ధక్ ధక్...ధక్ ధక్.. అంటున్నాయి క్రికెట్ అభిమానుల గుండెలు !
బయట వాతావరణంతో పాటే మనుషులూ వేడిగా కనిపిస్తున్నారు...టెన్షన్ తో.
బయట ట్రాఫిక్ సర్దుమణిగిపోయింది.
రోడ్లన్నీ ఖాళీ ఖాళీగా ఉన్నాయి.
మొహాలీ స్టేడియం అంతా తళుకు తారలతో, హేమాహేమీలతో నిండిపోయింది.
అయితే నాకేం బాధ? మనకూ ఆట నాగలోకంతో సమానం కదా. ఎందుకంటే మనం క్రికెట్ చూట్టం మానేసి చాలా ఏళ్లైంది. (నా క్రికెట్ కథ ఆ మధ్యన ఐపిఎల్ టైంలో రాసిన టపా చూసినవాళ్ళెవరికైనా గుర్తుండే ఉండాలి.)
కథ అంతటితో ముగియలేదు. నా చూట్టూరా ఎంతో మంది క్రికెట్ అభిమానులున్నారు..:)
world cup మొదలైన దగ్గర నుంచీ నిన్న రాత్రి శ్రీలంక నెగ్గేవరకూ..." ఫోర్...అబ్బా ఔట్...సిక్సర్...గుడ్ షాట్..." అనే అరుపులతో చెవులు హోరెత్తిపోతున్నాయ్ !
వద్దనుకున్నా స్కోరు,హోరు చెవిన పడుతూనే ఉన్నాయి. ఇక ఎందుకైనా మంచిదని, నాకూ క్రికెట్ తెలుసు అని పాత స్మృతులు నెమరేసుకుంటూ ఓ కన్ను అటు వేసే ఉంచుతున్నా..!
*** *** ***
మొన్నటికి మొన్న ఆటోలో మేము ఆట గురించి మాట్లాడుకుంటూంటే ఆటోడ్రైవర్ కూడా మాట కలిపేసి మొత్తం టీములన్నీ ఎలా ఆడుతున్నారో ఓ చిన్న సమ్మరీ కూడా చెప్పేసాడు . " చూసావా అదీ స్పిరిట్ అంటే...ఈయన కూడా ఎంత బాగా ఫాలో అవుతున్నారో చూడు.." అని శ్రీవారంటే, "ఈ స్పిరిట్, ఎటేంటివ్ నెస్, యూనిటీ మిగిలిన అన్ని విషయాలలో కూడా ఉంటే బాగుండేది" అన్నాను నేను.
*** *** ***
టివీ ఛానల్స్ వాళ్ళకు మరో కొబ్బరికాయ దొరికింది. అన్నీటిలోనూ డిస్కషన్స్..కొన్నింటిలో జ్యోతిష్యులతో సైతం ప్రెడిక్షన్స్. ఇక గెలిస్తే మన ఇండియన్ టీమంత వారు లేరని ఎత్తేయటానికీ...ఓడితే, ఛీ.. వీళ్ళేప్పుడూ ఇంతే! అని తిట్టేసుకోవటానికీ మనం ఎప్పుడూ రెడీనే...
ఒక వేళ ఓడిపోతే... ఆటేమౌతుందోనన్న టెన్షన్ తో హర్ట్ ప్రాబ్లం వచ్చిన వీరాభిమానులకోసమో లేక స్టేడియంలో తొక్కిసలాటలో దెబ్బలు తగిలించుకున్న జనాలకోసమో క్రికెట్ టీంతో ఓదార్పు యత్ర చేయిస్తే బాగుంటుందేమో కదా..
గెలిస్తే...ఏ గొడవా లేదు. (పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి ఫైనల్స్ లో మనం గెలవకపోయినా పర్లేదు అనేకునేవాళ్ళు బోల్డుమంది. )
సో, ఆ సంగతి తేలేదాకా... క్రికెట్ అభిమానుల గుండెలు..
ధక్ ధక్...ధక్ ధక్ !!

5 comments:
""ఈ స్పిరిట్, ఎటేంటివ్ నెస్, యూనిటీ మిగిలిన అన్ని విషయాలలో కూడా ఉంటే బాగుండేది" అన్నాను నేను. "
ఇందాకా టీవీల్లో ఈ గోల చూసి నాకూ ఇదే అనిపించింది. ఇదే స్పిరిట్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం లోనూ, ఎన్నికలలో ఓటు వెయ్యడం లోనూ మనవాళ్ళు ఎందుకు చూపించరా అనిపించింది. అంతెందుకు ఇప్పుడు మాల్స్ దగ్గర, ఆఫీసుల్లోనూ చూడండి ఆంధ్ర వాడు, తెలంగాణా వాడు కలిసే మ్యాచ్ చూస్తారు. మ్యాచ్ అయిపోగానే మళ్ళీ మన గొడవలు మొదలు.
"ఇక గెలిస్తే మన ఇండియన్ టీమంత వారు లేరని ఎత్తేయటానికీ...ఓడితే, ఛీ.. వీళ్ళేప్పుడూ ఇంతే! అని తిట్టేసుకోవటానికీ మనం ఎప్పుడూ రెడీనే... "
మన దేశం లో క్రికెట్ పట్ల అభిమాన చూస్తే నాకు ఎప్పుడూ శ్రీ శ్రీ గారి
"నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యం తో వీరు
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నేనొరిగిపోతే
నిర్దాక్షిణ్యం గా వీరే " గుర్తొస్తుంది
ఇందాకా స్టూడియో ఎన్ లో వాడెవడో న్యుమరాలజిస్ట్ అనుకుంటా మొహాలీ "M" తో ప్రారంభమవుతుంది దాని సంఖ్య 3 , మహేంద్ర సింగ్ ధోనీ పేరు కూడా "M" తోనే ప్రారంభమవుతుంది కాబట్టి గెలుపు మనదే. అనగానే భలే చిర్రెత్తుకొచ్చింది. ఒరేయ్ పిచ్చి వెధవా పేర్ల బట్టి గెలవరు, బాగా ఆడితే గెలుస్తారు అని డిప్ప మీద కొట్టి చెప్పాలనిపించింది.
శంకర్ గారు, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
అసలు ఈ టీవీ వాళ్ళను ఒకటి అడగాలని ఉంది తృష్ణ గారు, మూడ నమ్మకాలను నమ్మొద్దు బాబాలను నమ్మొద్దు అని లెక్చర్లు దంచే వీళ్ళే ఇటువంటి టైం లో జాతకాల వాళ్ళను పట్టుకొచ్చి చెత్త ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. మళ్ళీ ఈ మద్య గంటల గంటలు యాడ్స్ రూపం లో ఈ అంతరాలను ధరించండి, మా రాళ్ళను ధరించండి అనే భుతకపు యాడ్స్ ని ఈ న్యూస్ చానెల్ వాళ్ళే డబ్బులకు కక్కుర్తి పది మన మీదే రుద్దుతున్నారు. ఇదెక్కడి న్యాయమో అర్ధం కాక చస్తున్నాను.
బాగుంది...నేను కూడ శంకర్ గారి అభిప్రాయంతో ఏకిభవిస్తున్నా..
@సతీష్ ధనేకుల: నాకూ అర్ధం కాదండి. బాగా చెప్పారు..ధన్యవాదాలు.
@డేవిడ్: ధన్యవాదాలు.
Post a Comment