నిన్న రాత్రి బ్లాగు తెరిచి వ్యాఖ్యలకి సమాధానాలు రాస్తూంటే ఒక పొరపాటు జరిగింది.దాన్ని చిన్న పిల్లలు చేస్తే తెలీక చేసిన పొరపాటు అంటారు.నాలాటి పెద్దవాళ్ళు చేస్తే,బుధ్ధిలేని పని అనే అంటారు మరి.కొత్తపాళిగారి వ్యాఖ్య చదివి పొస్టులో సవరింపులు చేయబొయే ప్రయత్నంలో పక్కనే పెట్టుకున్న మజ్జిగ గ్లాసుని తన్నేసాను..నా కీ బొర్డు నిండా మజ్జిగ !!ఫలితం..నా కీబోర్డు మూగబోయింది.సగం బటన్లే పనిచేస్తున్నాయి..ఆరబెట్టడానికి,తుడవటానికీ చాలా ప్రయత్నాలు చేసాను కానీ బొత్తిగా మొరాయించుకుని బండెద్దులా మొండికేసేసింది కీబొర్డు...అందుకని అది బాగయ్యేదాకా
నా వాగుడికి పెట్టక తప్పదు కళ్ళెం
నే వహించక తప్పదు మౌనం !!
నే టపాలు రాయకపోతే తపించే నాధురాల్ని నేనొక్కత్తినే కాబట్టి....నాకోసం నేనే ఈ-మైలు సెంటరుకి వచ్చి మరీ ఈ పోస్టు పెట్టుకుంటున్నాను...ఒక పాఠం మాత్రం నేర్చుకున్నాను.ఇంకెప్పుడు తినే,తాగే వస్తువులు కంప్యుటర్ పక్కన పెట్టుకుని పని చెయ్యకుడదు అని!!
8 comments:
నేను ఇక్కడకి రాకముందు, నోయిడాలో ఉండేటప్పుడు, న్నటొకూడ వెంకట్అని ఇప్పుడూ నాగపూర్‌లో ఉన్నారు. ఎప్పుడైన నెను తిటూ, తాగుతూ కంప్యూటరుముందు కూర్చుంటే అరిచేవారు. అలాంటిది ఒకరోజు ఆయనే స్ప్రైట్‌తాగుతుంటే గ్లాసు జారింది. నాదీ మీపరిస్థితే. అప్పుడు కొన్ని బొత్తాలు విప్పి తుడిచా. కానీ బారెడు పొడుగుండే స్పేస్‌బారుమాత్రం సరిగా పెట్టలేక పోయాను. ఇప్పుటికీ కొంచం ఇబ్బందే దాన్ని నొక్కాలంటే. పునర్దర్శనం ఎప్పుడో.
అయ్యయ్యో!!! త్వరగా బాగుచేయించండి....నెక్ట్స్ టపా కోసం ఎదురుచూస్తూ!!!
windows lo virtual keybooard vuntundi kada try cheyandi offcourse ..koncham kashtame type cheyadam.edo password ante ok gani ila ante ammo........
అయ్యో.. ఈ మాత్రానికే internet center కి పరిగెత్తుకు వెళ్ళాలా? windows లో On screen keyboard ఉంటుంది ప్రయత్నించక పోయారా :). కొంచెం కష్టమేకనీ ఓ పోష్టు రాస్తే అదే అలవాటవుతుంది.
:( :((
:'(
ఇంతమంది పాఠకులు ఉంటే అదేం మాటండీ? త్వరగా వచ్చెయ్యండి..
chaitanya,padmArpita,vinay,indian minerva మరియు muraliగార్లు:
టపా రాయలేకపొతున్న నా బాధని పంచుకుని వ్యాఖ్య రాసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు.
Post a Comment