సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, October 20, 2009

గుంటూరు శేషేంద్ర శర్మ కవిత

"ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను" అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈయన కవిత్వాన్ని శ్రీ శ్రీ మొదలు విశ్వనాధ సత్యనారాయణ, పుట్టపర్తి నారాయణాచార్యులు దాకా ప్రశంసించారు. తిలక్ సాహిత్యంతో కూడా ఈయన సాహిత్యానికి సామీప్యం కనిపిస్తుంది. వీరిద్దరి కవితల్లో కనబడే భాషా సౌందర్యం ఇతర ఆధునిక కవుల్లో కొంత తక్కువనే చెప్పాలి. శేషేంద్ర శర్మ గారి కవిత్వంలో ప్రకృతి సౌందర్యంతో పాటూ తత్వాన్వేషణ కూడా మిళితమై ఉంటుంది. అందువల్ల మళ్ళి మళ్ళీ ఆ రచనలను చదవాలనే ఆసక్తి, చదివే కొద్ది కొత్త అర్ధాలూ కనబడుతూ ఉంటాయి నాకు.

ఇంతకన్నా గొప్పగా ఆయన కవిత్వాన్ని విశ్లేషించే కవితాశక్తి, అర్హత నాకు లేవు కానీ ఆయన కవిత్వం లోంచి కొన్ని వాక్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను...చదివి ఆస్వాదించండి...

"ఎక్కడ పేరులేని పక్షి కొమ్మల్లో కూర్చున్న మాత్రాన
పరిసరాలు పద్యాలుగా మారుతాయో
ఎక్కడ ఎర్ర యూకలిప్టస్ చెట్టు
సంధ్యలో స్నానం చేసి ఆకుల కొసల్లో
ఎర్రపూల బిందువులు వ్రేలాడుతూండగా
ముందుకు వస్తుందో
ఎక్కడ ముద్దుగా ఇంటి మీదికి ఒరిగిన
జాబిల్లి ముద్ద చేతి కందుతాడనిపిస్తుందో

అక్కడికి, ఆ కల లోయల్లోకి
పోదాం పదమంటుంది ఆత్మ
నగ్న వృక్షాల బారినించి తప్పించుకుని
శాంతి యాత్ర చేద్దాం పదమంటుంది.."
__(శాంతియాత్ర : మండే సూర్యుడు)

+++++++++++++++++++++++++

"తుఫాను" కవితలో ఆయనంటారు...
"ఏమోయ్ తుఫాను ఎక్కడికి పోతున్నావ్
నీ ముఖం ఎంత ప్రశాంతమైన అచ్చాదన నీకు
ఉన్నది ఒక్క గుండె
వంద గాయాలకు చోటేక్కడుంది నీలో..."

+++++++++++++++++++++++++

ప్రేమను గురించి ఉపమానాలు పేనుతూంటే
గుండెని కోకిల తన్నుకుపోయింది
గజల్ని గురించి రాద్దామని కూర్చుంటే
రాత్రి కవిత్వంలో తడిసిపోయింది..

+++++++++++++++++++++

మనసు ఇచ్చిన గాయాలను మమత కొనుక్కున్నది
బ్రతుకు సంతలో చివరకు బాటసారి అయినది..

+++++++++++++++++++

"చిన్న నక్షత్రం చేత్తో పట్టుకుని
అంతరాత్మ సందుల్లో ఒక రహస్యాన్ని
తవ్వుతున్నాను
ఎన్నో కోట్ల రాత్రుల పొరల క్రింద
బయటపడింది
మనిషి కోల్పోయిన మొహం
వెయ్యి కిరణాలతో..."

+++++++++++++++++++


"వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి
చెట్టుగా ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది
మనిషినై
అన్ని వసంతాలూ కోల్పోయాను.."

+++++++++++++++++++++++++

"...భూమిలో ఉన్న చిన్నారి గింజ
మెడ బయటకు పెట్టి
మొదట వచ్చిన రెండాకుల్ని
చేతులుగా జోడించింది
కృతజ్ఞతతో "

+++++++++++++++

ఒక్కటే :

రాళ్ళెన్ని ఉన్నా దూరాన్ని కొలిచే రాయి ఒక్కటే
పక్షులెన్ని ఉన్నా ఒంటరితనాన్ని
తనమీద వేసుకుని
దిక్కులతో చూపులు కలిపే పక్షి ఒక్కటే

