సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, September 18, 2009

నాన్నతో ఒక సాయంత్రం


నిన్న పొద్దున్నే పర్మిషన్ తీసేసుకున్నా.."ఇవాల్టితో పాప పరీక్షలయిపోతాయి.అట్నుంచటే అమ్మావాళ్ళింటికి వెళ్పోతానని..".శెలవలున్నా,మళ్ళీ పదిరోజులదాకా కుదరదు మరి.(రేపటి నుంచీ శరన్నవరాత్రులు కదా..నేను బిజీ)డ్రెస్స్ స్కూల్కి పట్టుకుపోయి,పాపకి అక్కడే డ్రెస్ మార్చేసి,బస్సెక్కేసా!ఇంటికి వెళ్ళగానే పాపకి అన్నం పెట్టే పంచవర్షప్రణాలిక పూర్తి చేసి, మెల్లగా కంప్యుటర్ దగ్గరికెళ్ళి బ్లాగు తెరిచా..."మాయ కంప్యూటర్ మళ్ళి తెరిచావా.. ఉన్న కాసేపు కబుర్లు చెప్పవే.."అని అమ్మ కేక..!లాభం లేదని సిస్టం ఆఫ్ చేసేసా.

కానీ మనకి ఖాళీగా ఉండటం రాదే..వంటింట్లో ప్రయోగాలుచేద్దామంటే అమ్మ ఒప్పుకోదు 'ఉన్న కాసేపూ..' డైలాగు వదుల్తుంది!!"సినిమాకు వస్తారా ఎవరన్నా?"..అడిగా..మేము రామన్నరు ఎవరూ."బజారు పనులున్నాయి వెళ్దామా?" "రాము..రాము" అన్నారు.ఇక ఆఖరి అస్త్రం "నాన్నా,విశాలాంధ్రకు వస్తావా..".ఐదు నిమిషాల్లో నాన్న రెడీ."అమ్మో మళ్ళీ పుస్తకాలు కొనేస్తారే బాబూ.."అంది అమ్మ.ఇంట్లో మరి రెండు బీరువాల పుస్తకాలు....

నాన్నతో సమయం గడిపి చాలా రొజులయ్యింది..!నాన్నంటే నాకు చాలా ఇష్టం.ఆయన విజ్ఞానానికి ఆయనంటే గౌరవం.ఎవరి నాన్నలు వాళ్ళకి గొప్ప.అలానే నాకునూ.ఏ విషయం గురించి అడిగినా చెప్పేస్తారు.ఆయన ఒక ఎన్సైక్లొపీడియా అనిపిస్తుంది నాకు.ఒక్క క్రీడా సంబంధిత విషయాలే ఆయనకు తెలియవు.బస్సులో ఆయన ఎక్కలేరని ఆటోలో బయల్దేరాం. ఆయన మిత్రుల కబుర్లు,ఆఫీసు కబుర్లు..సినిమాలూ,పాటలూ,కొత్త సింగర్లూ...అవీ ఇవీ చెప్పుకుంటూ..!నాన్న గురించి ఎక్కడ మొదలెట్టి ఎక్కడ ఆపాలో తెలీదు నాకు.జీవితమంతా వృత్తికే అంకితం చేసారు.వృత్తి పట్ల ప్రేమ ఉండటంతో చేస్తున్న దాంట్లో కావల్సినంత సంతృప్తినే పోగేసుకున్నారు.ధనార్జన ఆలోచనే లేదాయనకు.(నాన్న గురించి ప్రత్యేకం వేరే టపా రాయాలి.ప్రస్తుతానికింతే..)

చిన్న చిన్న మిగిలిన పనులు పుర్తి చేసుకుని షాపుకి చేరాం.పాత పరిచయాలవల్ల షాపువాళ్లకాయన పరిచయమే..!ఒక బీరువాడు పుస్తకాలు సేకరించాకా నేను పుస్తకాలు కొనటం మానేసాను..నా తదనంతరం పిల్లలకి ఈ అభిరుచి లేకపోతే ఇవన్నీ ఏం చేస్తారు..అన్న ఆలోచనవల్ల..!!మళ్ళీ నిన్నే చాలా రోజులకు పుస్తకాలు కొనటం.ఇద్దరం (అసంతృప్తిగా) ఒక సహస్రం బిల్లు చేసి బయటపడ్డాం.షాపులో నాన్న సంతకం పెడుతుంటే అన్నా..ఎన్నిరోజులయ్యిందో నీ సంతకం చూసి..అని!చిన్నప్పుడు నాన్న సంతకాన్ని కాపీ చెయ్యాలని ప్రయత్నించేవాళ్ళం కానీ వచ్చేది కాదు..!

