సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Thursday, September 10, 2009
ఒకోసారి...
ఒకోసారి...
...గెలుపు కన్నా ఓటమే స్ఫూర్తినిస్తుంది
...ప్రశంస కన్నా విమర్శే ఉత్తేజాన్నిస్తుంది
...వెలుగు కన్నా చీకటే బాగుందనిపిస్తుంది
ఒకోసారి...
...పరిచయంలేని అపరిచితుల వద్దే మనసు విప్పాలనిపిస్తుంది
...సమాధానం కన్నా చిరునవ్వే చాలనిపిస్తుంది
...కళ్ళు మూసుకుని గుడ్దిగా నమ్మాలనిపిస్తుంది
ఒకోసారి...
...కొన్ని గతాలకు మరపే ముగింపనిపిస్తుంది
...నిట్టూర్పులో కన్నీరే తోడనిపిస్తుంది
...మనుషుల సాంగత్యం కన్నా ఒంటరితనాన్నే మనసు కోరుతుంది
ఒకోసారి...
...నిజం కన్నా అబధ్ధమే వినాలనిపిస్తుంది
...వేదనలో హాయికై వెతకాలనిపిస్తుంది
...మాటల కన్నా మౌనమే మేలనిపిస్తుంది...!!
Subscribe to:
Post Comments (Atom)
28 comments:
ఒకోసారి
...అంతరంగ తరంగాలు వినాలనిపిస్తుంది
...మీ ప్రయాణ కబుర్లు చదవాలనిపిస్తుంది
...ఒక్కసారి ఈ కవితే చాలనిపిస్తుంది
కానీ...ప్రతీ సారీ మీరు రాసే టపా చదవాలనిపిస్తుంది. చాలా బాగుందండి. సూపర్బ్.
కధైనా, కబుర్లు చెప్పినా, కవిత్వమైన మీరు వ్రాసింది
నాకు భలే నచ్చేస్తుంది.....:) :)
Too good
బాగా రాసారండీ..
I agree. :)
ఏకీభవిస్తున్నా మీతో...
@భాస్కర రామి రెడ్డి: అమ్మో..భలే చెప్పారే...నిన్న మీ కవిత చూసానండి..వ్యాఖ్య రాసేలొపు మా అమ్మాయి వచ్చి కదిపేసింది..ధన్యవాదాలు.
@ ప్రణీత.స్వాతి :చదువుతూ ఉండండి మరి..ధన్యవాదాలు.
@ పద్మార్పిత :నాకు మీ కవితలు నచ్చినట్లు..కదా..!!
ధన్యవాదాలు.
లక్ష్మి: థాంకూ థాంకూ...
@ శేఖర్ పెద్దగొపు: ధన్యవాదాలు.
@ అరుణ పప్పు: ధన్యవాదాలు.
@ మురళి:ధన్యవాదాలు.
very ncie
నాకు కూడా ధన్యవాదాలు రాసేస్కోండి
ఒక్కోసారి
....ఆపీస్లో నిద్రపోవాలనిపిస్తుంది
....ఇంట్లోకి కారెత్తుకెళ్ళి పార్క్ చెయ్యాలనిపిస్తుంది.
....గుంటూరెళ్ళి మిర్చీబజ్జీ కరకర నమిలేయాలనిపిస్తుంది.
ఒక్కోసారి
....ఛీ దీనెమ్మ ఎదవజీవితం, ఓ నలుగెకరాలు పొలం సేస్కుందాం అనిపిస్తుంది
....ఓనాలుగు బర్రెల్ని మేముకుందా అనిపిస్తుంది.
బాగారాసాదండీ..ఇది రొటిను
నెను బాగాసిన్నా? అనేది ఎరైటి.
:):)
ఎంజాయ్ యువర్ డే
ఒకోసారి? లేక ఒక్కోసారి?
@ కొత్తపాళీ : ధన్యవాదాలు.
@చైతన్య: :) :)
@ భాస్కర్ రామరాజు: నమస్తే సారూ...!కొత్తగా ఇన్ని కామెంట్లెవరా అని చుస్తూన్నా..
అది "ఒకోసారి.." అంటే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది అని.
"ఒక్కసారి" అంటే..ఒక్కసారే అలా అనిపిస్తుంది అని కదండి..?!
సమాధానం తెలిసీ కావాలనే పరీక్షిస్తూ ఉంటారేమో అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు...hmmm !
నా కవిత కన్నా మీ వెరైటీ కవిత ఇంకా బాగుంది..అచ్చేసేయండి మరి.
ఒక్కోసారి, ఒకొసారి - వాడుక భాష, స్లాంగ్ అంతే.
ఒక్కసారి = ఒకే ఒక్కసారి.
@ భాస్కర్ రామరాజు: ఇందాకటి జవాబు రాసేప్పుడు నేను పొరబడ్డానండి.మీరు రాసినది కరక్టే.
బాగా రాసేరు తృష్ణ
@bhaavana:thankyou..!
good one
@హరే కృష్ణ :thankyou.
Nice one...
Bale raasaaru andi meeru
నేను మీ బ్లాగుకి కొత్త అండి
నాకు మీ బ్లాగు చాలా బాగా నచ్చింది.
@ karthik:thankyou verymuch.
నాక్కూడా ఒకోసారి ఇలాగే అనిపిస్తుంది.. చక్కగా రాసారు! :)
బాగా రాసారండీ..
Post a Comment