
"ఆనందమా.. ఆరాటమా.. ఆలోచనా.. ఏమిటొ
పొల్చుకొ హృదయమా.. ఎందుకీ అలజడి
దాహానిదా.. స్నేహానిదా.. ఈ సుచన ఏమిటో
తేల్చుకో నయనమా.. ఎవరిదీ తొలి తడి
పట్టుకో పట్టుకో చేయ్యిజారనివ్వక ఇకనైనా..
స్వప్నమే సత్యమై రెప్పదాటిపోయే సమయానా..
కంటికే దూరమై గుండేకే ఇంతగా చేరువైనా ....
...నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా ...."
... బ్లాగ్లోకం లోకి అడుగు పెట్టగానే నాకు రోజూ గుర్తు వచ్చే పాట ఇది...ఎందుకొ ఆ ట్యూన్ ,సాహిత్యం రెండూ నచ్చేసాయి నాకు...ప్రస్తుతానికి ఈ పాట నా బ్లాగుకి అంకితం !!(రేడియోలో అడుగుతూ ఉంటారు "ఎవరికి డేడికేట్ చేస్తున్నారు పాటని"...అని)ఒక పత్రికలొ చదివిన కధ ద్వారా నాకు బ్లాగులుంటాయని తెలిసింది.అప్పుడు కొంచెం ఆసక్తి కలిగింది...తరువాత ...."విత్తనాన్ని బురదలొ వేసినా అది మొలకెత్తి తీరుతుంది.దాని సహజ నైజం అది.అలానే కళాకారుడు ఎక్కడ ఉన్నా తన సహజ ప్రవృత్తిని మరువడు.అలా మరిస్తే ఆ మనిషి కళాకారుడే కాదు.." అని ఒక చర్చలొ నాతొ ఒకరు అన్న మాటలు ఈ బ్లాగుకి ప్రేరణ.ఇప్పటిదాకా చెయ్యని కొత్త పని ఏదొ చెయ్యలి...అని!
నేను బ్లాగు మొదలెట్టే ముందు ఎవరి బ్లాగులు చూడలేదు...అసలు ఎలా రాస్తారొ కూడా తెలిదు.ఒక మంచిరొజు చూసి బ్లాగు తెరిచేసా.ఎప్పుడో రాసిన 2,3 ఆర్టికల్స్ తొ.నేనేనీ రచయిత్రిని కాదు..అయినా ఒక వారం ఏవొ నాకు తొచిన రాతలు రాసుకున్నా..తరువాత ఒకరోజు కూడలిని,జల్లెడని చూసా..లంకె వేసా.కానీ దాంట్లో నే పొష్టు చేసిన టపాలు కనబడతాయని తెలీదు.10 రొజులనుంచీ రాని వ్యాఖ్యలు ఒక్కసారిగా ఎన్దుకు వస్తున్నాయో తెలిలేదు...ఎక్కడొ కొన్ని వేల బ్లాగుల లిస్టులొ ఉన్న నా బ్లాగుని చూసి జనం స్పందిస్తారా?అని అనుమానం వేసిన్ది...కూడలిలొకి వెళ్తే అసలు సంగతి తెలిసింది.నేనూ బ్లాగులు చూసి వ్యాఖ్యలు రాయటం మొదలెట్టా..!కొంత సాంకేతిక పరిజ్ఞానం లేక టపా పెట్టడానికే నానాతిప్పలూ పడి,ఈ మయసభని వదిలేద్దాం అనుకున్న రొజులు ఉన్నాయి..గ్రీక్ అన్డ్ లాటిన్ లా అనిపిన్చే ఈ బ్లాగు సిధ్ధాంతాలన్ని అర్ధంచేసుకోవటానికి అవస్థలు పడుతూనే ఉన్నా ఇంకా...
ఇక ఒక సందేహం వేధిస్తూ ఉన్డేది.అసలు నా బ్లాగుని ఎవరైనా చూస్తున్నారా?అని..చాలా బ్లాగుల్లో "విజిటర్స్" "లైవ్ ట్రాఫిక్" అని చూసి,ఇంకో వారనికి అదీ తెలుసుకుని నేనూ ఒక విజిటర్ కవున్టర్ పెట్టేసుకున్నా!దాని పుణ్యమా అని ఒక నెలలో నాలుగువేలపైనే అతిధులు వచ్చారు అని తెలిసింది...."ఆనందమా..ఆరాటమా.." అని ,"क्यो मुझे इतनी खुषी देदॆ के घबराता है दिल.." అనీ పాట పాడేసుకున్నాను.మళ్ళి సందేహం...ఇన్తమన్ది నిజంగా చూస్తూంటే మరి ఎందుకు ఎక్కువ వ్యాఖ్యలు రావు ? అని...
