సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, September 14, 2009

దంపుడు బియ్యం

ఆరోగ్య సూత్రాలు పాటించటంలో నేను కొంచెం చాదస్తురాలిననే చెప్పాలి.ఆరోగ్య సూత్రాలు ఎక్కడ కనిపించినా చదివి పాటించేస్తూ ఉంటాను.దాదాపు సంవత్సరంన్నర క్రితం యధాలాపంగా కొన్ని ఆరోగ్యపరమైన వెబ్సైట్లను చదువుతూంటే నాకు దంపుడు బియ్యం(brown rice)గురించి తెలిసింది.రాత్రులు చపాతీలు తినటం మాకు బొంబాయిలో అయిన అలవాటు.దంపుడు బియ్యం ఉపయోగాలు తెల్సుకున్నాకా ,పొద్దున్నపూటలు "వైట్ రైస్" బదులు "దంపుడు బియ్యం" తినటం మొదలుపెట్టాము.ఇంట్లో మిగిలినవారు వైట్ రైస్ తిన్నా,మావారి సహకారం వల్ల మేమిద్దరం మాత్రం ఉదయం దంపుడు బియ్యమే తింటాము.బరువు తగ్గటానికి ఇది చాల ఉపయోగపడుతుంది.రుచి కొంచెం చప్పగా ఉండటంవల్ల మొదట్లో ఇబ్బంది పడ్డా ఇప్పుడు అలవాటైపోయింది.కాకపోతే వారానికి ఒకరోజు "వైట్ రైస్" వండుతాను.దంపుడు బియ్యం గురించిన నేను తెల్సుకున్న కొన్ని వివరాలను ఇక్కడ తెలుపుతున్నాను.ఇది వారానికి నాలుగు రోజులు తినగలిగినా మంచిదే.

దంపుడు బియ్యం అంటే:
ధాన్యాన్ని పొట్టు తిసి,పొలిష్ చేసి వైట్ రైస్ గా మారుస్తారు.ఆ ప్రోసెస్ లో దానిలోని పోషకాలన్నీ చాలావరకూ నశించిపోతాయి.బియ్యాన్ని పోలిష్ చే్సే ప్రక్రియలో విటమిన్ B3లోన 67%,విటమిన్ B1లో 80%,విటమిన్ B6లో 90%,60% ఐరన్,సగం manganese,సగం phosphorus, మొత్తం డైటెరీ ఫైబర్ ,మిగతా అన్ని అవసరమైన "ఫాట్టీ ఆసిడ్స్" నశించిపోతాయి.వైట్ రైస్ లో విటమిన్ B1, B3, ఐరన్ ఉన్నా , పైన పేర్కొన్న nutrients అన్నీ పొలిష్,మిల్లింగ్ ప్రక్రియ వల్ల పోతాయి.


అదే
ధాన్యాన్ని పై పొట్టు(హస్క) మాత్రమే తీసినదాన్ని "దంపుడు బియ్యం" (బ్రౌన్ రైస్ ) అంటారు.పై పొర మాత్రమే తీయటంవల్ల దానిలోని పోషకాలన్నీ అలానే ఉంటాయి.శరీరానికి కావాల్సిన 14% DV(daily value) ఫైబర్ ను అందించటంతో పాటూ,ఒక కప్పు దంపుడు బియ్యంలో 88% manganese,మరియు 27.3% DV ఉండే selenium,Magnesium అనబడే ఆరోగ్యకరమైన మినరల్స్ కూడా ఉంటాయి.
manganese శరిరంలోని నాడీ వ్యవస్థ శక్తిని పెంచుతుంది.అంతేకాక ఎంతో ఉపయోగకరమైన కొన్ని ఏంటీఆక్సిడెంట్లని తయారుచేయటంలో శరీరానికి ఉపయోగపడుతుంది.
selenium అనేది శరీరమెటబోలిజంకి ఉపయోగపడే చాల రకాలైన సిస్టంలకి మూలమైనది. కేన్సర్, గుండెపోటు, ఆస్థ్మా,ర్యూమెటోయిడ్ ఆర్థరైటిస్ మొదలైన జబ్బులను నిరోధించే శక్తిని శరిరానికి ఈ selenium అందిస్తుంది.
Magnesium కండరాలను,నరాలనూ రిలాక్సింగ్ కీ,ఎముకలను గట్టిపరచటానికీ,రక్త ప్రసరణ సాఫిగా సాగిపోవటానికీ ఉపయోగపడుతుంది.

