సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, March 19, 2011

నిరీక్షణ..


నిరీక్షణకు అంతం ఉండదా?
అన్వేషణకు ఫలితం ఉందా?
చెప్పవూ...

చిరుగాలి సవ్వడికి తల ఊపే
ప్రతి పువ్వు కదలికకి
ఆకురాలు నిశ్శబ్దంలోకి
తొంగి తొంగి చూసాను..
దారి పొడుగునా..అడుగడుగునా
పరీక్షించి...ప్రతీక్షించి
వేచి వేచి చూసాను..
ఎక్కడా నీ పాదాల జాడే లేదు.
ఏ చోటా నీ ఆచూకీ దొరకనేలేదు.
ఏమయ్యావు నువ్వు?

క్రితం జన్మలో ఎప్పుడు విడిచావో
ఈ చేతిని...
ఇంతదాకా మళ్ళీ అందుకోనేలేదు..
ఎక్కడని వెతకేది నీ కోసం?
నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాను..

చినుకురాలినప్పుడు..
కమ్మని మట్టివాసన
గుండెనిండా నిండినప్పుడు..
దూరాన గుడిగంటలు
హృదయంలో ప్రతిధ్వనించినప్పుడు..
చల్లని వెన్నెల కిరణాలు
చెట్లమాటు నుంచి
నావైపు తొంగిచూసినప్పుడూ..
మధురమైన రాగానికి పరవశించి
నా గొంతు శృతికలిపినప్పుడూ..
ఎప్పుడూ..
నిన్ను తలుస్తూనే ఉన్నానూ.
కనుల కలలవాకిల్లో నీ రూపాన్ని
ఊహించ ప్రయత్నిస్తూనే ఉన్నాను.

ఈ నిరీక్షణకూ..ఈ అన్వేషణకూ అంతం ఎప్పుడు?
ఏ నాటికి నీ చేయి
నాకు తోడునిచ్చి అందుకునేది?
నిరీక్షణకు అంతం ఉండదా?
అన్వేషణకు ఫలితం ఉందా?
చెప్పవూ...

*** *** *** *** ***

పైన రాసినది ఇప్పుడు రాసినది కాదు...:) 12ఏళ్ళ క్రితం రాసిన ముచ్చట. ఆ తరువాత నాలుగేళ్ళకు మా పెళ్ళి అయ్యింది. అప్పుడిక గట్టిగా చేయిపట్టేసుకుని ఈ కవితను అంకితమిచ్చేసాను...:) "మేరేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అని బలంగా నమ్మే మనిషిని నేను. మధ్యాహ్నం "మాల గారి బ్లాగ్" లో పైన చిత్రాన్ని, ఆ తరువాత మాల గారి ఆహ్వానంపై ఈ రాజా రవివర్మగారి చిత్రానికి కవితలు రాసిన బ్లాగ్మిత్రుల ఇతర కవితలు చదివాకా వెంఠనే నాకు ఈ పాత కవిత గుర్తుకు వచ్చింది. మాల గారికి 'నేను రాస్తానని' పర్మిషన్ అడిగేసి, ఇంటికి వచ్చి పాత పుస్తకాలన్నీ తిరగేస్తే దొరికేసిది - కవిత రాసిన చిన్న స్పైరల్ నోట్ పాడ్. కానీ పనులన్నీ అయ్యేసరికీ ఇంత సమయమైంది. సరేలే ఇవాళ్టి వెన్నెల తోడుంది కదా అనేస్కుని టపా రాసేస్తున్నా.

పైన ఫోటో నాకు నెట్లో దొరికిన మరో ఇమేజ్.

17 comments:

మాలా కుమార్ said...

తృష్ణ గారు ,
చాలా బాగారాసారండి .
మీరు కూడా మాతో కలవటము చాలా ఆనందం గా వుందండి . థాంక్ యు.

SHANKAR.S said...