రాసేది నచ్చలేదా?వ్యాఖ్య రాసే టైము లేదా?రాయటం ఇష్టం లేదా?నేనొక అనామిక బ్లాగర్ననా?బాగున్డకపోతే,నచ్చకపోతే సరే..కానీ బాగుంటే,రాసినది బాగుంది అని వ్యాఖ్యానిస్తే కొంచెం ఆసక్తి,ఆనందం పెరుగుతాయి కదా! సరే ఎవరి ఇష్టం వారిది.అని ఊరుకున్నా.
నెమ్మదిగా కొన్ని పేర్లు తెలిసి,మళ్ళి మళ్ళి వచ్చే కొందరు అతిధులు మిత్రులయ్యారు.నేనూ కొన్ని బ్లాగులు ఫాలొ అవ్వటం మొదలేట్టా...నేను లిస్టేమీ పెట్టుకోలేదు...నాకు దొరికిన సమయంలో వీలున్నప్పుడల్లా ఆయా బ్లాగుల వైపు తొంగి చూడటం, వ్యాఖ్య తప్పక రాయటం అలవాటయిపొయాయి నాకు.ఇప్పుడు "నేను సైతం ఒక బ్లాగర్ని" అనే నిజం నాకు చాలా ఉత్సాహాన్నీ,ఆనందాన్ని ఇస్తున్న విషయం.కొన్దరు ఆటపట్టించారు..."బాబోయ్ దీన్ని కదిలిస్తే "నా బ్లాగు..." అని మొదలెడుతుంది.ఆవు వ్యాసంలా ప్రతి టాపిక్కూ దాని బ్లాగు దగ్గరకు తీసుకు వచ్చేస్తోంది.... ఈట్ బ్లాగ్,డ్రింక్ బ్లాగ్,స్లీప్ బ్లాగ్..అయిపొయింది దిని పరిస్థితి" అని.
అయినా నాకేటి సిగ్గు...?నా లోకం నాది.ఎవరికీ అపకారం,మనస్తాపం,ఇబ్బంది కలిగించనంత వరకూ భయమే లేదు.నా బ్లాగులో వార్తావిశేషాలు,రాజకీయాలు నేను చర్చించదలుచుకోలేదు.వాటికి చాలామంది పండితులు,మేధావులూ ఉన్నారు.సిధ్ధాంతాలనీ,సూక్తులనీ వల్లించదలుచుకోలేదు.ఒక స్త్రీ మనసులో భావాలు ఎలా ఉంటాయో,జీవితంతో గడిచే మార్పులతో ఆలోచనలు ఎలా మారుతూ ఉంటాయో చెప్పాలి అనిపించింది.అవి కూడా కొన్ని రాసాను,కొన్నింకా రాయాలి...ఏదో ఆకు,పువ్వు,పాట,పద్యం...అని నా ఊసులేవో నేను రాసుకుంటాను...ఆసక్తి కలిగితే చదువుతారు...లేకపొతే లేదు...
అమ్మ అడిగింది "బ్లాగంటే..?" అని. "ఇప్పటిదాకా బీరువాలో దాచుకున్న డైరీలో రాసుకునే కొన్ని విషయాలని(అన్నింటిని కాదు) అన్దరికీ తెరిచి చూపెట్టాడం" అన్నాను. "ఎన్దుకలా..?" మళ్ళీ అడిగింది. నే చెప్పా..."నా ఆలోచనలూ,నాకున్న అభిరుచులు,నాకు తెలిసిన విషయాలూ అందరితో పంచుకోవాలని....చెప్పుకోవాలని...ఒక అనామకురాలిగా మట్టిలో కలిసిపోకూడదని ఒక కొరిక...!!" అన్నాను.
అమ్మ నవ్వింది!!
