సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, March 14, 2011

ప్రకృతి వైపరీత్యాలు

నాల్రోజులు పాటు టివీ, న్యుపేపర్లు చదవలే. ఊరెళ్ళి వచ్చి టివీ పెట్టగానే కనబడ్డా వార్తలు కలవరపెట్టాయి. రాష్ట్ర రాజధానిలో విగ్రహాల కూల్చివేత, జపాన్లో భయంకర సునామీ..భూకంపం....ఇవాళ పొద్దున్నేనేమో రేడియేషన్ భయం..అంటూ వార్తలు..! రాష్ట్రంలో సంగతి గురించి విచారించటం తప్ప ఏమీ చెయ్యలేం. పాపం విగ్రహాలేం చేసాయి...వాటి తాలూకు మనుషులకు కాదు ఇది తెలుగు జాతికి జరిగిన అవమానం అనిపించింది నాకు. రాష్ట్ర భవిష్యత్తు కాలానికే తెలుసు కదా అనుకున్నా..

సూర్యుని కిరణాలు మొదట తాకే నేల కాబట్టి "Land of Rising sun" అని చిన్నప్పుడు చదువుకున్న పాఠo. ప్రపంచయుధ్ధంలో పెద్దఎత్తున నష్టపోయాకా, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు చవి చూశాకా కూడా మళ్ళీ నిలదొక్కుకుని ఆ దేశం సాధించిన ప్రగతి నన్ను అబ్బురపరుస్తాయి. ఇవాళ మరోసారి జపాన్ దేశం లో జరిగిన భీభత్సాన్ని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తోంది. రైల్లో వస్తూంటే "పేపరే చూడలేదు ఈ నాలుగురోజులు. ప్రపంచం ఏమౌతోందో.." అన్నాను. నిజంగానే నాలుగురోజుల్లో ఎన్ని దుర్ఘటనలు జరిగిపోయాయో..

What are natural calamities and how does they occur? అని చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో ప్రశ్న ఉండేది. అది గుర్తొచ్చింది ఇవాళ న్యూస్ చూడగానే.. ప్రపంచంలో ఏదో ఒక చోట మానవుడి ప్రమేయం లేకుండా ప్రకృతి చేసే విలయతాండవ రూపమే ఈ వైపరీత్యాలు... మరి అవి ఎందుకు వస్తాయి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అంటూ పెద్ద జవాబే ఉండేది స్కూలు పుస్తకాల్లో. కానీ వేదాంతధోరణిలో చెప్పాలంటే భూమి మీద పాపాలు పెరిగిపోయినప్పుడు భూమి భారాన్ని దించటానికి దేవుడు ఇలాంటి వైపరీత్యాలు సృష్టిస్తూ ఉంటాడు అని ఎక్కడో చదివిన గుర్తు.

ప్రపంచం ఎంత అభివృధ్ధి చెందినా, అధునాతన సాంకేతికపరిజ్ఞానాన్ని సంపాదించినా ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఆ పరిజ్ఞానానం అంతా మూగపోతుంది. చూస్తూ ఉండటం మినహా ఏమీ చేయలేని నిస్సహాయతలో మిగిలిపోతుంది. అంతా ప్రకృతి మాయ. జపాన్ లో ఈ వైపరీత్యం వాల్ల మరణించిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని, నష్టపోయిన కుటుంబాలు కొంతమేరకైన బాగుపడాలనీ, కనబడకుండా పోయిన కుటుంబసభ్యులు వారి వారి కుటుంబాలను మళ్ళీ చేరుకోవాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. మీరూ ప్రార్ధించండి.

'Japan Earthquake: before and ఆఫ్టర్' అని ఒకచోట దొరికిన ఫోటోలు నేను ఇప్పుడే చూసాను. క్రింద లింక్ లో చూడండి...
http://www.abc.net.au/news/events/japan-quake-2011/beforeafter.htm

6 comments:

జయ said...

Land of rising Sun ప్రస్తుతం చీకటి మయం.
God's forsaken land. సో పిటీ.

SHANKAR.S said...

జపాన్ గత చరిత్రను బట్టి చూస్తే కేవలం ఒక్క ఏడాదిలో వాళ్ళు ప్రకృతి తీసిన దెబ్బకు రెండితల ముందడుగు వేసేయగలరని నా నమ్మకం. అది పెను నష్టమే కానీ వారి స్ఫూర్తి ముందు అది ఆవగింజంత.

ఇక మనవాళ్ళ సంగతంటారా గిరీశం కరెక్ట్ గానే చెప్పాడనిపించింది మొన్న జరిగిన సంఘటనతో :)

రాధిక(నాని ) said...

చాలా దారుణమండి.సునామీ కాకుండా , మల్లి రేడియేషన్ లీకేజ్ ,అగ్నిపర్వతం బద్దలవటం అన్ని ఒకదానికొకటి జతై రెండోప్రపంచ యుద్ధం తరువాత మల్లి అంతటి బయంకరమైనరోజులు జపాన్ ప్రజలు గడుపుతున్నారు.వాళ్ళంతా తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

Rao S Lakkaraju said...

నాకయితే చూసే ధైర్యం లేదు. ప్రకృతి చేసే ద్వంసాలు మానవుడు చేసే ద్వంసాలు చూడటం చాలా కష్టం. మానవుడు చేసే ద్వంసాలకి ఏదో కారణం కధా చెపుతారు. నమ్మేవాళ్ళు నమ్ముతారు లేని వాళ్ళు లేదు. కానీ ప్రకృతికి కధా కమామీషూ లేదు. చేసి చూపిస్తుంది. కారణం మనం ఊహించటమే. బాధ పంచుకున్నందుకు థాంక్స్. థాంక్స్ ఫర్ పోస్టింగ్.

తృష్ణ said...

@జయ: టివీలో అప్డేట్స్ చూసినప్పుడల్లా మనసు కలుక్కుమంటోంది..
ధన్యవాదాలు.

@శంకర్.ఎస్: మీ మాట నిజం కావాలని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@రాధిక(నాని): ప్రార్ధించటం మినహా మనం చెయ్యగలిగిందేమీ లేదండి.
ధన్యవాదాలు.

@రావ్.ఎస్.లక్కరాజు: మనుషులు కారణం చెబుతారు. ప్రకృతి చెప్పదు..చేసి చూపిస్తుంది...very true !
ధన్యవాదాలు.