
నా చిన్నప్పటి వరకూ ఇరుగుపొరుగువాళ్ళని అత్తయ్యగారు,అక్క,వదిన,పిన్ని అని వరుసలు కలిపి పిలిచేవారు.రాను రానూ ఆ పిలుపులు పూర్తిగా తప్పిపొయాయి.ఆడవారందరికీ అన్వయించే ఒకే పదం అమలులొకి వచ్చేసింది..."ఆంటీ".ఇరుగుపొరుగు వాళ్ళే కాకుండా కూరలవాళ్లు,పాలవాళ్ళు అందరూ అదే పదం వాడటం మొదలెట్టారు..
బాగా చిన్నపిల్లలని పేరు పెట్టి పిలుస్తారు.స్కూల్,కాలేజీలకి వెళ్ళే పిల్లలని,పెళ్ళికానంత వరకూ "అక్క" అంటారు.ఇంక పెళ్ళి అయ్యిందో "ఆంటీ" నామకరణం జరిగిపొతుంది.అసలు పేరు తెలిస్తే, పేరు పెట్టో,ఏమండి అనో, పిలవచ్చు కదా? ఎందుకు ఆంటీ అని పిలవాలీ?అసలు నాకు తెలిసీ చాలామంది ఆడవాళ్ళ కి వయసు దగ్గర ఒకింత అభ్యంతరం ఉంటుంది.వెంటనే వయసు చెప్పటానికి ఇష్టపడరు.కొందరు ఎదుటి మనిషి వయసు సుమారుగా తమకన్నా చిన్నగా తెలుస్తున్నా సరే, అక్కగారు అనో,వదినగారూ అనో,పిన్నిగారూ అనో పిలిచేస్తు ఉంటారు.తమని తాము చిన్నగా అనుకుంటారొ ఏమో మరి.
మా నాన్నగారికంటే వయసులో పెద్దాయన ఒకసారి మా ఇంటికి వచ్చి మా అమ్మని "అక్కయ్యాగారు" అన్నరని మా అమ్మకి బోలేడు కోపం వచ్చేసింది.పెళ్లయ్యాకా మా ఇంటికి ఓసారి వంటకి వచ్చినావిడ మా అత్తగారిని "పిన్నిగారు" అన్నదని ఆవిడని మళ్ళి వంటకి రానివ్వలేదు మా అత్తగారు!!ఇంక నా సంగతికొస్తే..చిన్నప్పుడు రకరకాల పేర్లు,పెద్దయ్యాక "అక్క".అంతవరకూ బానే ఉండేది.నాకు పెళ్ళి అయ్యాకా, పెళ్ళికాని పక్కింటి అమ్మాయి కూడా నన్ను "ఆంటీ" అంటే ఒళ్ళు మండేది.వయసు చూడక్కర్లేదా?నాకు పెళ్ళి అయితే ఇంక ఆంటీ నా?అని మనసులో పీక్కునే దాన్ని.బయటకు ఎవరినీ ఏమీ అనలేము కదా...
ఒకసారి రైతు బజారుకి వెళ్తే అప్పటిదాకా "అక్కా" అనే కూరలవాడు "ఆంటీ ఈ కూర కొనండి,ఆ కూర కొనండి.."అనటం మొదలెట్టాడు.'నిన్నే పెళ్ళడతా 'లో 'పండు ' అంటే హీరోయిన్ కి ఎంత కోపం వస్తుందో...అంత కోపం వచ్చింది.నీ దగ్గర కూరలు కొనను.అని వచ్చేసా!!
ఆ తరువాత బొంబాయిలో మా పాలవాడు "అంటి..దూద్.." అని అరిచేవాడు."అబ్బాయీ నీ వయస్సెంత?" అన్నాను."30" అన్నడు."మరి నీ కళ్ళకి నేను ఆంటి లా ఎలా కనిపిస్తున్నను?అలా పిలిస్తే ఇంకనించీ నీ దగ్గర పాలు తీసుకోను!" అని ఖచ్చితంగా చెప్పేసా!! పాపం అప్పటి నుంచీ వాడు అలా పిలవటం మానేసాడు.కానీ పాలవాడు కాబట్టి అతడితో దెబ్బలాడగలిగాను.మిగిలిన అన్దరినీ ఏమంటాం...?తమ పిలుపుతో ఎదుటి వారిని ఏలాటి ఇబ్బందికి గురి చేస్తున్నాం అన్న విషయం ఎవరికి వారు అర్ధం చేసుకోవలసిందే కానీ ఒకరు చెప్తే వచ్చేది కాదు కదా..
మొన్న మా తమ్ముడు బండి తీసి బయటకు వెళ్తూంటే "అంకుల్ బాల్ ప్లీజ్,అంకుల్ బాల్ ప్లీజ్.."అని ఎవరో అంటూంటే ఎవరినో అనుకుని వాడు వెళ్పోతూంటే,మళ్ళీ అడిగారుట "అంకుల్ బాల్ ప్లీజ్.." అని.అప్పటికి గానీ అర్ధం కాలేదట వాడికి, పిలుస్తూన్నది వాడినే అని..!"నేను అంకుల్ అయిపోయానే.." అని వాడు బాధగా చెప్తూంటే,ఓహో ఈలాటి ఇబ్బందులు ఆడవాళ్ళకే కాక మగవారికీ ఉంటాయన్నమాట... అనుకున్నా అప్పుడు!!
కొసమెరుపు ఏమిటంటే,ఈ కొత్త పిలుపుకి నేను ఉడుక్కోవటం చూసి మావారు కూడా "ఆంటీ టీ ఇస్తావా...ఆంటీ వంటైందా...."అనటం మొదలెట్టారు...ఇప్పటికీ మానలేదు అంకుల్ !!