దిక్కులెన్ని ఉన్నా
చూపులతో మాట్లాడే దిక్కు ఒక్కటే
మాటలెన్ని ఉన్నా పొందిందీ లేదు
పోగొట్టుకున్నదీ లేదు
ఈ వెలుగు చీకట్ల సంగమంలో
అని చెప్పే మాట
ఒక్కటే

జీవితం అంతా అరిగిపోగా
చివ్వరి రేణువులా మిగిలి ఉన్న
నా ఉనికి అంతా
ఒక్క జ్ఞాపకం
ఒక్కటే
+++++++++++++++++

శేషేంద్ర శర్మ గారు రాసిన ఒకే ఒక సినిమా పాట "ముత్యాల ముగ్గు " చిత్రంలో ఉంది...
సంగీతం:కె.వి .మహదేవన్
పాడినది: పి.సుశీల

నిదురించే తో్టలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరానా రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంలా వెలిగిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరమ్ కలిపి నిలిపిందీ
ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడీ అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని
నావకు చెప్పండి..నావకు చెప్పండి..



17 comments:

సంతోష్ said...

మొదటి కవిత చదువుతూంటే రవీంధ్రుని "గీతాంజలి" గుర్తుకు వచ్చిందండి...

sreenika said...

నిజానికి జ్ఞానపీఠ్ అవార్డు అందుకొనే అర్హతకలిగిన వ్యక్తి. ఆయన ఆశించాడని కూడా అక్కడక్కడా ఆయన సన్నిహితులు అనుకునేవారుట. ఆయనకే అనుకున్న సం.రం. సినారె గారికి వచ్చిందంటారు.
నిజమే! కాని ఈ పాట దేవులపల్లి రాసారని అందరూ అనుకుంటారు. చాలా బాగుంది టపా.

జయ said...

చాలా బాగా రాసారు. నాకెందుకో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి భావ గీతాలు గుర్తుకొచ్హాయి. ప్రకృతి గురించి చాలా చక్కటి కవితలు కూడా ఉన్నాయి. ముత్యాల ముగ్గు చిత్రం లోని పాట చాలా భావుకత్వంతో మైమరిపిస్తుంది. చక్కటి పరిచయం.

కొత్త పాళీ said...

శేషేన్ ప్రదర్శించిన కవిత్వ ప్రతిభకి తగినట్టుగా ఆయనకి పేరు రాలేదని నా అనుమానం. ఇటీవల ఆయన రచనలన్నీ పునర్ముద్రణకి నోచుకుంటున్నాయి.

తృష్ణ said...

@ santhosh: Thankyou for the visit.

@ sreenika: some people think 'aarudra' has written it..

Thankyou verymuch.

తృష్ణ said...

@ jaya : If i were a poet, i might have analysed his poetry in a better way...but in this post i just wanted to write about my fondness for his works...

Thankyou.

తృష్ణ said...

@kottaapli: ...and if he were not married to the princess Indira, he wouldn't have had this much recognition also...

this is just my opinion sir.

And..thankyou verymuch for the comment in navatarangam. Iam pleased..!

Unknown said...

తృష్ణ గారు శేషేంద్ర శర్మ గారు రాణి ఇందిర దగ్గర ఎక్కువ సమయాన్ని గడిపే వారనడం సబబేమో .పెళ్లి అన్న పదం పెద్దది చాల కాలం ఎర్రమంజిల్ లో వారు మా ఇరుగు వారే .వాళ్ళఅబ్బాయి వనమాలీ , అమ్మాయి రేవతి నాకు పరిచయమే .నేను ఇంటర్ చదివే రోజుల్లోనే తను సివిల్స్ కి ప్రేపరే అయ్యేవాడు ,రేవతి అప్పటికే డాక్టర్ .వాళ్ళ అమ్మ గారు(శేషేంద్ర శర్మ గారి అసలు భార్య ) చాల కష్టపడేవారు , ఆయన నెలకి అయిదు రోజులు వుంటే గొప్ప .మనిషి మంచి స్ఫురద్రూపి మొహం లో వర్చస్సు తో ఉట్టి పడేది .వాళ్ళ అబ్బాయి వనమాలీ వచన కవిత్వం అంటూ రాసి ఆ పుస్తకాన్ని ఇస్తే ఆ వయసులో అంత ఆస్వాదించ లేక పోయే వాణ్ణి .నిదురించే తోటలోకి నాకు చాల ఇష్టమైన ఆయన రాసిన ఏకైక సిని పాట .కవులంతా కుటుంబ జీవితాన్ని ఆస్వాదించ లేక పోయారేమో అని పిస్తుంది వారిని చూస్తె ,

Padmarpita said...

