సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, October 26, 2009

గ్రీటింగ్స్...


గ్రీటింగ్స్ ... అంటే...
Greetings are wishes....wishes that convey our innermost feelings to the ot
her person. ఇది నా అభిప్రాయం. కొందరికి ఇదొక వృధా ఖర్చు. కానీ నాకు గ్రీటింగ్స్...అంటే పిచ్చి పిచ్చి..!! కాలేజీ రొజుల్లో మా ఊళ్ళో Prabodha, Options, Ashok book center, Archies, Pens n Pads...ఇవే పేరు మోసిన గ్రీటింగ్స్ దొరికే షాపులు. ఈ షాపులన్నీ నా అడ్డాలు. ఎప్పుడన్నా చేంజ్ లేదంటే మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వండి...అనేంత బాగా తెలుసు నేను ఆ షాపులవాళ్ళకి. సమయం దొరికినప్పుడల్లా స్నేహితులతోనో, ఒంటరిగానో వెళ్ళటం పదో ఎన్నో నచ్చినవి, కొత్త రకాలు కొని తెచ్చేసుకోవటం...B'days, New year, Occassions, just born, Bon voyage, Get well soon, just Hi.., GoodDay...అంటు ఎన్ని రకాల కార్డ్స్ ఉంటాయో అన్ని రకాలు నచ్చినవి కొనెయ్యటమే.

"ఎవరికి పంపిస్తావే..ఎందుకు ఇన్ని కొంటావు" అని అమ్మ కేకలేసేది...అవి మన చెవులకి వినబడితే కదా..! కొత్త చొక్కాల తాలూకూ అట్టపెట్టెలు సంపాదించి వాటిల్లో కేటిగొరీల ప్రకారం దాస్తూ ఉండేదాన్ని...అప్పుడు పెద్ద ఖరీదు ఉండేవి కాదు గ్రీటింగ్స్. ఏభై రుపాయల కార్డ్ అంటే చాలా ఖరీదైన కార్డ్. (ఇప్పుడు ఏభై రుపాయిలకు తుక్కులాంటి కార్డ్ కూడా రావట్లేదు.) ఇక స్నేహితులకూ, బంధువులకు ఉత్తరాలు కూడా బాగా రాసేదాన్ని. ప్రతి రోజూ పోస్ట్ మాన్ మా ఇంటికి రావాల్సిందే..ఎవరిదో ఒక లెటర్ తేవాల్సిందే. ఉత్తరాల గురించి నేను రాసిన ఒక పాత టపా "ఇక్కడ" చూడండి. అలా ఉత్తరాలతో పాటూ సందర్భానుసారంగా నేను తయారు చేసిన వాటితో పాటు ఈ కొన్న గ్రీటింగ్స్ కూడా పంపిస్తూ ఉండేదాన్ని...!!

ఇప్పుడు e-cards వచ్చేసాకా కొనటం పుర్తిగా తగ్గిపోయింది. పైగా అన్ని e-mails ఏ కదా. కానీ ఈగ్రీటింగ్స్ మాత్రం మైల్స్ తో నా బంధువులకీ,స్నేహితులందరికీ తప్పకుండా పంపిస్తూ ఉంటాను. అదొక సరదా. మనం ఎదుటి వ్యక్తికి ప్రాముఖ్యం ఇస్తున్నాము అని తెలపటానికి. మన గ్రీటింగ్స్ ద్వారా మరొక వ్యక్తికి ఆనందం కలిగిస్తున్నాము అనే సంతృప్తి కోసం. నాకు తిరిగి అందరూ పంపిస్తారా అంటే...ఖచ్చితంగా పంపించరు. కానీ ఎదుటి మనిషిలాగే మనమూ ఉంటే మనకీ వాళ్ళకీ తేడా ఏంముంటుంది అనేది నా అభిప్రాయం.

