సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, July 8, 2009

అమ్మతనం

మాతృత్వం స్త్రీకి దేవుడిచ్చిన వరం.ఎన్ని హడావుడుల్లో,చికాకుల్లో ఉన్నా 'అమ్మా ' అన్న బిడ్డ పిలుపుకు సర్వం మరచి పరవసిస్తుంది తల్లి. కుమార్తెగా, సహొదరిగా, భార్యగా, కోడలిగా, స్నేహితురాలిగా, ఉద్యోగినిగా ఎన్ని అవతారాలెత్తి ఎన్ని పాత్రలు పోషించినా తల్లిగా మారిన స్త్రీ పొందే అనుభూతి అన్నిటికీ సాటిలేనిది.పాలుతాగే వయసులో బిడ్డ కేరింతలు చూసి ప్రసవ వేదన మరుస్తుంది,తప్పాటడుగులు వేసే పాపడిని చూసి అలసటని మరుస్తుంది,చిన్నారి చిట్టి పలుకులని విని జీవితంలోని ఒడిదొడుకులను మరుస్తుంది ;గోరుముద్దలు తినిపిస్తూ,లాలిపాటలు పాడుతూ,పిల్లల ఆటల్లో తానూ ఒక ఆటబొమ్మై ఆనందంతో మైమరచిపోతుంది.
తనకు తెలిసిన విజ్ఞానాన్ని,ప్రపంచాన్ని బిడ్దకు తెలియచెయ్యాలని తపన పడుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దయి సక్రమమైన మార్గంలోకి వెళితే తన జివితానికి సార్ధకత కలిగిందని పులకిస్తుంది మాతృహృదయం.ఆ సార్ధకతని నేనూ పొందాలని తాపత్రయపడే సగటు తల్లిని నేను.నేలపై పాకే పసిపాపను చూసి ఇది ఎప్పుడు నడుస్తుందొ..అనుకున్నాను.నడిచింది.పాపాయి బుడి బుడి నడకలను చూసి..ఇది ఎప్పుడు పలుకుతుందో అనుకున్నాను..ఇంకొన్నాళ్లకి పలికింది.."హృదయం ఎక్కడ ఉన్నది..అమ్మ చుట్టూనే తిరుగుతున్నదీ.." అని సొంత కవిత్వం కూడా పాడింది!! ఇప్పుడు పలకపై "అ,ఆ లు " దిద్దుతోంది...నిన్న రాత్రి "ఆ నుంచి అం అ:" వరకూ తప్పుల్లేకుండా రాసింది...ఏమిటో ఆనందం..."తెలియని ఆనందం.."అని పాడాలనిపించింది. ఈ భావాలు ప్రతి తల్లి మనసులో పొంగేవే...ప్రతి తల్లిని సంతొషపరిచేవే...కానీ ఏదన్నా సరే మనదాకా వచ్చి మనం అనుభవిస్తేనే ఆ భావం మనకు పూర్తిగా అవగతమయ్యేది,అర్ధమయ్యేది...అనిపించింది.
అందుకేనేమో అన్నారు అమ్మతనంలో కమ్మతనం వర్ణనాతీతం అని!!

21 comments:

Anonymous said...

అమ్మ గురించి ఏమి చెప్పినా, ఎవరు చెప్పినా ఏమనగలం?
ఔను అని వూ కొట్టడం తప్ప.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

తృష్న గారికి ఒక జై

తృష్ణ said...

bonagirigAru,ధన్యవాదాలు.
chaitanyA,అంతొద్దండీ.నేను అతిసామాన్యమైన మామూలు మనిషిని.

మురళి said...

నిజమేనండి.. ఇవి ఎవరికీ వాళ్ళు స్వయంగా అనుభవించ వలసినవే...

మరువం ఉష said...