ఇవే కాక దంపుడుబియ్యం తినటం వల్ల ఉన్న మరికొన్ని ఉపయోగాలు:

* బరువు తగ్గించుకోవటానికి ఉపయోగపడుతుంది.
* దంపుడు బియ్యం మన శరీరంలోని LDL (bad) cholesterol ను తగ్గిస్తుంది. అందుకే "రైస్ బ్రాన్ ఆయిల్" కూడా మిగతావాటికంటే మంచిది అంటారు.(ప్రస్తుతం నేను అదే వాడుతున్నాను.)cardiovascular healthకు ఈ నూనె చాలా మంచిదని శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.
* ఎక్కువ శాతం కొలెస్ట్రోల్, హై బ్లడ్ ప్రషర్ మొదలైన లక్షణాలున్న మెనోపాజ్ దశ దాటిన మహిళలకు దంపుడు బియ్యం తినటంవల్ల ఆరోగ్యం చాలా మెరుగు పడినట్లు సమాచారం.
* American Institute for Cancer Research (AICR) వారి ఒక రీసర్చ్ ప్రకారం whole grains లో antioxidants ను ఉత్పత్తి చేసే phytonutrients ఉంటాయి.అవి శరిరంలో cancer-fighting potential ను,రోగనిరోధక శక్తిని పెంచుతాయి.పరిశోధనల ప్రకారం గోధుమల్లో 77% , ఓట్స్ లో 75%, దంపుడు బియ్యంలో 56% anitioxident activity ఉంటుంది. whole grains లో fat, saturated fat, and cholesterol తక్కువశాతాల్లో ఉండటం వల్ల గుండె జబ్బులను,కొన్ని రకాల కేన్సర్లను నిరోధించే శక్తి వీటిల్లో ఉంది.
* దంపుడు బియ్యం తినేవారికి type 2 diabetes వచ్చే అవకాశాలు కూడా తక్కువ.

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చదివాకా ,రుచి కొంచెం చప్పగా ఉన్నా మేము మాత్రం రోజూ ఇదే తినాలని నిర్ణయించేసుకున్నాము.కాకపోతే సరైన దంపుడు బియ్యాన్ని సిటీల్లో వెతికి కొనుక్కోవాలి.కొన్ని సూపర్ మార్కెట్లలో బాగా పొట్టు తీసేసిన దంపుడు బియ్యాన్ని అమ్ముతూ ఉంటారు.అలాటిది తిన్నా ఒకటే,తినకపోయినా ఒకటే.హోల్ సేల్ షాపుల్లో మంచి రకం దొరికే అవకాశం ఉంది.మేము కొనటం మొదలెట్టినప్పుడు కేజీ ఇరవై రూపాయలు ఉండేది.ఇప్పుడు కేజీ నలభైకి చేరుకుంది..!అయినా ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరి !!

15 comments:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

మంచి విషయం చెప్పారు. ధన్యవాదములు. మంతెన గారి మాట విని నేను కూడా దంపుడు బియ్యానికి మారాను. కాకపొతే కిలో 40/- :(

శ్రీలలిత said...