చాలా బాగారాసారు.

తృష్ణ said...

@ ravi gaaru: కళకే అంకితం అవ్వాలనుకున్న కళాకారులు అసలు పెళ్ళి చేసుకోకూడదు, చేసుకున్నా పిల్లల్ని కనకూడదేమో అనిపిస్తందండి నాకు. పెళ్ళి చేసుకున్నా అటు కుటుంబాన్ని సంతృప్తి పరచలేక, ఇటు వారిలోని కళాతృష్ణ కూ న్యాయం చెయ్యలేక సతమతమైన జీవితాలు బోలెడు...!! we are the creators of our own detiny...అని ఎంత చెప్పినా , ఎవరి యోగంలో ఏదుంటే అంతే ప్రాప్తం...అనిపిస్తుందండి నాకు.
Thankyou for the visit.

తృష్ణ said...

@ padmaarpita: thankyou.

siva said...

శేషే౦ద్ర గారి పేరు చూదగానే కళ్ళు, నది దోచుక పోతున్న నావ కోస౦ పరిగెత్తాయి. కొన్ని భావాలు,భావనలు పలికి౦చడ౦ కొ౦దరికే చెల్లు(ఆవిష్కరి౦చడ౦ అనాలేమో). ఇలా౦టి స్ప౦దనల వల్లే మనిష౦టే భౌతికమైన దేహమే కాక మరేదో వు౦ద౦టే నమ్మాల్సి వస్తు౦ది. మీ బ్లాగ్ పాత డైరీ మళ్ళీ చదివిన అనభూతినిచ్చి౦ది. థా౦క్స్.

తృష్ణ said...

@ Siva: Thankyou.

మరువం ఉష said...

ఆయన కవితలు, ఆ పాట నాకు బాగా గుర్తే + చాలా ఇస్టమూను. కొత్తపాళి గారి మాటే నాదీను ఆయన కళ, అర్హతలపై అభిప్రాయం వరకు. ఇక కళాతృష్ణ తీర్చు తోడే, సంసారజీవన సహచరి కావడం ఎక్కడో కానీ అరుదే. కుటుంబఛట్రంలో బిగించబడటం వారి అభాగ్యమో లేక తగు కళాభిమానం గల తోడు ముందుగా వారి జీవితంలోకి రాకపోవటం వారి దురదృష్టమో? మేఘసందేశం సినిమా లో ఈ ముక్కోణ జీవితం చూపారు [చూసేవుంటారు].

తృష్ణ said...

ఆ సినిమా తెలియనివారుండరు కదండీ...పాటలు బాగుంటాయి కానీ...ఎందుకో ఆ కధతో నేను రాజీ పడలేను..ఇంతకన్నా రాస్తే అభిమానులు కొడతారేమో..!!

ఇంతకీ మీ చెయ్యి ఎలా ఉంది..?

పూర్ణప్రజ్ఞాభారతి said...

రవిగారు said...

తృష్ణ గారు శేషేంద్ర శర్మ గారు రాణి ఇందిర దగ్గర ఎక్కువ సమయాన్ని గడిపే వారనడం సబబేమో .పెళ్లి అన్న పదం పెద్దది

Ee comment Ghoram. Seshendra Indira garini marriage chesukunnaru. Idi prapanchaniki telisina sangate. kabatti .పెళ్లి అన్న పదం పెద్దది Anna comment grahaneeyam. Pelli Evarikaina pelle.

కవులంతా కుటుంబ జీవితాన్ని ఆస్వాదించ లేక పోయారేమో అని పిస్తుంది వారిని చూస్తె ,
Idi kooda tappe. Seshen lead a happy life. I was with him till his last breathe.

Even now vanamali, revathi were in touch with Indira garu. She is taking care of their need... Yes... you might not know.

తృష్ణ said...

పండిత్ జీ గారూ,
నాకు శర్మగారి కవితలు మాత్రమే తెలుసునండీ. మిగతా వివరాలు తెలియవు. రవిగారు రాసిన వ్యాఖ్య కు నేను మామూలుగా కళకే అంకితమయ్యే కళాకరుల పట్ల నాకు ఉన్న అభిప్రాయాన్ని మాత్రమ్ తెలియజేసనంతేనండీ.
మీకు చాలా చాలా ధన్యవాదాలు.