ఇక్కడొక చిన్న మధుర స్మృతి...నా పెళ్లైన కొత్తలో "వేలెంటైన్స్ డే" వచ్చింది. "నాకేమన్నా కావాలి" అనడిగాను మావారిని. "ఏం కావాలో చెప్పు" అన్నారు. "గ్రిటింగ్స్ కొనివ్వరా?" అనడిగాను. ఆశ్చర్యపోయారు. "ఏం అడుగుతావో అనుకుంటుంటే...కాయితం ముక్క కావాలంటావేమిటీ?" అన్నారు. "నాకు అదే బంగారమంత ఎక్కువ. అదే కావాలి." అన్నాను. "నేనెప్పుడూ గ్రీటింగ్స్ కొనలేదు. ఎవరికీ ఇవ్వలేదు. ఏ షాపులెక్కడ ఉంటాయో తెలీదు.." అన్నారు. ఈసారి నేనాశ్చర్యపోయాను..కొత్త కదా ఏమంటాం..అని ఊరుకున్నాను. మర్నాడు శనివారం. తనకు హాఫ్ డే ఉండేది (బొంబాయిలో). సాయంత్రమైనా మనిషి ఇంటికి రాలేదు. నాకేమో కంగారూ, భయం.
మనకి పిలవకుండానే పలికే కోపం కూడా వచ్చేసింది...ఇంతలో బెల్ మోగింది...

తలుపు తియ్యగానే ఎర్ర గులాబిల బొకేతో, గ్రీటింగ్స్ పట్టుకుని మావారు..! "ఢాం" అని పడిపో
యా..!! కానీ కొంచెం అలక వహిస్తూ అడిగాను "ఎందుకింత ఆలస్యం?" అని.." అందరిని దారి అడుగుతూ గ్రీటింగ్స్ షాపు వెతుక్కుని వెళ్ళి, కొని తెచ్చేసరికీ ఇంత సేపైంది" అన్నారు. అలసిపొయిన ఆయన మొహం అప్పుడు కనబడింది నాకు...నా కోసం ఇంత కష్టపడ్డారా....కోపమంతా ఎగిరిపోయింది...!! ఆ తర్వాత రెండు రోజులదాకా ఈయన బొకే తెస్తూండగా చూసిన మా వింగ్ లోని ఇరుగు పొరుగు ఆంటీలంతా నన్ను ఏడిపిస్తూనే ఉన్నారు..."క్యా బాత్ హై..?!" అంటూ...

అప్పటినుంచీ పాపం నాకోసం పుట్టినరోజులకీ, పెళ్ళిరోజులకీ మిగిలిన బహుమతులతో పాటూ గ్రీటింగ్స్ కొంటూనే ఉన్నారు మావారు....!!

21 comments:

మురళి said...

నాక్కూడా గ్రీటింగ్స్ కొనే అలవాటు బాగా తక్కువ.. ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను.. మీవారి ఎంట్రీ, మీ కోపం..ఆ సీన్ ఊహించుకునే ప్రయత్నం చేస్తున్నానండి :) :)

తృష్ణ said...

@ మురళి:నా సంగతి ఆయనకు బాగా తెలుసు...(బోల్డు కోపం వచ్చేసి వెంఠనే తగ్గిపోతుందని..) అందుకని నాక్కోపం వచ్చినా పెద్దగా కంగారు పడరు..:)
కానీ, "ఆ చూపులకి పవరుంటే ఎన్నిసార్లు భస్మమైపోయేవాడినో...."అంటూంటారు..:) :)

Padmarpita said...

నేను గ్రీటింగ్స్ నే బహుమతిగా భావిస్తాను. చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ప్రతి గ్రీటింగ్ ని జాగ్రత్తగా దాచాను అంటే మీకు అర్థమై వుంటుంది......చూసారా ఇందులో కూడా సేం టు సేం:)

తృష్ణ said...

@ padmaarpita: oh..same pinch..:)

Bhãskar Rãmarãju said...

ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ విచిత్రంగా ఉంటాయి. ప్రతీ అలకకూ ఓ కార్డు ఇప్పించుకోజూస్తారు. అలా ఇవ్వాలవంటే కార్డు కంపెనీయే పెట్టుకోవాలి. అలా, ప్రతీదానికీ ఓ కార్డు ఇచ్చుకోబాసూ అని ఓ లుక్కు పడేస్తే పాపం మగాడి సంగతేంకానూ???

Bhãskar Rãmarãju said...

గ్రీటింగుకార్డులు ఉంటాయీ అని నాకు ఎనిమిదిలోనీ తొమ్మిదిలోనో[తరగతి] తెలిసింది.

మాలా కుమార్ said...

నాకూ గ్రీటింగ్స్ అంటే చాలా ఇష్టం.ఫీల్డ్ లో వున్న మావారికి పంపడానికి గ్రీటింగ్ కార్డ్స్, లెటర్ పాడ్స్ కోసమని ,బర్కత్పురా నుండి , ఆబిడ్స్ దాకా నడిచి వెళ్ళే దానిని . మరి అప్పుడు ఆబిడ్స్ లో మాత్రమే దొరికేవి . మనీ ఆదా కోసం నడక .