తృష్ణగారూ,

మేమూ పగటిపూట దంపుడుబియ్యమే తింటాము. రాత్రి హోల్ వీట్ బ్రెడ్ ఏదైనా కూరతో తింటాము. అలా తినడం మంచిదని అందరూ చెప్పారని తింటున్నాము తప్పితే అందులో పోషక విలువలు మీరు వ్రాసినది చదివాక తెలిసింది. చక్కటి విషయం చెప్పారు.

నాగప్రసాద్ said...

మంచి సమాచారం అందించారు. ధన్యవాదములు.

దంపుడు బియ్యం సంగతేమో కాని, చిన్నప్పుడు మిషన్‌లో అంతగా పొట్టుతీయబడని బియ్యాన్ని ఇష్టంగా తినే వాళ్ళం. అది ఎరుపురంగులో ఉండేది. చాలా తియ్యగా ఉండేది. మా సైడు దానిని శనింగి బియ్యం అంటారనుకుంటా.

మళ్ళీ చెన్నైకొచ్చాక, కేరళ వాళ్ళు అటువంటి బియ్యాన్ని రైస్‌గా వండుకొని తినడం చూశాను.

తృష్ణ said...

@ Venkata Ganesh. Veerubhotla :
ఐతే మిరు మా పార్టీనే అన్నమాట! మేము దం.బి.తినటం మొదలెట్టాకా ఎవరో అడిగారండి "మంతెన 'గారి ప్రోగ్రాం చూసా?" అని...కాదు ఎక్కడో చదివి మంచిదని మొదలెట్టామని చెప్పా వాళ్ళకి.

తృష్ణ said...

@శ్రీలలిత: "హోల్ వీట్" బ్రెడ్ నేను ఒకొరొజు "సేండ్ విచ్" చేసి,టిఫిన్ కు వాదుతు ఉంటానండి..
seven grains తొ ఒక బ్రెడ్ వస్తొంది చూసారా? అది కూడా బాగుంటుంది.

తృష్ణ said...

@నాగప్రసాద్: కేరలైట్స్ ఎక్కువ తినే ఈ "red rice" లో కొద్దిగా నీరు ఎక్కువ పడుతుంది.ధాన్యం "పార్ బోయిల్" చేసాకా ఔటర్ లేయర్ తీసేసే రైస్ ఇది.అది కూడా మంచిదే.బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది.

సుభద్ర said...

మీరు నా బడెనన్న మాట!మా మేష్టారు మా నాన్నరే ,మా ప్రిన్సి పాల్ మ౦తెన వారు.
ఇ౦కా మీ పాఠాలు ఇలా మాతో ప౦చుకో౦డీ.ప౦చెకొద్ది పెరుగుదీ మీ ఆరోగ్య౦,ఎలాగ౦టే మాకు తెలిసినవి లలితగారిలా మేము కామె౦టుతా౦ కదా!
నాకు చిక్కడ౦ స౦గతి తెలియదు కాని థైరాయిడ్ క౦ట్లోల్ అవుతు౦ది నా స్వానుభవ౦

Bhãskar Rãmarãju said...

ఇదెంటి ఇంత ఘోరం. మంతెన చెప్తేకానీ తెలియదా జనాలకి దంపుడు బియ్యం గురించి. చొచ్చొచ్చొ..
దంపుడుబియ్యం గురించి బడి పుస్తకాల్లో లేదా?
ఔన్లే, ఆంగ్ల మీడియంలో సతికేవాళ్ళకేంతెలుసుద్ది.

తృష్ణ గారు -
నేను బియ్యం మానేసా. తిన్నా, బాస్మతి తింటా. అదీ రా రైస్. డైరెక్ట్ గా తినకుండా, రాగిజావలో ఓ రెండు గుప్పిళ్ళు ఈ ముతక బియ్యం వేస్కునిమరీ లాగిస్తా.
శ్రీలలితగారు - మీరు ఒకసారి నా పోస్టు చూడండి http://nalabhima.blogspot.com/2009/05/blog-post.html
ఏంఇ తినాలి, ఎలా తినాలి అనేది ఓ పెద్ద రాకెట్ సైన్సేంకాదు. మన పెద్దలు చెప్పిన పద్ధతులు పాటిస్తే సరి.
తృష్ణ గారూ -
పార్బాఇల్డ్ రైస్ కూడా మంచిదే. స్టికీస్టికీగా ఉండే రైస్ మంచిది కాదు అనగా జాస్మిన్ రైస్ లాంటివి. మనోళ్ళు మనబియ్యం ఖరీదని ఈ మధ్య థాయ్ బియ్యం కొంటున్నారు.

