సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, March 3, 2011

ఇవాళేం చేసానంటే..


ఆయ్యో ఇవాళ బ్లాగనేలేదు... అసలు రోజూ రాయాలా? రూలేమీ లేదు. కానీ వీలైనంతవరకూ నాకోసం నేను ఈ ఈ-కబుర్లు రాస్కుంటూనే ఉంటాను. ఇంతకీ టపా రాయకుండా ఇవాళ ఏం చేసినట్లు? నిన్న చాంతాడంత క్యూ ఉందని సాములారి దర్శనం చేసుకోకుండా వచ్చేసాం కదా. అందుకని పొద్దున్న పనులయ్యాకా మళ్ళీ గుడికి వెళ్ళి ఓసారాసాములారిని పలకరించి, కాసిన్ని పాలు అభిషేకించి, ఓ దణ్ణమెట్టేసుకుని వచ్చేసామన్నమాట. ఇప్పుడొచ్చావ్... అప్పుడొచ్చావ్...అని కోప్పడడు కదా పెద్దాయన. మనుషులకైతేనే భయపడాలి. దేవుళ్ళకు భయపడక్కర్లేదు. ఎందుకంటే మనమేంటో ఎదుటోళ్ళకన్నా, మనకన్నా, బాగా తెలిసినది దేవుళ్ళకే కాబట్టి.

ఇంకా ఏవేవో పనులు...ఇప్పుడేమో మరి రాత్రయిపోయింది కదా ఇంకేం కబుర్లాడతాను? టయిం లేదు...ప్చ్! అంద్కని ఇప్పుడే చేసిన "stuffed capsicum" కూర ఫోటో పెట్టేస్తాను చూసేయండి...ఈసరి గ్రేటెడ్ పనీర్ అదీ వేయకుండా సాత్వికమైన కర్రీలా వండేసాను. టేస్ట్ కూడా బానే ఉంది. మీకు నచ్చిందనుకోండి, "రుచి..." బ్లాగ్ లో మళ్ళీ చేసేస్కుందాం. ఎల్లెల్లవమ్మా. నువ్వు చెప్పేదేమిటి? గూగులమ్మ నడిగితే రెసిపీ చెప్పేస్తుంది అంటారా? అయితే నేనే తినేసి హాయిగా బజ్జుంటాను.


అదిగో బొమ్మ బాగుంది కదా...అడిగేయండి...అడిగేయండి..ఎలా చేసానో చెప్పేస్తాను..!!

16 comments:

Rani said...

అడిగేసినట్టే, చెప్పెయ్యండి :)

రాధిక(నాని ) said...

ఉరించకుండా ...ఎలా చేసేరో కాస్త చెబుదురూ...

నైమిష్ said...

త్రుష్ణ గారు తొందరగా మీ రుచి బ్లాగులొ ఎలా చెయ్యాలో పెట్టెయ్యెండి..మేము ఈ వీకు ఎండింగ్ చేసేస్కొని మీ పేరు చెప్పేస్కొని తిని తొగుంటాము...

Bhãskar Rãmarãju said...

నేను నా కొట్టు మూసేసాఅన్నేగా ధైర్యంగా ఇల రాసేస్తున్నారు.

మళ్ళీ తెరుస్తా. అప్పుడు అప్పుడు చెప్తా మీ బెంగుళూరు మిరగాయ రుచో లేక మా పల్నాటి పోపు ఘాటో.

అప్పటిదాకా అరవకుండా మూ బ్లాగు సదూతా ఉంటా.

ఓమారు ఇక్కడో లుక్కు వేయండి
http://krishna-diary.blogspot.com/2011/02/blog-post_25.html

SHANKAR.S said...

"దేవుళ్ళకు భయపడక్కర్లేదు. ఎందుకంటే మనమేంటో ఎదుటోళ్ళకన్నా, మనకన్నా, బాగా తెలిసినది దేవుళ్ళకే కాబట్టి."
అసలు రష్ ఉండే రోజుల్లో కంటే (అంటే సోమవారం శివాలయం, శనివారం వెంకటేశ్వర స్వామి గుడి లాగ ) మామూలు రోజుల్లో వెళ్తేనే కుసింత తీరిగ్గా దేవుడ్ని చూడచ్చేమోనండీ. అయినా మన పిచ్చి కాకపోతే దేవుడికి స్పెషల్ రోజులేంటి? ఏదో ఆరోజే ఆయన దేవుడు, మిగిలిన రోజుల్లో కానట్టు.

