సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, March 25, 2011

మరువం పూలు + పేరు తెలీని మొక్క ?


కదంబం లో ఒదిగే మరువం సువాసన మాత్రమే తెలుసిన్నాళ్ళూ. మరువానికి కూడా పూలు పూస్తాయని ఊహన్నా లేదేమిటో. అదివరకూ కూడా కొంత కాలం పెంచాను ఈ మొక్కను. కానీ పూలెప్పుడూ పూయలేదు. ఇదే మొదటిసారి నేను మరువం పూలు చూడటం. నాకులా ఇప్పటిదాకా చూడనివాళ్ళుంటే ఓసారి ఈ ఫోటోలు చూసేయండి.



**** ***** ****

ఈ క్రింది ఫోటోలోని మొక్కలు మా సందులో గోడవారగా మొలకెత్తాయి. ఏం మొక్కలో తెలీక పెరిగేదాకా ఉంచాను. ఇప్పుడు ఇలా తెల్లని పూలు పూస్తున్నాయి. ఆకులకు గానీ, పువ్వులకు గానీ ఏ వాసనా లేవు. వఠ్ఠి గడ్డి మొక్కలేమో కూడా. ఇవేం మొక్కలో ఎవరికన్నా తెలుసా?



8 comments:

SHANKAR.S said...

అయ్యబాబోయ్ తృష్ణ గారూ మొన్న చుక్కాకు పూలు, ఇప్పుడు మరువం పూలు. అసలీ ఐడియాలు ఎలా వస్తున్నాయండీ మీకు?

గోదారి సుధీర said...

నువ్వు పువ్వుల్లా ఉన్నాయి కదా. కాసే వరకు చూడండి తృష్ణ గారు !

చిలమకూరు విజయమోహన్ said...

నువ్వు పూలు.

తృష్ణ said...

@శంకర్.ఎస్: "........ అనంతకోటి ఉపాయాలు.." అన్నారు కదండి పెద్దలు.
ధన్యవాదాలు.

@గోదారి సుధీర: నేనెప్పుడూ చూడలేదండి అందుకనే ఎవరైనా చెప్తారని పెట్టాను. ధన్యవాదాలు.

@చిలమకూరు విజయమోహన్: మీరు చెప్పారంటే 200% కరక్టే. చాలా థాంక్స్ అండి. ఏం మొక్కలో, ఇంటి సందులో మూలకి ఎలా మొలకెత్తాయో తెలియక తికమకపడ్డాను.

సత్భోగి said...

chivari rendu nuvvula mokkalu. modatidi emiti??

తృష్ణ said...

@SatBhog:మొదటి మూడూ మరువం పూలు, ఆ తరువాత ఫోటోలు మూడూ ఒకే మొక్కవి. టపాలో రాసానండి. ధన్యవాదాలు.

సినీరంగం said...

అది నువ్వు మొక్క అయి ఉండవచ్చు.

muddabanti@gmail.com

Unknown said...

అది నువ్వు మొక్కే... అది నువ్వు పువ్వే..