సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, July 6, 2009

శ్రీమతి రావు బాల సరస్వతీదేవి గారి "బంగారు పాపాయి"



శ్రీమతి రావు బాల సరస్వతీదేవి గారి కంఠం తెలుగు లలిత సంగీతప్రియులందరికీ సుపరిచితం.తెలుగు సినిమాలలో మొదటి నేపధ్యగాయణీమణులలోఈమె ఒకరు.తీయదనం,మాధుర్యం నిండిన ఆమె స్వరం ఎందరికో ప్రీతిపాత్రం.ఆమె పాడిన లలితగీతాలలో ఒక పాటను ఇవాళ ఈ టపాలోపరిచయం చేస్తున్నాను.
ఈ పాటను ప్రముఖ వైణికులు,అప్పటి హైదరాబాద్ రేడియోస్టేషన్ లో మ్యుజిక్ ప్రొడుసర్ గా పనిచేసిన మంచాల జగన్నాధరావు గారు రచించారు.సంగితం సమకూర్చినవారు సాలూరి హనుమంతరావుగారు.ఈయన సాలూరి రాజేస్వరరావుగారి సోదరులు. పాడినది:రావు బాల సరస్వతీ దేవి గారు. సాహిత్యం+ పాట లింక్

బంగారు పాపాయి బహుమతులు పొందాలి(2)

పాపాయి చదవాలి మా మంచి చదువు(2)
పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి
కళలన్నిచూపించి
ఘనకీర్తి తేవాలి

ఘన కీర్తి తేవాలి (2)
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు

మా పాప పలికితే మధువులే కురియాలి
పాపాయి పాడితే పాములే ఆడాలి
మా పాప పలికితే మధువులే కురియాలి
పాపాయి పాడితే పాములే ఆడాలి
ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప
ఎవ్వరీ పాప అని ఎల్లరడగాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు(2)
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు(2)

తెనుగు దేశము నాది తెనుగు పాపను నేను(2)
అని పాప జగమంత చాటి వెలిగించాలి
మా నోములపుడు మాబాగ ఫలియించాలి(2)
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు
***********************************

(ఈ లలిత గీతం కావాలని మాలా కుమార్ గారు ఆడిగారు. క్యాసెట్ వెతికి ఇవాళ mp3 లోకి మార్చి ఈ పోస్టులో పెడ్తున్నాను.ఒక పాట కావాలంటే ...అది ఎక్కడ దొరుకుతుందో అని దాని కోసం వెతకటం...చివరకు ఆ పాట దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు స్వీయానుభవం.నా వల్ల ఒకరి చిరకాల కోరిక తీరే అవకాశం కలిగితే అంత కన్నా కావలసినదేముంటుంది?మాలాకుమార్ గారు,ఇదిగో పాట.)

17 comments:

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

తృష్ణగారు నాకు జిడ్డూగాడు జవాజు చెప్పడు. ఎందుకో తెలీదు. అందులో నాకు డౌన్‌లోడ్ కాదు. దయచేసి ఈసారి మీడియాఫైర్ లింకులు పెట్టండి.

తృష్ణ said...

chaitanyagaru,my regular upload web is down with some error.i'll try to put the file in some other site.thanks for the visit.

మాలా కుమార్ said...

trushna gaaru,
ee paata maa attyya naenu puttinappudu paadindata.!!
repu naa blaag lo copy chesukuntaanu.
meeku chaalaa chaalaa thaanks.

madhu said...

http://surasa.net/music/lalita-gitalu/balasarasvati/bangaru.mp3

ikkada direct link undi. vinandi.

all songs by balasarasvati in below link:

http://surasa.net/music/lalita-gitalu/#balasarasvati

poovuleri teve cheli song vedavati prabhakar paadindi undi. if you've song by dwaram laxmi, can you please upload ? didnt find anywhere on internet.

తృష్ణ said...

anonymous gArU,dwAram laxmigAri pATa umdikAnI vetakAli ekkaDumdo..,paigA TV lOmchi chEsukunnadi.quAliTy bAgumDadamDi upload chEsinA.
thanks for the link,also your visit.

madhu said...

త్రిష్ణ గారు, నేను ఇక్కడ గంతులే గంతులు అండీ, మీ దగ్గర ద్వారం లక్ష్మి గారి పాట ఉందని చెప్పాక ! ఆ పాట కోసం నేను అడగని మనిషి లేడు, వెతకని చోటు లేడు ! వేదవతి ప్రభాకర్ గారు వేరే ట్యూన్ లో పాడారు, ఆ ట్యూన్ లక్ష్మి గారి ట్యూన్ అంత బాగోదు ! " పూవులేరి తేవే చెలి పూవలె కోవెలకు " ఎంత మధురమైన పాటో !

