవు! ఎంత ఫాస్టో మీరు!
అది సరే, సెలవంటారేమిటీ, వంద టపాల నోము పూర్తయినట్లు! మనసైతే కాదు, మనసు చేసుకుని రోజూ రాస్తుండండి తృష్ణ గారూ, నూతన సంవత్సరానికి ద్విశతాబ్ది టపాలతో స్వాగతం పలకాలి!
అభినందనలు!
నూరుటపాల పండగన్నమాట.
శుభాకాంక్షలు.
Congrats...
"so,..మళ్ళీ మనసైతే...కొన్నాళ్ళలో తప్పక ప్రత్యక్షమౌతాను...అంతవరకూ మీ , నా "తృష్ణ"కి శెలవు????"
దీని భావమేమిటి మాడం? ఏవరన్నా ఏదన్నా పత్రికలకి కథలు కాని ఇంకేమన్నా వ్రాయడంకోసం కొన్నాళ్ళు బ్లాగులకి దూరంగా ఉండమని???..అలాంటివేవో అమలుపరిచేముందు ఒక్క క్షణం ఆలోచించండి.
కామెంట్స్ మరీ పోస్ట్ కన్నా ఎక్కువ రాసేస్తున్నానని నా చేతులని నేనే కట్టేసుకొంటాను సాధారణంగా బ్లాగులు చదువుతూ ఎంత కామెంట్ రాయాలనిపించినా.... 100 తరువాత బ్రేక్ అని వాణిజ్య ప్రకటనలా ఈ బ్రేక్ సబబా? ఆలోచించండి.
శుభాకాంక్షలు తృష్ణా ఇంత తొందర గా 100 పోస్ట్ లు పూర్తి చేసి ఇంత మంది అభిమానులు, స్నేహితులను సంపాదించుకున్నందుకు. :-) అదేదో 100 టపాల నోము లా ఇంక శెలవు అంటు ఆ ప్రకటన ఏమిటండోయ్.. ... మీరలా టపాలేస్తూ వుండాలి మేము మా మనసుల్లోకి, గతం లో కి, అప్పుడు అప్పుడు వంట ఇంట్లో కి తొంగి చూసుకుంటూ వుండాలి..
congrats
తృష్టగారు,
నాల్గునెలలులో వ౦ద టపాల ????వావ్ చాలా గ్రేట్ అన్పిస్తు౦ది.ఇ౦చుమి౦చు రోజు ఒక పోస్ట్ రాసారు.టై౦ ఉ౦డొచ్చు కాని మీలా రాయదగ్గ థాట్స్ రావట౦ చాలా కొద్ది మ౦దికే ఉ౦డోచ్చు.మీకు ఒడ్డున పడి ఎ౦తగా కోట్టుకున్నారో అని తలుకు౦టు౦టే చాలా బాధ వేస్తు౦ది.మీరు రాయట౦ మానవద్దని నా విన్నప౦.ఇ౦కా ఇ౦కా రాయ౦డి..తిరిగేకాలు,తిట్టేనోరు,రాసేచెయ్యి ఆగవు,ఆగవు.ఎదో రైమి౦గ్
కోస౦ రాసాను ,మీరు మీని౦గ్ వెదక౦డి.మీరు మరిన్ని టపాలు రాయలని కోరుకు౦టూ...
ప్రేమ తో,
సుభద్ర
Congrats!!
నాలుగు నెలల్లోపే వంద టపాలు పూర్తి చేసినందుకు అభినందనలు తృష్ణ గారు. విరామాన్ని కుదించి సాధ్యమైనంత త్వరలో మళ్ళీ మొదలెట్టండి.
పైకి నవ్వుతూ :- ఏంటీ అప్పుడే 100 పోస్ట్లు అయిపోయాయా..మీరు గ్రేటండి ఎంతైనా ...
మనస్సులో కుళ్ళుతూ :-ఓర్నాయనో అప్పుడే 100 పోస్ట్లా ఎంత బడాయి ..నేను దాదాపుగా 1 year అవుతుంది 30 దాటడానికి ముక్కుతూ మూల్గుతున్నా ...
ఇప్పుడు మన్స్పూర్తిగా :- ఇంకా మంచి మంచి పోస్ట్లతో మమ్మల్ని అలరించాలి అభినందనలు తృష్ణగారు :)
అభినందనలు..
మాలా కుమార్,
వెంకట గణేష్,
జ్యోతి,
రవిగారు,
అరుణ పప్పు,
శేఖర్ పెద్దగోపు,
జయ,
చిలమకూరు విజయమోహన్,
సుజాత,
పద్మ,
భాస్కర్ రామరాజు,
రమణి,
భావన,
మా ఊరు,
సుభద్ర,
సునీత,
వేణూ శ్రీకాంత్,
నేస్తం ....
ఈ టపాకి స్పందించిన మీ అందరికీ
హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ వ్యాఖ్యలన్నీ చూస్తే నాకు బాలాంత్రపు రజనీకాంతరావు గారి "మనసౌనే ఓ రాధా..మరల వేణువూదా..." అన్న పాట గుర్తుకు వచ్చింది.
