సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, August 31, 2009

క్షీరాబ్ధి ద్వాదశి

నేను దాచుకున్న కొన్ని కధల్లో కోరుకొండ సత్యానంద్ గారు "క్షీరాబ్ధి ద్వాదశి" మీద రాసిన కధ ఒకటి.కధలు చదివే ఆసక్తి కలవారు చదువుకుందుకు వీలుగా పి.డి.ఎఫ్. ఫైల్ లింక్ ను ఇక్కడ పెడుతున్నాను.
http://www.mediafire.com/file/zyvzoi4zmmi/ksheerabdi%20dwaadasi.pdf

కొన్ని పర్వదినాలంటే నాకు చాలా ఇష్టం.కార్తీక పౌర్ణమి,మాఘపాదివారాలూ,ముక్కోటి ఏకాదశి,రధ సప్తమి,క్షీరాబ్ధి ద్వాదశి...ఇలాగ.చిన్నప్పుడు తులసికోట ముందర కూర్చిని,దాంట్లో ఉసిరి కొమ్మ పెట్టి అమ్మా చేసే "క్షీరాబ్ధి ద్వాదశి" పుజ అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది.పెళ్ళయ్యాకా నేను చేయటం మొదలెట్టాను...!క్షీరాబ్ధి ద్వాదశి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.కానీ తెలియనివాళ్ళెవరైనా ఉంటే,వాళ్ళ కోసం--

కార్తీక మాసంలోని శుక్లపక్ష ద్వాదశిని "క్షీరాబ్ధి ద్వాదశి" అంటారు.పురాణ కధనం ప్రకారం__విష్ణువు చెప్పగా,దేవదానవులు పాలకడలిని (క్షీరాబ్ధిని) మధించిన రొజు ఇది.అందువల్ల ఈ పేరు వచ్చింది.అంతేకాక,ఆషాఢ శుక్ల ఏకాదశినాడు యోగనిద్ర ఆరంభించే విష్ణువు కార్తిక శుధ్ధ ఏకాదశినాడు తన నిద్రను ముగిస్తాడు.మరుసటి దినమైన "క్షీరాబ్ధి ద్వాదశి"నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై,బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు.అందువల్ల ఈ రోజుని "బృందావన ద్వాదశిగా కూడా పిలుస్తారు.ఈ రొజు సాయంత్రం విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మను,లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్క పక్కన పెట్టి పూజ చేస్తారు.ఈ ప్రదేశాన్ని వీలైనన్ని దీపాలతొ అలంకరిస్తారు కూడా.సంవత్సరంలో ఏ రొజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం,ఈనాడు దీపారాధన చేయటం వల్ల పరిహారమౌతుంది అంటారు.

7 comments:

Anonymous said...

మంచి కథ చదివించారు.

మా ఊరు said...

"క్షీరాబ్ధి ద్వాదశి" ఎప్పుడు వినలేదు .కాని కధ చాలా బావుంది

తృష్ణ said...

@harephala:thankyou verymuch for the visit.

@మా ఊరు:తెలుగు కేలెండర్ చుసే అలవాటు ఉంటే,ఏ సంవత్సరం కేలండర్లోనైనా కార్తికమాసంలో వచ్చే పర్వదినాల జాబితాలోరాసి ఉంటుందండి....ఇది ఎక్కువమందికి తెలియకపోయి ఉండచ్చు.
thankyou verymuch for the visit.

Ruth said...

ఈ కథ ఈనాడు ఆదివారం ఎడిషన్ లో వచ్చింది కదా? అప్పుడు చదివాను. పేరు కొంచెం కొత్తగా ఉండటం వల్ల గుర్తు వుంది. మంచి కథ.

తృష్ణ said...

@ruth:yes...its from eenaaDu sunday book.Longback i use to buy sunday editions of eenaaDu..!
Thankyou for the visit.

మురళి said...

జ్ఞాపకాల తెనేతుట్టెని కదిలించారు కదా.. కార్తీకం అంటే చాలా ఇష్టం, చిన్నప్పుడు.. చాలా విశేషాలే ఉన్నాయండి ఇందుకు సంబంధించి.. మీ టపా బాగుంది.. కథ ప్రచురితమైనప్పుడు చదివానండి.. మంచి కథ..

తృష్ణ said...

@ మురళి:అయితే మీ టపా కోసం ఎదురుచూస్తాం.ధన్యవాదాలు.