సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, September 20, 2009

ఈ వారం వంట -- క్యాబేజీ పచ్చడి

మా ఇంట్లో అన్నంలోకి పప్పు,కూర,చారుతో పాటు రోజూ ఏదో ఒక పచ్చడి(పొద్దున్న పచ్చడి,రాత్రి అయితే పెరుగు పచ్చడి) చేసేది మా అమ్మ.ఎందుకంటే మా ఇంట్లో ఆవకాయలు గట్రా తినటం చాలా తక్కువ.అన్ని రకాల ఆకుకూరలతో,కూరలతోనూ పచ్చళ్ళు చేసేది.వాటిల్లో ఒకటి -- క్యాబేజీ పచ్చడి.

క్యాబేజీ లోని పోషకాలూ,ఉపయోగాలు:
* క్యాబేజీలో క్రొవ్వు,కొలెస్ట్రాల్ రెండూ తక్కువే.
* Dietary Fiber చాలా ఎక్కువ.ఇంకాదీనిలో Vitamin C, Vitamin K, Folate,
Potassium, Manganese, Vitamin A, omega 3 fatty acids,Thiamin,Vitamin B6,
Calcium,Iron and Magnesium మొదలైన పోషకాలు ఉన్నాయి.
* దీనిలోని పోషకాలు కొన్ని రకాల కేన్సర్లను నివారిస్తాయి.
* శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* బరువు తగ్గటానికి కూడా క్యాబేజీ ఉపయోగపడుతుంది.
* పాలిచ్చే తల్లులు ఎక్కువగా తింటే పాలు పెరుగుతాయి.
* చలవ చేస్తుంది,బలకరం,రక్త వృధ్ధి కలిగిస్తుంది.
* పచ్చి క్యాబేజీని కోరేసి చపాతీ పిండిలో కలిపేసి చపాతీలు చేసుకుంటే బాగుంటుంది.

క్యాబేజీ పచ్చడికి కావల్సిన పదార్ధాలు:
1) సన్నగా తరిగిన పావు కిలో క్యబేజీ.
2) చిన్న నిమ్మకాయంత చింతపండును కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకోవాలి.
3) తగినంత ఉప్పు.
4) 2,3 చెంచాల నూనె.
5)చిటికెడు పసుపు
పోపుకు:
ఆవాలు(1/2 tsp),మినపప్పు(1 tsp),జీలకర్ర(1/2 tsp),
ఇంగువ(a pinch),ఎండు మిర్చి--1, పచ్చి మిర్చి--1

చేసే విధానం:
* ముందు 1చెంచా నూనెలో పోపు వేయించుకోవాలి.అది పక్కకు పెట్టుకుని అదే మూకుడులో
* 2 టీ స్పూన్ల నూనెలో సన్నగా తరిగిన క్యాబేజీని పచ్చివాసన పొయేంతవరకు కొద్దిగా వేయించాలి.
* అది చల్లారాకా, నానబెట్టిన చింతపండు,ఉప్పు,మిర్చి,పోపుతో వేయించిన ఎండు మిర్చి,పచ్చిమిర్చి,చిటికెడు పసుపు వేసి మరీ ముద్దలా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.(ఐడెంటిటీ లేకుండా పేస్ట్ లా అయిపొతే నాకయితే నచ్చదు.)
Tips:
* పచ్చడిలో కారం వేయటం కన్నా పోపుతో పాటూ వేయించిన మిరపకాయలయితే రుచి బాగుంటుంది.
* మిర్చి ఎవరు తినే కారానికి సరిపడా వాళ్ళు వేసుకోగలరు. నేను తక్కువ వాడతాను కాబట్టి రెండే రాసాను.
* గ్రైండ్ చేసిన పచ్చడిలో పోపు ఆఖరులో కలుపుకుంటే బాగుంటుంది.కొందరు పచ్చడితో పాటూ గ్రైన్డ్ చేసేస్తారు.
కానీ వేగిన మినప్పప్పు పోపు, పచ్చడి గ్రైండ్ చేసాకా కలుపుకుంటేనే బాగుంటుంది.Freshness ఉంటుంది.

ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే....!!
క్యేబేజికూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి బాగుందని తినేస్తారు.(చాలా మందిపై ప్రయోగించాను :) )

******************************
(నా బ్లాగ్ రెగులర్ రీడర్స్ కి: ఇది నా 99వ పోస్ట్.సెంచరీ కోసం ఓ వారం ఎదురు చూడాల్సిందే మరి...శెలవు !!)

10 comments:

Padmarpita said...