తృష్ణ గారూ మీ నిరీక్షణ, ఆ ఫోటో రెండూ భలే కుదిరాయి. అన్నట్టు తృష్ణుడు(అంటే ఆయన పేరు తెలియక తృష్ణ గారి భర్త "తృష్ణుడు" అనేశా అన్నమాట. కుసింత క్షమించేస్కోండి :)) గారికి ఇది చూపించారా?

మధురవాణి said...

Cute and sweet! :)

ప్రసూన said...

very sweet poem :-)

శ్రీలలిత said...

ఊహల వాకిళ్ళకి తలుపులుండవు... అవి అలా వచ్చి పోతూనే వుంటాయి..
చాలా బాగుంది మీ కవిత...

బులుసు సుబ్రహ్మణ్యం said...

చాలా బాగుందండీ. నిరీక్షణ ఇంత అందంగా ఉంటుందా అనిపించింది.

శంకర్ గారూ.. చెణుకులు విసరడంలో మిమ్మల్ని మించిన వారు లేరు

తృష్ణ said...

@మాలా కుమార్: రవివర్మ గారి పైంటింగ్ లోని అందం మహిమ. థాంక్స్ ఎ లాట్... మీక్కూడా.

@శంకర్.ఎస్: మీ టపాల్లాగే వ్యాఖ్యలు కూడా సూపరండి. "తృష్ణుడు".భలే ఉందండి పేరు. పొద్దున్నుంచీ ఇదే పేరుతో పిలిచి పిలిచి తెగ నవ్వుతున్నాను...:)
పెళ్లవగానే నేర్చిన కళలన్నీ చూపించానండి...ఆయ్..! కానీ తృష్ణుడుగారికి మన ఫాంటసీ ప్రపంచం మరీ కొత్త. ట్రూలీ ప్రాక్టికల్ మనిషాయే. ఇప్పుడిప్పుడే ఇరు ప్రపంచాలకీ ఇరువురం అలవాటుపడుతున్నాం...:) u know..opposite poles attract !!

ధన్యవాదాలు.

తృష్ణ said...

@మధురవాణి: థాంక్యూ.

@ప్రసూన: హలో..బాగున్నారా? థాంక్స్ అండి.

@శ్రీలలిత: ఊహాప్రపంచానికి ఎల్లలు ఉండవు కదా మరి...:) ధన్యవాదాలు.

తృష్ణ said...

@బులుసు సుబ్రహ్మణ్యం: నిరీక్షణలో అందం, ఆనందంతో పాటే వేదన కూడా దాగిఉంటుందండి. Happy to see your comment సుబ్రహ్మణ్యంగారూ.

జయ said...

చాలా బాగుంది తృష్ణా. ఎప్పుడు ఎదురుచూస్తూనే ఉండాలనిపిస్తోంది. అంత హాయిగా ఉంది.

Hima bindu said...

బాగా రాసారు .

చెప్పాలంటే...... said...

చాలా బావుంది

మరువం ఉష said...

మొత్తానికి, మాలా గారి సంకల్పం, జయా గారి స్పందన, ఇలా మీ అందరి చేతా కొత్తా, పాతా జ్ఞప్తుల్ని వెలికి తీయించాయి. కూల్.

"ఎప్పుడూ..
నిన్ను తలుస్తూనే ఉన్నానూ.
కనుల కలలవాకిల్లో నీ రూపాన్ని
ఊహించ ప్రయత్నిస్తూనే ఉన్నాను."

పుష్కర కాలం నాటి మధుర స్మృతి పంచుకున్నందుకు థాంక్స్.

తృష్ణ said...

@జయ :
@చిన్ని :
@చెప్పాలంటే :
అందరికీ బోలెడు థాంక్యూలు.

తృష్ణ said...

ఉషగారూ, నిజమేనండి. మరోసారి మునుపటి ఉత్సాహం పెల్లుబికింది. నచ్చినందుకు + వచ్చినందుకు ఆదాబ్..:)

Ennela said...

తృష్ణ గారూ, బాగుందండీ.

జ్యోతి said...

చాలా బావుంది. పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసిందన్నమాట ఈ చిత్రం..