ఎప్పుడొచ్చినా ఏదో హడావుడి..మాట్లాడటం కుదరదు..నిన్ననే చాలారోజులకి నాన్నతో అలా సాయంత్రం గడపటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది..చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసింది..ఒక్కో రోజున అర్ధరాత్రి ఒకటి,రెండింటి వరకు జిడ్డు కృష్ణమూర్తిగారి గురించో,గుంటూరు శేషేంద్ర శర్మగారి గురించో..కిషోర్ కుమార్ గురించో,సలీల్ చౌదరి గురించో....ఏవో డిస్కషన్లు,కబుర్లూ చెప్పుకుంటూ గడిపిన రోజులు ఉన్నాయి..!!రకరకాల కారణాల వల్ల నాన్నే నా "ఐడియల్ మేన్" మరి.

29 comments:

Sujata M said...

సో స్వీట్ ! నాకూ మా నాన్నారు హీరో ! ఇన్నేళ్ళు వచ్చాయా, నిన్న రవ దోస చేసి ఇచ్చాను. అదేదో చిన్న పిల్లని పెద్ద వంట చేసేసి పెట్టేసినట్టు ఫీలయిపోయారు. చదవటం అనే అలవాటు నాన్న గారి వల్లే వచ్చింది. పాటలు వినడం, పాడటం - లాంటివన్నీ ఆయనవల్లే అనుభూతి లోకి వచ్చాయి. మీ ఫీలింగ్స్ ని అర్ధం చేసుకోగలను. మా నాన్నగారి జీవిత లక్ష్యం అంతా మా జీవితాల్ని తీర్చిదిద్దడమే గానీ - తన కోసం ఆలోచించుకునేది తక్కువ. మేము ఎంత పెద్దవాళ్ళమయినా, నాన్న కూచులమే ! మా ఆఫీసుల్లో కష్టాలకి, సమస్యలకీ నాన్న చెప్పే పరిష్కారాలు పెద్ద పెద్ద విష్యాల్ని సింపుల్ గా తేల్చేస్తాయి. చాలా నచ్చింది ఈ టపా. మీ నాన్న గారి కి అభినందనలు.

తృష్ణ said...

సుజాతగారు,అమ్మానాన్నలకెప్పుడు మనం చిన్న పిల్లలమే..ధన్యవాదాలు.

విజయభారతి said...

త్రిష్న గారు మీ భావాలు చదువుతుంటే నన్ను నేను చదువుతునట్లు ఉంది ఆ హింది పాటల మీద మక్కువ గజల్స్ వినడం కూడ ఒక్క ఇంఫర్మేషన్ ఇస్తారా ఈ లేఖిని కాకుండా మీరంత తెలుగు ఎలా టైప్ చెస్తునరొ చెప్పర కొంచం

Vani said...

మీ బ్లాగ్ కి ఇదే రావటం. నాన్న అనగానే క్లిక్ చేశా..
చాల బాగా రాసారు. నాన్ను గుర్తు చేసారు.
అమ్మాయిలందరికీ నాన్న అంటే ఇష్టం ఉంటుందేమో. మా అమ్మకు కోపం వచ్చేంత తలిచే దాన్ని ఆయన్ను. చివరకు సిజేరియన్ అయ్యి మెలుకువ రాగానే నాన్న ఏరి అని అడిగా పిల్ల గూర్చి కాక చుట్తో అందరూ ఉండి ఆయన లేక పొతే.
మానాన్న నాకు హిందీ గురువు. సూరదాసు, రాస్ఖాన్ పద్యాలు ఆయన చెప్పటం వల్ల నాకు కృష్ణుడంటే ఇష్టం కలిగింది. కబీర్ అంటే నాన్నకు ఇష్టం.
దక్ష్నిన భారత హిందీ ప్రచార సభ క్లాసులు ఇంట్లో చాలా రోజులు చెప్పేవారు. చాలా విషయాలు నా సబ్ కాన్షస్ లో చేరిపొయ్యాయి అయన వల్ల.

తృష్ణ said...

@భారతి:సంగీతం,సాహిత్యం,సినిమాలు అన్ని నేను నాన్న నుంచి తెలుసుకుని నేర్చుకున్నవే... థాంక్స్ అండి.
నాకు "లేఖిని.ఆర్గ్" తెలుసండి.అది మీ పి.సి లోకి కాపీ చేసుకోండి.వేరే రకాలేమన్నా కావాలంటే మరి గూగులమ్మనడగాల్సిందే మరి...

@ మైత్రేయి: అరే మా నాన్నగారికి కూదా కృష్ణుడు ఇష్టం..అలానే నాకూ..నాకూ కబీర్ అంటే చాలా ఇష్టం.చాలా జ్ఞాపకాలని జ్ఞాపకాలని గుర్తుచేసారు మీ వ్యాఖ్యతో..ధన్యవాదాలు.

శేఖర్ పెద్దగోపు said...

