సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, September 12, 2009

మెంతికూర సాంబారు

(ఫోటోలోని సాంబారు నేను చేసినది కాదు.అది మెంతికూర సాంబారు కుడా కాదు .)

ఈ వారం వంట -- మెంతికూర సాంబారు.
సాంబారు అందరూ చేసుకునేదే.కాని మెంతికూరతో సాంబారు చాలా బాగుంటుంది + ఆరోగ్యదాయకం.
మెంతికూరలో పోషకాలు:
1)దీనిలో potassium, calcium, iron వంటి మినరల్స్ ఉన్నాయి.
2)మెంతులు,మెంతికూర రెండూ శరీరానికి చలవ చేస్తాయి.
3)అరుగుదలను పెంచుతాయి.
4)రాత్రి పూట ఒక స్పూను మెంతులు మింగి పడుకుంటే,కాన్స్టిపేషన్ సమస్య ఉంటే;మెంతుల్లో ఎక్కువ శాతం ఫైబర్ ఉండటం వల్ల పొద్దుటికి సర్దుకుంటుంది.
5)పాలిచ్చే తల్లులకి పాలు పెంచుతాయి.
6)మధుమేహాన్ని అదుపు చేయటంలో కూడా ఉపయోగపడతాయి.
7)కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

సాంబారుకి కావాల్సిన పదార్ధాలు:
(ఇది ఐదారుగురికి సరిపోయే సామగ్రి)
* కందిపప్పు :3/4కప్పు
* సన్నగాతరిగిన మెంతికూర :1 కట్ట,చిన్న మెంతి అయితే 2 కట్టలు

(ఆకుకూర తరగకుండా రెండుమూడుసార్లు బాగా కడగాలి.తరిగాకా కడిగితే పొషకాలు ఉండవు.)
*సన్నగా పొడుగా తరిగిన పెద్ద ఉల్లిపాయ :1(చిన్నవి అయితే 2 )
*పచ్చిమెరప :2 or 3 (తినే కారాన్ని బట్టి)
*ఎండుమిర్చి :1
*చింతపండు పెద్ద నిమ్మకాయంత
*నెయ్యి 2 tsps
(చారులోకి,సాంబారులోకి పోపు నెయ్యితో వేసుకుంటే మంచి రుచి వస్తుంది)
*బెల్లం తరుగు 1 tsp (వద్దనుకుంటే ఇది మానేయచ్చు)
*సాంబారు పౌడర్ 2 1/2 tsps
* ఉప్పు 2 tsps(కావాలంటే తగ్గించుకోవచ్చు)
*ఆవాలు 1 tsp
*జీలకర్ర 1/2 tsp
*ఇంగువ 1/4 tsp
(*మెంతికూర వెయ్యని మామూలు సాంబారు పోపులో మెంతులు కూడా నేనైతే వేస్తాను)

మెంతికూర సాంబారు తయారీ :
1) రెండున్నర కప్పుల నీటితో పప్పుని చిటికేడు పసుపు(ఇలా వేయటం వల్ల పప్పుకి మంచి రంగు వస్తుంది,పసుపు ఆరోగ్యకరం కూడా) వేసి,ఒక గిన్నెలో మూత పెట్టి,కుక్కరులో ఉడికించుకుని,మెత్తగా పేస్టులా మాష్ చెసి పెట్టుకోవాలి.
2 ltrs ఉన్న బుల్లి కుక్కరులో అయితే డైరెక్ట్ గా పప్పు పెట్టేసుకోవచ్చు.
2)చింతపండుని 1 1/2 కప్పుల నీటిలో నానబెట్టి ,రసం తీసుకుని,వడబోసుకుని ఉంచుకోవాలి.
3)వెడల్పాటి kaDaiలో లేదా లోతున్న నాన్స్టిక్ పాన్ లో నెయ్యివెసి,ఆవాలూ,జీలకర్ర,ఇంగువ,ఎండు మిర్చి వేసి పోపు వేసుకోవాలి.
4)తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 2,3 నిమిషాల తరువాత సన్నగా తరిగిన మెంతి ఆకు వేసి వేయించాలి.
5)మెంతికూర వేగాకా మంచి వాసన వస్తుంది.అప్పుడు స్టవ్ ఆపేసి,వేగినదంతా వేరే ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి.
అదే ముకుడులో చింతపండు రసం,ఉప్పు,బెల్లం తరుగు వేసి మరగనివ్వాలి.
6)చింతపండు రసం తాలూకూ పచ్చివాసన పోయాకా,మెత్తగా చేసి పెట్టుకున్న పప్పు,సాంబార్ పౌడర్ వేసి బాగా కలపాలి.(సాంబార్ పౌడర్ ముందుగా కాస్త అర కప్పు చన్నీళ్లలో కలుపుకుని అప్పుడు వేసుకుంటే పౌడర్ ఉండలు కట్టకుండా ఉంటుంది)
7)తరువాత ఇందాకా వేయించి ఉంచుకున్న మెంతి ఆకుని ,ఉల్లిపాయ ముక్కలని అందులో కలుపుకోవాలి.
8)తగినన్ని నీళ్ళు కలుపుకోవచ్చు అవసరాన్ని బట్టి.సాంబారు చిక్కబడినట్టు అనిపించాకా దింపేసుకోవటమే.