మీ ఆనందం చూస్తున్నాను. అది తృప్తిగా కూడా మారుతుంది. అయిన అమ్మతనం అన్నది ఎప్పటికీ తనివితీరని తృష్ణ. ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. నేనూ మీబోటి మనిషినే మీరాస్వాదిస్తున్న అనుభూతిని మరి కొన్నిటినీ రుచి చూసాను. మీ స్వానుభూతి మరికొన్నిటిని మీ పరం చేయాలని కోరుకుంటున్నాను. నాకైతే వళ్ళే చాలావరకు నా లోకం. "అమ్మమ్మా, నానమ్మా, అంటూ తిరిగిన ఓ అమ్మాయిని ఏకంగా అమ్మని చేసిన శుభారంభానివి." అని మురిపెంగా చెప్పుకుంటూ నేను వ్రాసుకున్న నా శిశు దశావతారాలివి "దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల? http://maruvam.blogspot.com/2009/01/blog-post_31.html

తృష్ణ said...

ఉషగారు,మీ పొస్టుని తప్పక చూస్తాను.
ధన్యవాదాలు.

మురళిగారు,అవునండి.ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

thank god you did not write about another snack! :)

Hima bindu said...

చక్కగా చెప్పారు.వారు ఎదిగే దశలో ప్రతి మార్పు ముచ్చటగా వుంటది

తృష్ణ said...

కొత్తపాళీగారు,అది మికు భయపడే :( :)

తృష్ణ said...

చిన్నిగారు,ఇది మీ మొదటి వ్యాఖ్య నాకు.ధన్యవాదాలు.

భాస్కర రామిరెడ్డి said...

అనునిత్యం చిన్నారి సేవలో తరిస్తున్నారన్నమాట. వచ్చిరాని మాటలతో వాళ్ళు చేసే చేష్టలు ఇప్పుడు కోల్పోతే జీవితంలో మళ్ళీ తిరిగిరావు కదా.. ఆనందించండి.

శ్రుతి said...

తృష్ణ గారూ!

ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదుచూడటంలో ఒక ఆనందం, ఆపై వాళ్ళ బుడి బుడి నడకలు, చిలక పలుకులు, గిల్లి కజ్జాలు అన్ని అపురూపమే అమ్మకు. అనుభవించితే కాని అర్ధం కాని అనుభూతులివి.
పాపం ఉద్యోగం చేసుకునే తల్లులు ఎన్ని మిస్ అవుతున్నారో కదా?
మీ పాపాయి మీ మరింత ఆనందాన్నివ్వాలని, మీరు ఆ సంతోషాన్ని ఇలాగే పంచుకోవాలని కోరుకుంటున్నాను.

శ్రుతి said...

అన్నాట్లు మర్చిపోయానండోయ్. మీ మొక్కజొన్న వంటకాలకు అభినందనలు. మొక్కజొన్న బూరెలు నా ఫేవరెట్.

Bolloju Baba said...

మీ బ్లాగు చాలా బాగుంది.

మీరు వ్రాసే విధానం రిఫ్రెషింగా ఉంది.

తృష్ణ said...

భాస్కర్ గారు,అందుకేనండీ ఉద్యోగం చేయకుండా పాపతొనే కాలం గడుపుతున్నది!!

శృతిగారు,నిజంగానేనండి.ఉద్యోగం చెయ్యటంలేదని కొన్నిసార్లు బాధపడినా,చేస్తూ ఉండిఉంటే ఈ సరదాలు,ఆటపాటలు,ముద్దుమురిపాలు మిస్ అయిఉండేదాన్నని చాలాసార్లు అనుకుంటు ఉంటాను.

తృష్ణ said...

శృతిగారు,
మొక్కజొన్న బూరెలా?ఎలా?చెప్పండి...వెంఠనే చెసుకుని తినెయ్యాలని ఉంది..!

తృష్ణ said...

బొల్లోజు బాబా gAru,thankyou verymuch sir.

నీహారిక said...

తృష్ణ గారు,
మీరు మొదట తెలుగు నేర్పారా? నేను ఎందుకు నేర్పలేకపోయానా అని ఇప్పటికీ బాధ పడుతుంటాను.

తృష్ణ said...

నీహారిక గారు,పోని ఇప్పుడు నేర్పండి.తెలుగుకు సంబంధించిన విషయాలు,తెలుగు కవులు,తెలుగుతనం గురించి ...మన భాష ఎలా మంచిగా మాట్లాడాలో..అవన్నీను. better late than never annaru kadamDi.

రమణ said...

అద్భుతంగా వ్రాశారు.

తృష్ణ said...

@వెంకటరమణ: ధన్యవాదాలండి.