ఎందుకో తెలియదు చాలా హాయిగా అనిపించింది మీరు నాన్నగారితో గడిపిన విషయాలు చదువుతుంటే...

తృష్ణ said...

@శేఖర్ పెద్దగోపు :thankyou..

Praveen Rangineni said...

మా నాన్నే గుర్తొచ్చారు ఇది చదువుతుంటే..
పాపం మేము పెరుగుతుంటె వచ్చిన బాధ్యతల వల్ల కావచ్చు ఆయన తన చాలా అభిరుచులను మానుకున్నారు! ఇప్పుడు తలుచుకుంటె అనవసరంగా పెరిగి పెద్ద వాళ్ళమయ్యా మనిపిస్తుంది.
తను రిటైర్ అయినప్పడి నుంచి, వీలైనప్పుడల్ల తనకోసం మ్యూసిక్ సిడి లు, పుస్తకాలు కొంటుంటాను ఇప్పుడు.

Many Thanks త్రుష్ణ gaaru!
-ప్రవీణ్

తృష్ణ said...

praveen gaaru,thanks for the visit.

జయ said...

మా నాన్న గారిని తల్చుకోని రోజు నాకు ఇప్పటికీ లేదు. పది సంవత్సరాల క్రితం అయన మమ్మల్ని ఒదిలేసినా, జ్ఞాపకాలు మాత్రం మాతోనే ఉన్నాయి. ఇన్నేళ్ళు గడిపిన నాజీవితంలో ప్రతి అడుగులో మా నాన్నగారి అడుగులే కనిపిస్తాయి. వాళ్ళ చిన్నప్పటి సంగతులు చెప్పినా, అనేక గ్రంధాలు, కవిత్వం- సమష్యా పూరణాల గురించి మాట్లాడినా, ఇంజినీర్ అయినప్పటికి ప్రతి ఒక్కరి జాతకాలు ఎంతో వివరంగా కరెక్ట్ గ చెప్పే అయన ప్రతిభ, అంతేకాదు తన నిష్క్రమణ ని ముందే తెలుసుకున్న జ్ణాని. ఎలా మర్చిపోగలను. మీ నాన్నగారి పట్ల మీ అభిమానం నాకు ఎంతో సంతోషాని కలిగించింది. మీకు నా అభినందనలు.

మురళి said...

చాలా బాగుంది మీ టపా.. 'అరె.. అప్పుడే అయిపోయిందా..' అనిపించింది...

భాస్కర రామిరెడ్డి said...

sooooo sweat.

తృష్ణ said...

@జయ:మా నాన్నగారి ఇంకా గురించి చెప్పాల్సింది చాలా ఉందండి..అనుమతి తీసుకుని రాయాలి ఎప్పుడో..

మీ నాన్నగారి గురించి చదివి బాధ కలిగిందండి.పెద్దవాళ్ళు మనల్ని వదిలి వెళ్ళినా..వాళ్ళ ఆశీర్వాదాలు మనతోనే ఉంటాయి..అవే మనకు రక్ష.. ఈ టపా సందర్భంగా ఒక మహానుభావుని గురించి తెలుసుకునే అదృష్టాన్ని కలిగించారు.ధన్యవాదాలు..

తృష్ణ said...

మురళి: ఏమిటా మీరింకా రాయలేదూ..అనుకుంటున్నానండి..ధన్యవాదాలు.

@భాస్కర రామి రెడ్డి: థాంకూ థాంకూ..!

భాస్కర రామిరెడ్డి said...

మాయా గారు, నేనొక్క ఇ ని ఎ గా మారిస్తే మీరు రెండు వత్తులు తీసేసారే :)

కుడి ఎడమైతే పొరపాటో కాదో కానీ , ఉపకరణిలో స్పెల్లిన్గ్ చూడకుండా, అక్షరం మారితే పొరపాటేనండోయ్ !

Bhãskar Rãmarãju said...

నాన్నని అయ్యాక *నాన్నతనం*లో ఉన్న *తనం* గొప్ప కావచ్చు, బాధ్యత కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా కావచ్చు, తెలిసింది.
మానాన్న ఆత్మ నాలోనే ఉంటుంది ఎప్పుడూ...
పొద్దునపొద్దున్నే ఇలా సెంటీ చేసేసారు.

Bhãskar Rãmarãju said...

http://ramakantharao.blogspot.com/2009/02/blog-post_19.html

Padmarpita said...

ఎంతో హాయినిచ్చింది మీ టపా!!

తృష్ణ said...

@భాస్కర రామి రెడ్డి : "మాయా" నా?అదేం కొత్త పేరండి?ఇప్పటికే నాకున్న పేర్లతోనే పెద్ద కంఫ్యూషన్ ఎక్కువైపోయి నా పేరేదో నాకే తెలీట్లేదండి...!