ఇది అన్నంలోకీ,చపాతిల్లోకీ కూడా బాగుంటుంది.


14 comments:

మురళి said...

చపాతీ లోకి సాంబార్ మొదటిసారి వింటున్నానండీ.. అయినా మీరు ఇలా మిలియనీర్స్ కి మాత్రమే అందుబాటు లో ఉండే దినుసులతో (కందిపప్పు) వంటకాలు వర్ణిస్తే, సామాన్యులు ఏమైపోవాలి చెప్పండి? :-)

మరువం ఉష said...

will try it today ;) thanks for sharing. I eat the menti/fenugreek sprouts [home made] and eat them by soaking in curds/yogurt early in the morning [soaked from previous night]. And recently watched my cousin pouring a handful of the dry seeds in to her daughter's mouth who complained of stomach pain. Looks like menti season. ;)

జయ said...

బాగుందండి. మొన్నటి 'బ్రెడావడలు ' ఇప్పటి 'మెంతి సాంబారు ', చాల వెరైటీలే చూపిస్తున్నారు. ఈ సారి రైస్ తోటి ఏమన్నా చెప్పండి. అన్నీ కలిపి మంచి కాంబినేషన్ లో మొత్తం సెట్ అంతా ఒక రోజు చేసుకోవచ్హు.

తృష్ణ said...

@ మురళి : పెళ్ళయ్యేదాకా నాకు తెలీదండి చపాతిలో సాంబార్ తింటారని..కానీ మెంతికూర సాంబార్ మాత్రం దాదాపు15ఏళ్ళనుంచీ చేస్తున్నాను.

ఇక కందిపప్పు సంగతి....అందరిదీ అదే పరిస్థితి.జీడిపప్పులా వాడాల్సి వస్తోంది కందిపప్పుని..!!రొజూ కందిపప్పు వండే నేను; 2రోజులకోసారి కందిపప్పు,ఒకరొజు ఎర్రపప్పుతో,ఒక రొజు పెసరపప్పుతొ పప్పు వండుతున్నాను.. :) :)
నాకు 20ఏళ్ళు ఉన్నప్పుడు నుంచి ఇంట్లోకి సరుకులు నేనే తెచ్చే అలవాటు..అప్పటి రేట్లకీ ఇప్పటి రేట్లకీ ఎంత వ్యత్యాసం వచ్చేసిందో తల్చుకుంటేనే ఆశ్చర్యం వేస్తుందండి..

తృష్ణ said...

@ ఉష:పచ్చి మెంతులు మింగటం నా చిన్నప్పటి నుంచీ మా ఇంట్లో చుస్తూన్నానండి..

దాదాపు5,6 రకాల sprouts తినే అలవాటు నాకు ఉందండి...వాటితో సలాడ్స్,గట్రా ప్రయోగాలు చేస్తూ ఉంటాను.చిన్న మెంతి బాగా వాడతానండి నేను.మిరు చెప్పిన మజ్జిగలొ మెంతులు రాత్రి నానబెట్టి,పొద్దున్నే రుబ్బుకుని తలకు పెట్టుకునేది నా స్నేహితురలు.అయితే నేనూ అలా తినే ప్రయత్నం చేస్తాను..మంచి సంగతి చెప్పారు.థాంక్స్.

Bhãskar Rãmarãju said...

లేత మెంతాకులు - తరగాల్సిన పనిల్యా.
మంతాకు ముదురుది సాధారణంగా వంటకి వాడరు. కానీ మాలాంటి కిచకిచ ప్రదేశాల్లో దొరికిందే అమృతం.
తిర్గ్స్మాత్స్ లో నెయ్యి[రుచికోసమైనా??] అవసరమా అద్దెచ్చా?
సాంబార్ పౌడర్ ఏది? యంటీఆర్??