వెంఠనే టపా రాసేయాలనిపించింది...
కొన్ని రోజులు నేను మౌనంగా ఉండి తరువాత టపా రాయచ్చు.ఈ ప్రకటన అవసరం లేదు...మాటామంతీ లేకుండా మయమైపోవచ్చు...కానీ రొజూ చదివేవారు కొందరైనా ఉంటారు కదా..వాళ్ళని నిరాశపరచటం ఇష్టం లేక ఇలా టపా రాసాను.ఉన్నట్లుండి మాయమైపోవటం నేను చెయ్యలేని పని..!!
టపాలో చెప్పినట్లు-- రాయకుండా నేను ఉండలేను...చదివే వాళ్ళకీ,వినేవాళ్ళకు ఓపిక ఉండాలే కానీ నేను చెప్తునే ఉంటాను...నా భావాలనేకం...నా కబుర్లు అనంతం.
నేను రాస్తాను...తప్పక రాస్తాను...కాని ప్రస్తుతానికి ఎందుకనో నిశ్శబ్దంగా ఉండాలని అనిపిస్తోంది..
ఎవరో అన్నట్లూ ఇదేమీ "బ్రేక్" కాదు...బండి స్లో అయ్యిందంతే...
జయగారూ, "మనసిక బాంధవ్యం.." అన్నారు...ఈ మాట నాకెంతో సంతొషాన్నిచ్చింది.ధన్యవాదాలు.
త్వరలో తప్పక తృష్ణ మీ ముందుంటుంది...!!
మురళి గారూ,నేను నా వ్యాఖ్య పబ్లిష్ చేసాకా మీ వ్యాఖ్య చూసాను.ధన్యవాదాలు.
నేను మీకు మీ నూరవ టపాలోనే శుభాకాంక్షలు చెప్పేసానన్నమాట!
"కాని ప్రస్తుతానికి ఎందుకనో నిశ్శబ్దంగా ఉండాలని అనిపిస్తోంది"....
నిజమే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది..సహజమే. మన మనస్సుకి ఏదనిపిస్తే అది చేయటమే..అందుకేగా బ్లాగు ఉంది. మీకు త్వరలోనే మరలా వ్రాయాలనిపించాలని కోరుకుంటున్నాను.
@ సుజాత, నేస్తం, ఏం పర్లేదు..మీ ముందు నేనున్నా ఓ పెద్ద గూడ్సు బండిని :)
@నేస్తం, మనలో మనమాట (తృష్ణ గారు, మీరు వినకండే)..నిన్న నేను కూడా మీలానే అనుకున్నా మనస్సులో!!
@సిరిసిరిమువ్వ: ధన్యవాదాలు.
వినద్దన్నా నెను వినేసానుగా...నేనొప్పుకొనూ...Umm...!
ఇన్ని ఆలోచనలు, భావాలు. కబుర్లు, స్పన్దనలు, ప్రతిస్పన్దనలు మీలోనే దాచుకొకన్ది. మీ చిన్ని(పెద్దదయినా)మనస్సుకు క్లేశ౦. వాన కురిస్తేనే స్వా౦తన నేలకైనా, ని౦గికైనా,మేఘానికైనా.
అయినా గ౦గ కమ౦డల౦లో దాచేస్తే దాగేనా........
@siva:మీరే అన్నారుగా..గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా..అని.
అవును మరి "ఉరికే మనసుకు గిరిగీస్తె అది ఆగేదేనా..."
ధన్యవాదాలు..
వందయ్యాయని చప్పట్ట్లేమిటొ అంతలో అలసిపోయానొచ్ అనటమేంటో. అంతా తృష్ణ మాయ. చూద్దాం
@chaitanya:ఏమిటో ఈ మాయా...ఓ వెన్నెల రాజా...hmmm..
తృష్ణ గారు,
మీ లోని చాలా కళలు చూసాను,ఒక్కసారి మీ పాట కూడా వినాలని ఉంది.esnips ద్వారా try చేయకూడదూ?
నూరు టపాల సుందరికి అభినందనలు.
నీహారిక గారూ,
ధన్యవాదాలు.ఏమిటండి..పాట పెట్టనా?ఇక వచ్చే కాస్త మంది అతిధులనీ పారిపొమ్మన్నట్టే.. :)
తృష్ణ గారికి,
శతటపోత్సవ శుభాకాంక్షలు.! ఒక చిన్న విరామం తీసుకుని, విశ్రాంతి తరవాత మళ్ళీ మళ్ళీ తరచూ మాకు దర్శనం ఇప్పిస్తారు కదూ..!
@మధురవాణి:ఇవాళే మళ్ళీ దర్శనమిచ్చాను..చూడండి మరి...
మీరు ఆ రోజు లింక్ ఇచ్చినప్పటినుమ్చీ ప్రయత్నిస్తూనే ఉన్నాను..మీ "మధురవాణి" బ్లాగ్ నా సిస్టంలోంచి ఓపెన్ కావటం లేదండి...ఆ జీవితం పోస్ట్ నే ఇప్పటిదాకా చూడనే లేదు..:(
Post a Comment