17 comments:
Trishna garu,
check this link.....
http://manishi-manasulomaata.blogspot.com/2008_06_01_archive.html
నాది కూడా ఇలా వరస పిలుపులు నచ్చవు. నేను మా క్రింద ఇంటి ఆవిడని జ్యోతి గారు అని, ఆమె భర్తని వెంకటేశ్వరరావు గారు అని పేర్లు పెట్టి పిలుస్తాను. వాళ్ళని ఎన్నడూ ఆంటీ, అంకుల్ అని పిలవలేదు.
'ఆంటీ' బాధితుల జాబితాలో మీరూ చేరారన్న మాట..
@సుజాత:ఒహ్..భలే ఇప్పుడే చూసాను.చాలా బాగా రాసారు.
@ప్రవీణ్ శర్మ:బాగుందండి.నేనూ అలానే పిలుస్తాను కొందరిని.
@ మురళి:అవునండి.
It reflects the changing values of the society. Calling people Aunty Uncle is the new "respectful form of address". No need for ppl to take offense at it.
@కొత్త పాళీ :అది కరక్టే కానీ,మన కన్న వయసులొ పెద్దగా ఉన్నవారు కూడా "ఆంటీ" అని పిలిస్తే మరి కోపం రాదాండీ?అందులో ఆడవారికి వయసు గురించిన 'కాన్షియెస్నెస్' కొంచెం ఎక్కువే మరి..
abba miidii naa casae nannamaata.
నా వయసు 26 ఏళ్ళు. 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కూడా నేను ఎవరినీ ఆంటీ, అంకుల్ అని పిలవలేదు. బంధువుల్ని మాత్రమే బంధుత్వం పేరుతో పిలిస్తే సరిపోతుంది. ఎవర్ని పడితే వారిని బంధుత్వం పేరుతో పిలిసే కంఫ్యూజన్స్ వస్తాయి. అన్నకి కాబోయే భార్య వదిన అవుతుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించానని తెలియక మా తమ్ముడు ఆమెని అక్క అని పిలిస్తే ఎలా ఉంటుంది?
lol :)
మిమ్మల్ని ఆంటీ అని పిలిచినోల్లందరి తరుపున నేను sorry చెప్తున్నా ఆంటీ.. కావలంటే Y.S, CBN తో కూడా చెప్పిస్తా ఆంటీ :P
ఆంటీ అనో అక్కా అంటేనో పర్వాలేదులెండి....
మున్ముందు ఓయ్, ఒసేయ్ అనే సూచనలు కనబడుతున్నాయి!
మగవాళ్ళకు కూడా ఈ బాధ తప్పడంలేదండి తృష్ణ గారు...ఓ సారి మా ఇంటి పక్కన అబ్బాయి నన్ను అంకుల్ అన్నాడు...నాకు చత్రపతికి వచ్చినంత కోపం వచ్చి, వాడిని మా ఇంటికి లాక్కోచి వార్నింగ్ ఇచ్చేసరికి బిత్తరపోయాడు, వాడి సంభోధనకి అంట తీవ్రత ఉందా అని...అదన్నమాట :)
@ మాలా కుమార్:బహుసా పెళ్లైన ఆడవారందరిదీ ఇదే కేసేమొనండి...ధన్యవాదాలు.
@ప్రవిణ్ శర్మ:తెలిసి పిలిస్తే తప్పు కానీండి,తెలియక పిలిస్తే తప్పవుతుందా?అయినా ఇది ఎవరి ఇష్టాన్ని బట్టి వారు పలుకరించుకోవటంలో ఉంటుంది.పూర్వం స్నేహితులూ,ఇరుగుపొరుగు ఇళ్ళ వాళ్ళ మధ్య ఆత్మీయత,అభిమానాలు బాగా ఉండేవి.అందువల్ల అందరూ బంధువులు కాకపోయినా అలా వరసలతొ పిలుచుకునే వారు.ఇప్పుడు చాలా వరకు అంతంతమాత్రం అనుబంధాలే కదా.ఇప్పటి పిల్లలకి అప్పటి పిలుపులు హాస్యాస్పదంగానే ఉంటాయి.అది కాలం తెచ్చిన మార్పు.పిలుపులది,అభిమానాలది కాదు.
మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.
@జీడిపప్పు: :) థాంక్స్ అండి .
@శ్రీవాత్సవ :థాంక్స్ అంకుల్ :) :)
@పద్మార్పిత: అలా భయపెట్టకండి..
@కిషన్ రెడ్డీ : అయితే మనం మనం ఫ్రెండ్స్ అన్నమాట!!
హ హ టపా బాగుందండీ.. ఎందుకడుగుతార్లెండి, ఈ కష్టాలు ఆడవారికి పరిమితం ఎంతమాత్రమూ కాదు.
పద్మార్పిత గారు మీరు చెప్పినది అక్షారాలా నిజం. సినిమాల పుణ్యమేమో తెలియదు కానీ ఓయ్ అనే పిలుపు ఇప్పటికే ఫ్యాషన్ అయిందండి. అపరిచితులని కూడా అలానే పిలవడం గమనించా.
వేణూ గారూ,ధన్యవాదాలు.
ఆడవాళ్లను పెళ్లైన తరువాతే ఆంటీ అని పిలుస్తారు. మగవాళ్లకు ఒకసారి డిగ్రీ ఐపొయందో వెంటనే ప్రమోషన్. ఎవరికి చెప్పుకోవాలి మాబాధ.
Post a Comment