సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Tuesday, March 8, 2011
అభివందనం..
అన్నివేళలా పక్కనుండగల శక్తి
ఏది, ఏంత చెప్పినా వినే ఓరిమి
అర్ధం చేసుకునే సహనం
శ్రధ్ధ తీసుకోగల అభిమానం
అనురాగం ఆత్మీయత నిండిన
నవనీత హృదయ మగువ.
అన్నదమ్ములకు అనురాగం అందించినా
తల్లిదండ్రులకు అభిమానం పంచినా
స్నేహసౌరభాలు పంచిఇచ్చినా
భార్యగా బంధాలు పెనవేసినా
మాతృత్వపు మమకారాలు చూపినా
అత్తింట బాధ్యతలు తనవి చేసుకున్నా
ఉద్యోగభారాన్ని సమర్ధంగా మోసినా
ఎక్కడ ఎన్ని అవతారాలెత్తినా
తన స్త్రీత్వమనే అస్థిత్వాన్ని పదిలపరుచుకుంటుంది అతివ.
అపురూపమైన ఈ అస్థిత్వాన్ని గుర్తించలేని నిర్భాగ్యులు కొందరైతే
అదే అస్త్రంగా తమ స్త్రీత్వాన్ని ప్రజ్వలించుకునేవారు కోకొల్లలు.
పరిపూర్ణమైన ఆ స్త్రీత్వానికి వందనం.
ప్రతి బంధంలో ప్రాణం నింపే ప్రతి అతివకూ అభివందనం.
Subscribe to:
Post Comments (Atom)
14 comments:
బాగా రాశారు.
మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
అన్నట్టు
M - MARVELLOUS
A - ADORABLE
N - NICE
అని మేమూ అనుకోచ్చుగా :)
chaalaa chakkagaa chepparu
miku kudaa abhinandanalu
గొప్పగా రాసారు..అభినందనలు..
స్త్రీ విశ్వరూపిణి. అవును. కవిత చాలా బాగుంది. తృష్ణా, మీకు నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Baaga Raasaaru :) Meeku kooda Happy Womens Day :)
చాలా బాగారాసారు
ముగింపు చాలా బాగుంది..శంకర్ గారూ కూడా ఆలోచింప చేసారు !!
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
happy women's day
చాలా బాగా రాశారు. Beautiful! కాస్త ఆలస్యంగా మీకూ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు! :)
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
chala chala bagunndi..:)
happy womens day.. :)
కొంచెం ఆలస్యంగా, అభివందనం !
Post a Comment