అవును ఇంతకీ ఎలా చేశారు? ఆ రెసిపీ ఏంటి? (హమ్మయ్య అడిగేశా)

ఇందు said...

'ఎలా చేసారో చెప్పరూ?'అడిగేసా!అడిగేసా! పెట్టేయండి మరీ!!

[చూసారా...నేనెంత గుడ్ గర్ల్ నో!!]

మధురవాణి said...

అబ్బ.. ఎంత రుచిగా ఉందొ చూడ్డానికి.. నాకు తినాలనిపిస్తుంది చూస్తుంటే... తొందరగా రెసిపీ చెప్పెయ్యండి మరి! :)

Ennela said...

చెప్పేయండి, చెప్పేయండి....

kumar said...

Choodataanikichala bagundi.Eppudu oil companies ad lo chudatam tappinchi ee curry nenu tinaledu. Meeru chepite nenu okasari try chestaanu.

తృష్ణ said...

@రాణి: చాలా రోజులకు కనబడ్డారు..సంతోషం.
చెప్పేస్తాలెండి. ధన్యవాదాలు.

@రాధిక(నాని): మరి నా "రుచి..." వైపు రావాలి...ధన్యవాదాలు.

@నైమిష్: త్వరగా రాసేస్తాలెండి. ధన్యవాదాలు.

తృష్ణ said...

@భాస్కర్ రామరాజు: ఇదన్యాయం అన్నగారు. మీకు పోటీ వచ్చేంత ఉద్దేశం, ధైర్యం లేవని ముందుగానే చెప్పాను. కావాలంటే పాత టపాలు తిరగేయండి...
అయినా మీరీమధ్యన బొత్తిగా కొట్టు తెరవట్లేదని.. ఇలా అప్పుడప్పుడు ఇన్స్పైర్ చేద్దామనన్నమాట...:)
"నేను గానీ పోపు గానీ పెట్టానంటే..." అని సూర్యాకాంతం లెవెల్లో డవిలాగు చెప్పేసి, ఇహ త్వరగా మీ పోపు ఘాటు ఇండియా దాకా తగలనీయండి...!!

అక్కడ జవాబిచ్చేసా...:)

తృష్ణ said...

@శంకర్.ఎస్: మీ మాట కరక్టే నండి. మొన్న ఇసుకేస్తే రాలనట్లున్న గుడిలో నిన్న మేం తప్ప ఎవరూ లేరు..:) పెళ్ళికాక ముందు నేనూ ఇలానే అనేదాన్ని. కానీ అదేమిటో పెళ్ళయ్యాకా కాస్త పాతివ్రత్యం పాళ్ళు ఎక్కువయ్యి, పండుగరోజుల్లో దైవ దర్శనం చేసేస్కుని కూసింత ఎక్కువ పుణ్యం సంపాదించేసి సగం మావారికి అందించేయాలని అత్యాశ...:)

సీరియస్ గా చెప్పాలంటే పండుగరోజుల్లో దైవ దర్శనానికి ప్రాముఖ్యత ఉందండి.

అలా "రుచి.." కేసి ఓ లుక్కేసి ఉంచండి మరి.

తృష్ణ said...

@ఇందు: "you are a good girl
you are a good girl
you are a good girl..."

(little soldiersలో పాటలా పాడుకోవాలన్నమాట)

@మధురవాణి: తినడానికి కూడా బాగుందని తిన్నవాళ్ళు కూడా అనేసారు...:)
ధన్యవాదాలు.

తృష్ణ said...

@ఎన్నెల: అల్గలాగే...
ధన్యవాదాలు.

@కుమార్: అదివరకూ ఆయిల్ ఏడ్స్ లో చూసాకే నాకు చెయ్యాలని ఉత్సాహం వచ్చి నేర్చుకున్నానండి.

ధన్యవాదాలు.

విరిబోణి said...

Tvaragga cheppeyandi ela cheyaalo :))

తృష్ణ said...

@విరిబోణి :
my recipe link:
http://ruchi-thetemptation.blogspot.com/2011/03/stuffed-capsicum.html

Thank you.