ఏమిటీ కాగితం పూలు అనేద్దామనుకుంటున్నారా? అదేం కదు. ఇవి "చుక్కాకు పులు". ఆకుకూరల్లో ఒకటైన చుక్కాకుకు ఈ పూలు పూసాయి.నేనూ ఇదే చూడటం.కుండీలో పెంచిన చుక్కాకు పప్పులోకి రెండు కోతలు అయిపోయాకా ఇలా పూలు వస్తూంటే బాగున్నాయని ఉంచేసాను. కుండీ నిండుగా ఇలా పూసేసాయి. కాగితo పూల్లాగా ఉన్న ఈ పూలు చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇలా ఉంచేస్తే ఎండిపోయి విత్తనాలయిపోతాయని ఉంచేసాను. బాగున్నాయి కదా.
మేమూ లాస్ట్ టైం చుక్కకూర వేసినప్పుడు కొన్నిరోజులు కుదరక కోయకుండా అలా ఉంచేస్తే ఇలా బోల్డన్ని పూలు పూసాయి... మళ్ళీ ఇండియా నించి తెప్పించుకునే బాధ లేకుండా వాటినే విత్తనాలుగా వాడుతున్నాం ఇప్పుడు.. :-)
10 comments:
తృష్ణగారూ, నేనూ మొన్ననే చూసాను. ఎప్పుడూ చూడకపోవడం వల్ల చుక్కకూర లో వేరే ఎదైనా ఆకుకూర కలిసిందెమో అనుకున్నాను కూడా.
చాలా కలర్ ఫుల్ గా బావున్నాయండీ పూలు
ఫోటోగ్రఫీ కేక.
చుక్కాకు పూలు ఫస్ట్ టైం వింటున్నా. చూస్తున్నా.
చుక్కకూర ఇక్కడ తినరు కాని పూలమొక్క క్రింద కుండీలో ఇక్కడ పెంచడం నేనూ చూసాను.
మేమూ లాస్ట్ టైం చుక్కకూర వేసినప్పుడు కొన్నిరోజులు కుదరక కోయకుండా అలా ఉంచేస్తే ఇలా బోల్డన్ని పూలు పూసాయి... మళ్ళీ ఇండియా నించి తెప్పించుకునే బాధ లేకుండా వాటినే విత్తనాలుగా వాడుతున్నాం ఇప్పుడు.. :-)
బాగున్నాయండి
ఎంత అందంగా ఉన్నాయ్! నేను క్రోటన్ అనుకున్నా ;) ఇక ఇంత అందంగా పూలుపూస్తుంటే ఆ మొక్కని ఏం తీస్తాం!!?
Naaku telusu ee poolu, every year nenu kundi lo chukka koora veci last round ala vadilestaa vittanaala kosam :) bavuntai
మేము ఒక చోట తినడానికేమీ దొరక్క చుక్కాకు , తోట కూర పెంచుకుని వాటితోనే కూర, పప్పు, పచ్చడి , పెరుగు పచ్చడి, పకోడీలు, బజ్జీలు అవీ ఇవీ చేసుకు తినేవాళ్ళం..బాగుంటుంది కానీ కొన్నాళ్ళకి బోర్ కొట్టింది..ఫోటోలు బాగున్నాయండీ.
చాలా బాబున్నాయ్ పూలు. పూలకోసమయినా చుక్క కూర పెంచాలి . మీ బ్లాగులో చూసి నేనూ పొటాటో మొక్కలు పెంచాను . ఇప్పుడు ఇదీ ట్రై చేస్తాను. థేంక్యూ తృష్ణ
Post a Comment