వంటల పట్ల,కొత్త ప్రయోగాల పట్లా నాకు చాలా ఆసక్తి.నేను ప్రయత్నించిన కొన్ని ఆరోగ్యకరమైన వంటల రెసిపీలని ప్రతి వీకెండ్ లోనూ రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ వారం ఒక మంచి హేవీ టిఫిన్ తో మొదలుపెడుతున్నాను:
బ్రేడ్ తో చేసే ఇది ఒక హెవీ టిఫిన్.హెవీ అంటే కూర ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వెయ్యదు.దీని పేరు నాకు తెలీదు.మేము ముంబైలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ నాకు చెప్పింది. ఆవడలు ఇష్టమైన వారికి ఇది నచ్చుతుంది.
కావల్సిన పదార్ధాలు:
1 బ్రెడ్ ప్యాకెట్ (సాండ్విచ్ బ్రెడ్ అయితే బాగుంటుంది)
4,5 (పెద్దవి) ఉడికించిన బంగాళదుంపలు
చిలికిన పెరుగు 1/2లీటర్ (కొద్దిగా నీరు కలుపుకోవచ్చు)
కొత్తిమీర సన్నగా తరిగినది-1చిన్న కట్ట
నూనె - పోపుకి తగినంత
పోపు దినుసులు:ఆవాలు,మినపప్పు,సెనగపప్పు,జీలకర్ర,చిటికెడు ఇంగువ,కర్వేపాకు 2 రొబ్బలు
కారం ఇష్టమైనవారు కూరలొనూ,పెరుగులొనూ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు.
చేసే విధానం:
1)ఉడికించిన బంగాళదుంపలతో "పోపు కూర" చేసి పెట్టుకోవాలి.
2)బ్రేడ్ స్లైసులన్నీ ఏదన్న గుండ్రటి మూతతో రౌండుగా కట్ చేసుకోవాలి.
3)చిలికిన పెరుగులో పోపు వేసుకుని ,కొత్తిమీర చల్లి ఉంచాలి.(రైతా లాగ అన్నమాట)
4)ఒక గరిటెడు బంగాళాదుంపల కూరని ఒక్కో రౌండ్ స్లైసుకి అద్ది, దాన్ని తవా పైన కూర అడుగు వైపుకి వచ్చేలాగ 1నిమిషము ఫ్రై చేసి తీసేయాలి ఇలా...
5)ప్లేటులో పైన వైపు రౌండ్ బ్రేడ్ స్లైసు వచ్చేలాగ ఓ 4 అరేంజి చేసి,
వాటిపైన చిలికిన పెరుగు బ్రెడ్ ముక్కలను కవర్ చేసేలా వేసి,
పైన కొత్తిమీర చల్లుకోవాలి.ఇలా--
ఒక సంగతి:
బంగాళాదుంపలు తినకూడదన్నది ఒక అపోహ.మధుమేహం ఉన్నవారు తప్ప, మిగిలిన వాళ్ళందరూ తినదగిన పౌష్టికాహారం.ఉడికించిన వాటిల్లో కార్బోహైడ్రేట్స్,విటమిన్ బి,సీ,ఇంకా కొన్ని ప్రోటీన్లు ఉంటాయి. నూనెలో వేయించితేనే అది హానికరం.పప్పు దినుసుల్లో కన్నా ఎక్కువ తేమ బంగాళాదుంపల్లో ఉంటుంది,అందువల్ల పప్పుదినుసులలో కన్న తక్కువ కేలరీలు వీటిల్లో ఉంటాయి.ఉడికించిన బంగాళాదుంపముక్కలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నిమ్మరసం,కొత్తిమీర చల్లుకుని సాయంత్రాలు టీ టైం లో తినచ్చు.
అయితే,తొక్కతీసి ఉడికించినా,తొక్క బ్రేక్ అయ్యేలా ఎక్కువ ఉడికించినా వీటిలోని పోషకాలన్నీ నశిస్తాయి..
ఈ సంగతి నేనొక పుస్తకంలో చదివి తెలుసుకున్నది.
24 comments:
చాలా బాగుందండి ఈ టిఫిన్. ఇదివరకు నేను బ్రెడ్, ఆలు కర్రీ తో చేసేదాన్ని. కాని పెరుగుతో కూడ వెరైటీ ఉందని ఇప్పుడే తెలిసింది. తప్పకుండా ట్రై చేస్తాను. మీ ఇతర వంటల కోసం కూడా వైట్ చేస్తాను.