తృష్ణ said...

@భాస్కర్ రామరాజు: అడిగేది గ్రీటింగులే కదండీ...వెండిలూ, బంగారాలూ కాదుగా !!

నాకు గ్రీటింగ్స్ కొనటమ్ చేయటం రెండూ నాన్నగారి వద్ద నుంచి వచ్చాయి. మా నాన్నగారు "న్యూఇయర్" వస్తే ఒక వంద కార్డులు తయారు చేసి(చిత్రకారులు కూడా కాబట్టి) స్నేహితులందరికీ పంపించేవారు..
పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళను మేము పోషించినట్లు ఎవరూ పొషించి ఉండరు :)

తృష్ణ said...

@మాలా కుమార్: లెటర్ ప్యాడ్స్ అంటే నాకు చాలా ఇష్టమ్ అండీ...అయిపోయిన లెటర్ ప్యాడ్ కాయితం ఒకోటి చప్పున గుర్తు కోసమ్ ఇప్పటికీ దాచుకున్నాను...నాకు పెళ్ళయే టైమ్ కి ఈమైల్స్ వచ్చేసాయి..అందుకని మావారికి లెటర్ ప్యాడ్ మీద ఉత్తరాలు రాయాలనే సరదా అలానే ఉండిపోయింది..
మనీ ఆదా చెయ్యటమ్ కోసం నేనూ నడిచే వెళ్ళేదాన్ని కొన్ని చో్టలకి...ఇప్పుడు నదక మంచిది కదా అని నడుస్తాను...

జయ said...

తృష్ణ చాలా బాగుంది. గ్రీటింగ్స్, అందులో చక్కటి మాటర్ తో పంపటమన్నది ఒక కళ. ఇది నాకు ఎంతో ఇష్టమైన పని. సొంతంగా గ్రీటింగ్స్ ప్రిపేర్ చేసి అందులో అనుగుణంగా మాటర్ రాసి పంపిస్తాను. కాని, మీరన్నట్లు ఎంతమంది తిరిగి మనకి పంపిస్తున్నారన్నది అనవసరం. ఇందులో ఉండే ఆ తృప్తి వేరు. ఎదుటి వాళ్ళకు మన హృదయం తెలుస్తుంది కదా! అది చాలు.

తృష్ణ said...

@ jaya:అవునండీ..నేనూ,నా ఫ్రెండ్ కలిసి ప్రతి NewYear,పుట్టినరొజులకీ గ్రీటింగ్స్ తయారు చేసి మేటర్లు రాసి పంపేవాళ్ళం. ఈ మేటర్లు కుడా రకరకాలవి డైరీలనిండా రాసుకునేవాళ్ళం..కొన్ని షాప్ లో చూసిన మేటర్లు ఇంటికి వచ్చాకా ఇద్దరము కాయితం మీద ఒక్కో వాక్యం గుర్తుతెచ్చుకుంటు రాసేవాళ్లం పరీక్ష రాస్తున్న విద్యార్ధుల్లాగ...అవన్నీ మధురమైన జ్ఞాపకాలు...

SRRao said...

తృష్ణ గారూ !
మంచి ఆర్టికల్ అందించారు. గ్రీటింగ్ కార్డ్ లు కొనడం, తయారు చెయ్యడం, ప్రింటింగ్ చేయించడం, స్క్ర్రీను ప్రింట్ చెయ్యడం. డిజిటల్ ఫోటొ గ్రీటింగ్స్ తయారు చెయ్యడం, మొబైల్ ఎస్.ఎం.ఎస్. లు, ఈమెయిల్ దాకా అనేక పరిణామ దశలు చూసాను. కానీ ప్రతి సందర్భానికి ఈ గ్రీటింగ్స్ పంపే అలవాటు మాత్రం తగ్గలేదు. శుభాకాంక్షలతో బాటు మనల్ని గుర్తుచేసే సాధనం గ్రీటింగ్స్ .

తృష్ణ said...

Rao gaaru, dhanyavaadaalu.

Ram Krish Reddy Kotla said...

