సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, September 16, 2009

ఎందుకిలా..

..ఎందుకిలా..
ఎందుకిలా అని చాలా సార్లు ఆలోచిస్తాను కాని సమాధానం దొరకదు..
ఇదేమి న్యాయం అని అడగకోడదంటారు...
కొన్ని సార్లు నిజాలు చెప్పకూడదంటారు...
ఒక వేలు మనవైపు చూపితే,తమ మూడు వేళ్ళు తమనే చూపుతాయని తెలిసినా
భూతద్దంలోంచి మన తప్పులెంచుతూంటారు...
ఎవరి తప్పువు వారికెందుకు కనబడవు?
ఇతరుల విషయాల్లో జోక్యాలెందుకు?

ఈటెల్లాంటి మాటలు వల్ల కలిగే బాధ ఎలాటిదో తెలిసి కూడా మాటలు విసురుతూ ఉంటారు...
విరిగిన మనసుని మళ్ళీ మళ్ళీ ముక్కలు చేస్తూనే ఉంటారు...
పొందిన సాయాన్నీ మరుస్తూనే ఉంటారు...
మంచితనాన్ని వాడుకుంటూనే ఉంటారు...
నమ్మకాన్ని విరిచేస్తూనే ఉంటారు...
ఎవరి పని వారెందుకు చేసుకోరు?
ఎవరిష్టం వారిదని ఎందుకు వదిలెయ్యరు?
ఎవరి దారినవారెందుకు పోరు?

ఎందుకిలా అని చాలా సార్లు ఆలోచిస్తాను కాని సమాధానం దొరకదు...
ఎందుకిలా...

13 comments:

నేస్తం said...

అందుకే ఎందుకు,ఏమిటి,ఎలా అని ఆలోచించకుండా అదంతే అనుకోవాలని బాబు మోహన్ గారు ఒక సినిమాలో చెప్పారు :)బాగా రాసారు

లక్ష్మి said...

అది ఎప్పటికీ ఎవరికీ సమాధానం దొరకని ప్రశ్నే అనుకుంటా బహుశా. ఐనా అందరూ అలానే అనుకుంటారు కూడా అది కూడా ఇంకో పెద్ద సమస్య

మాలా కుమార్ said...

అవును ఎందుకిలా ? సమాధానం లేని ప్రశ్న .

సుజాత వేల్పూరి said...

ఎందుకిలా? అంటే దీనిపేరు జీవితం కాబట్టి!

మా ఊరు said...

ఎందుకిలా ,
దీని సమాధానం ఎవ్వరికి తెలియదు కావచ్చు.

భావన said...

ఎందుకంటే అది మానవ నైజం కాబట్టి. నిన్నే మా మేస్టారు చెపుతున్నారు.. అయిష్టమైన దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా వదిలేస్తే సరిపోతుంది అని... అవును ఎన్ని ముళ్ళొ ఎన్ని గతుకులో నా జీవన పధం లో, ఎన్ని పువ్వులో ఎంత పరిమళమో ప్రతి మలుపులో... గతుకులన్ని కనిపించని మలుపుల నుంచి గమన వేగం తగ్గించి మనలను రక్షించటానికే అనుకోవటం తప్ప ఏమి చేస్తాము తృష్ణా..

Padmarpita said...

ఈ ప్రశ్నకు బదులు లేదని తెలిసి ఆరాటం దేనికని???
బాగారాసారండి...

Bhãskar Rãmarãju said...

ఎందుకిలా? అంటే లోకం పోకడ..అదంతే.
కావాల్సింది నిన్నునీవు గట్టిపరుచుకోడమే.
సెన్సిటివిటీస్ ని బుజ్జగించుకుంటూ ముందుకెళ్ళటమే.

తృష్ణ said...

@ నేస్తం: "ఎందుకు?ఏమిటి?ఎలా?" ఆ డైలాగు చెబుతున్న బాబూమోహంగారి మొహం తల్చుకుంటేనే నవ్వు వచ్చేస్తోంది...భలే గుర్తు చెసారు..ధన్యవాదాలు.

@లక్ష్మి: చాలావరకూ(ముఖ్యంగా మనల్ని మాటలనేవాళ్ళు కూడా) అందరూ అలానే అనుకుంటారు..అదే సమస్య..?!
థాంక్స్ అండి.

తృష్ణ said...

@ మలా కుమార్: అదే కదా ప్రశ్న మరి..

@సుజాత: అవునేమో ...

మీ ఇద్దరికీ ధన్యవాదాలు.

తృష్ణ said...

@ మా ఊరు: లోకం పోకడ ఇంతేనేమో..అనిపిస్తుందండి..థాంక్స్.

@ భావన: చాలా బాగా చెప్పారండి..ధన్యవాదాలు.

తృష్ణ said...

@ పద్మార్పిత :"जिंदगी कैसी है पहॆली हायॆ
कभि तो हसायॆ..कभि तो रुलायॆ.."
ధన్యవాదాలు.

@ భాస్కర్ రామరాజు :అలా గట్టిపడటం రాకే ఇన్ని బొప్పెలు...అందుకే కదండీ నా ప్రొఫైల్లో ఆ పాట రాసుకున్నది.."सब कुछ सीखा हमनॆ न सीखी हॊशियारी..."

మీరన్నట్లు లోకం పోకడ..అనుకోవాలి అంతే..!ధన్యవాదాలు.

మురళి said...

భాస్కర్ రామరాజు గారితో ఏకీభవిస్తున్నా..