పాట url + సాహిత్యం :
http://www.youtube.com/watch?v=_fhR8g_oj6g
మౌనమె నీ భాష ఓ మూగ మనసా (2)
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ( 2)
మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
కోర్కెల సెల నీవు ఊరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ( 2)
మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
************************************************
రెండవది బాపుగారి "స్నేహం" చిత్రంలోనిది.కె.వి.మహదేవన్ గారు సంగితం సమకూర్చిన ఈ పాటని ఆరుద్రగారు రచించగా బాలుగారు పాడారు.
ఈ పాట నాదగ్గర ఉన్నది పెడుతున్నాను.quality కొంచం తక్కువగా ఉంటుండి. http://www.savefile.com/files/2148877
సాహిత్యం:
నవ్వు వచ్చిందంటే కిలకిల ఏడుపొచ్చిందంటె వల
వలగొదారి పారింది గల గలదానిమిద నీరెండమిల మిల(ప)
నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా(2)
నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా(2)
కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే(2)
ఎవరెంత చేసుకుంటే(2) అంతే కాదా దక్కేదినవ్వు వచ్చిందంటే కిలకిల ఏడుపొచ్చిందంటె వల వల..
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ
కొత్త మతం పుచ్చుకుంటె గుర్తులెక్కువ
చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువ
నవ్వువచ్చిందంటే కిలకిల ఏడుపొచ్చిందంటె వల వల..
తమసొమ్ము సొమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
పరులకింత పెట్టినదే(2) పరలోకానికి పెట్టుబడి
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
గోదారి పారింది గల గల
కధలెన్నో చెప్పింది ఇల ఇల...
11 comments:
nice songs.........
just 2 days back ma friend second song pallavi cheppi ee movie ani adigaadu nenu chimatamusic.com nundi info ichhanu and nenu song vinnanu baaga anipinchindi
naaku moname nee bhasha chaala baaga nachhutundi
especially
okaporapaatuku yugamulu pogilaevu ane line awesome........
athreya gaaru athreya gaare
వినయ్ గారు,నాకు ఆ పాటలో "లేనిది కోరేవు ఉన్నది వదిలేవు" అన్న లైన్ చాలా ఇష్టమండి.మనందరం చాలవరకు చేసేది అదే.ఉన్నదాని విలువ తెలుసుకొలేము,లేనిది కావాలని ప్రాకులాడతాము..
నవ్వు వచ్చిందంటే కిలకిల పాట మరింత నాణ్యమైన ధ్వని ముద్రణలో ఇక్కడ వినవచ్చు/దిగుమతి చేసుకోవచ్చు..
http://www.esnips.com/doc/c4b33132-1550-4af3-92fc-e18e5a0475dd/Sneham---Navvu-vachindante-kila-kila
మీకు తెలియదన్న సాహిత్యం
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ
ధన్యవాదాలు రావు గారు.పాటలో లైనుని మీ వ్యాఖ్యవల్ల సరిచేస్తున్నాను.లింక్ ఇచ్చినందుకు మరొక్కమారు ధన్యవాదాలు.
రెండవది నాకు తెలియదు కానీండి మొదటిది మాత్రం నా ఆల్టైం ఫావరెట్. చాలాకాలం నా ఓర్కుట్ ప్రొఫైల్‌కి కాప్షన్ ఇదే. ఈపాటకి బాలమురిళిగారికి జాతీయ అవార్డు వచ్చింది అని ఒకసారి మాటీవీలో పాడాలని ఉంది ప్రొగ్రాంకి ఆయన శిష్యుడు ఒకాయన న్యాయనిర్ణేతగా వచ్చరు. ఆయన దాన్ని పాడి తరువాత అవార్డుగురించి చెప్పారు .అప్పటివరకు తెలియదు నాకు. నేనుకూడా యూట్యూబ్ నుంచే దిగుమతి చెశాను.
"కోర్కెల సెల నీవు ఊరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు" ఎంతటి నగ్నసత్యం కదా!
చైతన్యా, ఆ శిష్యులు నాకు ఒకప్పుడు సంగీతం గురువుగారు.
పద్మార్పిత గారు,ధన్యవాదలు.
మీరు ఎంతో అదృష్టవంతులండీ. ఆయనకున్న పరిమితులలో ఆయన కేవలం జ్ఞాపకశక్తితో 500కు పైగా కృతులుగుర్తుపెట్టుకొన్నారంటే చాలా గొప్పవాళ్లు. మీరు తప్పకుండా ఆయన గురించి, ఆయనతో మీ అనుభవాలగురించీ టపా కాదు టపా'లు ' పెట్టాలి. మర్చిపోకండి. ఎదురుచూస్తుంటాను.
చైతన్యా,నెమలికన్ను గారు నన్ను కూడా గుమ్మంలో నిలబెట్టేసారు.
సంగతేమిటో మరి.(మరి నేనెవరిని రాయబారం అడగను?)
మా మాష్టారి గురించి రాయాలని నేనూ అనుకుంటున్నానండి.రాయాలి.
తృష్ణ గారు, "నవ్వు వచ్చిందంటే కిల కిల" పాట గురించి వెతుకుతూ ఇక్కడకు వచ్చి మీ గురువు గారి గురించి తెలుసుకుని అచ్చెరువొందాను. పాట, సాహిత్యం పొందు పరచినందుకు ధన్యవాదాలు.
@venu srikanth: thankyou.I like this particular song verymuch for its fabulous lyrics.
Post a Comment