పొద్దున్నే ఎఫ్.ఎం వింటూ పనులు చేస్కుంటూంటే ఒక వింత పాట వినిపించింది. ఈ మధ్యన పెద్ద పెద్ద పేరాగ్రాఫులను పాటలుగా మార్చేస్తున్నారు. అలానే ఉంది. కానీ సాహిత్యం చాలా బాగుంది. తీరుబడి అయ్యాకా నెట్లో వెతకటం మొదలెట్టా. కానీ వాక్యాలు మర్చిపోయా. చాలా సేపు వెతికి దొరక్కపోయే సరికీ ఒక ఐడియా వచ్చింది. కొత్త సినిమా పాటలు అని టైప్ చేసి వచ్చిన సినిమాల పాటలలిస్ట్ లు అన్నీ వెతకటం మొదలెట్టా. ఒకచోట హుర్రే...!! అనేసా.
పాట.. "Mr.Perfect" సినిమా లోదిట. సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్. సాహిత్యం - సిరివెన్నెల. అదీ.. అందుకే అంత బాగుంది. ఏమైనా ఆయనకాయనే సాటి. కార్తీక్, మల్లికార్జున్ పాడారుట. చిన్నవయసులోనే ఎన్నో పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కార్తీక్. మంచి పాటలు ఉన్నాయి అతని జాబితాలో.
ఇంతకీ నాకు అంత విపరీతంగా నచ్చేసిన పాట సాహిత్యం చూడండి...కష్టపడి మొత్తం రాసేసా...:)
ఎప్పటికీ తన గుప్పిట విప్పదు
ఎవ్వరికి తన గుట్టుని చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా
తప్పుకునేందుకు దారినిఇవ్వదు
తప్పు అనేందుకు కారణముండదు
చిక్కులలో పడటం తనకేం సరదా
బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా
నిన్నా మొన్నా నీ లోపలా
కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా
ఈరోజేమైందని ఏదైనా అయ్యిందని
నీకైనా కాస్తైనా అనిపించిందా?
(ఎప్పటికీ..)
ఏదోలా చూస్తారే నిన్నో వింతలా
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతగా
మునుపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా?
సంబరపడి నిను చూపిస్తూ
కొందరు అభినందిస్తూంటే
నవ్వాలో నిట్టుర్చాలో తెలిసేదెలా?
(బదులు తోచని)
నీతీరే మారింది నిన్నకీ నేటికీ
నీ దారే మళ్ళుతుందా కొత్త తీరానికీ
మార్పేదైనా వస్తుంటే
నువ్వది గుర్తించకముందే
ఎవరెవరో చెబుతూఉంటే నమ్మేదెలా?
వెళ్ళే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందడుగేసే వీల్లేదెలా?
(బదులు తోచని)
చదివితే ఏదో పాఠం తాలూకూ ఎస్సే ఆన్సర్ లా ఉండి కదా. పాట చరణాలు ఎలా ఉన్నా, నాకైతే మొదట్లో హమ్మింగ్ వాక్యాలు, పల్లవి చాలా నచ్చేసాయి. మ్యూజిక్ తో పాటూ వింటే బాగుంది. మీరూ వినేయండి మరి..
8 comments:
baavundandi.
ఆ సినిమాలోనే ఇంకో పాట ఉందండీ. "లైట్ తీస్కో" అని. రామజోగయ్య శాస్త్రి రాశారు. కాస్త ఇంగ్లీష్ పదాలు పంటికింద రాయిలా తగిలినా భావం సరదాగా బావుంది.
కాకపోతే పాటలన్నిటికీ ఊదరగొట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాహిత్యాన్ని చాలావరకు మింగేస్తోంది. ఏమో అదే దేవిశ్రీ ప్రసాద్ స్టైల్ అనుకుంటా :(
బాగుందండి నేను విన్నా
త్రిష్ణ గారు...ఈ పాట ...నాకు కూడా చాలా నచ్చింది.. :)
నా favorite లిస్టు లో చేరిపోయింది.. :)
వేణూ శ్రీకాంత్ గారి బజ్లో చూసాక విన్నా ఈ పాట.. కేవలం సాహిత్యం కోసం అయినా వినదగిన పాట! :)
@సుధ: థాంక్స్ అండి.
@శంకర్.ఎస్: అన్నీ ఇంకా వినలేదండి. ఒక శ్రేయా పాట కూడా ఉన్నట్లుంది. వినాలి.
@రాధిక(నాని): మీరూ విన్నారా? బావుందండీ. ధన్యవాదలు.
@కిరణ్: :) ధన్యవాదాలు.
@మధురవాణి: అవునా? సాహిత్యమేనండి నాకూ బాగా నచ్చినది. ఈ బజ్జులు చూడ్డం అలవాటులేదండి... ఆసక్తీ లేదు. బ్లాగ్లులకే టైం సరిపోవటం లేదు..అందరూ బజ్జుల్లో ఎలా గడుపగలుగుతున్నారో అనుకుంటూంటాను.
ఈమైల్స్ వచ్చాకా జనాలు ఉత్తరాలు రాయటం మానేసినట్లు, బజ్జులు వచ్చాకా బ్లాగులు రాయటం తగ్గించేసారు అంతా. ఎంతైనా చేతితో రాసిన ఉత్తరాల కమ్మదనం లాగ బ్లాగు అందం బ్లాగుదే..!!
ధన్యవాదాలు.
nice...! This is an evidence to say that, lyrical values are still not extinct! :)
I'm a beginner in blogging! and for all, please do visit my blog :)
Post a Comment