సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, July 29, 2009

శ్రావణమంగళవారం నైవేద్యాలు

అమ్మావాళ్ళింట్లో పెండింగ్ ఉన్న నా నొముతో పాటూ ఇంకో ఇద్దరితో మంగళవారం నోము నోపించాల్సిన అవసరం వచ్చింది.పౌరోహిత్యం వహించి మొత్తం ముగ్గురం నొచేసుకున్నాం.చేతి దురద తీర్చుకునే అవకాశం కూడా వచ్చింది..ఉల్లాసంగా...ఉత్సాహంగా..మడి కట్టేసుకుని పైన ఫొటొలోని నైవేద్యాలు చేసేసాను.

1)పూర్ణం బూరలు...

2)పులగం (బియ్యం,పెసరపప్పులతొ చేసేది) ఫొటొలొకి రాలేదు.

౩)sprouted బొబ్బర్లు,పుదినా,మిర్చి,అల్లం కలిపి చేసిన వడలు.

4)బూరెల్లో పూర్ణం అయిపొయాకా మిగిలిన పిందిలో తొటకూర,మిర్చి కలిపి అదో రకం పకోడిల్లాగ వేసేసాను.

5)పులిహొర.

శెనగలను ఏమీ చెయ్యక్కర్లేదు.అవి నానబేట్టినవే..బత్తాయిలు colourfulగా ఉంటాయని add చేసా..అవి.. ఫొటోలోని నైవేద్యాల విశేషాలు.

నాకొచ్చిన వంటలతొ ఒక సెపరేటు బ్లాగు పెడదామా అనుకున్నా కానీ..ఒక్క బ్లాగు నడపటానికే సమయం ఉండటం లేదు.ఇంక రెండవ బ్లాగా..అనుకుని ఇంక ఒకటే కిచిడీ బ్లాగు ఉంచేద్దామని డిసైడయిపోయా..!
పుజ అయ్యి,ఇళ్ళు వెతుక్కుని,వాయనాలు ఇచ్చేసి వచ్చాం ముగ్గురం !!
హమ్మయ్య,ఓ పని అయిపొయింది.ఇంక ఏవన్నా పాటలు విందాం అని తిరుబడిగా పాత కేసట్లు అన్ని వెతికి "ABBA" బయటకు తీసా.

honey honey...

give me one more date....

ring ring... why dont you give me a call...

this park..and these houses..all streets i've walked...

అంటూ గుండ్రాల్లోకి వెళ్ళిపొయి వినేస్తున్న... ఇంతలో అన్నయ్య వచ్చడు."మల్లన్న పాటలు డౌన్లోడ్ చెసాను"వినమని పెట్టాడు.పెద్ద సౌండ్లో "excuse me Mr..మల్లన్న...అ..అ..ఆ...అ..అ..ఆ..."అంటూ పాట మొదలైంది.2,3 వినగానే అరె ఇవన్ని రొజూ ఫంలో వింటున్నానురా అన్నాను..

ఈలోగా అమ్మ వెనకాల నుంచి తిట్లు..శ్రావన మంగళవారం పుజ చెసుకుని అవేం పాటలే....అని!!

13 comments:

సిరిసిరిమువ్వ said...

మంచి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి నైవేద్యాలు.
శ్రావణ మంగళవారం పూజ చెసుకుని అవేం పాటలే....:)

తృష్ణ said...

@ సిరిసిరిమువ్వ : :) : )
thanks andi.

కొత్త పాళీ said...

హమ్మో, నిజం చెప్పండి .. అమ్మింటికెళ్ళి నైవేద్యాలు, అందులోనూ ఇన్ని వెరైటీలు మీరే చేశారా?
హబ్బా, అబ్బాని గుర్తు చేశారుగా .. సీ దట్ గాల్, వాచ్ దట్ సీన్, యు ఆరె ద డేన్సింగ్ క్వీన్ .. నిజమే, ఈ తరం వాళ్ళసలు .. పొద్దున నోములూ, సాయంత్రం మల్లన్న పాటలు .. హుహ్

మురళి said...

సంప్రదాయం, ఆధునికతల సమ్మేళనం అన్నమాట తృష్ణ గారు.. బాగుందండి.. నైవేద్యాలే మరీ నోరూరిస్తున్నాయి :)

తృష్ణ said...

@కొత్తపాళీ:నిజంగా నేనొక్కర్తినే చేసానండీ.10,15మందికి నేనొక్కర్త్తినే వండిన రోజులు ఉన్నాయి...

@ మురళి:అటు ఇటు కాని...మధ్యంతరం మనిషినండి...

సుభద్ర said...

bhale vandarandi,mukyam gaa amma intlo nenu maaattagaari intlo kudaa enni yeppudu cheyaledu.maa amma laane mee ammagaaru kudaa.all mother same.

తృష్ణ said...

@ కొత్తపాళీ:ఇందాక మర్చిపొయానండీ,ABBA తెలుసా..భలే!చిన్నప్పుడు ABBA,BoneyM,Cliff richards,Barbra Streisand...ఇంకా నాన్న కలక్షన్స్ అన్నీ తెగ వినేవాళ్ళం...

తృష్ణ said...

@సుభద్ర:అమ్మలందరూ ఒకటేనండి.thankyou.

Bhãskar Rãmarãju said...

మేమొప్పుకోం అద్దెచ్చా!! మాకేది?

పరిమళం said...

మధ్యంతరం మనిషి :) :)

తృష్ణ said...

@భాస్కర్ రామరాజు:కావలసిన్ది వన్డేసుకోగల నలభీములు..మీకేమండీ..!

@పరిమళం: అటో ఇటో ఉంటే బానే ఉన్డేదండీ.ఎటూ కాకుండా మధ్యలో ఉండిపోయా...

జ్యోతి said...

hmmm ఐనా ముచ్చటగా వ్రతం చేసుకుని ABBA పాటలా. మళ్లీ మల్లన్న. అమ్మ తిట్టకుండా ఊరుకుంటుందా? బాగా చెడిపోయారు.:(

నా పేవరేట్ కూడా ABBA, Boney M..

తృష్ణ said...

@జ్యోతి: మీరు ఎందుకు చూడలేదా ఈ టపాని అనుకుంటూండగా...వచ్చింది వ్యాఖ్య... అంతేనంటారా...అయితే iam a bad bad girl..(josh song కి పారడీ)అని పాడాలేమో నేను...