వచ్చే ఆదివారం ఇదే టిఫిన్ మా ఇంట్లో....కాస్త హెవీ కదా:)
ఓ చూస్తుంటే నే నోరూరి పోతోంది . చాలా బాగుంది.
మీరే ఏదైనా పేరు పెట్టేయండి .
nice recipe.useful information about potatoes and that teatime boiled potatoes salad is also nice.
సాయంకాలం స్నాక్స్ ఏమిచేయాలో చెప్పారు....చేసి కుమ్మేస్తాను:):)
బావుంది ..courier చెయ్యగలరా కాస్త హెవీ గా
ఈ వంటకం పేరు?
హెవీ టిఫిన్ చాలాబాగుంది.
దీనికి నేనో పేరు పెడుతున్నాను..
దహీ వడ లాగా దహీ పొటాటో బ్రెడ్ అంటే ఎలా వుంటుందంటారు?
ఇదేదో చూడ్డానికి చాలా బాగుందండీ.. ఎవరైనా చేసిపెడితే రెండో ఆలోచన లేకుండా తిని పెడతా :-) అన్నట్టు ఫోటోలు చాలా బాగున్నాయి.. మీరే తీశారు కదా? మొదటి ఫోటో ఐతే స్టవ్ ఆపేసి తీసి ఉంటారని డౌట్ :-) :-)
me bread avada chusthuntene noru vuruthundi,try chestha....
మొదటి వంటల పోస్ట్..ఎవరైనా చుసారో లేదో అనుకుంటూ ఇప్పుడే బ్లాగ్ తెరిచాను..హమ్మయ్య,అయితే నేను వారానికి ఒక వంటకం గురించి రాయచ్చు అని ధైర్యం వచ్చింది.
జయగారు,తప్పకుండా ట్రై చేయంది.చాలా బాగుంటుంది.నేను కూడా మరి ప్రతి వారం మీ వ్యాఖ్య కోసం ఎదురు చుస్తానేం?!
ధన్యవాదాలు.
పద్మగారు,అదరగొట్టేయండి మరి.
ధన్యవాదాలు.
@ మాలాకుమార్:"బ్రెడ్ ఆవడ" అని పెడితే ఎలా ఉంటుందంటారు?
@రవి కుమార్: ధన్యవాదాలు.
@సృజన:సాయంత్రం తయారు చేసారా?ఎలా వచ్చిందండి?
@ హరే కృష్ణ:రాయటం మర్చిపోయానండి..దీనిని చేసిన వెంఠనే తినేయాలి.లేకపోతే బ్రెడ్ కదా మజ్జిగలో నాని ముద్దలా అయిపోతుంది.
అందుకని కొరియర్ చేయటానికి అవ్వదు మరి :) :)
@ శ్రీలలిత: మాలా కుమార్ గారు అడిగారని పైన ఒక పేరు పెట్టాను "బ్రెడ్ ఆవడ" అని.ఎలాఉందండి? మీరు పెట్టిన పేరు కూడా బాగుంది.
@ మురళి:ఇంకేం మి శ్రీమతిగారిని వెంఠనే చేసేయమనండి.అందరికీ నచ్చుతుంది దీని రుచి.ఆ ఫొటోలు నేను తీస్తే పొయ్యి మీది వంటకం మాడిపొతుంది..మా మరిది సెల్లోంచి మావారు తీసిపెట్టారు పాపం :)
కానీ అవి మొబైల్లోంచి బయటకు రావటానికి నెల పట్టింది.బ్లాగ్లో పెట్టాలని నెల క్రితం బ్రెడ్ కొనుక్కొచ్చి చేసిన టిఫిన్ ఫొటొలకి ఇవాల్టికి మోక్షం వచ్చిందండి. :)
@ anagha: తప్పక ప్రయత్నించండి..
ఈ మొదటి రెసిపి టపాకి వ్యాఖ్యలు రాసిన అందరికీ మరొసారి ధన్యవాదాలు.
ఏవిటిది? నలభీములకు పోటీయా?
మగబ్లాగర్లు భాస్కరన్నకి, స్త్రీవాదబ్లాగర్లు హరితగారికి మద్దతివ్వాలని నేను విన్నవించుకుంటున్నాను.
అయితే వంటలు మాత్రం రెంటిలోనూ ఫాలో అవ్వాలండోయ్. మన కడుపు అదీ ఇదీ అనే బేధం ఉండదుగా?
నేను ప్రతి నెలా ఒక్కొక్క వంటని ఎలా తినాలో వర్ణిస్తా. నాకు తెలిసిందదే.
