సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, July 30, 2009

మౌనం...


భావాలకు,భావ వ్యక్తీకరణకు అర్ధం మాటలే అని నమ్మాను కొన్నాళ్ళు...
కానీ మౌనంలో అన్నిటినీ మించిన అర్ధం ఉందని,
మౌనాన్ని మించిన ఆయుధం లేదన్నది అనుభవం నేర్పిన పాఠం!!
"silence ia a great art of conversation..."అన్నారు కూడా!
మౌనం గురించి నా అలోచనలు ఇవి...


అక్షరాలకు అంతం
ఆలొచనల సొంతం
అంతులేని ఆశల శబ్దం
పెదవి దాటని మాటలకర్ధం
అలసిన మనసుకు సాంతం...మౌనం!!

కన్నీట తడిసిన చెక్కిలి రూపం
అలుపెరుగని అలజడులకు అంతం
రౌద్రంలో మిగిలిన ఆఖరి అస్త్రం
యుధ్ధాల మిగిలిన శకలాల భాష్యం
నిశ్శబ్దంలో నిలిచే ఒంటరి నేస్తం....మౌనం!!

సుతిమెత్తని కౌగిలికి
ఆరాటం నిండిన పెదవులకి
మాటలు మిగలని అలకలకి
మాటలు కరువైన మనసులకి
అన్నింటి చివరా మిగిలేది....మౌనం!!

8 comments:

రమణ said...

చాలా బాగుంది.

పరిమళం said...

"అంతులేని ఆశల శబ్దం
పెదవి దాటని మాటలకర్ధం
మౌనం!!" Beautiful!

తృష్ణ said...

@పరిమళం :మౌనం మీద రాసాననేమో అందరు మౌనంగా చూసి వెళ్లిపొయినట్టున్నారండి...ఇవాళ ఎవరూ వ్యాఖ్యానించలేదు...మీకు ధన్యవాదాలు.

sriram velamuri said...

రౌద్రం లో మిగిలిన ఆస్త్రం ...మౌనం ..బాగుందండీ

తృష్ణ said...

@sriram vEmuri:thanks andi.

మాలా కుమార్ said...

మౌనాన్ని మించిన ఆయుధం లేదన్నిది మాత్రము నాకు అనుభవమే ! మావారు మౌనంగానే నిరసన తెలియజేస్తారు .ఆయన నిశబ్ధం గా వుంటే ఇంట్లో అందరికీ భయమే !

తృష్ణ said...

@మాలా కుమార్:ధన్యవాదాలు.

తృష్ణ said...

@venkataramana:పొరపాటున మీకు జవాబు రాయటం మరచినట్లున్నాను..ఇప్పుడే ఎందుకో చూసాను..ధన్యవాదాలు.