[ఇవి కేవలం ఏదో పట్టేసా అని చెప్పటం కోసమే!! మంచి వంటాకాన్ని అందించారు. ఇక మేము స్కూలు మూసేస్కోవచ్చనుకుంటా, నలభీమకి సపోర్ట్ ఎతుక్కోవాల్సొచ్చేలా ఉంది]

తృష్ణ said...

@jaya: @జయ:ధన్యవాదాలండి..బావుంది మీ ఐడియా. ఈసారి వికెండ్లో రైస్ రెసిపి ట్రై చేస్తాను.

తృష్ణ said...

@ భాస్కర్ రామరాజు:
1)అయ్యా,ఇక్కడ మాదగ్గర ఆకు కనబడితే "ఏమిటీ గడ్డి?"అని ప్రశ్నించే మనుషులు ఉన్నారండి..అందుకని అన్ని ప్రత్యామ్న్యాయాలూ రాస్తున్నాను.మొత్తం ఆకేంటి అసలు కొత్తిమీర కాడలతొ మా ఇంట్లో(పుట్టింట్లో) వండుకుంటాము,గోంగూర తరగకుండా నేనూ మా అన్నయ్యా పచ్చడి చేస్తాము.అది సూపర్..!!

2)పోప్స్ కోసం "నెయ్యి" అభ్యంతరమైతే ఉందిగా "నూనె"..ఇంకేంటి బెంగ?!
అది నే రాయకపొయినా పర్లేదు.

3)ఇక మెంతాకు ముదురుదైనా సన్నగా తరిగి వేయిస్తే అదే బాగుంటూంది.లేతది దొరికితే పండగే.

4)సాంబార్ పౌడర్ "ఎం.టీ.ఆరా?"
ఎంతమాటన్నారు?ఇది నా వంటతనానికే అవమానం.నేను ఇంట్లో 'షుభ్భరంగా' తయారు చేసుకుంటాను కానీ.సాంబార్ పౌడర్ కొననే కొనను.
ఎవరికి నచ్చిన పౌడర్ వాళ్ళు వాడుకుంటారని అది రాయలేదు.

5)ఇక నలభీములకు పొటీ ఏమిటి..అంత ధైర్యం లేదు!ఇక్కడ నాకు మా అన్న ఉన్నాడు కదా,వాడితొనే నే పోటీ పడలేను..

స్వర్ణమల్లిక said...

త్రుష్ణ గారూ,
చాలా బాగుందండీ మీ మెంతి సాంబారు. నాకు మెంతి కూర అంటే చాలా ఇష్టం. రక రకాలుగా తింటూ ఉంటాను. కానీ ఇది చాలా వరైటీగా ఉంది. అన్నట్టు మీ బ్రెడ్ ఆవడలు మొన్న గురువారం ట్రై చెసాను. సూపర్ గా ఉంది అన్నారు మావారు. చాలా బాగా కుదిరాయండీ. ఈజీ గానె ఉంది చెయ్యడం కూడా. ఈ సాంబారు కూడా ఈ వారం చేసి చూస్తాను.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

చపాతీలోకి సాంబారు వాడటం మాఇంట్లో అలవాటే. కొంచెం పులుపు ఎక్కువ చేస్తే బావుంటుంది.
మా అమ్మచేస్తే వీధి చివరికి వస్తుంది వాసన. మేము కొంతకాలం వేరేఊర్లో ఉన్నాం. మా పైపోర్షనులో ఉండే 'ఆంటీ' వాసనకి మెట్లపైన దొల్లుకుంటూ వచ్చింది

తృష్ణ said...

@uma:thankyou.

తృష్ణ said...

చైతన్యా,నేను పులుపు,కారం,ఉప్పు అన్నీ తక్కువే వాడతాను.

అదేదో సినిమాలో సూర్యాకాంతంగారు అంటారు "నేను కానీ పోపు పెడితే..వీధి వీధంతా ఘుమఘుమ లాడాల్సిండే .." అని.అలాగన్నమాట మీ అమ్మగారు.
గొప్పకాదు కానీ నేను కూడా సాంబార్ చాలా బాగా చేస్తాను.నాకు "సాంబార్ స్పెషలిస్ట్" అని పేరు!

Vidya Sagar said...

telugu lo type cheyadam elaga?

తృష్ణ said...

@vidya sagar:
go to "http://lekhini.org" and save it in your PC.or download it.you can see the typing procedure there.
Its very easy.
thankyou for the visit.