తృష్ణ said...

@Praveen Rangineni :ఇందాకా బయట ఉండి ఎక్కువ రాయలేకపోయానండి.ప్రేమతో మనం వాళ్ళకోసం చేసే చిన్న చిన్న పనులు కూడా వాళ్ళని చాలా సంతొషపెడతాయి.. మీరు చాలా మంచి పని చేస్తున్నారు.

తృష్ణ said...

@ భాస్కర్ రామరాజు: మీ పోస్ట్ చాలా బాగుంది..మీరు రాసినట్లుగా "అమ్మ-నాన్న" అయ్యాకానే ఆ విలువ,బాధ్యత,గొప్పతనం మనకు తెలిసేది..!అలా తెలిసాకనే మనం కొల్పోయినదాన్ని(ఏదయినా ఉంటే) మన పిల్లలకు మనం అందివ్వగలం..

తృష్ణ said...

@padmaarpita:ఒక్కసారి చిన్నపిల్లనైపోయి నాన్నతో అలా షికారెళ్ళటం నాకూ చాలా హాయినిచ్చిందండి.

కొత్త పాళీ said...

sweet.

తృష్ణ said...

@కొత్త పాళీ: :)

సుభద్ర said...

తృష్టగారు,
మీ శర్ననవరాత్రి పోస్ట్ చుడటానికి వచ్చి మీ నాన్న గారి పోస్ట్ చదివాను.చాలా బాగు౦ది.
మా నాన్న గుర్తువచ్చారు.మా నాన్న కోనసీమ రైతు.తన అనే మాట నాన్న కి తెలియదు.
ఎప్పుడు తన ,నాన్నమ్మ,తతయ్య,తమ్ముళ్ళు,మేము ఇదే లోక౦.ఆపైనా పోల౦,నాన్నకి తన పోల౦లో ప్రతి చెట్టు ఎ౦తో అపురుప౦గా చుసుకు౦టారు.శివుడు తోడిదే ప్రప౦చ౦.జిన్నురు నాన్న గారి ప్రస౦గాలు వినట౦,సినిమాలు చుడట౦ చాలా ఇష్ట౦.ఈ మద్య సినిమాలు మానేశారు అనుకో౦డీ.లస్ట్ ఇయర్ ఈ టై౦కి ఇక్కడికి వచ్చి మూడు నెలలు ఉన్నారు.ఇ౦క నా వ్యవసాయ౦ చుసి పొ౦గిపోయారు.మ౦తెనవారి వ౦టలు వ౦డీ పెడితే తెగ ఆన౦దపడిపోయరు.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

నాన్న- ఈపదం కనిపించడంతోనే కళ్లు అక్షరాలవెంట పరిగెత్తాయ్. ఆతర్వాత నిజం చెప్పాలంటే భాస్కరన్న కామెంటుకోసం కిందకిజారాయి.

Unknown said...

మనుషులు బతికి వున్నప్పుడు వాళ్ళ విలువ మనకి తెలీదు . ముఖ్యం గా తల్లిదండ్రుల్ని take it for granted గా తీసుకుంటాం.యి రోజే పది ఏళ్ళ క్రితం చనిపోఇన నాన్న గారి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే మీ పోస్ట్ కనబడి ఆనందం వేసింది .వీడితో కాసేపన్నా మాట్లాడదామని వస్తే ఎప్పుడు ఏదో పనుల్లో బిజీ నే అనే వారు .ఇప్పుడు గిల్టీ గా అని పిస్తుంది మరింత క్వాలిటీ టైం నాన్నగారి తో స్పెండ్ చేసి వుండ వలసిందే అని .తను మా జీవితం లో అన్ని సౌకర్యాలు కలిపించి ,మేము మళ్లీ ఆయనకి తిరిగి ఇచ్చే టైం కి వెళ్లి పోయారు .మీరు చాల మంచి పని చేసారు నా ఇల్లు , పిల్లలు అని మీ ఇంట్లోనే వుండిపోకుండా parents దగ్గరికి వెళ్లి , మీ నెట్ బలహినతని అధిగమించి నాన్న తో వో మధుర జ్ఞాపకాన్ని మిగుల్చు కున్నందుకు .

తృష్ణ said...

@ రవిగారు: మీ వ్యాఖ్యకు సమాధానం రాసేసాననుకున్నాను.ఇప్పుడే చూసాను..

నిజమేనండి.ఒకోసారి మనుషుల దురమయ్యాకా కానీ కొన్ని విషయాలు అర్ధం కావు..
Thankyou for the visit.

కమల్ said...

ఏంటో..! "అందరి నాన్నలు ఒకలా ఉండరు.." అన్న ఐతే సినిమా కాప్షన్ నాకు సరిపోతుంది. మీరందరూ అదృష్టవంతులు...! కమల్.