ఎన్నాళ్ళు రాస్తానొ తెలీదు కానీ నా భావాలని పంచుకోవటానికీ,వ్యక్తీకరించటానికీ ఇదో మంచి వేదిక ! ఈ నెలన్నర రోజులూ నాకు మరపురానివి.నాలాటి అభిరుచులు,ఆలోచనలూ ఉన్న మరికొన్దరిని కలిసి కబుర్లు చెప్పే అవకాశాన్ని,ఆనందాన్ని ఇచ్చిన ఈ బ్లాగ్లోకం అంటే నాకెన్తో ఇష్టం... నా బ్లాగుకి వచ్చి,వ్యాఖ్య రాసి ప్రొత్సహించి,నాకు బ్లాగానందాన్ని పెంచిన అందరికీ ఈ టపాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
30 comments:
ఈట్ బ్లాగ్,డ్రింక్ బ్లాగ్,స్లీప్ బ్లాగ్..అయిపొయింది దిని పరిస్థితి" అని.
:) :)
నేనూ డిటో డిటో
సంతోషం తృష్ణ గారూ.
బ్లాగర్లందరి ఆలోచనలూ (బ్లాగుల విషయానికి వచ్చేసరికి) ఇంచుమించు ఒకేలా ఉంటాయండి.. బ్లాగు మొదలు పెట్టినప్పుడు నాక్కూడా టెక్నికల్ విషయాలు ఏవీ తెలియవు.. నెమ్మదిగా తెలుసుకుంటున్నా.. అభినందనలు.
@ హరేకృష్ణ : మా ఇంటికెళ్తే అందరూ నన్ను అలానే ఆటపటిస్తారండి :)
@ మాలాకుమార్ : ధన్యవాదాలండి.
@ శరత్ 'కాలమ్': ధన్యవాదాలండి.
@ మురళి :టెక్నికల్ విషయాలు నిజంగా ఎంత ఇబ్బంది పెడతాయోనండి..ధన్యవాదాలు.
తృష్ణ గారు,
బావుంది మీ బ్లాగానందం.
"ఆనందమా.. ఆరాటమా.. ఆలోచనా.. ఏమిటొ
పొల్చుకొ హృదయమా..." అని పాడేసుకుంటూ బ్లాగుతూ ఉండండి...
sekhargAru,dhanyavAdAlu.
తృష్ణ గారూ, సాంకేతిక విషయాలు తెలీకుండా బ్లాగు మొదలుపెట్టిన అందరిదీ దాదాపు ఇదేపరిస్తితి . (నాతో కలిపి) . బయటి సంగతేమోకానీ, ఈ బ్లాగ్లోకంలో మాత్రం మనం అడిగిందే తడవుగా మనకి కావల్సిన సహాయం చెయ్యటానికి అందరూ సిద్దంగా వుంటారు. అది ఈపాటికి మీకు అర్ధమయ్యేవుంటుంది.
మీ పరిస్తితే నాదీను. నన్ను చూస్తేనే ఏదో పనున్నట్టు పారిపోతుంటే ఏమిటా అనుకున్నా. తర్వత అర్ధమయింది. కొత్తబిచ్చగాడు పొద్దెరగడన్నట్టూ, నేను కంపించినవాళ్ళందరికీ బ్లాగాయణం వినిపించడమే కారణం అని.
బ్లాగుడుకాయ అయిపోండి తొరగా. :)
తృష్ణ గారూ, సాంకేతిక విషయాలు తెలీకుండా బ్లాగు మొదలుపెట్టిన అందరిదీ దాదాపు ఇదేపరిస్తితి . (నాతో కలిపి) . బయటి సంగతేమోకానీ, ఈ బ్లాగ్లోకంలో మాత్రం మనం అడిగిందే తడవుగా మనకి కావల్సిన సహాయం చెయ్యటానికి అందరూ సిద్దంగా వుంటారు. అది ఈపాటికి మీకు అర్ధమయ్యేవుంటుంది.
మీ పరిస్తితే నాదీను. నన్ను చూస్తేనే ఏదో పనున్నట్టు పారిపోతుంటే ఏమిటా అనుకున్నా. తర్వత అర్ధమయింది. కొత్తబిచ్చగాడు పొద్దెరగడన్నట్టూ, నేను కంపించినవాళ్ళందరికీ బ్లాగాయణం వినిపించడమే కారణం అని.
@lalita:ఇదే మీ మొదటి వ్యాఖ్య...ఇప్పుడే మి బ్లొగ్ చూసా.ఉండంది నెనూ ఒక "కెవ్వ్వ్...కేక పెడతాను.."
ధన్యవాదాలు.
@ అరుణ :ధన్యవాదాలండి.
