(నిన్నటి సాయంత్రపు ఊసులివి...)
ఇప్పుడే వాన వెలిసింది...చెట్ల చివర్ల నుంచి వర్షపు బొట్లు ఒక్కొక్కటే నేల రాలుతున్నాయి..మెల్లగా వీస్తున్న గాలికి కొమ్మలు చిన్నగా తలలూపుతు తమ హర్షాన్ని వ్యక్తపరుస్తున్నాయి..రామచిలుకలు ఇళ్లకు వెళ్ళాలా వద్దా అని యోచిస్తున్నట్లు కొమ్మ కొమ్మకీ అటు ఇటు ఎగురుతున్నాయి...వాన కురిసేప్పుడు ఒకరకమైన అందమైతే,వాన వెలిసాకా ప్రకృతిది మరో రకమైన అందం!వాన వెలిసిన తరువాత అలసట తీర్చుకుంటున్నట్లు నిశ్సబ్దంగా పలకరించే నిర్మలమైన ఆకాశం ఒక మౌన మునిలా గోచరిస్తుంది!!ఈ నిశ్శబ్దంలో నాలో ఎన్నో ఆలోచనలు...వంట్లో బాలేకపోతే ముసుగుతన్ని పడుకోక ఎందుకొచ్చిన రాతలూ?అని మనసు కసురుతున్నా "తిరిగే కాలూ,తిట్టే నొరూ.."అన్నట్టు..రాసే చేతికి విశ్రాంతి ఉండదు...మనసులో అలలై ఎగసే భావాలను కాగితం పైనో,నోట్ ప్యాడ్ పైనో రాయకపోతే తొచదు...
ఒకప్పుడు 300పేజీల పుస్తకాన్నయినా ఒక్కపూటలో,ఇంకా మాట్లాడితే 3,4 గంటల్లో పూర్తి చెయ్యగల నేను,గత నెల రోజులుగా 170పేజీల పుస్తకాన్నిపూర్తి చెయ్యలేకపోవటం నాకే ఆశ్చర్యం.చూసే సినిమాకో,చదివే పుస్తకానికో మధ్యలో ఆటంకం వస్తే ఇల్లెగిరిరేలా నే చేసిన హాహాకారాలు,పెట్టిన పెడ బొబ్బలు చిన్ననాటి ముచ్చట్లుగా మిగిలిన జ్ఞాపకాలే! ఇప్పుడలాటి హా హాకారాలన్నీ గుండె గొంతుకలోనే నిలిచిపోతాయి...బాధ్యతతొ కూడిన పెద్దరికం మాట్లాడనివ్వదు మరి.అప్పుడు చివుక్కుమన్న అమ్మ మనసు ఇప్పుడు కనిపిస్తుంది..!కూరలు తరిగేప్పుడు వేలు కోసుకున్నా,పరధ్యానంలో వేడి కుక్కర్ తగిలి చేయి కాలినా,ఒళ్ళు వెచ్చబడినా అమ్మానాన్నల ఓదార్పుకై మనసు పరుగులు తీస్తుంది...ఇప్పుడు ఓదార్పు లేక కాదు,అమ్మానాన్నలు ప్రేమతో "అయ్యో" అంటే సగం తగ్గిపోయే నెప్పి గుర్తుకువస్తుంది!!కాలం పరుగులో వయసనే బంధనం శరీరానికే గానీ మనసుకు కాదు కదా.బాధ్యత,విధి నిర్వహణ లాంటి ఎన్ని బరువులు అది మోసినా,భార్యగా,కోడలిగా,తల్లిగా ఎన్ని కొత్త పదవుల్లో చేరినా...మనసులో ఎక్కడో మూలన దాగిఉన్న పసిమనసు ఇంకా "పుట్టింటికే పరుగులు" తీస్తూ ఉంటుంది సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో పాటలాగ!!
ఇలా అలవాట్లలో మార్పులు,పనుల్లో తగ్గిన జోరు,ఆవేశంలో స్మరణకొచ్చే ఆలోచన,ఆలోచనల్లో వచ్చిన నెమ్మదితనం,వాదన స్థానంలో మౌనం...ఇవన్నీ పెళ్ళి తెచ్చిన మార్పులు అనటం కన్నా వయసు తెచ్చిన పెద్దరికపు లక్షణాలు అని మనసు తెలియచేస్తూ ఉంటుంది.కానీ కొన్ని విషయాల పట్ల మాత్రం విముఖత,అనాసక్తి రెండూ ఖచ్చితంగా ఏర్పడిపోయాయి.చిన్నతనపు అల్లరులూ,కేరింతల స్థానంలో ఏదో తెలియని నిశ్శబ్దం..!మనతో కలిసి నిన్నటివరకూ తిరిగిన దగ్గరి మనుషులు హఠాత్తుగా దూరమైనప్పుడు అర్ధమైన జీవనతత్వం. చివరికి మిగిలేదేమీ లేదని అర్ధమైనందువల్ల కలిగిన నిర్వేదం..!!