తృష్ణ said...

@ భాస్కర్ రామరాజు: డెలివెరీ టైంలో పెరిగిన బరువు తగ్గటానికి నేనూ అప్పట్లో ఓ 6నెలలు రైస్ మానేసాను.నా సొంత మేనేజ్మెంట్ తో 8,9 నెలలలో పెరిగిన బరువంతా తగ్గించేసాను.
ఇప్పటికీ నేనూ వారానికి రండు మూడు రోజులు గోధుమన్నం వండేసుకుంటూ ఉంటాను,మావారికి దం.బి.వండేసి.
గ్రిన్ టీ తో ఓట్స్ ఉప్మా లేక స్ప్రౌట్స్, నా మధ్యాహ్న్నం తిఫిన్(ఒకవేళ తింటే).

చపాతి పిండిలో రాగి,జొన్న,సోయాబీన్ పిండిలను కలుపుతాను.
మీరిచ్చిన లింక్ నేను అదివరకూ చూసానండి.
బాగుందండి.రకరకాల ఆరోగ్యకరమైన తిళ్ళూ,ప్రయోగాల గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు మహా ఉత్సాహం వచ్చేస్తుంది...!!

తృష్ణ said...

@ సుభద్ర: అయితే మనం మనం ఒక జట్టే..!!
మంతెనగారు ప్రిన్సిపాల్ అంటే అర్ధం కాలేదండి?

Bhãskar Rãmarãju said...

@నాగయ్య (నాగప్రసాద్)
>>బియ్యాన్ని రైస్‌గా వండుకొని తినడం చూశాను.
బియ్యాన్ని రైస్ గా వండుకునేదేందీ? పేపరు కాయితకం, సైడుపక్క లాగా...

భావన said...

మంచి ఇంఫర్మేషన్.

Vinay Chakravarthi.Gogineni said...

బాగుంది.మంచి రీసెర్చ్ చేసినట్లున్నారు. ఈ మధ్య వంటల మీద రాస్తున్నారేంటి.

తృష్ణ said...

రిసర్చ్ ఏమీ లేదండి.ఇది నా హాబీ.చిన్నప్పటి నుంచీ నెను కలక్ట్ చేసిన ఆరోగ్య సంబంధిత పేపర్ కట్టింగ్స్ తొ పెద్ద లావాటి బైండ్ పుస్తకమే ఉంది నా దగ్గర.బ్లాగు కోసం ప్రత్యేకంగా రీసర్చ్ చేయాల్సిన అవసరం నాకు లేదు.

నా బ్లాగు రొజూ చుసేవారికి నేను ఏ ఏ విషయాల గురించి రాస్తానో తెలుస్తుందండి.

నేను వారానికి ఒక రోజు ఆరోగ్యకరమైన వంటల గురించి రాయటం మొదలెట్టి రెండు వారాలైంది.

thankyou verymuch for your visit.

Dr.sivababu said...

బాగా వ్రాశారండీ! మీకు పనికొచ్చే విషయాలు కొన్ని ఉంటాయనుకుంటున్నా. ఒకసారి http://www.prajarogyam.blogspot.com చూసి మీ అభిప్రాయాన్ని అక్కడ వ్యాఖ్యానించాల్సిందిగా కోరుతున్నాను.
డా.శివబాబు,జనవిజ్ఞానవేదిక,జహీరాబాద్