ప్రెజెంట్ చేసిన విధానం బాగుందండి!

పానీపూరి123 said...

> సెంచరీ కోసం ఓ వారం ఎదురు చూడాల్సిందే మరి
దసరా శెలవలు ఎంజాయ్ చేస్తున్నారా?

asha said...

wow. I will try then.

తృష్ణ said...

@ padmarpita:thankyou.

@ పానీపూరి123 :పిల్లలకి శెలవులంటే మరి తల్లులకి
fullday స్కూల్ కదండీ... :)

@ bhavaani:thankyou.

జయ said...

కాబేజ్ పచ్హడి బాగుంది. మీ టిఫిన్, సాంబార్, పచ్హడి అన్నీ బాగున్నాయి. మీరు రైస్ ఐటం ఎప్పుడు చెప్తారా అని ఎదురుచూస్తున్నాను. మీ 'సెంచురీ ఐటం ' అదే కనిచ్హేయొచ్హు కదా! ఫుల్ మీల్స్ ఎప్పుడు తయారు చేద్దామా అని నేను చూస్తున్నాను.
మొన్నామధ్య మా ఫ్రెండ్ ఆలుగడ్డ పచ్హడి చెప్పింది. అది కాపీ కొట్టి రాసేయనా! నాకేమొ ఒంటల ఐటం ఏదన్నా ఒకటి రాయాలని ఉంది. మరేమొ, నాకేమొ ఏ స్పెషల్స్ రావు.

తృష్ణ said...

@ జయ:రాత్రి దాకా చూసి ఇంక మీరు కూడా రాయలేదనుకున్నానండి...రైస్ ఐటెం మీరడిగిన గుర్తు ఉంది..కానీ చేసి ఫోటో తీసి రాద్దాం అనుకున్నాను.. కుదరలేదండీ...
స్పెషలే రాయాలని ఏముందండి..పండగల్లో చేసిన పిండివంట..అని మీరు చేసిన ప్రసాదం రాయండి...వీలుంటే ఫొటో తీసి పెట్టండి..!
నా క్లోజ్ ఫ్రెండ్ ఒకమ్మాయి పేరు "జయ".ముంబైలో ఉంటుంది...15ఏళ్ళ స్నేహం మాది.మీ పేరు చూస్తే తనే గుర్తు వస్తుంది.

సిరిసిరిమువ్వ said...

ఈ పచ్చడి మా ఇంట్లో కూడా ఫావరేటేనండోయ్. కూర అయితే తినరని ఇలా చేస్తుంటాను.
పచ్చిమిరపకాయలతో పాటు ఓ చిన్ని చెంచాడు ధనియాలు కూడా చేరుస్తాను, రుచి బాగుంటుంది. అప్పుడప్పుడు ఓ రామ్ములక్కాయ కూడా చేరుస్తుంటాను.

అప్పుడే నూరు పోస్టులకి వచ్చేసారా. ఇలా వచ్చి అలా భలే వ్రాసేసారండి. మీ నూరవ పోస్టుకి ముందస్తు శుభాకాంక్షలు.

తృష్ణ said...

@ సిరిసిరిమువ్వ:మీరు చెప్పినది కూడా బావుంది.

నేను నా బ్లాగ్ ను కూడలికి,జల్లెడకి లంకె వేసిన రోజు నుంచీ మీ వ్యాఖ్యలు గుర్తు నాకు...వర్డ్ వెరిఫికేషన్ తిసివెయ్యమని మీరే సలహా ఇచ్చారు నాకు. ధన్యవాదాలు.

satya said...

క్యాబెజీ భలే సన్నగా తరిగారండీ.చూస్తూంటే పచ్చిదే తినేయాలనిపిస్తోంది.........).
వేగిన పప్పులు నలిగితే అదో రుచి...అంచేత నేను సగం పోపు పచ్చడి తో పాటు గ్రయిండ్ చేసేసి మిగిలిన పోపు పైనుంచి కలుపుతాను.

మాలా కుమార్ said...

ఏమిటి దూకుతా నని బెదిరిస్తున్నారు. నా కామెంట్ కూడా పబ్లిష్ చెయలెదు . ( దీని తరువాత పొస్ట్ లో ) హన్నా !
నా జీవన తరంగాలు ఇంకో రెండు ఎపిసోడ్స్ లో అయిపోతుంది.
తరువాత సీరియల్ కి మీమీద ఆశ పెట్టుకున్నాను మరి నన్ను నడిసముద్రం లో ముంచేసి దూకేస్తారా ?