మొన్నటి పరిమళంగారి "నా మొదటి వంట" టపా చూసినప్పుడు నాకు నా మొదటి ఉప్మా ప్రయోగం గుర్తు వచ్చింది.(మొదటి సారి చేసినదాన్ని "ప్రయోగం" అనటం నాకు అలవాటు.)ఆ కధ వ్యాఖ్యలో సరిపొదు వేరే టపా రాస్తానన్నాను.ఇదే ఆ కధ.. ఒకరొజు అనుకోకుండా ఊరు నుంచి చుట్టాలు వచ్చారు.అమ్మ ఇంట్లో లేదు.సాయంత్రానికి కానీ రాదు.వాళ్ళు సాయంత్రానికి మరో చోటకి వెళ్పోతారు.నాన్న లోపలికి వచ్చి అడిగారు"ఉప్మా చేయ్యగలవా?" అని.నేనప్పుడు ఎనిమిదవతరగతి.అమ్మ చేసినది తినటం తప్ప వండటం రాదు.వచ్చినవాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి పాపం.ఇంట్లో చిరుతిళ్ళు కూడ ఏమీ లేవు. అప్రయత్నంగా "సరే" అన్నా!!అమ్మ వంట చేస్తూంటే చూసే అలవాటుంది ;నీలం రంగు మూత ఉన్న సిసాలో రవ్వ ఉంటుందని తెలుసు కాబట్టి, ధైరంగా "ఉప్మా ప్రయోగం" మొదలేట్టా.
నెయ్యి వేసి,పోపు వేసి,జీడిపప్పు వేసి,రవ్వ వేసి,కొద్దిగా వేగాకా నీళ్లు పోసి...మొత్తానికి తయారయ్యింది.చూడ్దానికి బానే ఉంది.పట్టుకెళ్ళి పెట్టాను. "కుంచమంత కూతురుంటే మంచం మేదే కూడు. అప్పుడే అమ్మాయికి వంట వచ్చేసింది ఇంకేమిటి" అంటూ వాళ్ళు ఉప్మా తినటం ప్రారంభించారు.నెమ్మదిగా వాళ్ళ మొహాల్లో మార్పులు కనబడ్డాయి."బానే ఉందాండి?" అని అడిగాను."ఆ బానే ఉంది,బానే ఉంది.." అంటు పూర్తి చేసారు.కాస్త కాఫీ కలిపి ఇచ్చాను.బాగుందని తాగేసి ఇంకో అరగంట ఉండి వెళ్ళిపొయారు.
సాయంత్రం అమ్మ వచ్చింది.నాన్న ఉత్సాహంగా సంగతంతా చెప్పరు.అమ్మ కంగారుగా వంటింట్లోకి పరిగెత్తింది.వెనకాల మేమూ..
అమ్మ అడిగింది "ఈ నీలం రంగు మూత ఉన్న సీసాలో దానితోనే ఉప్మా చేసావా? " అని అడిగింది.
అవునని తల ఊపాను."వాళ్ళేమన్నారు?" అంది.
"బానే ఉంది..బానే ఉంది.. అని తిన్నారే " అన్నాను విసుగ్గా.
"పాపం! "అంది అమ్మ.
"ఖాళీగా ఉందని ఆ సీసాలో నిన్ననే ఇడ్లీ రవ్వ పోసాను అంది" (పోయ్...అని వెనకాల పెద్ద ట్రంపెట్ సౌండు వినిపించింది మా అందరికీ!!)
ఆ తరువాత నుంచీ వంటింట్లో అన్ని సీసాలకి పేర్లు రాసి పెట్టడం మొదలెట్టింది మా అమ్మ.
(డిగ్రీ అయ్యేదాకా పెద్దగా పనులేమి చెయ్యకపోయినా ,ఆ తరువాత మాత్రం వంటింటి ప్రయోగాల్లో ఎక్సపర్ట్ నయిపొయా.పనుల్లో అమ్మకి కుడిచెయ్యి అయిపోయా...)
13 comments:
:-) :-) :-)
ఇడ్లీరవ్వతో ఉప్మా చేసి బాగుంది అనిపించుకున్నారన్నమాట!
మరీ అంత అశ్చర్య పడక్కర లేదు.
పేరుకి ఇడ్లీ రవ్వ ఐనా అది బియ్యపు రవ్వే. దాంతోకూడా ఉప్మా బాగానే ఉంటుంది.
నేను చాలా సార్లు మరిచి పొయి చేసేసాను.
కాముధ
@మురళి :ధన్యవాదాలు.
@పద్మార్పిత:ఊ!ధన్యవాదాలు.
@కాముధ:అందుకేనేమోనండి వచ్చిన చుట్టాలు ప్లేటు ఖాళీ చేసే వెళ్ళరు :)
తృష్ణ గారూ ! ఇప్పుడు ఇడ్లీ ఉప్మా చేస్తున్నారుగా వెరైటీ అని ..మీరు ఆప్రయోగం ఎప్పుడో చేసేశారన్న మాట ! ఇడ్లీ రవ్వతో ... :) :)
హహహ ఇడ్లీపిండితో చేసే దోసెలుకూడా చాలాబావుంటాయి.
@ పరిమళం:అవునాండి?బాగుందైతే..
మీ పరిమళాన్ని నా బ్లాగుకందించినందుకు ధన్యవాదాలు.
@chaitanya: :)
తృష్ణ గారూ,
అచ్చం నాది కూడా ఇదే అనుభవం..మొదటిసారి ఉప్మాతో.. నేను రాద్దామా అనుకుంటున్నాను. మీరు చెప్పేశారు. same pinch ;)
@ మధురవాణి : అబ్బ..అంత గట్టి same pinchaa...చెయ్యి నెప్పెట్టెస్తోంది..(kidding) :):)
:):) దేంతో ఐనా చేయొచ్చు ఉప్పుమా...
పాపం ఆ వచ్చినవాళ్ళు మాత్రం ఏంచేస్తార్లేండి, గమ్మున తినిపోక!! పిల్లాట.
ఆడోళ్ళకి సవాల్ చేసినట్లు కాదు గాని, చాలామందికి కందిపప్పుకి, పచ్చిశనగపప్పుకి తేడా తెలియదు. కాదంటారా?
@ భాస్కర్ రామరాజ :కాదననండి.ఎందుకంటే ,కాలేజిలొ ఉన్నప్పుడు ఒకమ్మయి "గుండ్రం గుండ్రంగా ఉంటాయి,బారు బారువి అవి.."అనేది.ఆవాలకి,జీలకర్రకి వచ్చిన తిప్పలవి.
ఇడ్లీరవ్వతో ఉప్మా బాగుంటుంది.నేను కావాలనే కొన్ని సార్లు చేస్తుంటాను.
@రాధిక:ఇదే విషయం ఒకరిద్దరు రాసారండి...నేను తెలియకపోయినా మంచి ప్రయోగమే చేసానన్నమాట.అనుకున్నా.అన్నట్లు మొన్నొకరోజు పెట్టిన కైత ఓ సారి చూద్దురూ..మీ వంటి కవయిత్రులు చూస్తే ఓ ఆనందం..
Post a Comment