సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, July 27, 2009

ఆషాఢం ఎండింగ్ కేక్..!!


మొన్నశనివారం ఒక బంధువులింట్లో పుట్టినరోజు పార్టీకి వెళ్ళాం.ఆ పుట్టినరోజు కుర్రాడికి కొత్తగా పెళ్ళి అయ్యింది.పెళ్ళైన నెల తిరక్కుండా ఆషాఢం వచ్చేసింది.నెళ్ళాళ్ళుగా ఊళ్ళోని షాపింగ్ కాంప్లెక్సుల్లోనే మొహాలు చూసుకుంటూ విరహాన్ని చవిచూసిన ఆ కొత్త దంపతులు సరదాగా కబుర్లు చెప్పుకుంటూంటే ముచ్చటేసింది..ఆ ఇంట్లోవాళ్ళు ఆ కుర్రాడి బర్త్ డే కేక్ తొ పాటూ మరొ కేక్ పక్కనే పెట్టారు. ఏమిటా అని దగ్గరికెళ్ళి చూస్తే...దాని మీద "ఆషాఢం ఎండింగ్" అని ఉంది.బర్త్ డే కేక్ కట్ చేసాకా,ఆ నవ దంపతులిద్దరి చేతా వాళ్ళింట్లోవాళ్ళు ఆ "ఆషాఢం ఎండింగ్ కేక్" ని కట్ చేయించారు.అందరూ సరదాగా వాళ్ళ వాళ్ళ ఆషాఢవిరహం గురించిన జోక్స్,కబుర్లు మొదలేట్టారు...

ఆ కుర్రాడు మొన్న ఆషాఢం పూర్తవ్వగానే అత్తారింటికి వెళ్లటం,వాళ్ల అత్తగారు ప్రేమగా వండిపెట్టిన వంటకాలను వర్ణించి చెప్పటం మొదలెట్టాడు.పురీలు-ఛోలే కూర,దొసెలు-మాంచి చెట్నీ,బాదం ఖీర్,బొబ్బట్లు..మొదలైన పేర్లు వినగానే నా నాలిక లోంచి తెలియకుండానే లాలాజలం ఊరిపొయింది.."కొత్తల్లుడినైనా కాకపొతిని ,బాదం ఖీరు తినగా.." అని పాడేసుకున్నాను...
ఆ యువ జంటని చూసి,వాళ్ల కబుర్లని విని నేను మైమరచిపోయిన ఒకానొక బలహీన క్షణంలో మా అమ్మయి నేను చూడకుండా 2,3 బాగా క్రీము నిండిన కేక్ ముక్కలు లాగించేసింది...


కట్ చేస్తే...రాత్రికి పాపకి కడుపునొప్పి,డోకులు...డాక్టర్ దగ్గరికి పరుగులు,నిద్ర లేని రెండు రాత్రులు..!!


(ఇలా నిద్రలేని రాత్రులు గడిపినప్పుడు తెలుస్తాయి మనకోసం అమ్మనాన్నలు ఎన్ని రాత్రింబవళ్ళు అవస్థలు పడ్డారో...అప్పుడు చెప్పాలనిపిస్తుంది ముగ్గురేసి పిల్లల్ని పెంచిన అమ్మలకి; 10,12 మంది పిల్లల్ని పెంచి పెద్దచెసిన అమ్మమ్మలకి,నానమ్మలకి హేట్స్ ఆఫ్...!!)

8 comments:

Padmarpita said...

:) :)

పరిమళం said...

"ఆషాఢం ఎండింగ్ కేక్" గుడ్ ఐడియా ...కానీ ఇప్పుడు పెళ్ళయిన వెంటనే వేరేగా ఉంటున్నారుగా ...అటువంటివారికి ఆషాడం వియోగం తెలీదు .

Bhãskar Rãmarãju said...

తృష్ణ గారూ - బాగా చెప్పారు!!
ఇలా నిద్రలేని రాత్రులు గడిపినప్పుడు తెలుస్తాయి మనకోసం అమ్మనాన్నలు ఎన్ని రాత్రింబవళ్ళు అవస్థలు పడ్డారో...అప్పుడు చెప్పాలనిపిస్తుంది ముగ్గురేసి పిల్లల్ని పెంచిన అమ్మలకి; 10,12 మంది పిల్లల్ని పెంచి పెద్దచెసిన అమ్మమ్మలకి,నానమ్మలకి హేట్స్ ఆఫ్...!!

నిజం!!
మా వాడు ఏంటో అర్ధం కాదు. కంటి నిండా నిద్ర పోటం చూళ్ళా. లేస్తూనే ఉంటాడు. ఏడుస్తాడు, నవ్వుతాడు, కూర్చుంటాడు లేచి. వాడు కదిల్తే. లేచి ఓ మూలుగు మూల్గి పడుకునేలోపు పిల్ల లేస్తుంది. కుస్కుస్లాడుతుందా, చంటిది పడుకునే లోపు వీడు లేస్తాడు మళ్ళీ.

లక్ష్మి said...

Ashadam ending cake aa?? variety ga undi concept

మురళి said...

'ఆషాఢం ఎండింగ్ కేక్' కాన్సెప్ట్ బాగుందండి..

తృష్ణ said...

@ పద్మార్పిత:ధన్యవాదాలు.

@పరిమళం:నిజమెనండి ఇవాల్టి రొజున అన్నీ చిన్న కుటుంబాలే."దురమైన కొలదీ పెరుగును అనురాగం..విరహంలోనే ఉంది అనుబంధం.." అన్న పాటలొని తియ్యదనం వాళ్లకి తెలియదు మరి..

@ భాస్కర్ రామరాజు : పిల్లలకి 5,6 ఏళ్లు వచ్చేదాకా పెద్దలకి నిద్రలు కరువే నండీ.

@లక్ష్మి, @ మురళి : అవునండి.ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

నీతి: పిల్లల తల్లులు ఇలా పక్కవారి రొమాన్సులు చూసి హాయని మైమరిచి పోగూడదు! :)

తృష్ణ said...

@kottapali: yes sir!!forgot to mention below the post :)