బాబ్బాబు, క్వాలిటీ ఎలా ఉన్నా సర్దుకుంటాను, కాస్త upload చేసి, పుణ్యం కట్టుకుందురూ, మీ మేలు ఎప్పటికీ మర్చిపోను !

అన్నట్టు నేను ఇచ్చిన లింక్స్ లోంచి బాల సరస్వతి గారి పాటలు డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఫైరుఫాక్సు బ్రౌజరు వాడుతుంటే మీరు, పాట ( mp3, rm ) అని ఉన్న చోట, right click చేసి " save link as " అని కొడితే mp3 or rm గా save అవుతుంది.

అదే ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ లో అయితే, right click చేసి "save target as" అని కొడితే, ఫైల్స్ సేవ్ చేస్కోవచ్చు !

తృష్ణ said...

anonymousgAru,మీరేదన్నా mail iD ఇస్తే లింక్ పెడతానండీ.2,3రోజులు టైమివ్వండి.బ్లాగులో పాటలు పెడితే పెద్దగా స్పందన ఉండటంలేదండీ.అందుకని.

సుజాత వేల్పూరి said...

తృష్ణ,
బాల సరస్వతి గారి బాబు బారసాల సందర్భంగా కవి గారు రాసి ఇచ్చిన పాట అట ఇది. ఆమెకు సాహిత్యం నచ్చి, ట్యూన్ చేయించి పాడి రికార్డ్ చేశారట. ఒకసారి రేడియో ప్రోగ్రామ్‌లో ఈ సంగతి చెప్పి ఈ పాట వేశారు. చాలా మంచి పాట. బారసాల లాంటి ఫంక్షన్స్ లో పాడమని కోరితే ఈ పాటే పాడతాను నేను. నాకు చాలా ఇష్టమైన పాట.ఇక్కడ పంచుకున్నందుకు థాంక్స్!

తృష్ణ said...

అవునండి నాకు తెలుసు.మా నాన్నగారు చెప్పారు.ఎందుకులెమ్మని రాయలేదు.

Purnachandra Rao T said...

Thrushna garu, Poovuleri theve cheli povale pataku nenoka fan, rendrojulnunchi jalledandtha jalleda pattina Aa pata lyric poorthiga dorakaledu... lyric tho patu tune dorikithe.... nenu kUda ganthule... ganthulu... chaala thanks andi.

తృష్ణ said...

sri hari gaarU,

u can find this song with lyrics in the below blog page..

http://sarigamalagalagalalu.blogspot.com/2008/08/blog-post.html

thanks for the visit.

Jhansi said...

HELLOO
NAMASKAARAM NAAKU DWARAM LAKSHMI GAARI PAATA "POOVULERI THEVEE CHELI" ANTEEE PRAANAM. PLEASE OKKASAARI VINAALANI UNDI
HELP CHEYYAROOOO???
JHANSI

Jhansi said...

hellooo
namasteee
naaku dwaram lakshmi gaari paata "poovuleri theeveee cheli povale koovelaku" anteee praanam.
naa cheinnatanam looo black n white tv loo aa paata raagaaneee parigettukuni velli chevulu kallu appagincheseedaanni.
avi elaa vinaalooo chepparooooo please evarynaa sareee......

తృష్ణ said...

jhansi gaaru,

http://sarigamalagalagalalu.blogspot.com/2008/08/blog-post.html
పైన ఒక వ్యాఖ్యలోని ఈ లింక్లో మీకు సాహిత్యం,పాట దొరుకుతాయండీ.ద్వారం లక్ష్మి గారు పాడిన పాట ప్రస్తుతమ్ నా దగ్గర లేదండీ...sorry.
thankyou for the visit.

నేస్తం said...

తృష్ణ ఎలా ఉన్నారు..ఇంత చక్కని పాట కోసం వెదుకుతునే ఉన్నా (పూవులేరి తేవే చెలి )లింక్ ఇచ్చిననదుకు థేంక్యూ

Unknown said...

MEERU ENTHA MANCHI VARANDI .. KALA KALAM AYUR AROGYA ISWARYALATHO VUNDALANI .. MEE LAAGA ANDARU VUNDALI NENU KORU KUNTOO DEVUDINI KOODA ADUGUTA ..

తృష్ణ said...

@venkata surya janardhana rao: ఈ పాట గురించి రాసానని అంటున్నారా? సంతోషం. మీ దీవెనకి ధన్యవాదాలు జనర్థన్ గారూ.