అన్ని భావాలకూ అతీతమైన నిర్లిప్తత..అది.
ఏమిటిది...ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్పోతున్నాయి ఆలోచనలు.....ఇలా పొంతనలేని గజిబిజి ఆలోచనలతో బుర్ర వేడేక్కినప్పుడు ఎప్పుడు చేసే పనే ఇప్పుడూ చేసాను....
మీడియ ప్లేయర్లో పాట పెట్టేసాను....
"మేంబో మామియా....ప్రేమ ఒక మాయ...
సునామి లాగ దాహమొచ్చినాది,వేగమొచ్చినాది...".
ఇలాటి హుషారైన పాటలు నాలుగు వింటే అంతుపట్టని ఆలోచనలన్నీ...ఢమాల్!!
తుక్కునంతా రీసైకిల్ బిన్లో పడేసినట్లు...కంప్యూటర్ లో రిఫ్రెష్ కొట్టినట్లు.....!!
23 comments:
ఇదేమిటబ్బా ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అని అనుకున్నానో లేదో, మీక్కూడా అదే ఆలోచన వచ్చి పాట పెట్టేశారు.. వర్షం అంటే ప్రకృతికి స్నానం కదండీ.. మనకి ఆహ్లాదం...
:) ఇలాగే రాస్తూ ఉండండి, నెమ్మదిగా ఆలోచనల వేగమంతా అక్షరాల్లోకి వచ్చి చేరుతుంది.
మాటల గారడి చెసి భలే ఆహ్లదమైనా ముచ్చట్లు చెప్పారు.పోటొ కుడా సుపర్ అది మీ ఉహాల ఉప్పెనలా కాక తెమ్మరాపిల్లగాలి లా ఉ౦ది.
వర్షం వెలిసిన సాయింత్రం ఆరుబయట కూచొని, వేడి వేడి పకోడీలో లేక కాల్చిన మొక్క జొన్న కండీ నో తినుకుంటూ, సరదాగా ఎవరితో అయినా కబుర్లు చెప్పుకునుంటే మీకు ఇలా ఆలోచనలు ప్రవాహంలో ముంచెత్తేవి కాదండీ...
@ మురళి: ఆలొచనలు గజిబిజిగా ఉన్నా రాసిన అక్షరాల పట్ల ఉన్న ఇష్టం వల్ల ప్రచురించేసానండి...ధన్యవాదాలు.
@ అరుణపప్పు: చెప్పడానికి చాలా కబుర్లు ఉన్నాయండి...చాలా రాయాలి..ఇలాంటి ఊసుపోని కబుర్లు కాదుగానీ..మంచి విషయాలే!!
@ సుభద్ర:నా రాతలు నిజంగా బాగున్నాయంటారా....?!ధన్యవాదాలు.
@ శేఖర్ పెద్దగొపు:కాలేజీరొజుల్లో వర్షం వస్తే చాలు వేడి వేడి ఉల్లిపాయ పకొడీలు నేనే చేసేసి అందరికీ తినిపించేసేదాన్నండి...ఒక్కసారి ఆ రోజులు గుర్తొచ్చాయి మీ వ్యాఖ్య చూడగానే...ధన్యవాదాలు.
very well said.
శేఖర్ .. మీరు కోరుతున్నది ఎంత గొంతెమ్మ కోరికో ఇంకొంచెం పెద్దవారైతే గాని మీకు తెలీదు.
very well said.
శేఖర్ .. మీరు కోరుతున్నది ఎంత గొంతెమ్మ కోరికో ఇంకొంచెం పెద్దవారైతే గాని మీకు తెలీదు.
ఒక్కోరోజు ఇలాంటి నిర్లిప్తత అవరిస్తుంది ఎందుకో తెలియదు. మరలా మనమే రిచార్జీ అవ్వాలి. ఫోటు చాలా బాగుంది.
@ కొత్తపాళీ: ధన్యవాదాలు.
@సునీత:అవునండి...రిచార్జ్ అయిపొయా...!!
ధన్యవాదాలు.
హ్మ్మ్... ఏమిటో కదా ఈ వర్షం వెలిసిన సాయింత్రాలు, ఒంటికి నలతైన శరీరాలు, అలసటే లేక పరుగెట్టే మనఃసంధోహాలు... గజిబిజి ఆలోచనలు, ఒప్పులకుప్ప ఆడే సంతోషాలు.... హ్మ్మ్
కామెంట్ అల్లిబిల్లి గా ఉందా, మరి వాన వెలిసిన వుదయం, తప్పక చెయ్యవలసిన పని.... నాకు అంతే వుంది తృష్ణా..