హ హ బ్లాగ్ లోకం లో వచ్చిన క్రొత్తలో నాకు వర్డ్ వెరిఫికెషన్ అంటే ఎంటో,కామెంట్స్ మొడరేషన్ ఏంటో ఏంటో అసలేంటో అంతా సరదాగా,భయం భయం గా,సిగ్గుగా అచ్చం అత్తారింటికి వచ్చిన కొత్త కోడలి పరిస్థితి అనుకోండి నాకు :) ..బాగా రాస్తున్నారు మీరు keep it up
తృష్ణ,
చక్కగా చెప్పారు...
" ఒక స్త్రీ మనసులో భావాలు ఎలా ఉంటాయో,జీవితంతో గడిచే మార్పులతో ఆలోచనలు ఎలా మారుతూ ఉంటాయో చెప్పాలి అనిపించింది."
తప్పకుండా...ఎదురుచూస్తుంటాము.
కల్పనరెంటాల
కల్పనగారు,పెళ్ళికి ముందు,తరువాత వచ్చే మార్పులతొ ఒక పోస్టు రాసా మొదట్లో.లింక్ పెడుతున్నాను.వీలుంటే చూడండి. http://trishnaventa.blogspot.com/2009/05/appuduippudu.html
@sujji: ధన్యవాదాలండి.
@నేస్తం :నాకు ఇప్పటికీ పోస్టు పెట్టేప్పుడు సగం డిలీట్ అయిపోవటమో,అప్లోడ్ చేసిన బొమ్మ ఎగిరిపోవటమో జరుగుతూ ఉంటుంది..ధన్యవాదాలండి.
తమనితాము రచయితలుగా గుర్తించుకోని వారు ఎందుకు బ్లాగు మొదలు పెడతారో, ఎందుకు పెట్టాలో క్లుప్తంగా హృద్యంగా చెప్పారు.
Your blog is a pelasure to visit. I could not find a correlation between hits and comments. Hit does not even mean that someone actually read your post. If I have to give an anology .. Say your blog is a clothes store in the main bazar. Hits are people looking at the window display. Comments are cutomers actually making a purchase.
కొత్తపాళీగారు,చాలా సంతోషం.మీరు మంచి విశ్లేషకులని చాలా బ్లగుల్లో మిరు రాసిన వ్యాఖ్యల వల్ల అర్ధమైంది.మీరు మెచ్చుకుంటే ఏనుగెక్కినంత ఆనందం.అందుకే అదివరకూ ఒకసారి రాసినట్లు i feel honoured when people like you leave a comment..నిన్నటి పోస్టు చూసి నేను పుస్తకాల మీద రివ్యు రాయచ్చో లేదో తెలుపగలరు.
మీ బ్లాగు రథాన్ని ఇలాగే పరిగెత్తించండి.
bonagiri gAru,ధన్యవాదాలండి.
ఒక్కొకసారి చిన్నవిషయాన్ని చెప్పాలంటే మాటలు వెతుక్కొనే పరిస్థితి దాదాపు ప్రతి ఒక్కరికీ ఎదురయ్యేదే. అలాంటిది మనభావాలను అక్షరాల్లో కూర్చి, అందరితో పంచుకొని, చర్చిస్తున్నాం అంటేఅది బ్లాగుల పుణ్యమే. మనిషిలోని భావప్రకటనకు బ్లాగు ఎంతోమంచి వేదిక. ఇక సాంకేతిక విషయాలకు వస్తె కొంతమందికి ఇబ్బందిగా అనిపించినా అంతకంటే సులువుగా చెయ్యటం కష్టమే. అందులోనూ మనంరాసే ప్రాంతీయభాషల్లో బ్లాగును రూపొందించాలంటే ఎంతకష్టమో ఒక్కసారి అలోచించండి. అందుకు కృషిచేసిన వాళ్లకు ధన్యవాదాలు తెలియజేయాలి మనం.
హ్మ్ ఇలాంటి మథనం,అంతర్మధనం అప్పుడప్పుడూ తప్పదు. అవసరం కూడా!