అధ్యక్షిణీ, ఈ రెసిపీ పట్ల నాకు చాలా అభ్యంతరాలున్నాయని తెలియజేసుకుంటున్నాను!
"ఉడికించిన బంగాళదుంపలతో "పోపు కూర" చేసి పెట్టుకోవాలి." - అన్నారు.
ఇదెట్లా చెయ్యడం అని నేణు ప్రశ్నిస్తున్నాను.
బంగాళదుంపలకి తొక్కు తియ్యాలా, కూడదా? తీస్తే ఉడక్క ముందు తియ్యాలా, ఉడికాక తియ్యాలా? .. ఇన్ని ప్రశ్నలు.
"బ్రేడ్ స్లైసులన్నీ ఏదన్న గుండ్రటి మూతతో రౌండుగా కట్ చేసుకోవాలి." - అన్నారు.
ఇదెట్లా? ఎల్లాంటి మూత వాడాలి? బ్రెడ్ స్లైసుల్ని నేలమీదనో, లేక తిన్నగా డైనింగ్ టెబుల్ మీదనో పెట్టలేము గదా? ఎక్కడ పెట్టి ఇలా కట్ చెయ్యాలి? గుండ్రంగానే ఎందుకు చెయ్యాలి, బ్రెడ్ స్లైసు ఉన్నది ఉన్నట్టు ఉపయోగిస్తే సరిపోదా? కట్ చేస్తే ఆ మిగిలిన స్లైసు భాగం వేస్టు కదా .. ఇన్ని ప్రశ్నలు.
ఇలాగే ప్రతీ స్టెప్పుకీ ఇంకా బోలెడు ప్రశ్నలు!!
@కొత్తపాళీ: మాష్టారు,మంచి ప్రశ్నలు వేసారు..
1)వంటకమూ నేనే చేసి ఫొటోలూ నేనే తీయాలంటే ఏదో ఒకటి పాడవటం ఖాయం.తయారి విధానాన్నంతా(బ్రెడ్ ముక్కలు కట్ చెయటం దగ్గరనుంచీ)ఫోటొలు తియ్యవయ్యా అంటే మావారు నేను తియ్యను ఫో..అనటం ఖాయం.అందుకని రెండు ఫొటొలతో కానిచ్చేసానండి.
2)బ్రెడ్ ముక్కలు ఆ పడంగా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు..కానీ ఇండియాలో చాలావరకూ సైడ్స్ మెత్తగా ఉండవు..పైగా రౌండ్ గా అయితే చూడటానికి అందంగా ఉంటుంది..అతిధులు వచ్చినప్పుడు మనం పదార్ధాన్ని దేనితో చేసాం అనేది తెలియనివ్వకుండా చెయ్యటం ఒక సరదా నాకు..
ఇక కట్ చెయ్యాలి అంటే కోసుగా ఉండే ఏ డబ్బా మూతో పనికి వస్తుందన్న సంగతి రాయాల్సిన అవసంలేదనిపించిందండి..
3)ఇక పోపు కూర అంటే కూడా అందరూ చేసుకునేదే కదా..కొత్తగా చెప్పేదేముంటుంది..ఇక్కడ అందరూ పాకశాస్త్ర ప్రవీణులనే తెలుస్తోంది.. అందుకని రాయలేదు..అయినా మీకు కావాలంటే..
బంగాళాదుంప పోపుకూర:
ఉడికిన బంగాళదుంప ముక్కలు ఇష్టాన్ని బట్టి తొక్కతో కాని,తొక్క తీసి కానీ ముక్కలు చిదపాలి.నేను పైన రెసిపీలో చెప్పిన పోపు దినుసులు,పచ్చిమిర్చి వేసుకుని,అవి వేగాకా పొటాటొ ముక్కలు అందులొ వేసుకుని,తగినంత సల్ట్,చిటికెడు కావాలంటే పసుపు వేసుకుని,3,4నిమిషాల తరువాత దింపేసుకోవాలి.
ఏమైనా "సీతతో ఇదంత వీజీ కాదన్నమాట"..!!
ఈసారికిలాక్కానిండి.నెక్స్ట్ వీక్ ప్రశ్నలు వేసే అవసరం రాకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను :) :)
@చైతన్య :ఇదేమన్యాయం?నోరారా తమ్ముడు అని పిలిచినందుకిదేనా నువ్వు చెయ్యాల్సినది? ఒక తమ్ముడే పోయి ఒక అక్క బ్లాగులో మరొకరి బ్లాగులకు మద్దతునివ్వమని కోరడం భావ్యమా?(తమిళ్ డబ్బింగు సినిమాల్లో తెలుగు డైలాగులిలాగే ఉంటాయి..తెలుసుగా)
నేను చహించను..చమించను..