వాన వెలిసాక ప్రకృతిని చూసి మీక్కలిగిన అందమైన అనుభూతిలో నాకూ భాగస్వామ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు :)
నాకు కనీసం ఏ చెయ్యి నొప్పో, జలుబో వచ్చినా కూడా వెంటనే ఇల్లు గుర్తోచ్చేస్తుంది. మిగతా అప్పుడు బానే ఉంటాగానీ, ఒంట్లో కాస్త బాలేదు అనిపిస్తే ఇక అంతే.. బోలెడంత బెంగ వచ్చేస్తుంది ఇంటి మీద.
హమ్మ్.. నిర్వేదం, నిర్లిప్తత.. నేను కూడా కొంచెం ఈ టైపులోనే పోస్టు రాశాను ఇవ్వాళ. వీలైతే చూడండి.
చాలా చక్కగా రాసారు.ఇలాంటి ఆలోచనలు నాకూ అనుభవమే.
@భావన:"అల్లిబిల్లి కలలా రావే..అల్లుకున్న కథలా రావే..." పాట గుర్తు వచ్చిందండి ఆ పదం చూడగానే...
చక్కని పాట గుర్తు తెచ్చారు..ధన్యవాదాలు.
@రాధిక:పొద్దున్న పొస్ట్ పెడుతూంటే మీరు గుర్తు వచ్చారు ఎందుకో..చూస్తారేమో అనిపించింది..నా 6th సెన్సె బానే పనిచేస్తోందండోయ్....
@ మధురవాణి:అన్నింటికీ వ్యాఖ్యలు రాయకపోయినా,మీ పోస్ట్ లు నేను తాప్పక చుసే వాటిల్లో ఉంటాయి...ఇవాళ ఇంకా చూడలేదు..ప్రస్తుతం "Iron Man" చూస్తున్నా(HBO లో).Theatreలొ చుసా కానీ టి.వీలో వస్తూంటే చూసెయ్యాలి కదా మరి..!!ఆయ్యాకా తప్పక చూస్తాను.
కొన్ని కొన్ని చాలా టచింగా ఉంటాయ్.
కొన్ని కొన్ని జ్ఞపకాలు కళ్ళల్లో నీళ్ళని నింపుతాయ్.
పుట్టిల్లు అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకూ ఉంటయ్ కదా..
బాగుంది.
కాకపోతే ఆ పాటే అర్ధంగాలే!!
ఎంత చక్కగా రాసారండి మీ భావాలని.
నేను కుడా శేఖర్ గారిలాగానే అనుకున్నానండి.. కొత్తపాళీ గారు చెప్పినట్టు ఇంకా మచూరిటీ రావాలేమో!!
@భాస్కర్ రామరాజు: busyనా?
మల్లన్నలో పాట గురించా మీరు అడిగింది?ఆలోచనలతో మనసు బరువెక్కినప్పుడు అలాంటి కొన్ని హుషారు పుట్టించే పాటలు వింటే..నా మనసు తేలికౌతుంది అని రాసానండి..అందులో అర్ధంకానిదేముందండి?
@పద్మార్పిత:ధన్యవాదాలు.
@ప్రణీత.స్వాతి :అనుభవమైతే మీకే అవగతమౌతుందిలెండి..ధన్యవాదాలు.
తృష్ణ గారూ,
నా టపాలు తరచూ చూస్తుంటారని చెప్పడం చాలా సంతోషాన్నిచ్చింది. ధన్యవాదాలు మీ ఓపికకి :)
మీకు ఓపెన్ అవ్వలేదన్న లింక్ ఇక్కడ ఇస్తున్నాను. మరోసారి ప్రయత్నించండి.
http://madhuravaani.blogspot.com/2009/08/blog-post_28.html
బాగా రాసారండి.
వర్షం పడుతుంటే చదివాను అనుకోకుండా .
వెలిసాక బయటికి పోతీ మీరు చెప్పినవి ఏమి లేవు.
రోడ్లు ,భవనాలు తప్ప.
ఇండియా గుర్తొచ్చిందిబాగా రాసారండి.
వర్షం పడుతుంటే చదివాను అనుకోకుండా .
వెలిసాక బయటికి పోతీ మీరు చెప్పినవి ఏమి లేవు.
రోడ్లు ,భవనాలు తప్ప.
ఇండియా గుర్తొచ్చింది
@మా ఊరు :మీరిప్పుడు ఇండియాలో లేరా?మీ బ్లాగ్లో లొకేషన్ AP అని రాసారేమి?
Post a Comment