సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, August 4, 2009

అన్నయ్య


రక్షా బంధనాన్ని పురస్కరించుకుని మా అన్నయ్యను గురించి నాలుగు వాక్యాలు చెప్పాలనిపించింది...

వేణువంటే అతనికి ప్రాణం
సంగీతం అతని ఊపిరి
నేర్వకపొయినా కృతి విని రాగాన్ని పట్టగల దిట్ట !
వంక పెట్టలేనంతగా వంటొచ్చిన నలుడు....
ఏలాటి చిత్రాన్నయినా అవలలీలగా వేయగల చిత్రకారుడు....
విద్య వల్ల ఇంజనీరైనా

వృత్తిపరంగా కొత్తబాటల వెంట పయనాన్ని నిర్దేశించుకున్న సాహసి..
ఏ కంప్యూటరు కోర్సులూ చేయకుండా
తానే స్వయంగా అన్ని రకాలూ పట్టుదలగా నేర్చిన విక్రమార్కుడు.
మౌస్ పట్టుకోవటం కూడా సరిగ్గా రాని నాకు....మెళుకువలు నేర్పి,
ఒక PPT వెనకాల నేపధ్యసంగీతం అందించగలిగేలా తయారు చేసిన గురువు.
నీతి,నిజాయితీలకి మారుపేరు.... కష్టాన్ని నమ్మిన శ్రామికుడు...!
భక్తిశ్రధ్ధలతనికనేకం...'ఓర్పు ' తన ఆయుధం !
అర్ధమయ్యీ అర్ధంకాని లోతైన అంతరంగమతనిది
ప్రేమానురాగాలు పంచే ఆ హృదయం చైతన్యవంతమైనది...
మా అందరి ప్రేమనూ మదినిండుగా నింపుకున్న మా "అన్నయ్య" అతడు!!


ఈ రాఖీ పండుగ సందర్భంగా ప్రతి అన్నకు,ప్రతి తమ్ముడికీ మంచి భవిష్యత్తునూ,ఆయురారోగ్యాలనూ ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను!!

15 comments:

Bhãskar Rãmarãju said...

అంతా బాగుంది కానీ మీ సహోదరుల పేరు మాత్రం చెప్పలేదు.

మీకు రఖాబంధన పౌర్ణమి శుభాకాంక్షలు.

తృష్ణ said...

ధన్యవాదాలు. ఆ పేరు కూడా మీ పేరుకు దగ్గరగా ఉన్నదేనండి.. :) :)

మురళి said...

అన్నింటినీ మించి ఇంత చక్కని సోదరిని పొందిన అదృష్టవంతుడు!! శుభాకాంక్షలు..

హరే కృష్ణ said...

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు :)

తృష్ణ said...

@murali:
no words...iam flattered...:)
thankyou.

@hare krishna: thankyou.

విశ్వ ప్రేమికుడు said...

"తృష్ణ" బ్లగ్ పేరు చాలా బాగుందండీ.

మీకూ మీ అన్నయ్యకీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు :)

తృష్ణ said...

@విశ్వ ప్రేమికుడు :dhanyavaadaalu.

కొత్త పాళీ said...

అన్నయ్య సన్నిధీ .. అదే నాకు పెన్నిధీ .. పాట నేపథ్యంలో వినబడిందంటే నమ్మండి టపా చదూతుంటే! :)

మీ యిద్దరికీ రాఖీ శుభాకాంక్షలు!

తృష్ణ said...

@kottapali: :) :)

పరిమళం said...

మీకూ రక్షా బంధన్ శుభాకాంక్షలు.

తృష్ణ said...

@parimalam:ధన్యవాదాలు.

మరువం ఉష said...

Nice of you for the feelings very well laid out. Wish you many more years of harmony and affection in this relation. First time Sneha tied a raakhi to Yuva [that sis and bro are my "aaru praaNaalu"] yesterday. I was standing by and watching the reality while lost in my thoughts.

తృష్ణ said...

@usha:its really great to watch our kids doing the same things which we've done in our childhood...and kids are our dearest gifts of GOD.

Jyothsna Palwai said...

మీ బ్లాగ్ పేరు చాలా బాగుందండి. ఆలాగే మీ "అన్నయ్య" టపా కూడ. ఆంత మంచి అన్నయ్య వున్న మీరు అద్రుష్టవంతులు.మీ లాంటి చెల్లేలు వున్న మీ అన్నయ్య అద్రుష్టవంతులే. మీ ఇరువురికీ రాఖీ శుభాకాంక్షలు.

తృష్ణ said...

@ధన్యవాదాలు.