సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, June 28, 2009

ముళ్ళపూడి వెంకట రమణగారి "కోతికొమ్మచ్చి"

(బాపుబొమ్మ.కాం సైటు నుంచి ఈ ఫోటో)
"కొంత కాలం క్రిందట బ్రహ్మదేముని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపురేఖలు వేరట,ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం..."
"బాపురమణ"గార్ల ద్వయాన్ని తలుచుకుంటే నాకు గుర్తు వచ్చే పాట ఇది.
ముళ్ళపూడి వెంకట రమణగారు వారిద్దరి స్వీయచరిత్రని "కోతికొమ్మచ్చి" పేరుతో స్వాతి వీక్లీలో సీరియల్ రాసారు.అది ఇప్పుడు పుస్తక రూపంలో మన ముందుకు రాబోతోంది.ఈ నెల ౩౦వతారీఖు సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగబొతోంది.చాలా మందికి తెలిసే ఉంటుంది.ఆసక్తి గల అబిమానులు,హైదరాబాదు వాసులు ఆ కార్యక్రమంలో పాల్గొనగలరని ఈ పోస్ట్ రాస్తున్నాను.

1 comment:

Anonymous said...

ఏ కారణం చేతైనా ఈ అద్భుత కార్యక్రమానికి రాలేకపోయిన నాలాంటి వారు కూడా ఆనందించేలా , ఈ కార్యక్రమాన్ని యు ట్యూబ్ లో పెట్టకలిగితే మా జన్మ ధన్యం అవుతుంది. ప్రయత్నించి చూడండి.