అన్నగారితో పోటీయా?అంతటి ధైర్యమే?పొటీ పెట్టేట్టయితే కొత్తగా ఒక వంటల బ్లాగునే తెరిచేదాన్ని కదయ్యా!అయినా ఏరి అన్నగారు?మరీ నల్లపుసైపోయారు..అసలు బ్లాగువైపే తొంగి చూడటంలేదు...
నన్ను చాలా అపార్ధం చేసుకున్నారు. నాకు చాలా బాగా వంటొచ్చు. నేనీ ప్రశ్నలు వేసిన పరమార్ధం వేరే ఉంది. జనాలు అసలు రెసిపీలు ఎందుకు రాస్తారు? ఆల్రెడీ మీ అంత బాగ వంటొచ్చిన వాళ్ళకి, ఏదో కొంచెం వెరైటీ ఆలోచన ఇవ్వడానికి రాసినట్టు ఉంటాయి 99% రెసిపీలు. అసలు పొయ్యి ఎలా వెలిగించాలి, పోపంటే ఏంటి, బియ్యం ఎలా ఉడికించాలి, ఇలాంటి బేసిక్స్ కూడా తెలియని వారిని ఎవరూ దృష్టిలో పెట్టుకోరు. ప్రతి స్టెప్ కీ ఫొటోలు ఉండాలని కాదు, అనేక స్టెప్పుల వివరాలు మీ పాఠకులకి ఆల్రెడీ తెలుసు అన్న భ్రమలో రాస్తారు చాలామంది. మన రెసిపీల్లో ఇంకో గొప్ప లక్షణం ఏ వంట, ఏ స్టెప్పు చెయ్యడానికి ఎంత సమయం పడుతుందో చెప్పవు. రెసిపీ చదివి ఈజీగానే ఉంది అని మొదలు పెడితే, ఆ బంగాళ దుంపలు ఉడికేందుకే అరగంట పడుతుంది! రెసిపీలు రాసేప్పుడు ఇలాంటివన్నీ ఆలోచించాలని నా ప్రార్ధన.
@ కొత్తపాళీ: అయ్యో,అలాంటిదేమీ లేదండి..ఇవన్ని జెనరల్ వీవరాలు కదా,పైగా మరీ వివరంగా రాస్తే అవికూడా మాకు తెలియవా?నువ్వేనా వంటొచ్చిన దానివి?అని కూడా ఎవరైన ప్రశ్నించగలరు,అనుకున్నానండి. అంతే..అయినా మీరు చెప్పినది చాలా సరైన పోయింటు..అస్సలు వంట రాని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈసారి నుంచీ రాస్తాను.నా వ్యాఖ్యతో మిమ్మల్ని ఏమైన నొప్పించి ఉంటే క్షమించగలరు.
అన్నట్లు మరి మీ వంటని ఎప్పుడు రుచి చూపిస్తారు?
No hard feeligns at all. you're doing a fine job. carry on.
@కొత్త పాళీ:thankyou sir !!
ప్చ్!!
మీవారికి మరి తినిపించారా?
.....
....
...
..
.
ఇస్త్రీవాద బ్లాగరి హరితగారా? ఆవిడెవరు?
@ భాస్కర్ రామరాజు: మావారికి తినిపించక పొవటమా? మొదటి ప్రయొగాలు ఎప్పుడూ అక్కడే..:) :)
హరితగారు ఎవరా?ఇవాళ మీకింట్లో ఫుడ్డు దొరుకుతుందనేనా ఇంత సాహసం..?
నల్లపూసాలేదు, వెన్నపూసాలేదండీ, ఈ మధ్య జీవితం రోలర్కోస్టర్ ఎక్కినట్టైంది. పిల్లాడికి బడి, మనకి ఇత్తడి. దింపను, తీస్కొచ్చి ఇంట్లో దింపను, పనిలో సంస్థాగత మార్పులు అన్నీ మనవైపు వేళ్ళోకాళ్ళో చూపిస్తుంటాయ్, జవాబిచ్చుకోనూ బండి నెట్టుకురానూ..ఇలా ఉంది జీవితం. సందట్లో సడేమియా, పిల్ల అడుగులేస్తోంది, కళ్ళాజోళ్ళు పీకేసి వికటాట్టహాసం, గుర్రం సకిలించినట్టుగా సకిలిస్తోంది...
అదీ కధ
Post a Comment