తృష్ణ గారు, గ్రీటింగ్స్ ప్రాముఖ్యం గురుంచి బాగా చెప్పారు...మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలు ఒక గ్రీటింగ్ కార్డు పలికించగలదు...కానీ ఈ-గ్రీటింగ్స్ పుణ్యమా అని అసలు గ్రీటింగ్ కార్డ్స్ కొని స్నేహితులకు ఆప్తులకు ఇవ్వడమే మరచిపోయారేమో జనాలు...అందులో నేను కూడా ఒకడిని...కనీ మీ పోస్ట్ చదివాకా ఖచ్చితంగా ఈ సారి గ్రీటింగ్ కార్డు కొని ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాను...

తృష్ణ said...

@Kishen Reddy: oh..thats a great idea...buy a card and give it to your dearones...

Thankyou..!

భాస్కర రామిరెడ్డి said...

బాగుందండీ, నాకూ ఉండేది పిచ్చి కొంతకాలం. కానీ అందరికీ నేనివ్వడమే గానీ నాకు ఒక్కటో అరో తప్ప పెద్దగా వచ్చేవి కావు. దాంతో కొనడం మానేసాను. ఇక మీ పూలబొకే కబుర్లు బాగున్నాయి. ఇంతకీ ఆ తరువాత ఎన్నిసార్లు కొనిచ్చారు?

తృష్ణ said...

@ భాస్కర రామి రెడ్డి: పూల బొకే అయితే మళ్ళీ కొనలేదు కానీ గ్రీటింగ్స్ కొని ఇస్తారు ఇప్పటికీ..!!

వేణూశ్రీకాంత్ said...

భలే టపా తృష్ణ గారు, చాలా బాగుంది. పదవ తరగతికి వచ్చే వరకూ కూడా నాకు గ్రీటింగ్స్ అంటే నూతన సంవత్సరానికి వచ్చే సినిమా తారల పోస్ట్ కార్డ్ లే. ఆ తర్వాత కాని అసలు గ్రీటింగ్ అంటే ఏంటో అర్ధం కాలేదు. ఈమెయిల్స్ వచ్చాక కొనడం మానేశాను కానీ కార్డ్ కార్డే.. ఆ స్పర్శ, అనుభూతి ఈ-గ్రీటింగ్ లో మిస్సింగ్..

ఓ ఏడాది క్రితం వరకూ నా మితృలని కనీసం ఈ గ్రీటింగ్ ద్వారా అయినా ప్రతి సంధర్భానికి క్రమం తప్పక పలకరించే వాడ్ని కానీ ఈ ఏడు మానేశాను మీ టపా చూశాక మళ్ళీ మొదలు పెట్టాలనిపిస్తుంది.

మీ బొకే ఎపిసోడ్ చాలా బాగుంది :-)

భావన said...

తృష్ణా నాకు కూడా ఎంత పిచ్చో గ్రీటింగ్స్ అన్నా పువ్వులన్నా.. నా చిన్నప్పుడైతే మంచి ఆర్చీస్ గ్రీటింగ్స్ 25రూపాయలకే కె వచ్చేయి, ఎన్ని కొని పంపించే వాళ్ళమో నేను నా ఫ్రెండ్ అందరికి. ఇప్పటికి ఏమిటో మనసు ఒక్క సారి గడ్డ కట్టినట్లైపోతుంది నాకు ఆ ఎర్రటి గులాబితో తెల్లటి మెరిసే కాగితం మీద వున్న గ్రీటింగ్స్ చూస్తే... లెటర్ ప్యాడ్స్ అన్నా నాకెంత ఇష్టమో... ఎవ్వరికి వుత్తరాలు రాసే పనే లేదు కదా ఇప్పుడూ.. ప్చ్.... నేను ఇంకా ఓపిక గా గ్రీటింగ్స్ కొని పంపుతూనే వుంటా జనాలకు ఇప్పటికి..

తృష్ణ said...

@ వేణూ శ్రీకాంత్: తప్పకుండా కొని పంపండి. పోస్ట్ లో వచ్చే గ్రీటింగ్స్ మనకు ఎదుటి మనుషులు ఎంత విలువ ఇస్తారో తెలియజేస్తాయి..ఆనందాన్ని ఇస్తాయి.

తృష్ణ said...

@ భావన: అయితే మీక్కూడా సేం పించ్.. :) i just love letter pads ma'm...

నేను ఇంక కొని పంపటం మానేసానండీ..ప్రస్తుతం పంపేవన్నీ ఈగ్రీటింగ్సే..అవి మాత్రం ఠంచనుగా అందరు మిత్రులకీ, బంధువులకి పంపిస్తూ ఉంటాను...