సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, March 2, 2011

మహా దేవ శంభో ...



(బిక్కవోలు గుడిలో ఫోటో)

శివరాత్రి సందర్భంగా శివునిపై కొన్ని ఓల్డ్ గోల్డీస్...

మహా దేవ శంభో (భీష్మ)

హర హర మహాదేవ(దక్ష యజ్ఞం)

దేవ దేవ ధవళాచలమందిర(భూకైలాస్)


నీలకంధరా దేవా(భూకైలాస్)

శైలసుత హృదయేశా(వినాయక చవితి)


------------------------

అదివరకూ నేను టపాయించిన తనికెళ్ల భరణిగారి రచించి, పాడిన "నాలోన శివుడు కలడు" పాటలు:
http://trishnaventa.blogspot.com/2009/11/blog-post_16.హ్త్మ్ల్

ఆదిశంకరాచార్య విరచిత "నిర్వాణ షట్కం" :
http://trishnaventa.blogspot.com/2010/05/blog-post_18.హ్త్మ్ల్

12 comments:

శివ చెరువు said...

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు

రామరాజ్యం said...

ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభోశంకర.

కొత్త పాళీ said...

శివరాత్రి శుభాకాంక్షలు.
ఫొటోలో బొమ్మ భలేగా ఉంది.
శ్రీకాళహస్తి మహత్యం అని ఒక పాత సినిమా ఉండలి. దాని లంకెలేమైనా తెలిస్తే చెప్పగలరు.

కొత్త పాళీ said...

నాకు ఇవి దొరికాయి.
http://www.youtube.com/watch?v=PYBBoGHG2UQ
http://www.youtube.com/watch?v=e32MPnCa4FY
http://www.youtube.com/watch?v=xZdES7cgDBk
http://www.youtube.com/watch?v=fFniyGGUJbo

తృష్ణ said...

@కొత్తపాళీ: అరే, ఇప్పుడే వెతుకుతున్నా ..ఇంతలో మీరే లింక్స్ ఇచ్చారు. ధన్యవాదాలు.
మాష్టారు గారు, నా బ్లాగ్ పై శీతకన్ను వేసారు....:(
ఇన్నాళ్ళకైనా ఇటు విచ్చేసినందుకు బోలెడు థాంకూలు.

తృష్ణ said...

@కొత్తపాళీ: పొద్దున్న యూట్యూబ్లో ఎన్టీఆర్ గారి తాండవం క్లిప్పింగ్ దొరికితే పెడదామనికుని మీరు గుర్తువచ్చి, మీరేమంటారో అని మానేసా..:)

SHANKAR.S said...

మీ ఈ పోస్ట్ కి కామెంట్ పెట్టడానికి ఇప్పటికి శివుడాజ్ఞ అయినట్టుంది :)

బిక్కవోలు దాకా వెళ్ళారంటే ద్రాక్షారాం, సామర్లకోట కూడా చూసే ఉంటారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో పుష్కరాల టైం లో పెట్టిన శివుడి విగ్రహం భలే ఉంటుందండీ. నాకు అన్నిటికన్నా నచ్చింది మాత్రం బెంగుళూరు కెంప్ ఫోర్ట్ లోదే.
భూకైలాస్ / సీతారామ కల్యాణం లో రావణాసురుడి కైలాసం సీన్స్ కూడా పెడితే బావుండేది. ముఖ్యంగా రుద్రవీణ. ఎన్టీవోడు కేకో కేక :)

కొత్త పాళీ said...

@తృష్ణ, ఇది మరీ బావుందండోయ్. మధ్యలో నాకెందుకు అభ్యంతరం మీరు NTR చేసిన తాండవం పెడితే?

@శంకర్, అవును, రాజమహేంద్రి కోటగుమ్మం దగ్గర రెండు బిందెలతో తానే అభిషేకం చేసుకుంటున్న శివుడి బొమ్మ చాలా బావుంటుంది.

SRRao said...

తృష్ణ గారూ !
మంచి ఫోటో ఉంచారు. మీకు, మీ కుటుంబానికి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.

తృష్ణ said...

@శివ చెరువు: ధన్యవాదాలు.

@రామరాజ్యం:ధన్యవాదాలు.

తృష్ణ said...

@శంకర్: బిక్కవోలు,ద్రాక్షారం కబుర్లన్నీ "తూర్పు గోదావరి ప్రయాణం" టపాల సిరీస్ లో రాసానండి. వీలున్నప్పుడు చూడండి. రాజమండ్రి లో చూసాను కానీ బెంగుళూరు లోది తెలీదండి. ఈ మధ్యన వెళ్లలేదు.

నిన్న కొంచెం హడావుడిలో ఉండి ఆలోచించే వ్యవధి లేక టపా కూడా గుర్తొచ్చిన పాటలు మటుకు పెట్టానండి.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@కొత్తపాళీ: ఆ మధ్యన ఒకచోట ఒక టపాలో నృత్యం బాగున్నా శాస్త్రీయంగా లేదు అని మీరు రాసిన వ్యాఖ్య గుర్తు. (మీరు కాదేమో కూడా) నిన్న ఎన్.టి.ఆర్ ది కూడా నాకు బాగున్నా అది శాస్త్రీయంగా ఉందో లేదో...అని డౌట్ వచ్చిందండీ. అదండి సంగతి.

@ఎస్.ఆర్.రావు: మీక్కూడా ఆ మహాదేవుని కృపాశీస్సులు అందాలని కోరుతున్నానండి. ధన్యవాదాలు.