తృష్ణగారు,
అందరూ మొదట్లో మీలాగే డిటో. లలిత అన్నట్టు అడగితే సహాయం చేయడానికి ఎందరో ఉన్నారు. నిస్సంకోచంగా అడగొచ్చు. ఇక ఈ బ్లాగుల్లో గొడవలు చదివి వదిలేయండి. పట్టించుకుని మనసు పాడు చేసుకోవద్దు. మీ బ్లాగుకు మీరు మహారాణి. ఒకరిని నొప్పించనంతవరకు ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ హిట్లు చూస్తే బాగుంటుంది. అలాగే కామెంట్లు దానికి తగ్గట్టుగా ఉంటాయని ఆశించొద్దు. అసలు ఆ విషయమే పట్టించుకోవద్దు. మీ ఆలోచనలను బ్లాగులో పొందుపరచండి. ఇది రాసేది మీ ఆత్మానందం కోసం ఎవరికోసమో కాదు. ఒకె.. సాంకేతిక సహాయం కావాలంటే తెలుగు బ్లాగు గుంపు ఉంది, ప్రమదావనం ఉంది.
చైతన్యా,ఆ మాట నిజమే.నేనూ అదే అనుకున్నాను.ఈ "బ్లాగ్" అనే దాన్ని సృష్టించిన వాళ్ళెవరో కానీ నిజంగా ప్రశంసాపాత్రులు.
మహేష్ గారూ,నిజమండి.ధన్యవాదాలు.
జ్యొతిగారు,బాగా చెప్పారు.
"మనకు మనమే మహారాణి".ఇది నేను ఈ మధ్యనే జివితానికి కూడా అన్వయించటం మొదలెట్టాను.లేకపొతే ఈ జనారణ్యంలొ మనుగడ కష్టం...మీ అయిడియా బాగుంది.నా సందేహాలని తెలుగు బ్లాగు గుంపులో పెట్టాలని తొచలేదు నా మట్టి బుర్రకి.ధన్యవాదాలు.
keep bloging
@sivaprasad: thankyou.
ఒక వ్యాఖ్యాతకు:
నా బ్లాగులో మొదట అందరికీ కనిపించేలా రెండు వాక్యాలు పెట్టడం జరిగింది.
"ideas and opinions expressed in this blog are purely personal and are not meant for criticism" అని .
నా భావాలను,ఆలోచనలను,జ్ఞాపకాలను,అనుభుతులను పంచుకోవటానికి బ్లాగు పెట్టుకున్నాను తప్ప చర్చలకు,విమర్శలకు కాదు.
టపా నచ్చితే చదవండి.నచ్చకపోతే ముందుకు సాగిపొండి.మనసు నొప్పించే వ్యాఖ్యలు మాత్రం చేయవద్దని మనవి.
ఇవన్ని ఎవరైనా కూడా సంతృప్తి కోసం రాసుకునే అభిప్రాయాలే తప్ప ఏదో నిరూపించటానికి రాసుకునే సిధ్ధంతాలు కావు.
మనసు నొప్పించే వ్యాఖ్యలు చెయవద్దని విన్నపం అంతే...అంతకు మించి మరే ఉద్దేశం లేదు.
@తృష్ణ: ఇది "మీ" బ్లాగు. You have every right to decide what should be there and what not.
ఈ మధ్య ఇలాంటి ధోరణులు మామూలైపోయాయి. కాబట్టి కామెంట్ మోడరేషన్ సరైన పద్దతి.
హహహ భలే పోస్ట్. కామెంట్లు కూడా వెరైటీగా ఉన్నాయి. మొదట్లో చూసేవాడిని కానీ, మరీ రోజుకో పోస్ట్ ఉంటంతో అంత శ్రద్ధ పెట్టేవాడిని కాదు. ఎందుకంటే ఏదో వచ్చానంటే వచ్చాను, కామెంటానంటే కామెంటానని కాదు. ఇచ్చే వ్యాఖ్యకో ప్రయోజనం ఉండాలి అని నా ఉద్దేశ్యం. మీకు నేను ఆరు కామెంట్ల బాకీ. చిన్నగా తీరుస్తాను. క్రమంగా మీ టపాలు నచ్చటం మొదలైంది. చక్కని భాష, మంచి వ్యక్తీకరణ.
మీరే అన్నారు కదా... "మన ఇంట్లో భోజనం" అచ్చం అలాంటి బ్లాగు ఇది. పొగిడేందుకు చెప్పే మాట కాదిది. విమర్శ అయినా ఇలాగే నిజాయితీ చేస్తాను నేను.
ఇక నేను మొదలెట్టింది మాత్రం అందరిలా నా ఆలోచనలు పంచుకోవటానికైతే మాత్రం కాదు. గుర్తింపు కోసం అస్సలు కాదు. I came, I saw, and ... I ((WV గురించి చెప్పా కదా) :-)
ఇలాగే కొనసాగించండి. వస్తూనే ఉంటాను
Post a Comment