
నిన్నలొ ఉన్నది నేను
నేడులొ ఉన్నది తాను
తానెవరో తెలియదు నాకు
నేనెవరో తెలియదు తనకు
గడిచిపోయిన నిన్నలలో నిలిచిపోయిన నన్ను
పరిచయమే లేదంటూ పరిశీలిస్తుందా కన్ను
నువ్వెవరని ప్రశ్నిస్తూ నిలేస్తుంది నన్ను
ఆ శోధనలో నిరంతరం ముఖాముఖి మాకు
కలలలో నిదురలో కలతలో తానే నా తోడు
నేను లేని తానెవరని అచ్చెరువే నాకు
సంసార మధనమే నిరంతర ధ్యానం తనకు
తనతొ చెలిమికై ప్రయత్నమే ప్రతినిత్యం నాకు
నేనే నువ్వంటూ కవ్విస్తుంది నన్ను
నీ నేడే నేనంటూ తడుతుంది వెన్ను
ఒక్క క్షణం కళ్లలోకి సూటిగా చుసి
కనుపాపలో దాగిన రూపు తనదంటుంది
ఆ కొత్త రూపాన్ని నేనేనని నమ్మాలి
నాకై నా వెతుకులాటనికనైనా ఆపాలి
ఈ నిరంతర అన్వేషణకిక స్వస్తి పలకాలి
ఇదే నా అస్థిత్వమని మళ్ళి మళ్ళి నమ్మాలి !!
(నిరంతరం వివాహానంతరం ప్రతి స్త్రీలో జరిగే మధనమే ఇదని నా అభిప్రాయం...)
10 comments:
'ఆ శోధనలో..' అనుకుంటానండి.. బాగుంది కవిత..
Excellent!!! Simply Superb!!!
చాలా బాగారాసారు..
స్త్రీ మనోభావాలకి అద్దం పడుతుంది..
@murali: typing mistake అండి. చూపినందుకు ధన్యవాదాలు.
@anveshita:ధన్యవాదాలండి.
@padmarpita:ధన్యవాదాలండి.
బాగుంది మీ కవిత. అన్నట్టు మీ బొమ్మలు( ముందు టపా ) కూడా చాలా బావున్నాయండీ.
తృష్ణగారు.. నేను అనుకున్నవి మీకెలా తెలిసిపోయాయి చెప్పండి?
శేఖర్ గారు,ధన్యవాదాలండి.
సృజనగారు, అందుకే ఆఖరు వాక్యం రాసానండి.."నిరంతరం వివాహానంతరం ప్రతి స్త్రీలో జరిగే మధనమే ఇదని నా అభిప్రాయం..." అని.
ధన్యవాదాలు.
very interesting.
A totally new angle to your writing and creativity. Glad to see it
@ కొత్తపాళి:thankyou sir!!
తృష్ణ, బహుశా నా వ్యాఖ్య ఇక అదనపు భారం ;) అన్ని అంతా చెప్పేసారు. తొలి కవితగా చాలా లోతుగా తరిచారు. నాది ఇంకొంచం కటువైన సూటి భావనేమో. భావ సామీప్యం ఎక్కువ లేదు కానీ, నా "చక్రభ్రమణం" http://maruvam.blogspot.com/2008/12/blog-post_26.html చూడండి. అలాగే "చివరకు మిగిలేదేది?" http://maruvam.blogspot.com/2009/01/blog-post_15.html కూడా ఇవే స్కోత్కర్షలు.
Post a Comment